ఈ రోజుల్లో ప్రతి యంత్రం, ప్రతి పరికరం.. న్యూ టెక్నాలజీని అందుకుంటూ.. ఈజీ ప్రొసెస్‌ను వినియోగదారులకు అందిస్తున్నాయి. సాధారణంగా వాటర్ బాటిల్స్, పాల బాటిల్స్, వాటి చిన్న చిన్న మూతలను క్లీన్ చేయడానికి పొడవాటి బ్రష్ ఉండేది. అయితే చిత్రంలోని బ్రష్ చూడటానికి అలానే కనిపిస్తుంది కానీ, ఇది టెక్నాలజీతో ముడిపడిన పరికరం (ఎలక్ట్రిక్ వాటర్‌ప్రూఫ్ డివైస్).
ఒక్క బటన్ నొక్కితే చాలు గిర్రున తిరుగుతూ బాటిల్ మూల మూలలను శుభ్రం చేసి పెడుతుంది. ఈ హ్యాండ్‌హెల్డ్ క్లీనర్‌కి తగినంత చార్జింగ్ పెట్టుకుని.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. అవసరం అయితే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు వేసుకుని సులభంగా వాడుకోవచ్చు. ఒంపులు తిరిగిన మగ్గులు, గ్లాసులు, చెంబులు, బేబీ బాటిల్స్, బాటిల్ నిపుల్స్ వంటివి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు.
అందుకు అనువైన రెండు వేరు వేరు బ్రష్‌లు.. బేస్ డివైస్‌కి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మధ్యలో ఉన్న పవర్ బటన్ ఆన్ చేసుకోవడంతో ఈ డివైస్ పని చేస్తుంది. ఇది వాటర్‌ప్రూఫ్ కావడంతో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీని ధర 14 డాలర్లు (రూ.1,158)
Comments
Please login to add a commentAdd a comment