Water bottles
-
ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి..
ఇంట్లోని ఇలాంటి చిన్న చిన్న వస్తువులను మన్నికగా, శుభ్రంగా ఉంచడంలో ఇబ్బంది పడుతున్నరా!? అయితే ఈ సూపర్ కిచెన్ టిప్స్ మీకోసమే.బట్టల మీద పడిన ఇంక్ మరకలు పోవాలంటే.. ఇంక్ మరకలపై కొద్దిగా నీళ్లు చల్లాలి. ఇప్పుడు టూత్ పేస్టును అప్లై చేసి బ్రష్‌తో రుద్ది నీటితో వాష్ చేస్తే ఇంక్ మరకలు ఇట్టే పోతాయి.మినరల్ వాటర్ క్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, టీస్పూను బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ రసం, కొద్ది గోరువెచ్చని నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తరువాత క్యాన్‌ను పైకీ కిందకు బాగా గిలకొట్టాలి. పది నిమిషాలపాటు ఇలా గిలకొట్టి రెండుమూడుసార్లు నీటితో కడగాలి. తరువాత డిష్ వాష్ లిక్విడ్‌తో వాటర్ క్యాన్ బయటవైపు తోముకుంటే క్యాన్ మురికి వదిలి కొత్తదానిలా మెరుస్తుంది.స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీ స్పూను డిష్ వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములూ దరిచేరవు. దీనిలో ఎటువంటి రసాయనాలు లేవు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే.ఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన వాటర్ బాటిల్ ఇదే..టేస్ట్ అదిరిపోతుంది!
ఒక వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. అదే హోటల్స్‌లో అయితే వంద రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ వాటర్ బాటిల్ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే దీని ధర అక్షరాలా రూ. 45 లక్షలు. అవును మీరు విన్నది నిజమే. ఆ వాటర్ బాటిల్ మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. మరి ఆ స్పెషల్ ఏంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచి నీళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా?లీటర్ కూడా ఉండని ఈ బాటిల్ ధర దాదాపు 45 లక్షల రూపాలుంటుందట!మనం రోజూ తాగే మంచి నీళ్ల బాటిల్ ధరలు కూడా.. ఊహించని స్థాయిలో ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు.అక్వా డి క్రిస్టలో ట్రిబ్యుటొ ఎ మోడిగ్లియాని అనే వాటర్ బాటిల్ గురించే ఈ చర్చంతా. దీనిలో కేవల 750 మిల్లీ లీటర్ల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంత చిన్న వాటర్ బాటిల్ ధర అక్షరాలా 45 లక్షల రూపాయలు. ఇప్పుడు ప్రపంచంలోని అతి ఖరీదైన మంచినీళ్లు ఇవేమరి. లీటర్ కూడా లేని ఈ నీళ్లకు ఎందుకింత డిమాండ్? అంటే..ఈ నీళ్లను ఫ్రాన్స్, ఫిజీలలోని సహజ నీటిబుగ్గల నుంచి సేకరిస్తారట. భూగర్భ జలాలు ఉబికి భూమిపైన ప్రవహించే సహజ నీటి బుగ్గల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ఇది వింతేమీ కాదే!! ఈ రోజుకీ మార్కెట్లో అనేక మినరల్ వాటర్ బాటిల్లు ఈ విధమైన సహజ నీటి బుగ్గల నుంచి సేకరించిన నీళ్లను అమ్ముతున్నారు. మన దేశంలో కూడా ఈ విధమైన నీళ్ల బాటిల్లను రూ. 50 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. అయినప్పటికీ ఈ వాటర్ బాటిల్ ఎందుకంత ధర పలుకుతుంది? ఇదేనా మీ అనుమానం.. అనేకానేక కారణాల్లో ఈ వాటర్ బాటిల్ డిజైన్ కూడా ఒక కారణమే. ఎందుకంటే.. ►ఈ బాటిల్ లోపలి భాగాన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారుచేయడం. ►ఈ బాటిల్ ఆకారాన్ని ప్రపంచంలోనే ప్రసిద్ధ బాటిల్ డిజైనర్ అయిన ఫెర్నాండో అల్టామిరానో డిజైన్ చేశాడు. ప్రపంచంలోనే అతి ఖరీదైన హెన్రీ 4 హెరిటేజ్ డ్యుడోగ్నన్ కోగ్న్యాక్ అనే వైన్ బాటిల్ కూడా ఇతనే డిజైన్ చేశాడు. ►ఈ బాటిల్లోని నీళ్లు కూడా ప్రత్యేక రుచి కలిగి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో లభించే సగటు తాగునీటి కంటే ఎక్కువ శక్తిని అందిస్తుందట. అంతఖరీదు పెట్టి కొని తాగే వారు ఎవరుంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! సెలబ్రెటీలు, ప్రముఖ వ్యక్తులు మనలా సాధారణ నీళ్లను తాగరు. వాళ్లు తాగే నీళ్లు ఇవే మరి.. ! -
ఇలా చేస్తే వాటర్ బాటిల్స్‌ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు
ఈ రోజుల్లో ప్రతి యంత్రం, ప్రతి పరికరం.. న్యూ టెక్నాలజీని అందుకుంటూ.. ఈజీ ప్రొసెస్‌ను వినియోగదారులకు అందిస్తున్నాయి. సాధారణంగా వాటర్ బాటిల్స్, పాల బాటిల్స్, వాటి చిన్న చిన్న మూతలను క్లీన్ చేయడానికి పొడవాటి బ్రష్ ఉండేది. అయితే చిత్రంలోని బ్రష్ చూడటానికి అలానే కనిపిస్తుంది కానీ, ఇది టెక్నాలజీతో ముడిపడిన పరికరం (ఎలక్ట్రిక్ వాటర్‌ప్రూఫ్ డివైస్). ఒక్క బటన్ నొక్కితే చాలు గిర్రున తిరుగుతూ బాటిల్ మూల మూలలను శుభ్రం చేసి పెడుతుంది. ఈ హ్యాండ్‌హెల్డ్ క్లీనర్‌కి తగినంత చార్జింగ్ పెట్టుకుని.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. అవసరం అయితే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు వేసుకుని సులభంగా వాడుకోవచ్చు. ఒంపులు తిరిగిన మగ్గులు, గ్లాసులు, చెంబులు, బేబీ బాటిల్స్, బాటిల్ నిపుల్స్ వంటివి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. అందుకు అనువైన రెండు వేరు వేరు బ్రష్‌లు.. బేస్ డివైస్‌కి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మధ్యలో ఉన్న పవర్ బటన్ ఆన్ చేసుకోవడంతో ఈ డివైస్ పని చేస్తుంది. ఇది వాటర్‌ప్రూఫ్ కావడంతో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీని ధర 14 డాలర్లు (రూ.1,158) -
ట్రైన్ లో వాటర్ బాటిల్ కొంటున్నారా..ఇది మీ కోసమే
-
రైళ్లలో వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఏ బ్రాండ్ అమ్మాలి.. రూల్స్ ఏంటి?
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. రైలు ప్రయాణంలో ఎక్కువ మంది ఇబ్బందులు పడేది ఆహారం, నీళ్లతోనే. డబ్బు పెట్టినా సురక్షితమైన నీళ్లు లభించవు. చాలా సార్లు రైళ్లలో అసురక్షితమైన ఏవో లోకల్ బ్రాండ్ వాటర్ బాటిళ్లు విక్రయిస్తుంటారు. అయితే రైళ్లలో ఏ బ్రాండ్ వాటర్ బాటిళ్లు అమ్మాలో నిబంధనలు ఉన్నాయి. తాజాగా పోర్బందర్ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీ కారు నుంచి అనధికారిక, నాసిరకం తాగునీటి బాటిళ్లను మొరాదాబాద్ రైల్వే స్టేషన్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం వాటర్ బాటిళ్ల విక్రయంపై ఓ సిబ్బందిలో ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు వేగంగా చర్యలు తీసుకున్నారు. సుమారు 80 కేసులు లోకల్ బ్రాండ్‌కు చెందిన బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యుడైన మేనేజర్‌ను, మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. సీనియర్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ (DCM) సుధీర్ కుమార్ సింగ్ ఈ సంఘటనపై మాట్లాడుతూ భారతీయ రైల్వేలలో ‘రైల్ నీర్’ బ్రాండ్ వాటర్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలని, ఒకవేళ అవి అందుబాటులో లేకుంటే నిర్దిష్ట బ్రాండ్ నీటిని విక్రయించడానికి కచ్చితమైన ప్రోటోకాల్ ఉందని పేర్కొన్నారు. 'రైల్ నీర్' బ్రాండ్ వాటర్ బాటిళ్ల సరఫరా పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వేరే బ్రాండ్లను విక్రయించాల్సిన పని లేదన్నారు. ‘రైల్ నీర్’ అనేది భారతీయ రైల్వేలో భాగమైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRTC)కి చెందిన బాటిల్ వాటర్ బ్రాండ్. -
ధరలు తెలిస్తే నీళ్లు నమలాల్సిందే
బిందె నీటిని రూ.2కు కొంటున్నారని పాతికేళ్ల క్రితం పత్రికల్లో వస్తే ‘నీళ్లు కొనాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయన్న మాట’ అని చాలామంది నోళ్లు నొక్కుకున్నారు. ఆ తర్వాత ఎక్కడికక్కడ వాటర్ బాటిళ్లు వచ్చేశాయి. ప్రస్తుతం ఏ హోటల్‌కు వెళ్లినా నీటిని కొనాల్సిందే. ఉచితంగా మంచినీళ్లు ఇచ్చే పరిస్థితులు దాదాపు ఏ హోటల్, రెస్టారెంట్లోనూ కనిపించటం లేదు. ప్రజల ఆర్థి క పరిస్థితులు బాగా మెరుగుపడటంతో సురక్షిత నీటి కోసం ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. భారతదేశంలో 2018 వరకూ మినరల్ వాటర్ బాటిళ్ల వ్యాపారం ఏటా రూ.16 వేల కోట్లు ఉండేది. 2022లో రూ.33 వేల కోట్లకు చేరింది. 2023లో రూ.43 వేల కోట్ల బిజినెస్ జరుగుతోందని మార్కెట్ వర్గాల అంచనా. బిస్లరీ, కిన్లే, ఆక్వాఫినా, టాటా వాటర్ ప్లస్, బెయిలీ, రెయిల్ నీర్, ఆక్సీరిచ్ వాటర్ వినియోగం ఎక్కువ. ఇప్పుడు వీటికంటే ఖరీదైన నీరు మార్కెట్‌కు చేరింది. దేశంలో లీటర్ నీళ్ల ధర కనిష్టంగా రూ.20 ఉండగా.. గరిష్టంగా రూ.12 వేల వరకూ ఉంది. జపాన్, జర్మనీతో పాటు దేశాల్లో ఇంతకంటే ఖరీదైన మినరల్ వాటర్ కూడా ఉంది. వీటిని ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయొచ్చు. –సాక్షి ప్రతినిధి, కర్నూలు ఖరీదైన బ్రాండ్లు ఇవీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని హవాయి సముద్రం నుంచి 3వేల అడుగుల లోతులో నీటిని సేకరించి ప్రాసెస్ చేస్తారు. ఇందులో సముద్రపు మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ‘కోనదీప్’ పేరుతో ఈ నీళ్లు మనదేశంలోనూ దొరుకుతున్నాయి. భారత్‌లో లభిస్తున్న అత్యంత ఖరీదైన నీరు ఇదే. ‘వోస్ ఆర్టేíÙయల్’ అనే మరో కంపెనీ దక్షిణ నార్వే నుంచి నీటిని సేకరిస్తోంది. మంచుకొండలో అతి చివరి పొర నుంచి ఈ నీటిని సేకరిస్తారు. భారత్‌లోని అత్యంత ఖరీదైన రెస్టారెంట్లు, లాంజ్లలో మాత్రమే వీటిని విక్రయిస్తున్నారు. 800 మిల్లీలీటర్ల బాటిల్ ధర రూ.6,600 నుంచి రూ.12వేల వరకూ ఉంది. ‘ఆవా’ పేరుతో మరో కంపెనీ ఆల్కలైన్ వాటర్ ఇస్తోంది. ఇందులో పీహెచ్ 8+ ఉంటుంది. కాల్షియం, మెగ్నీíÙయం లాంటి ఫోర్టీ ఫైడ్ మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. ఆరావళి, తరంగ పర్వతాల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ‘ఈవియన్’ అనే మరో బ్రాండ్ నీటిలో మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మంచుకొండల్లో వర్షం కురిసినప్పుడు మంచుపై పారే నీటిని సేకరిస్తారు. ఇందులో పీహెచ్ 7.2 ఉంటుంది. ఇండియాలో ఎక్కువగా క్రీడాకారులు, సెలబ్రిటీలు ఈ నీటినే వినియోగిస్తున్నారు. టాటా హిమాలయా బ్రాండ్ నీటిని హిమాలయాల్లో శివలేక్ పరిధిలో ఉన్న మంచు పర్వతాల నుంచి సేకరిస్తారు. 100 శాతం స్వచ్ఛమైన నేచురల్ మినరల్స్ ఇందులో ఉంటాయి. ఈ నీటిని సేకరించే ప్రాంతంలో మనుషుల సంచారం, కాలుష్యం ఉండదు. బాక్టీరియా కూడా ఉండదు. ఫిలికో వాటర్ రూ.1.14 లక్షలు ప్రపంచంలోని టాప్–10 బ్రాండ్లలో కనిష్టంగా 27 డాలర్ల నుంచి గరిష్టంగా 1,390 వరకు లీటర్ నీటి ధర ఉంది. ఇందులో జపాన్ కంపెనీకి చెందిన ఫిలికో లీటర్ వాటర్ ధర 1,390 డాలర్లు (రూ.1.14 లక్షలు). జర్మనీకి చెందిన నివాస్ ధర1,180 డాలర్లు (రూ.96,760). టాప్ బ్రాండ్లలో కనిష్టంగా ఆ్రస్టేలియాలోని టాస్మానియా కంపెనీ బీఎల్వీడీ నీటి ధర 27 డాలర్లు (రూ.2,214). కొత్తగా వచ్చింది ‘బ్లాక్ వాటర్’ ‘ఇవాకస్’ పేరిట మార్కెట్లోకి కొత్తగా బ్లాక్‌వాటర్ వచ్చింది. ఇందులో 70పైగా నేచురల్ మినరల్స్ ఉన్నట్టు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటంతో పాటు ఎసిడిటీని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా మృదువుగా ఉంచుతుందట. వయసు ప్రభావం కన్పించదని చెబుతున్నారు. -
Cristiano Ronaldo: ఇదే తగ్గించుకుంటే మంచిది..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కోపం ఎక్కువే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు తన చర్యతో అభిమానుల మనోభావాలను కూడా దెబ్బతీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం క్రిస్టియానో రొనాల్డో కాస్త కొత్తగా కనిపించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపుల తర్వాత అల్-నసర్ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్న రొనాల్డో వరుస విజయాలు సొంతం చేసుకుంటూ వచ్చాడు. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లు ఓడినప్పటికి ఆ తర్వాత అల్-నసర్ వరుస విజయాలతో దుమ్మురేపింది. అయితే సౌదీ ప్రోలీగ్‌లో భాగంగా శుక్రవారం అల్-ఇత్తిహాద్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో సేన 1-0తో ఓటమిపాలైంది. మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో పాత రొనాల్డో బయటికి వచ్చేశాడు. సహనం కోల్పోయిన రొనాల్డో పెవిలియన్‌కు వస్తున్న క్రమంలో ఎదురుగా కనిపించిన వాటర్ బాటిల్‌ను కోపంతో తన్నాడు. దెబ్బకు వాటర్ బాటిల్స్ చెల్లాచెదురయ్యాయి. ఒక వాటిర్ బాటిల్ ఎగిరి అభిమానుల మధ్య పడింది. అయితే ఎవరికి ఆ బాటిల్ తగల్లేదు. అయితే రొనాల్డో చర్యను ఫుట్‌బాల్ ఫ్యాన్స్ వ్యతిరేకించారు. ఒక్క మ్యాచ్ ఓడిపోయనంత మాత్రానా ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. కోపంలో చేసే పని ఒక్కోసారి చేటు తెస్తుందని.. అందుకే కోపం తగ్గించుకుంటే మంచిదని హితబోధ చేశారు. అయితే రొనాల్డో కోపానికి ఇంకో కారణం కూడా ఉందని తెలిసింది. అదేంటంటే మ్యాచ్ జరుగుతున్నంత సేపు అల్-ఇత్తిహాద్ జట్టు అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ నామస్మరణ చేశారు. రొనాల్డో కనిపించిన ప్రతీసారి మెస్సీ పేరు అతనికి వినపడేలా గట్టిగట్టిగా అరిచారు. ఈ చర్య కూడా అతని కోపానికి ఒక కారణం కావొచ్చు అని కొందరు పేర్కొన్నారు. అయితే తన చర్యపట్ల సిగ్గుపడిన రొనాల్డో కాసేపటి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి అభిమానులను క్షమాపణ కోరాడు. ఇక మ్యాచ్‌లో ఆట 10వ నిమిషంలో అల్-ఇత్తిహాద్ తరపున బ్రెజిల్‌కు చెందిన రొమారినో గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇరుజట్లు పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు జరిపినప్పటికి మరో గోల్ రాలేదు. pic.twitter.com/26nxt7u4Ak — Out Of Context Football (@nocontextfooty) March 9, 2023 చదవండి: మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు -
ప్రత్యామ్నాయ మార్గాల్లో అదనపు ఆదాయం: పువ్వాడ
అఫ్జల్‌గంజ్: ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే కార్గో సర్వీసులు, పెట్రోల్ పంపులతో పాటు తాజా గా మంచినీటి బాటిళ్ల విక్రయానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. సోమవారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుద్ధి చేసిన మంచినీటి బాటిళ్ల (జీవా జలం) విక్రయాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్... టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఈడీలు వినోద్‌కుమార్, యాదగిరి, ఆర్ఎం శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. -
గులాబీ రంగునీళ్లు బాటిలే మెయిన్ ఎవిడెన్స్.. దీని వెనుక కథ తెలుసా?
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): అవినీతి నిరోధక శాఖ(యాంటీ కరప్షన్ బ్యూరో) పలు ఆకస్మిక దాడుల్లో లంచావతారాలను పట్టుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయా అధికారులు లంచాలు తీసుకునే క్రమంలో ముందస్తు పథకం ప్రకారం ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. అయితే ఇలా అవినీతిపరులను పట్టుకున్నప్పుడు కామన్‌గా కనిపించే ఒక ఇమేజ్ ఎప్పుడైనా గుర్తించారా.? అదే కరెన్సీ నోట్లపై గులాబీ రంగు నీళ్ల బాటిళ్లు ఉంచే ఫొటో. అయితే దీని వెనుక కథ ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయతనించారా? చదవండి: చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే? నిజానికి ఈ రంగు నీళ్ల బాటిలే ఆ నేరంలో ప్రధాన సాక్షమని మీకు తెలుసా.? అయితే రండి తెలుసుకుందాం. లంచం డిమాండ్‌తో విసుగుపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించినప్పుడు ఆయనకు ఇవ్వబోయే కరెన్సీ నోట్లకు ఏసీబీ అధికారులు ముందుగా కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ నోట్లపై ఫినాప్తలీన్ అనే తెల్లని రసాయన పొడిని ఆ నోట్లపై చల్లి బాధితుడి చేత అవినీతి అధికారికి ఇప్పిస్తారు. బాధితుడి నుంచి అధికారి ఆ నోట్లు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేస్తారు. లంచగొండి అధికారి తీసుకున్న ఆ నోట్లను గుర్తించి వాటిని తొలుత ఆ అధికారి ఎదుటే చేతులతో తాకుతారు. అనంతరం చేతులను సోడియం కార్బోనేట్‌తో ఓ బౌల్లో కడిగినప్పుడు రసాయన చర్య జరిగి నీళ్లు గులాబీ రంగులోకి మారతాయి. దీంతో ఆ అధికారి లంచం తీసుకున్నట్టు శాస్త్రీయంగా నిర్ధారించడంతో పాటు ఈ ద్రావణాన్ని బాటిళ్లలో సేకరించి నోట్లపై ప్రదర్శిస్తారు. ఆ అవినీతి ఘటనలో ఆ బాటిళ్లలో ద్రావణాన్ని ప్రధాన సాక్షంగా తీసుకుంటారు. -
బాటిల్ మహల్
సాక్షి, ఒంగోలు: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్య కారకాల్లో ప్లాస్టిక్ ఒకటి.. భూతాపాన్ని మరింతగా పెంచుతున్న ఈభూతం.. మానవ మనుగడకే మంట పెడుతోంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియకు పునాదులు పడినా.. ఆచరణ అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రజలకు అవగాహన కల్పించేలా కొత్తపట్నం బీచ్‌లోని ఓ రిసార్ట్ నిర్వాహకులు భావించారు. వినూత్న రీతిలో ప్లాస్టిక్ బాటిల్ హౌస్ నిర్మించారు. కొత్తపట్నం బీచ్‌కు వచ్చే పర్యాటకులు తాగి పడేసిన 6,500 ఖాళీ సీసాలను ఇందుకువినియోగించారు. బాటిల్ మూతలను ఇంటి లోపలి భాగం గచ్చుపై వృత్తాకారంలో ఆకర్షణీయంగా పేర్చారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచిస్తూ చేపట్టిన ఈ నిర్మాణం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది చదవండి : కొండా.. కోనల్లో.. లోయల్లో.. -
రైళ్లలో అనుమతిలేని వాటర్ బాటిల్స్
సాక్షి, న్యూఢిల్లీ: రైళ్లలో అనధికారికంగా వాటర్ బాటిళ్లను అమ్ముతున్న వారికి రైల్వే అధికారులు చెక్ చెప్పారు. భారతీయ రైల్వే ఒక స్పెషల్ ఆపరేషన్‌లో భాగంగా అక్రమంగా తాగు నీటిని అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. “ఆపరేషన్ థర్స్ట్’ అనే పేరుతో జూలై 8, 9 తేదీల్లో ఈ దాడులను నిర్వహిచామని వెల్లడించింది. రైళ్లలో, ప్లాట్‌పాంలలో అనుమతి లేకుండా తాగునీరు బాటిళ్లను విక్రయిస్తున్న 1371 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై అనధికారిక బ్రాండ్ల ప్యాకేజ్డ్ తాగునీటి బాటిల్‌ను విక్రయించే స్టాళ్లను గుర్తించినట్టు ప్రభుత్వం తెలిపింది. నిందితులనుంచి మొత్తం 69,294 బాటిళ్లను, 6లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. అలాగే నలుగురు ప్యాంట్రీ కార్ల నిర్వాహకులను కూడా అరెస్టు చేశామనీ, సంబంధిత చర్యలు కొనసాగుతాయని పేర్కొంది. రైల్వేలలో అనధికార పీడీడబ్ల్యు (ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్) ఆందోళనల నేపథ్యంలో, న్యూఢిల్లీలోని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్ చేపట్టారు. ఇలాంటి అనధికార కార్యకలాపాలను అణిచివేసేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ ప్రిన్సిపాల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్లను (పీసీఎస్సీ) రైల్వేబోర్డు డీజీ ఆదేశించారు. దాదాపు అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారిక ప్రకటన తెలిపింది. -
ఆస్పత్రికి వెళ్తున్నారా...నీళ్ల బాటిల్ మస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నారా?.. అయితే వెంట నీళ్ల బాటిల్‌ను తీసుకెళ్లండి.. అసలే ఎండాకాలం ఆపై ఆస్పత్రుల్లో మంచి నీళ్ల కరువు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నీళ్లు తాగితే.. అక్కడే అడ్మిట్ కావాల్సిన పరిస్థితి. కాచి వడపోసిన నీటినే తాగండి అని చెప్పే అధికారులు ఆస్పత్రుల వంక కన్నెత్తి చూడకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్ సహా ఉస్మానియా, గాంధీ, పేట్ల బురుజు, సుల్తాన్ బజార్, ఈఎన్టీ, సరో జినిదేవి, ఛాతీ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. మందులు వేసుకునేందుకు.. ఆహారం తినేందుకు రూ.20 చెల్లించి లీటర్ బాటిల్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. వార్డు ల్లో ఉన్న రిఫ్రిజిరేటర్లు పని చేయకపోవడం, ఒక వేళ పనిచేసినా నీరు లేక ఖాళీగా ఉండటంతో తాగేందుకు నీరులేక రోగులు, వారి బంధువులు తీవ్ర యాతన పడుతున్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, వాటిపై సరైన మూతల్లేకపోవడంతో దుమ్మూధూళి కణాలతో పాటు పిచ్చుకల మలవిసర్జన, తోక పురుగులు కనిపిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిమ్స్‌లో నీళ్ల కరువు... నిమ్స్ ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజు కు 1,500 మంది వస్తుండగా, నిత్యం వెయ్యి మందికిపైగా చికిత్స పొందుతుంటారు. రోగుల బంధువులు, ఉద్యోగులు మరో 3వేలమంది ఉంటారు. ఇక్కడి రోగులకు పలు ఇన్సూ్యరెన్స్ కంపెనీలు మందులు, చికిత్స ఖర్చులతో పాటు ఆహారం, తాగునీటి బిల్లులూ చెల్లిస్తుంటాయి. కానీ ఈ ఆస్పత్రిలో మంచి నీరు కూడా రోగులే సమకూర్చుకోవాల్సి వస్తుండటం విశేషం. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ లబ్ధిదారులకు ఆహారం సహా స్వచ్ఛమైన నీటిని ఉచితంగా సరఫరా చేస్తుండటం కొసమెరుపు. ట్యాంకుల్లో పిచ్చుకల వ్యర్థాలు.... ఉస్మానియా ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజూ 2,000 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్ విభాగాల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. వీరికి సహాయకులుగా మరో వెయ్యి మంది ఉంటారు. వైద్య సిబ్బంది మరో 2,000 ఉంటారు. రోజుకు 50 లక్షల లీటర్లకుపైగా నీరు అవసరం కాగా 29,47,640 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని నిల్వ చేసిన ట్యాంకులపై మూతల్లేక దుమ్ము, ధూళీ చేరుతోంది. పావురాల మలవిసర్జన నీటిపై తేలియాడుతోంది. ట్యాంకులను 15 రోజులకోసారి బ్లీచింగ్‌తో శుభ్రం చేయాల్సి ఉన్నా నెలకోసారి కూడా చేయడం లేదు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఆర్‌ఎంఓలు వాటిని పట్టించుకోవడం లేదు. నీటి ట్యాంకుల్లో ఈకొలి బ్యాక్టీరియా... గాంధీ ఆస్పత్రిలోనూ మంచినీటికి కటకటే. ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో నీటిపై నాచు తేలియాడుతోంది. కుళాయి నీటిలో ఈకొలి బ్యాక్టీరియా ఉండటంతో తాగడానికి పనికిరావడం లేదు. ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజూ 2,500 మంది, ఇన్‌పేషంట్ విభాగానికి 1,500 మంది వస్తుంటారు. మరో 2,500 మంది వరకు సిబ్బంది ఉంటారు. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సరిపడ నీరు సరఫరా కాకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. వైద్యులే కాదు ఎవరైనా రోగులు మందు బిల్ల వేసుకునేందుకు నీరు కావాలంటే పైసలు పెట్టి కొనుక్కోవాల్సిందే. -
ఆ బ్రాండెడ్ వాటర్ తాగితే.. వచ్చే రోగాలివే!
న్యూయార్క్ : భారతదేశం సహా 9 దేశాల్లో బ్రాండెడ్ వాటర్ బాటిల్స్‌పై జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దాదాపు 11 రకాలైన బ్రాండెడ్ వాటర్ కంపెనీల నీళ్లలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు న్యూయార్క్‌లోని ఫ్రిడోనియా స్టేట్ యూనివర్సీటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్న నీళ్లను తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే హాని ఏమిటి? ప్రమాదకరమైన ఈ ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరితే వచ్చే ముప్పేమిటంటే.. మైక్రో ప్లాస్టిక్ కణాలలోని రసాయనాలు మన శరీరంలోని హార్మోన్లను బలహీనపర్చి.. వాటి పనితీరును ప్రభావితం చేస్తాయి. ఈ కణాల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశమూ ఉంది. శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. మహిళలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశముంది. పురుషులలో శుక్రకణాల సంఖ్య తగ్గడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు సన్నగిల్లుతాయి. అలాగే పిండంపై ప్రభావం చూపి పుట్టబోయే పిల్లలు శారీరకలోపంతో పుట్టే ప్రమాదం ఉంది. ప్లాస్టిక కణాలపై జరిపిన అధ్యయనంలోని ప్రాథమిక అంచనా ఆధారంగా.. ఈ మేరకు రోగాలు వచ్చే అవకాశముందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయం పేర్కొంటున్నది. అయితే మైక్రో ప్లాస్టిక్ వల్ల కలిగే ఈ భయంకరమైన రోగాల నుంచి తప్పించుకోవడానికి ప్లాస్టిక్ వాడాకాన్ని తగ్గించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. -
వాటర్ బాటిళ్లకు ఎమ్మార్పీ వర్తించదు!
సాక్షి, న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో వాటర్ బాటిళ్లను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువకు అమ్ముకోవచ్చని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పింది. నీటిసీసాల అమ్మకాలకు ‘న్యాయబద్ధమైన కొలతలు, తూనికల చట్టం’ వర్తించదని జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. హోటళ్లలో వస్తువుల అమ్మకంతోపాటు వినియోగదారులకు సేవలు కూడా అందుతాయనీ, ఎవ్వరూ కేవలం నీటిసీసాను కొనడానికే హోటళ్లకు వెళ్లరని వ్యాఖ్యానించింది. సేవలతోపాటు రెస్టారెంట్లలో ఉండే వాతావరణాన్ని ఆస్వాదించేందుకే వినియోగదారులు అక్కడకు వెళ్తారనీ, అందుకోసం యజమానులు పెట్టబుడి పెడుతుండటం వల్ల ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటు తీసుకోవచ్చంది. భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య వేసిన ఓ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. -
బాటిల్‌పై బాదేస్తున్నారు!
► బస్టాండ్లలో వాటర్ బాటిళ్లకు అడ్డగోలు రేట్లు ► రూ.20 నీటి సీసా రూ.25కు విక్రయం.. ► ఎమ్మార్పీని ఏమార్చి బిల్లులు ..జనానికి తప్పని తిప్పలు సాక్షి, హైదరాబాద్ : ..ఇది ఈ ఒక్కచోటే జరుగుతున్న తంతు కాదు! రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. నీళ్ల సీసాలను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారు. బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.20 కాగా.. ఏకంగా రూ.5 అదనంగా వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతు న్నారు. కొందరు ప్రయాణికులు ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా గట్టి చర్యలు తీసుకోవడం లేదు. సొంత లోగో.. అయినా ఆగని దోపిడీ! ఇటీవల ఆర్టీసీ ఓ వింత నిర్ణయం తీసుకుంది. బస్టాండ్లలో కేవలం బిస్లరీ కంపెనీ మంచినీటి సీసాలనే విక్రయించేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ నీటి సీసాపై బిస్లరీ వివరాలతోపాటు ఆర్టీసీ లోగో కూడా ముద్రిస్తున్నారు. నాసిరకం నీటి విక్రయాల నిరోధానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ ప్రకటించింది. దీనిపై ఇతర కంపెనీలు కోర్టును ఆశ్రయించటంతో ఆ కేసు కొనసాగుతోంది. ఆ సంగతి అటుంచితే... ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త సమస్యకు కారణమైంది. సాధారణంగా బస్టాండ్లలో మంచినీటి బాటిల్స్ సహా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి అమ్ముతుంటారు. ఇదంతా తెలిసినా ఆర్టీసీ నియంత్రించడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ లోగోతో వచ్చిన వాటర్ బాటిల్స్‌ను కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. దీనిపై ఆర్టీసీకి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తుండటంతో.. వాటి అసలు ధర (రూ.20)ను తెలియజేస్తూ స్టిక్కర్లు అతికించి చేతులు దులుపుకొన్నారు. వాటిని ఖాతరు చేయని వ్యాపారులు రూ.25 చొప్పున అమ్ముతున్నారు. నీటి ప్లాంట్ల ఊసే లేదు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎమ్మెల్సీగా ఉండగా తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 32 ఆర్టీసీ బస్టాండ్లలో నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయించారు. హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ నియోజకవర్గం పరిధిలో ఇవి ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వీటిల్లో పది మాత్రమే పనిచేస్తున్నాయి. నీటిని శుద్ధి చేసి ఉచితంగా ప్రయాణికులకు అందుబాటులో ఉంచటం దీని ఉద్దేశం. పేద ప్రయాణికులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అన్ని బస్టాండ్లలో దశలవారీగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వ్యాపారులకు మేలు చేసేందుకే అన్నట్టుగా ఆర్టీసీ వీటి ఏర్పాటును పూర్తిగా విస్మరించింది. కేవలం మామూలు నీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆ ప్రాంతం అపరిశుభ్రంగా ఉంటుండటంతో ఆ నీటిని తాగేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. దీంతో కచ్చితంగా బాటిల్ నీటిని కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణమైన వరంగల్ సహాæ కరీంనగర్, నిజామాబాద్ లాంటి రద్దీ బస్టాండ్లలో కూడా మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేయలేదు. కళ్లు మూసుకున్న ప్రజాప్రతినిధులు మంచినీటి కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం స్పందించడం లేదు. ఒకరిద్దరు మినహా ఎమ్మెల్యేలు, ఎంపీలెవరూ ఈ విషయంలో స్పందించ లేదు. బ»స్టాండ్లలో ప్రయాణికుల వసతి మెరుగుపరిచేందుకు ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ల నుంచి ప్రజాప్రతినిధులకు లేఖలు అందాయి. కానీ గడచిన ఏడాది కాలంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మంచినీటి శుద్ధి ప్లాంటును ప్రతిపాదించలేదు. బస్టాండ్లలో సింహభాగం దుకాణాలు ఎమ్మెల్యేల అనుచరులవే కావటమే దీనికి కారణం. ఎమ్మార్పీకి అమ్మితే నష్టమట తమకు సరఫరా అయ్యే నీటి సీసాల్లో కొన్ని లీకేజీలతో వస్తున్నాయని, ఆ నష్టాన్ని తామే భరించాల్సి వస్తుందని, అలాంటప్పుడు ఎమ్మార్పీ ధరలకు నీటి సీసాలు అమ్మితే నష్టం వస్తుందని దుకాణదారులంటున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే ధర పెంచి అమ్ముతున్నామని పేర్కొంటున్నారు. అంటే.. పరోక్షంగా అధికారుల సమ్మతితోనే ఈ దందా నడుస్తోందని స్పష్టమవుతోంది. ఈయన పేరు మేకల నాంపల్లి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామం. ఓ పనిపై కరీంనగర్ వచ్చి సొంతూరికి తిరుగుపయనమయ్యాడు. దాహం వేయటంతో బస్టాండ్‌లో మంచినీళ్ల బాటిల్ కొనేందుకు వెళ్లాడు. రూ.25 చెప్పడంతో నోరెళ్లబెట్టాడు. ఆయన ఊరికి బస్ టికెట్ ధర రూ.16. వాటర్ బాటిల్ ధర మాత్రం రూ.25. చివరికి అంత ధర పెట్టలేక దాహం తీర్చుకోకుండానే బస్సెక్కాడు. అదే బస్టాండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్ ఇది. ఈ నెల 13న ఓ ప్రయాణికుడు ఇందులో వాటర్ బాటిల్ కొనగా.. రూ.25కు బిల్ ఇచ్చారు. నిజానికి ధర రూ.20 మాత్రమే. పైగా బిల్‌పై వాటర్ బాటిల్ పేరు కాకుండా ‘మిస్లేనియస్’ అని రాశారు. సరిగ్గా ఆ దుకాణం ముందే ఆర్టీసీ కంట్రోలర్ కూర్చుని ఉండటంతో ప్రయాణికుడు ఆయనకు ఫిర్యాదు చేశాడు. ఆయన పట్టించుకోకపోవటంతో ఫోన్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు ఆ కంట్రోలర్‌ను హెచ్చరించి దుకాణం ముందు మంచినీటి సీసా ధర రూ.20 అని సూచిస్తూ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటిదాకా బోర్డు ఏర్పాటు చేయలేదు. బస్టాండ్లలో ఇదీ పరిస్థితి.. ♦ కరీంనగర్ బస్టాండ్‌కు రద్దీ అధికంగా ఉంటుంది. నిత్యం దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. బస్టాండ్‌లో ఎక్కడ చూసినా నీటి సీసాలు అమ్మే దుకాణాలే. శుద్ధి చేసిన నీటిని ఉచితంగా అందుబాటులో ఉంచాలన్న ఆలోచన ఆర్టీసీకి రావడం లేదు. ♦ కేంద్రం ప్రతిపాదించిన స్మార్ట్ సిటీ జాబితాలో వరంగల్ ఉంది. ఇక్కడి హన్మకొండ బస్టాండ్‌కు నిత్యం 35 వేల మంది వరకు ప్రయాణికులు వస్తారు. ఇక్కడా నీటి శుద్ధి ప్లాంటు లేదు. ♦ మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో నీటి శుద్ధి ప్లాంటు మరమ్మతుకు చేరి మూతపడింది. అధికారుల నిర్లక్ష్యంపై ‘సాక్షి’లో కథనం రావటంతో ఇటీవలే దాన్ని పునరుద్ధరించారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా పలు బస్టాండ్లలో 32 చోట్ల నీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నా.. అందు లో 20 వరకు పనే చేయటం లేదు. అధికారులు ప్రతిపాదిస్తే చూస్తాం ఏ డిపోకు ఏ అవసరాలుంటాయో పరిశీలించి తదనుగుణంగా హైదరాబాద్‌లో ఉండే ఉన్నతాధికా రులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. డిపోలకు కొత్త భవనాలు, కొత్త బస్సులు, బస్టాండ్లలో వసతుల కల్పన.. ఇలా అన్ని విషయాలపై సమీక్షల్లో చర్చించి చర్యలు తీసుకుంటారు. కానీ.. ఉచిత మంచినీటి శుద్ధి కేంద్రాల విషయంలో మాత్రం వారి తీరు విస్తుపోయేలా ఉంటుంది. ఎందుకంటే.. ఆయా బస్టాండ్లలో మంచినీటి ప్లాంటు ఎందుకు అవసరమో వివరిస్తూ విడిగా ప్రతిపాదన ఉన్నతాధికారులకు అందజేయాలి. అలా ప్రతిపాదన వస్తే దాని ఏర్పాటు ఆవశ్యకతను పరిశీలించి చర్యలు తీసుకుంటామనేది ఉన్నతాధికారుల వాదన. దీనిపై ఓ ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే... ఇప్పటివరకు తమకు నీటి శుద్ధి ప్లాంట్లు కావాలంటూ డిపో అధికారుల నుంచి ప్రతిపాదనలు రాలేదని పేర్కొనటం విశేషం. వాటర్ బాటిళ్ల ధరలను తెలిపే స్టిక్కర్లు ఇవి. చల్లని బాటిల్ రూ.21, మామూలు బాటిల్ రూ.20 చొప్పున అమ్మాలని, ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. కానీ.. దీన్ని అతికించిన వెంటనే ధర కనపడకుండా ఇలా చించేయడం, వేరే కాగితాలు అతికించటం చేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు ఎవరికీ కన్పించకుండా దుకాణాల పైభాగంలో అతికించి వారికి పరోక్షంగా సహకరిస్తున్నారు. -
కాపర్.. ఆరోగ్యానికి సూపర్
మాదాపూర్: మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ‘డాక్టర్ కాపర్’ వాటర్ బాటిల్స్‌ను సినీనటి రాశిఖన్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురాతన ఆరోగ్య పద్ధతులను తిరిగి పరిచయం చేస్తున్నందుకు సంస్థ నిర్వాహకులను అభినందించారు. కాపర్‌తో తయారు చేసిన బాటిల్లో నీటిని నిల్వ ఉంచుకొని తాగితే ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వంద శాతం డాక్టర్ కాపర్ బాటిల్‌ను స్వచ్ఛమైన కాపర్‌తో తయారు చేశామని, సంవత్సరానికి 18 లక్షల బాటిల్స్‌ను తయారు చేసే సామర్థ్యం ఉన్న యంత్రపరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో అధిక మొత్తంలో కాపర్ బాటిల్స్‌ను విక్రయిస్తామని చెప్పారు. -
అలా అమ్మితే.. ఇక జైలుకే
మామూలు దుకాణాల్లో తప్ప బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, థియేటర్లు.. ఇలా ఎక్కడకు వెళ్లినా వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి కూల్ డ్రింకుల వరకు ఏవీ ఎంఆర్పీ ధరకు అమ్మరు. దానికంటే ఎంతో కొంత ఎక్కువ ధర పెడితే తప్ప దాహం తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ, ఇక ముందు ఇలా అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుకు కూడా పంపుతామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఎక్కడ చూసినా మంచినీళ్ల బాటిళ్లను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పి) కంటే 10-20 శాతం అధిక ధరలకు అమ్ముతున్నారని పాశ్వాన్ అన్నారు. అసలు కొన్ని బాటిళ్ల మీద అయితే దాని ధర ఎంతో కూడా ముద్రించడం లేదని మండిపడ్డారు. 47వ ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తూనికలు కొలతల చట్టంలోని సెక్షన్ 36 ప్రకారం.. ముందుగానే ప్యాక్ చేసిన వస్తువులో ప్రమాణాలు దాని మీద పేర్కొన్నట్లు లేకపోతే.. రూ. 25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. రెండోసారి కూడా అలాంటి నేరం చేస్తే.. విధించే జరిమానాను ఇప్పుడు రూ. 50 వేలకు పెంచుతున్నారు. ఇంకా పదే పదే అలాగే చేస్తుంటే లక్ష రూపాయల వరకు జరిమానా, లేదా ఏడాది జైలుశిక్ష లేదా రెండూ కూడా విధిస్తారు. 2009 నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చినా.. దాని గురించిన పరిజ్ఞానం పౌరులకు పెద్దగా లేదు. ఎంఆర్పి కూడా లేబుల్ మీద ముద్రించే ఉంటుంది కాబట్టి దాన్ని ఉల్లంఘించినా కూడా జైలుశిక్ష, జరిమానా విధిస్తారని పాశ్వాన్ ఈ సందర్భంగా చెప్పారు. వినియోగదారులు అవగాహన పెంచుకుని ఫిర్యాదులు చేయాలని, ఫిర్యాదు అన్నదే లేకపోతే చర్యలు ఎలా తీసుకుంటామని ఆయన అడిగారు. ఈ విషయంలో 2007లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. గత ఫిబ్రవరి నెలలో ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్సులో నీళ్ల బాటిల్‌ను ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మినందుకు జాతీయ వినియోగదారుల కమిషన్ రూ. 5 లక్షల జరిమానా విధించింది. -
పేస్ట్ ఒక్కటే... పనులు బోలెడు!
టూత్‌పేస్ట్ ఏం చేస్తుంది అనడిగితే... దంతాలను శుభ్రం చేస్తుంది అని ఠక్కున చెప్పేస్తాం. కానీ టూత్‌పేస్ట్ అదొక్కటే చేయదు. చాలా పనులు చేస్తుంది. అవేంటో తెలుసుకోవాలనుందా? ⇒ చేపలు శుభ్రం చేసినా, వెల్లుల్లి రేకులు ఒలిచినా, ఉల్లిపాయలు కోసినా వాటి వాసన చేతికి ⇒ అంటుకుపోతుంది. అలాంటప్పుడు టూత్‌పేస్ట్‌తో చేతులు రుద్దుకుంటే వాసన వదిలి పోతుంది! ⇒ అద్దాల మీద మరకల్ని, పింగాణీ వస్తువుల మీది మరకల్ని పేస్ట్ తేలికగా వదిలిస్తుంది! ⇒ బూట్ల మీద మరకలుంటే, టూత్‌పేస్ట్‌తో రుద్దితే చాలు... మళ్లీ తళతళ మెరుస్తాయి! ⇒ గోడలపై పిల్లలు పెన్ను, స్కెచ్ పెన్నుతో గీతలు గీశారా? అయితే పేస్టుకి పని చెప్పండి! ⇒ బంగారు, వెండి వస్తువులు మెరుపును కోల్పోతే, టూత్‌పేస్ట్‌తో రుద్ది చూడండి! ⇒ మొటిమలు వచ్చి ముఖమంతా సలుపుతుంటే... పడుకునే ముందు వాటి మీద పేస్ట్ రాయాలి. వాపు తీసి, సలుపు తగ్గి హాయిగా ఉంటుంది! ⇒ ఒక్కోసారి చేతి వేళ్లు, కాలి వేళ్లు రఫ్‌గా తయారవుతాయి. అలాంటప్పుడు టూత్‌పేస్టుతో రుద్దితే మళ్లీ మృదువుగా తయారవుతాయి! ⇒ దోమలు, పురుగులు కుట్టి దద్దుర్లు వచ్చినప్పుడు పేస్టు రాస్తే దద్దుర్లు అణగిపోతాయి. దురద కూడా తగ్గిపోతుంది! ⇒ కాలిన చోట పేస్ట్ రాస్తే బొబ్బలు, మంట రావు! ⇒ వాటర్ బాటిల్స్‌లో నీళ్లు పోసి, పేస్ట్ వేసి శుభ్రం చేస్తే... బాగా శుభ్రపడతాయి. పిల్లల పాల సీసాలను కూడా పేస్టుతో కడిగితే, పాల వాసన పోతుంది! -
ఇక వాటర్ బాటిళ్లను కూడా తినొచ్చట!
లండన్: ఇకపై తాగేసిన వాటర్ బాటిళ్లు చెత్తకుప్పల్లో... కూల్‌డ్రింక్ టిన్నులు రోడ్లపై పడేయాల్సిన అవసరం లేదు. తినడానికి అనువుగా ఉన్న ‘ఓహో’ బాటిల్‌ను ఉపయోగిస్తే చాలు.తాగాల్సింది తాగేసి, బాటిల్‌ను కూడా లొట్టలేసుకుంటూ తినొచ్చు.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు ఈ ‘తినే బాటిల్’ను రూపొందించారు. గోళాకారంలో కనిపించే దీన్ని ఉప్పు, గోధుమవర్ణం శిలీంధ్రానికి చెందిన జిగురుతో తయారు చేశారు. రెండు పొరలతో నిర్మితమైన ఈ బాటిల్‌కు ‘ఓహో’అని పేరు పెట్టారు. ఇందులో ద్రవాలను నిల్వచేయవచ్చు. తాగిన తర్వాత కూల్‌గా బాటిల్‌ను కూడా తినొచ్చు. ‘ఓహో’ పర్యావరణహితమైందే కాకుండా ఎంతో సురక్షితమైంది, చవకైందని తయారీదారులు చెబుతన్నారు. -
‘వరద’ పారేది!
ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో జూలై మాసాంతానికే కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండాయి. ఆగస్టు మొదటివారంలో నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకోవడంతో ఈ నెల 2వ తేదీ నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీ నాటికి సాగర్ జలాశయం 585 అడుగుల నీటిమట్టాన్ని దాటడంతో ఎన్ఎస్పీ అధికారులు క్ర స్ట్గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ నెల 7,8 తేదీల్లో క్రస్ట్‌గేట్ల ద్వారా 20.84 టీంఎంసీలు, 17 నుంచి 21వ తేదీ వరకు మరో 68.98 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. నత్తనడకన లోలెవల్ కెనాల్ నిర్మాణం నాగార్జునసాగర్ జలాశయంలో 575 అడుగులకు పైగా నీటిమట్టం ఉన్న సమయంలో గ్రావిటీ ద్వారా, మిగిలిన సమయంలో మోటార్ల ద్వారా జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో వరద కాల్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1997లో 175 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించారు. అగ్రిమెంట్ ప్రకారం ఐదేళ్లలో కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. గడువు ముగిసి పదేళ్లు కావస్తున్నా నేటికి కాల్వ నిర్మాణం పూర్తి కాలేదు. 17 ఏళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో టేలాండ్ భూములకు సాగునీరు కలగానే మిగిలింది. పంపుహౌస్ నిర్మాణంలోనూ జాప్యమే సాగర్ జలాశయంలో 575 అడుగుల కంటే నీరు తక్కువగా ఉన్నప్పుడు వరద కాల్వలోకి నీటిని పంపింగ్ చేయడానికి రూ. 112 కోట్ల వ్యయంతో పంపుహౌస్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇవి కూడా మందకొడిగానే సాగుతున్నాయి. వాస్తవానికి పంపుహౌస్ నిర్మాణ పనులు 2009 డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. అదీ జరిగింది లేదు. దీంతో అధికారులు ఏటేటా పంపుహౌస్ నిర్మాణ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. రెండేళ్ల క్రితం పంపుహౌస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సైతం పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. కానీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి మోటర్లను బిగిస్తామని ఎన్ఎస్పీ అధికారులు చెబుతున్నా..పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పనులు ఇలాగే మందకొడిగా సాగితే పంపుహౌస్ నిర్మాణం పూర్తయ్యే సరికే మరో ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది. పూర్తికాని డిస్ట్రిబ్యూటరీల తవ్వకం వరద కాల్వ డిస్ట్రిబ్యూటరీల తవ్వకం కూడా నత్తకు నడకలు నేర్వే విధంగా ఉంది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడంతో తమ భూముల్లో కాల్వలు తవ్వవద్దంటూ రైతులు అక్కడక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో డిస్ట్రిబ్యూటరీల తవ్వకానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వరద కాల్వ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీల తవ్వకం 2009 మార్చి నాటికి పూర్తి కావాలి. కాని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత శాసనసభ ఎన్నికలకు ముందు నాటి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హడావిడిగా డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు వదిలిపెట్టారు. దీంతో కాల్వల్లో నీరు చేరి పనులు మరింత ఆలస్యానికి కారణమయ్యాయి. నేటికి ఆ పనులు పూర్తికాలేదు.