కాపర్.. ఆరోగ్యానికి సూపర్
మాదాపూర్: మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘డాక్టర్ కాపర్’ వాటర్ బాటిల్స్‌ను సినీనటి రాశిఖన్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురాతన ఆరోగ్య పద్ధతులను తిరిగి పరిచయం చేస్తున్నందుకు సంస్థ నిర్వాహకులను అభినందించారు. కాపర్‌తో తయారు చేసిన బాటిల్‌లో నీటిని నిల్వ ఉంచుకొని తాగితే ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వంద శాతం డాక్టర్ కాపర్ బాటిల్‌ను స్వచ్ఛమైన కాపర్‌తో తయారు చేశామని, సంవత్సరానికి 18 లక్షల బాటిల్స్‌ను తయారు చేసే సామర్థ్యం ఉన్న యంత్రపరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో అధిక మొత్తంలో కాపర్ బాటిల్స్‌ను విక్రయిస్తామని చెప్పారు.