న్యూయార్క్ : భారతదేశం సహా 9 దేశాల్లో బ్రాండెడ్ వాటర్ బాటిల్స్‌పై జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దాదాపు 11 రకాలైన బ్రాండెడ్ వాటర్ కంపెనీల నీళ్లలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు న్యూయార్క్‌లోని ఫ్రిడోనియా స్టేట్ యూనివర్సీటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్న నీళ్లను తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే హాని ఏమిటి? ప్రమాదకరమైన ఈ ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరితే వచ్చే ముప్పేమిటంటే..
మైక్రో ప్లాస్టిక్ కణాలలోని రసాయనాలు మన శరీరంలోని హార్మోన్లను బలహీనపర్చి.. వాటి పనితీరును ప్రభావితం చేస్తాయి. ఈ కణాల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశమూ ఉంది. శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. మహిళలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశముంది. పురుషులలో శుక్రకణాల సంఖ్య తగ్గడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు సన్నగిల్లుతాయి. అలాగే పిండంపై ప్రభావం చూపి పుట్టబోయే పిల్లలు శారీరకలోపంతో పుట్టే ప్రమాదం ఉంది.
ప్లాస్టిక కణాలపై జరిపిన అధ్యయనంలోని ప్రాథమిక అంచనా ఆధారంగా.. ఈ మేరకు రోగాలు వచ్చే అవకాశముందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయం పేర్కొంటున్నది. అయితే మైక్రో ప్లాస్టిక్ వల్ల కలిగే ఈ భయంకరమైన రోగాల నుంచి తప్పించుకోవడానికి ప్లాస్టిక్ వాడాకాన్ని తగ్గించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment