పేస్ట్ ఒక్కటే... పనులు బోలెడు! | Paste the only ... Uniforms works! | Sakshi
Sakshi News home page

పేస్ట్ ఒక్కటే... పనులు బోలెడు!

Published Tue, Mar 17 2015 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

పేస్ట్ ఒక్కటే... పనులు బోలెడు!

టూత్‌పేస్ట్ ఏం చేస్తుంది అనడిగితే... దంతాలను శుభ్రం చేస్తుంది అని ఠక్కున చెప్పేస్తాం. కానీ టూత్‌పేస్ట్ అదొక్కటే చేయదు. చాలా పనులు చేస్తుంది. అవేంటో తెలుసుకోవాలనుందా?
చేపలు శుభ్రం చేసినా, వెల్లుల్లి రేకులు ఒలిచినా, ఉల్లిపాయలు కోసినా వాటి వాసన చేతికి
అంటుకుపోతుంది. అలాంటప్పుడు టూత్‌పేస్ట్‌తో చేతులు రుద్దుకుంటే వాసన వదిలి పోతుంది!


అద్దాల మీద మరకల్ని, పింగాణీ వస్తువుల మీది మరకల్ని పేస్ట్ తేలికగా వదిలిస్తుంది!
బూట్ల మీద మరకలుంటే, టూత్‌పేస్ట్‌తో రుద్దితే చాలు... మళ్లీ తళతళ మెరుస్తాయి!
గోడలపై పిల్లలు పెన్ను, స్కెచ్ పెన్నుతో గీతలు గీశారా? అయితే పేస్టుకి పని చెప్పండి!
బంగారు, వెండి వస్తువులు మెరుపును కోల్పోతే, టూత్‌పేస్ట్‌తో రుద్ది చూడండి!
మొటిమలు వచ్చి ముఖమంతా సలుపుతుంటే... పడుకునే ముందు వాటి మీద పేస్ట్ రాయాలి. వాపు తీసి, సలుపు తగ్గి హాయిగా ఉంటుంది!
ఒక్కోసారి చేతి వేళ్లు, కాలి వేళ్లు రఫ్‌గా తయారవుతాయి. అలాంటప్పుడు టూత్‌పేస్టుతో రుద్దితే మళ్లీ మృదువుగా తయారవుతాయి!
దోమలు, పురుగులు కుట్టి దద్దుర్లు వచ్చినప్పుడు పేస్టు రాస్తే దద్దుర్లు అణగిపోతాయి. దురద కూడా తగ్గిపోతుంది!
కాలిన చోట పేస్ట్ రాస్తే బొబ్బలు, మంట రావు!
వాటర్ బాటిల్స్‌లో నీళ్లు పోసి, పేస్ట్ వేసి శుభ్రం చేస్తే... బాగా శుభ్రపడతాయి. పిల్లల పాల సీసాలను కూడా పేస్టుతో కడిగితే, పాల వాసన పోతుంది!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement