Toothpaste
-
కిచెన్‌ని క్లీన్‌గా ఉంచడంలో టూత్‌పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!
టూత్‌పేస్ట్ దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు. మన కిచెన్‌ని శుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతుంది. ముఖ్యంగా స్టీల్ సింక్లు, ట్యాప్‌లు, ఎంత ఘోరంగా ఉంటాయో తెలిసిందే. అలాంటి వాటిపై ఉండే మొండి మరకలను క్లీన్ చేయడంలో టూత్‌పేస్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎలా ఈ టూత్ పేస్ట్ మన కిచెన్‌లో ఉన్న వస్తువులను క్లీన్‌గా ఉంచుతుందో సవివరంగా తెలుసుకుందాం.! మన ఇంట్లో వేస్ట్‌గా మిగిలిపోయిన పాత పేస్ట్‌లు వస్తువులను శుభ్రం చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నీటిలోని ఫ్లోరైడ్ కారణంగా కొన్ని రకాల స్టీల్ వస్తువులపై తెల్లటి మరకలు ఉండిపోతాయి. అవి ఓ పట్టాన పోవు. అలాంటి వాటిని వదలగొట్టడంలో టూత్‌పేస్ట్ అద్భతంగా పనిచేస్తుంది. అలాంటి వాటిని క్లీన్ చేయడంలో ఎలా సహకరిస్తుందంటే..స్టెయిన్లెస్ స్టీల్ సింక్లు..వంటగదిలోని సింక్ మిలమిల మెరుస్తు కాంతిగా ఉండాలంటే టూత్‌పేస్ట్‌ని ఉపయోగించటం మంచిది. దానిపై పడు గీతలు, ఒక విధమైన తెల్లటి మరకలను వదలగొట్టడంలో టూత్ పేస్ట్ భలే పనిచేస్తుంది. స్పాంజ్ సాయంతో కాస్త ప్రెజర్ ఉపయోగించి క్లీన్ చేస్తే సులభంగా మరకలు, గీతలు వదిలిపోతాయి. కుళాయిలు..నీటి కుళాయిలపై ఉండు మచ్చలు, మరకులతో కాస్త అసహ్యంగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని టూత్‌పేస్ట్‌ని పూసి క్లాత్‌తో క్లీన్ చేస్తే చక్కగా మెరుస్తూ అందంగా ఉంటుంది. గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్‌లు..గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్ టాప్‌లపై మరకలు, వండిన పదార్థాల అవశేషాలను నీటిగా వదలించడంలో టూత్‌పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మగ్స్‌పై కాఫీ, టీ మరకలు..కొన్ని రకాల టీ కప్పుల్లో కాఫీ, టీ మరకలు ఓ పట్టాన వదలవు. అలాంటప్పడు టూత్‌పేస్ట్‌ని ఉపయోగిస్తే నీటిగా వదిలిపోతాయి. కటింగ్ బోర్డ్..కూరగాయలు కోసే కటింగ్ బోర్డ్‌లు వివిధ రకాల ఆహార పదార్థాల వాసనలతో, మరకలతో ఉంటాయి. వాటిని టూత్‌పేస్ట్‌తో శ్రభం చేస్తే చూడటానికి అందంగానే గాకుండా మంచి సువాసనతో ఉంటుంది. టూత్పేస్ట్ల్ ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, రాపిడి వాసనలను తొలగించి ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..) -
బతికేందుకు చెత్త సేకరించి అమ్మాను: బుల్లితెర నటి
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి దహియా. యే హై మొహబ్బతేన్ సీరియల్‌తో ఫేమస్ అయింది. ప్రస్తుతం అదృశ్యం అనే సీరియల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్యాంక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. బతకడం కోసం చిన్న చిన్న పనులు చేశానని వెల్లడించింది. దివ్యాంక మాట్లాడుతూ.. ' ప్రతి ఒక్కరూ మీపై మీరే ఆశలు పెంచుకోవాలి. మన లక్ష్యం కోసం ఎప్పటికీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ మన మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలి. గతంలో నేను టూత్‌పేస్ట్ పెట్టెలను సేకరించి అమ్మేదాన్ని. వాటికి ఒక్కో బాక్స్‌కు రూపాయి ఇచ్చేవారు. అలా సేకరించిన వాటిని భద్రంగా దాచి చెత్త సేకరించే వారికి అమ్మాను. అలా డబ్బు సంపాదించి నా పెట్ డాగ్ కోసం ఆహారం, బిల్లులు చెల్లించేదాన్ని. అప్పట్లో నా సర్వైవల్ కోసం రూ. 2 వేలు వచ్చినా ఫర్వాలేదు. అలా నా రోజువారీ జీవితం ప్రారంభయ్యేది. ఎవరైనా సరే డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలి' అంటూ సలహాలు ఇస్తోంది బుల్లితెర భామ .కాగా.. దివ్యాంక ప్రస్తుతం బాలీవుడ్ బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం దివ్యాంక ఈజాజ్ ఖాన్ సరసన అదృష్టమ్ అనే చిత్రంలో నటిస్తోంది. -
ఈ ట్రిక్ ఎపుడైనా ట్రైచేశారా? మ్యాజిక్..అస్సలు వదలరు!
వంటిల్లు, వంట ఇంటి సామాను జిడ్డు వదిలించడం అంత తేలిక కాదు. దీనికి సంబంధించి అనేక చిట్కాలను మనం చూసే ఉంటాం. వాటిని చాలామంది పాటించి ఉంటారు కూడా. తాజాగా ఇలాంటి వంట ఇంటి చిట్కా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టూత్‌పేస్ట్+కోకాకోలా+క్లీనర్+బేకింగ్-సోడా+వాటర్‌తో తయారు చేసిన లిక్విడ్ మ్యాజిక్ఇంటర్నెట్ హల్చల్ చేస్తోంది. లెర్న్ సంథింక్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే మూడు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. చిన్ని కోకోకాలా బాటిల్లో కొద్దిగా టూత్ ప్లేస్ వేసి బాగా కలిపాడు. ఆ రువాత ఆమిశ్రమాన్ని ఒకగిన్నెలోపోసి, దానికి బేకింగ్ సోడా, లిక్విడ్ క్లీనర్,కొద్దిగా నీళ్లు కలిపాడు. ఆ తరువాత దీన్నీ ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకుని జిడ్డు పట్టిన పెనాన్ని శుభ్రం చేయడం ఇందులో చూడొచ్చు. This Magic products made by toothpaste+cocacola+cleaner+baking-soda+water pic.twitter.com/KOOeJwuvWn — Learn Something (@cooltechtipz) March 12, 2024 -
టూత్‌పేస్ట్, సన్క్రీమ్లతో డయాబెటిస్ రిస్క్!
అధిక బరువుకు దారితీసే ఆహారపు అలవాట్ల వల్ల, ఒత్తిడి వల్ల, జన్యు కారణాల వల్ల డయాబెటిస్ వస్తుందని ఇప్పటివరకు అందరికీ తెలిసిందే. ఇవి మాత్రమే కాదు, టూత్‌పేస్ట్‌ల వల్ల, మేకప్ కోసం వాడే సన్క్రీమ్ వంటి పదార్థాల వల్ల కూడా టైప్–2 డయాబెటిస్‌కు లోనయ్యే ముప్పు ఉంటుందని టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టూత్పేస్ట్లు, సన్క్రీమ్లు తదితర పదార్థాల్లో తెల్లని తెలుపు రంగు కోసం వాడే ‘టిటానియమ్ డయాక్సైడ్’ అనే రసాయనం డయాబెటిస్ ముప్పును కలిగిస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వారు వెల్లడించారు. టిటానియమ్ డయాక్సైడ్ను ప్లాస్టిక్, పెయింట్లు సహా రకరకాల గృహోపకరణ వస్తువుల తయారీలో వాడటం ఇరవయ్యో శతాబ్ది తొలి రోజుల నుంచి ప్రారంభమైంది. దీని వాడుక 1960 దశకం నుంచి విపరీతంగా పెరిగింది. టిటానియమ్ డయాక్సైడ్ కేవలం ఆహార పానీయాల ద్వారా మాత్రమే కాదు, శ్వాసక్రియ ద్వారా కూడా మనుషుల శరీరాల్లోకి చేరుతుందని, రక్తంలో కలిసిన టిటానియమ్ డయాక్సైడ్ కణాలు పాంక్రియాస్‌ను దెబ్బతీస్తాయని టెక్సాస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ పరిశోధన కోసం ఎంపిక చేసుకున్న వారిలో టైప్–2 డయాబెటిస్ రోగుల పాంక్రియాస్లో టిటానియమ్ డయాక్సైడ్ కణాలను గుర్తించామని, డయాబెటిస్ లేని వారి పాంక్రియాస్లో ఆ రసాయనిక కణాలేవీ లేవని వారు వివరించారు. టిటానియమ్ డయాక్సైడ్ను పేపర్ తయారీలోను, కొన్ని రకాల ఔషధ మాత్రల తయారీలోను, ఫుడ్ కలర్స్ తయారీలో కూడా వాడుతున్నారని, దీని వాడకం పెరుగుతున్న కొద్దీ డయాబెటిస్ రోగుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి, ఇప్పుడిది మహమ్మారి స్థాయికి చేరుకుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిటానియమ్ డయాక్సైడ్ ప్రభావం వల్ల పాంక్రియాస్ పాడైనవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి క్షీణించడం వల్ల వారు టైప్–2 డయాబెటిస్ బారిన పడుతున్నారని టెక్సాస్ శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఆడమ్ హెల్లర్ తెలిపారు. ఆస్బెస్టాస్ ఊపిరితిత్తుల వ్యాధిని కలిగించే రీతిలోనే టిటానియమ్ డయాక్సైడ్ డయాబెటిస్‌కు కారణమవుతోందని తమ పరిశోధనలో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు సాగించాల్సి ఉందని, తాము ఆ దిశగానే ముందుకు సాగుతున్నామని డాక్టర్ హెల్లర్ వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలను ‘కెమికల్ రీసెర్చ్ ఇన్ టాక్సికాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. -
టూత్‌పేస్ట్‌తో ఊపిరితిత్తుల వ్యాధులు దూరం!
మిచిగాన్ : మనిషి ప్రతినిత్యం ఉపయోగించే వాటిలో టూత్పేస్ట్ది ఓ ప్రత్యేక స్థానం. నిజం చెప్పాలంటే టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకున్న తర్వాతే రోజు మొదలవుతుంది అందరికీ. ఇది కేవలం పళ్లని శుభ్రం చేయడానికే కాదు.. ప్రాణాంతక జబ్బులను తరిమికొట్టడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. టూత్‌పేస్ట్‌లో ఊపిరితిత్తుల సంబంధమైన రోగాలతో పోరాడే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టూత్‌పేస్ట్‌లో ఉండే ట్రైక్లోసన్ బ్యాక్టీరియాను చంపుతుందని, దాన్ని టుబ్రామిసిన్ అనే యాంటీ బ్యాక్టీరియా జౌషదంతో కలిపినపుడు అది రోగ సంబంధ క్రిములను 99 శాతం చంపగలిగిందని వారు తెలిపారు. ముఖ్యంగా వంశపారపర్యంగా వచ్చే సిస్టిక్ ఫైబ్రోసిస్(ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధి)ను నివారించగల్గిందని పేర్కొన్నారు. అయితే టుబ్రామిసిన్ ఉపయోగించటం వల్ల దుష్ప్రభావాలు ఉండటంతో దీని వాడకాన్ని తగ్గించడం జరిగిందన్నారు. పూర్తిగా కాకుండా కొద్ది మొత్తంలో వాడటం ద్వారా వ్యాధి నివారణకు తోడ్పడుతుందన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగి పూర్తి స్థాయిలో నివారణ కనుక్కునే దిశగా అడుగులు వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే..? ప్రాణాంతకమైన వ్యాధులలో ఇది ఒకటి. వంశపారపర్యంగా వచ్చే ఈ ఊపిరితిత్తుల వ్యాధి ప్రతి 3000 మందిలో కనిపిస్తుంటుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ కారణంగా ఊపిరితిత్తులలో శ్లేష్మం పేరుకుపోతుంది. ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను చంపడం చాలా కష్టం. సూడోమోనాస్ ఎరుగినోస అనబడే ఈ బ్యాక్టీరియా బయోఫిల్మ్ రక్షణలో ఉండి మామూలు మందులతో నియంత్రణ కష్టంగా మారుతుంది. -
పిప్పి పళ్లకు పెపై్టడ్ టూత్ పేస్ట్‌తో చెక్!
పిప్పి పళ్లకు రోజూ వాడే టూత్ పేస్ట్ ద్వారానే చెక్ పెట్టేందుకు వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. మన పంటి దృఢత్వానికి కారణమైన ఒక ప్రొటీన్ అమిలోగెనిన్లో ఉండే పెపై్టడ్లతో ఇది సాధ్యమేనని వారు అంటున్నారు. పెపై్టడ్లు పంటి ఉపరితలానికి అతుక్కుపోయి కాల్షియం, ఫాస్పరస్ అయాన్లను ఉపయోగించుకుని పన్ను గట్టిగా మారేందుకు ఉపయోగపడుతుందని అంచనా. బ్యాక్టీరియా కారణంగా ఏర్పడే పిప్పి (కావిటీ) ని కూడా ఈ పెపై్టడ్లు సమర్థంగా నయం చేయగలవని ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ మెహ్మెట్ సరికాయ అంటున్నారు. పరిశోధనశాలలో జరిగిన ప్రయోగాల్లో ఈ పెపై్టడ్లు పళ్లపై పది నుంచి 50 మైక్రో మీటర్ల మందంతో ఎనామిల్‌ను సృష్టించగలిగాయని ఆయన చెప్పారు. వాణిజ్యస్థాయిలో ఈ పెపై్టడ్లతో టూత్‌పేస్ట్ తయారుచేయగలిగితే పిప్పి పళ్లు అన్న అంశం గతకాలపు విషయమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోగ్యానికి ఏ మాత్రం హాని కలగని రీతిలో పిప్పి పళ్ల సమస్యను అధిగమించేందుకు ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని సరికాయ తెలిపారు. పరిశోధన వివరాలు ఏసీఎస్ బయోమెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. -
‘దంత్ కాంతి’తో మెరుగైన ఫలితాలు
హైదరాబాద్: మార్కెట్లోని పలు టూత్‌పేస్ట్‌లతో పోలిస్తే పతంజలి హెర్బల్ టూత్‌పేస్ట్ బ్రాండ్ ‘దంత్ కాంతి’ మెరుగైన ఫలితాలను అందిస్తోందని డెంటిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (డీఏఐ) పేర్కొంది. దంతాల మీది గార తొలగింపు, రక్తస్రావం తగ్గింపు, సూక్ష్మజీవులను ఎదుర్కోవడం వంటి అంశాల్లో ‘దంత్ కాంతి’ ఇతర టూత్‌పేస్ట్‌ల కన్నా ముందుందని 42 రోజుల ఒక ట్రయల్ పరీక్షలో తేలినట్లు డీఏఐ నేషనల్ ప్రెసిడెంట్ అనిల్ డాలా ఒక ప్రకటనలో తెలిపారు. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా మెస్వాక్, కోల్గేట్ టోటల్ ఉన్నాయి. -
మెంటల్ కాదు... డెంటల్ రికార్డు...
తిక్క లెక్క ఇతగాడి పేరు శివమణి కాదు... అందుకే ‘మెంటల్’ కాదు గానీ, కొంచెం ‘డెంటల్’. మరేమీ లేదు... ఇతగాడికి దంతసిరిసంపదలపై జాగ్రత్త ఎక్కువ. అంతేకాదు, దంతసిరిని ధగధగలాడించే టూత్‌పేస్టులపై కొంచెం టేస్టు కూడా ఎక్కువే! ఇదోరకం కలాపోసన లెండి. అయితే ఏంటి..? అనుకుంటున్నారా..? ఈ కలాపోసనతోనే ఇతగాడు ఏకంగా గిన్నెస్ బుక్కులోకి ఎక్కేశాడు. ఏమంత ఘనకార్యం చేశాడంటారా..? ఫొటో చూస్తే అర్థం కావట్లేదూ! తన జీవితకాలంలో వాడేసిన టూత్‌పేస్ట్ ట్యూబులను పారవేయకుండా పదిలంగా దాచుకున్నాడు. ఇతరులు పారవేయబోతున్నవి కూడా వెరైటీగా కనిపిస్తే వెంటతెచ్చి మరీ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇలా ఏకంగా 2,037 టూత్‌పేస్ట్ ట్యూబులను సేకరించాడు. -
వంటింటి తళతళలు...
ఇంటిప్స్ వెండి వస్తువులు నల్లగా మారిపోతే, బంగాళ దుంపలను ఉడికించిన వేడినీటిలో వాటిని దాదాపు గంటసేపు నానబెట్టండి. తర్వాత వాటికి టూత్‌పేస్ట్ పట్టించి, బ్రష్‌తో తోమేస్తే తిరిగి ధగధగలాడుతాయి. రాగి పాత్రలు రంగు కోల్పోయినట్లయితే, చిటికెడు ఉప్పు, కాసింత చింతపండు గుజ్జుతో వాటిని శుభ్రంగా తోమి, నీటితో కడిగేస్తే చాలు, తిరిగి మెరుస్తాయి. వంటింట్లోని గ్లాసులు వంటి గాజు వస్తువులు కొన్నాళ్లు వాడాక మసకబారినట్లవుతుంటాయి. సుద్దముక్కల పొడిని పట్టించి, శుభ్రంగా తోమాక నీళ్లతో కడిగేసి, పొడిగుడ్డతో తుడిచేయండి. తిరిగి అవి కొత్తవాటిలా తళతళలాడుతూ కనిపిస్తాయి. -
పేస్ట్ ఒక్కటే... పనులు బోలెడు!
టూత్‌పేస్ట్ ఏం చేస్తుంది అనడిగితే... దంతాలను శుభ్రం చేస్తుంది అని ఠక్కున చెప్పేస్తాం. కానీ టూత్‌పేస్ట్ అదొక్కటే చేయదు. చాలా పనులు చేస్తుంది. అవేంటో తెలుసుకోవాలనుందా? ⇒ చేపలు శుభ్రం చేసినా, వెల్లుల్లి రేకులు ఒలిచినా, ఉల్లిపాయలు కోసినా వాటి వాసన చేతికి ⇒ అంటుకుపోతుంది. అలాంటప్పుడు టూత్‌పేస్ట్‌తో చేతులు రుద్దుకుంటే వాసన వదిలి పోతుంది! ⇒ అద్దాల మీద మరకల్ని, పింగాణీ వస్తువుల మీది మరకల్ని పేస్ట్ తేలికగా వదిలిస్తుంది! ⇒ బూట్ల మీద మరకలుంటే, టూత్‌పేస్ట్‌తో రుద్దితే చాలు... మళ్లీ తళతళ మెరుస్తాయి! ⇒ గోడలపై పిల్లలు పెన్ను, స్కెచ్ పెన్నుతో గీతలు గీశారా? అయితే పేస్టుకి పని చెప్పండి! ⇒ బంగారు, వెండి వస్తువులు మెరుపును కోల్పోతే, టూత్‌పేస్ట్‌తో రుద్ది చూడండి! ⇒ మొటిమలు వచ్చి ముఖమంతా సలుపుతుంటే... పడుకునే ముందు వాటి మీద పేస్ట్ రాయాలి. వాపు తీసి, సలుపు తగ్గి హాయిగా ఉంటుంది! ⇒ ఒక్కోసారి చేతి వేళ్లు, కాలి వేళ్లు రఫ్‌గా తయారవుతాయి. అలాంటప్పుడు టూత్‌పేస్టుతో రుద్దితే మళ్లీ మృదువుగా తయారవుతాయి! ⇒ దోమలు, పురుగులు కుట్టి దద్దుర్లు వచ్చినప్పుడు పేస్టు రాస్తే దద్దుర్లు అణగిపోతాయి. దురద కూడా తగ్గిపోతుంది! ⇒ కాలిన చోట పేస్ట్ రాస్తే బొబ్బలు, మంట రావు! ⇒ వాటర్ బాటిల్స్‌లో నీళ్లు పోసి, పేస్ట్ వేసి శుభ్రం చేస్తే... బాగా శుభ్రపడతాయి. పిల్లల పాల సీసాలను కూడా పేస్టుతో కడిగితే, పాల వాసన పోతుంది! -
ఈ నోటి దుర్వాసన అందుకేనా?
నా వయసు 35. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాను. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు టెన్షన్ తెలియకుండా, చాక్లెట్లు, చ్యూయింగ్ గమ్‌లు నములుతుండటం అలవాటయింది. ఈ మధ్య నా స్నేహితులు నా నోటినుంచి దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. ఏం చేయమంటారో సలహా ఇవ్వండి. - కృష్ణకౌశిక్, సికిందరాబాద్ ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. చాలామంది ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందే. పని చేస్తున్నప్పుడు కొందరు చాక్లెట్లు, పిప్పరమెంట్లు, చ్యూయింగ్ గమ్ వంటివి నములుతూ ఉంటారు. వీటిలో ఉండే చక్కెర పదార్థాలు నోటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. సహజంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ప్రమాద స్థాయిలో పెరిగిపోతుంది. దాంతో లాలాజలం పీహెచ్ వాల్యూలో ఆమ్లస్వభావం పెరిగిపోయి, సులభంగా పంటిజబ్బులు వస్తాయి. వీటిలో పళ్లు పుచ్చిపోవడం ఎక్కువగా జరుగుతుంది. పంటికి అతుక్కుపోయే ఆహార పదార్థాల వల్ల పళ్లసందుల్లో పాచి పేరుకుపోయి, చిగుళ్ల జబ్బులూ వస్తాయి. అందుకే బ్రష్ చేసినప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు చాలామంది అవగాహన లేకపోవడం వల్ల మార్కెట్లో దొరికే ఖరీదైన టూత్పేస్ట్లు వాడితే నోటి దుర్వాసన పోతుందనుకుంటారు. అలాగే మంచి బ్రష్‌లు వాడటం లేదా నోరు పుక్కిలించే మౌత్ వాష్‌లు, నోటిస్ప్రేలు వాడటం, మరికొందరయితే ఆయిల్ పుల్లింగ్ లాంటి సొంతవైద్యాలూ చేస్తూ ఉంటారు. అందరూ తెలుసుకోవలసింది ఒకటే... పైన చెప్పినటువంటి ఏ ప్రయత్నాల వల్లా నోటి దుర్వాసనను శాశ్వతంగా పోగొట్టలేరు. నోటి దుర్వాసన అనేది పళ్లు లేదా చిగుళ్ల జబ్బులకు సంబంధించిన ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. దీనికి సరైన చికిత్స జరగాలే తప్ప మరే ప్రయత్నాలూ ఫలించవు. అదే సమయంలో ఎక్కువ కాలం నిర్లక్ష్యం మంచిది కాదు. ఒకవేళ చిగుళ్ల జబ్బులు ఉండి ఉంటే నిర్లక్ష్యం వల్ల జబ్బు మరింత పెరిగి, చిన్న వయసులోనే పళ్లు వదులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు వెంటనే స్పెషలిస్టును కలిసి, వారి సలహా మేరకు చికిత్స చేయించుకోవడం మంచిది. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
నెలకోరకం పేస్టును వాడచ్చా?
నేను సూపర్ మార్కెట్టులో ప్రతినెలా పేస్టు కొనేటప్పుడు ఎన్నో కొత్తకొత్త పేస్టులు, పౌడర్లు కనిపిస్తుంటాయి. వాటిలో ఏది మంచిదో తేల్చుకోలేక ప్రతిసారీ కొత్తది కొంటుంటాను. ఇలా నెలకొకటి చొప్పున వాడవచ్చా? లేదా ప్రతినెలా మారుస్తుండాలా? - కృష్ణమూర్తి, ఒంగోలు టూత్‌పేస్ట్ అనేది రోజూ మనం తప్పనిసరిగా వాడే వస్తువైనప్పటికీ దీని గురించి ప్రజలలో అవగాహన తక్కువే. దాదాపు అన్ని పేస్టులలో కూడాను ఒకేరకమైన పదార్థాల మిశ్రమమే (ఇన్‌గ్రెడియంట్స్) ఉంటుంది. రంగు, రుచి, వాసన, ట్యూబ్ ఆకారం, పరిమాణం మాత్రమే మారుతుంటాయి. పళ్లు తోముకునేటప్పుడు బ్రష్‌తో శుభ్రం చేసిన పాచినంతటినీ పేస్టు నురగతోపాటు ఉమ్మేయడానికి మాత్రమే ఒక మీడియాలాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నోటిలో అన్ని మూలలకూ కదలడానికి, పంటిమీద ఆనడానికి ఒక కందెనలా ఉపయోగపడుతుంది. అంతేకాని, మీరు అడ్వటైజ్మెంట్లలో చూసినట్లు పలానా పేస్టు వాడితే నోటిలోని జబ్బులన్నీ పోతాయని కాదు. ఖరీదైన పేస్టును వాడితే మంచి ఫలితాలు ఉంటాయని, మామూలు పేస్టు వాడితే అంతగా ఉపయోగం ఉండదనీ ఎప్పుడూ అనుకోవద్దు. వాడే పేస్టు కంటే కూడా మనం బ్రష్ చేసుకునే విధానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి... ఎంత ఖరీదైన పేస్టయినా సరే, సరిగా రెండుపూటలా శాస్త్రీయ పద్ధతిలో బ్రష్ చేసుకోకుంటే ఎటువంటి ఫలితాన్నీ ఇవ్వదు. అదేవిధంగా జీవితకాలం ఒకే రకమైన పేస్టు వాడాలనే నిబంధన ఏమీ లేదు. రంగు, రుచిని బట్టి మీకు నచ్చిన పేస్టుతో హాయిగా పళ్లు తోముకోవచ్చు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్