వంటింటి తళతళలు...
ఇంటిప్స్
వెండి వస్తువులు నల్లగా మారిపోతే, బంగాళ దుంపలను ఉడికించిన వేడినీటిలో వాటిని దాదాపు గంటసేపు నానబెట్టండి. తర్వాత వాటికి టూత్‌పేస్ట్ పట్టించి, బ్రష్‌తో తోమేస్తే తిరిగి ధగధగలాడుతాయి.
రాగి పాత్రలు రంగు కోల్పోయినట్లయితే, చిటికెడు ఉప్పు, కాసింత చింతపండు గుజ్జుతో వాటిని శుభ్రంగా తోమి, నీటితో కడిగేస్తే చాలు, తిరిగి మెరుస్తాయి.
వంటింట్లోని గ్లాసులు వంటి గాజు వస్తువులు కొన్నాళ్లు వాడాక మసకబారినట్లవుతుంటాయి. సుద్దముక్కల పొడిని పట్టించి, శుభ్రంగా తోమాక నీళ్లతో కడిగేసి, పొడిగుడ్డతో తుడిచేయండి. తిరిగి అవి కొత్తవాటిలా తళతళలాడుతూ కనిపిస్తాయి.