బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి దహియా. యే హై మొహబ్బతేన్ సీరియల్‌తో ఫేమస్ అయింది. ప్రస్తుతం అదృశ్యం అనే సీరియల్‌లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్యాంక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. బతకడం కోసం చిన్న చిన్న పనులు చేశానని వెల్లడించింది.
దివ్యాంక మాట్లాడుతూ.. ' ప్రతి ఒక్కరూ మీపై మీరే ఆశలు పెంచుకోవాలి. మన లక్ష‍్యం కోసం ఎప్పటికీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ మన మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలి. గతంలో నేను టూత్‌పేస్ట్ పెట్టెలను సేకరించి అమ్మేదాన్ని. వాటికి ఒక్కో బాక్స్‌కు రూపాయి ఇచ్చేవారు. అలా సేకరించిన వాటిని భద్రంగా దాచి చెత్త సేకరించే వారికి అమ్మాను. అలా డబ్బు సంపాదించి నా పెట్ డాగ్ కోసం ఆహారం, బిల్లులు చెల్లించేదాన్ని. అప్పట్లో నా సర్వైవల్ కోసం రూ. 2 వేలు వచ్చినా ఫర్వాలేదు. అలా నా రోజువారీ జీవితం ప్రారంభయ్యేది. ఎవరైనా సరే డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలి' అంటూ సలహాలు ఇస్తోంది బుల్లితెర భామ
.కాగా.. దివ్యాంక ప్రస్తుతం బాలీవుడ్ బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం దివ్యాంక ఈజాజ్ ఖాన్ సరసన అదృష్టమ్ అనే చిత్రంలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment