Survival
-
'లాస్ట్ హోప్ కాదు... బెస్ట్ కేర్'..!
‘లాస్ట్ హోప్ కాదు... బెస్ట్ కేర్ ఎవరినైనా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చారు అనగానే... ఇక వారు తిరిగి మామూలు వ్యక్తిగా వెనక్కు రావడం అసాధ్యమనేది చాలామంది సాధారణ ప్రజల్లో ఉండే అ΄ోహ. కాసేపు కోలుకున్నట్లుగా కనిపించినా ఐసీయూలో చేర్చేవారిలో చాలామంది ఆరోగ్యం క్రమంగా విషమిస్తుందని అనుకుంటూ ఉండేవారి సంఖ్య ఎక్కువ. కేవలం కొందరు మాత్రమే కోలుకుంటారనే అభిప్రాయాలు చాలా మందిలో వినిపిస్తుంటాయి. నిజానికి ఐసీయూలో గనక చేర్చకపోతేనే మరణావకాశాలు ఎక్కువ. అసలు ఐసీయూలో ఎలాంటి వసతులుంటాయి, అక్కడ అత్యంత ముప్పు ఉన్న బాధితుల విషయంలో డాక్టర్లు ఏం చేస్తారు, ఎలాంటి చికిత్స అందిస్తారు, ఏయే జాగ్రత్తలు తీసుకుంటారనే విషయాలను తెలుసుకుందాం. మానవ శరీరం అనేక ఖనిజ లవణాలతో ఎన్నో సంక్లిష్టమైన జీవరసాయన చర్యలు జరుగుతుండటం వల్లనే సజీవంగా ఉంటూ, ఆరోగ్యకరంగా పనిచేస్తుంటుంది. ఎవరైనా ఏదైనా తీవ్రమైన జబ్బుల బారిన పడ్డా లేదా ఏదైనా ప్రమాదంలో గాయపడ్డా ఈ జీవరసాయన క్రియల్లోనూ, శరీరంలోని ఇతర ఖనిజ, లవణాల వంటి రసాయనిక అంశాల్లోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఫలితంగా దేహంలోని ఎన్నెన్నో భాగాలు వేగంగా మార్పులకూ, వివిధ పరిణామాలకు లోనవుతూ ఉంటాయి. దాంతో చాలా దుష్పరిణామాలకు అవకాశాలెక్కువ. శరీరంలో ఉంటే సహజమైన సమతుల్యత (హోమియోస్టేసస్) కూడా దెబ్బతింటుంది. బాధితులకు వచ్చే ప్రమాదాలూ... అధిగమించే పద్ధతులు... ఐసీయూలో చేర్చాల్సి వచ్చిన బాధితుల్లో కనిపించే కొన్ని హటాత్పరిణామాలు ఇలా ఉండవచ్చు... ఉదాహరణకు హటాత్తుగా గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, గుండె సరిగా పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తడం, మెదడులోగానీ, కడుపులోగాని రక్తస్రావం కావడం వంటి సమస్యలు ఒక్కోసారి శరీరం వెంటనే కోలుకునే అవకాశం లేకుండా చేయవచ్చు. ఇలాంటి సమయాల్లో రోగి పరిస్థితి చాలా వేగంగా క్షీణించడం మొదలువుతుంది. కొందరిలో ఇది ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. ఇలాంటి హటాత్పరిణామాల్లో ఏది వస్తుందో, ఏది రాదో ముందే ఊహించడం సాధ్యం కాదు. అయితే క్రిటికల్ కండిషన్లో ఉన్న బాధితులు ఐసీయూలో గనక ఉన్నట్లయితే వారిలో ఆయా సమయాలకు వచ్చే అనర్థాలనూ, ప్రమాదాలనూ వెంటనే గుర్తించి, వెనువెంటనే స్పందించి, వచ్చిన సమస్యకు అనుగుణంగా అవసరమైన చికిత్సను తక్షణం అందించడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఊపిరి అందనప్పుడు ఐసీయూలోని వెంటిలేటర్లను ఉపయోగించడం, మూత్రపిండాలు పనిచేయకపోతే వెంటనే డయాలసిస్ వంటి ప్రాణరక్షణ యంత్రాన్ని వాడటం వంటివి చేసేందుకు వెసులుబాటు ఉంటాయి. గుండె లయలో తేడా వచ్చినప్పుడు సరిచేయడానికి డిఫిబ్రిలేటర్లు ఉంటాయి. క్రిటికల్ కేర్ నిపుణులతో తక్షణ వైద్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే క్రిటికల్ కేర్ వైద్యనిపుణులు శరీరంలో ఎప్పుడే మార్పు వచ్చినా దానికి అనుగుణంగా స్పందిస్తారు. ఉదాహరణకు గుండె ఆగి΄ోయినా తక్షణమే తిరిగి పనిచేయించడానికి సీపీఆర్ చేయడం, షాక్‌లు ఇచ్చి, బాధితులను విజయవంతంగా బతికించడం చేసిన కేసులే ఎక్కువ. కిడ్నీ పని చేయక΄ోతే రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ, కాలేయం పనిచేయకపోతే ఉపయోగించే మార్స్... ఇలా అందుబాటులో ఉండే ఉపకరణాలూ, పరికరాలతో చికిత్స అందిస్తారు. మందుల్ని అనుకున్న మోతాదుల్లో పంపేందుకు ఇన్ఫ్యూజన్ పంపులు ఉంటాయి. ఇక బీపీని, నాడిని లోపలి నుంచి వచ్చే ప్రతి బీట్నూ కొలిచే వీలుంటుంది. ఇక బాధితులను చూసుకోడానికి ఏడాదిలో ప్రతిరోజూ 24 గంటలూ జాగ్రత్తగా చూసుకోడానికి నిపుణులైన ఫిజీషియన్లు, నర్సులు, శ్వాస అందేలా చూడటానికి రెస్పిరేటరీ టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. ఏ కొద్ది తేడా వచ్చినా వెంటనే పై నిపుణులంతా చురుగ్గా స్పందించడంతో తక్షణ వైద్యచికిత్సలు మొదలవుతాయి. ఇవన్నీ చాలా క్రిటికల్‌గా ఉండే బాధితులకు అవసరమైనవి. అప్పటికే పరిస్థితి బాగా విషమించి΄ోయిన సందర్భాల్లో తప్ప... నిజానికి ఇప్పుడు విజయవంతమైన చికిత్సతో ఐసీయూలోంచి బయటకు వచ్చేవారి సంఖ్యే ఎక్కువ. ఐసీయూలో ఏం చేస్తారంటే... బాధితులను ఐసీయూలో ఉంచినప్పుడు దేహంలో వచ్చే మార్పులనూ, అలాగే దేహంలోని అనేక కీలకమైన పనులు జరగడానికి తోడ్పడుతుండే జీవరసాయన చర్యలూ, వాటిలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, జరిగిన ప్రతికూల మార్పులను మళ్లీ యథాస్థితికి (నార్మల్కు) తెచ్చేందుకూ, వాటిని క్రమబద్ధంగా జరిగేలా చూసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటారు. బాధితులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటారు కాబట్టీ, వాళ్లను నార్మలైజ్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటారు కాబట్టి... ఆ డాక్టర్లను ‘క్రిటికల్ కేర్’ నిపుణులుగా చెబుతారు.ఐసీయూలోని సౌకర్యాలేమిటంటే... శరీరం తాలూకు సహజ సమతౌల్య స్థితి (హోమియోస్టేసస్)తిరిగి పొందేందుకు అవసరమైన అన్ని చికిత్సల కోసం కావాల్సిన సౌకర్యాలన్నీ ఐసీయూలో ఉంటాయి. ఏదైనా వ్యాధికి లోనైన శరీర భాగాలు వాస్తవానికి తమను తాము రిపేర్ చేసుకునే స్వాభావికమైన (నేచురల్) గుణం... దాదాపుగా అన్ని అవయవాలకూ ఉంటుంది. కానీ కీలకభాగాలైన మెదడు, గుండె, శ్వాసకోశ వ్యవస్థ, కాలేయం, కిడ్నీలు, రక్తం దెబ్బతింటే అవి నేచురల్‌గానే కోలుకోవాలంటే పట్టే సమయం అతడు బతికి కోలుకోవడం కోసం సరిపోదు. అవి వీలైనంత త్వరగా కోలుకునేలా చేయగలిగితేనే ఆ బాధితుడి మనుగడ (సర్వైవల్) సాధ్యమవుతుంది. ఆ వ్యవస్థలను వీలైనంత త్వరగా మామూలు స్థితికి తెచ్చే సౌకర్యాలన్నీ ఐసీయూలో ఉంటాయి.(చదవండి: గుమ్మడి పండంటి బిడ్డ... రిస్క్ టాస్క్..) -
బతికేందుకు చెత్త సేకరించి అమ్మాను: బుల్లితెర నటి
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి దహియా. యే హై మొహబ్బతేన్ సీరియల్‌తో ఫేమస్ అయింది. ప్రస్తుతం అదృశ్యం అనే సీరియల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్యాంక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. బతకడం కోసం చిన్న చిన్న పనులు చేశానని వెల్లడించింది. దివ్యాంక మాట్లాడుతూ.. ' ప్రతి ఒక్కరూ మీపై మీరే ఆశలు పెంచుకోవాలి. మన లక్ష్యం కోసం ఎప్పటికీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ మన మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలి. గతంలో నేను టూత్‌పేస్ట్ పెట్టెలను సేకరించి అమ్మేదాన్ని. వాటికి ఒక్కో బాక్స్‌కు రూపాయి ఇచ్చేవారు. అలా సేకరించిన వాటిని భద్రంగా దాచి చెత్త సేకరించే వారికి అమ్మాను. అలా డబ్బు సంపాదించి నా పెట్ డాగ్ కోసం ఆహారం, బిల్లులు చెల్లించేదాన్ని. అప్పట్లో నా సర్వైవల్ కోసం రూ. 2 వేలు వచ్చినా ఫర్వాలేదు. అలా నా రోజువారీ జీవితం ప్రారంభయ్యేది. ఎవరైనా సరే డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలి' అంటూ సలహాలు ఇస్తోంది బుల్లితెర భామ .కాగా.. దివ్యాంక ప్రస్తుతం బాలీవుడ్ బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం దివ్యాంక ఈజాజ్ ఖాన్ సరసన అదృష్టమ్ అనే చిత్రంలో నటిస్తోంది. -
Nitin Gadkari: విరాళాల్లేకుండా పార్టీలు మనలేవు
అహ్మదాబాద్: ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేశాక ఈ పథకంపై ప్రజాక్షేత్రంలో చర్చోపచర్చలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన మనసులో మాట చెప్పారు. ‘‘ అసలు విరాళాలు తీసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. సదుద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల పథకం తెచ్చాం. పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేయకుండా అందులోని లోటుపాట్లను సరిచేయాలని సూచనలు చేస్తే బాగుండేది. సూచనల మేరకు అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూర్చుని చర్చించుకునే అవకాశం దొరికేది. ఏకాభిప్రాయంతో సవరణలు చేసేవాళ్లం’ అని అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ‘గిఫ్ట్ సిటీ’లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. ‘గతంలో అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఇలాంటి పథకం ఒకటి ఉంటే మంచిదని చర్చ జరిగినప్పుడు నేను అందులో పాల్గొన్నా. వనరులు లేకుండా రాజకీయ పార్టీల మనుగడ అసాధ్యం. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే పార్టీలకు నిర్వహణ నిధులిస్తాయి. భారత్‌లో అలాంటి పద్ధతి లేదు. అందుకే పార్టీలకు ఆర్థిక అండగా నిలబడే ఇలాంటి పథకాలను రూపొందించుకున్నాం. నేరుగా పార్టీలకు విరాళాలు చేరేలా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. విరాళాల అందజేతకు ముందు, తర్వాత అధికారంలో ఉన్న పార్టీ మారిపోతే దాతలకు సమస్యలు వస్తాయి. అందుకే దాతల వివరాలు రహస్యంగా ఉండేలా పథకంలో నిబంధనలు పెట్టాం. ఏదైనా మీడియా సంస్థ తన ఒక కార్యక్రమానికి నిధులు అవసరమైతే స్పాన్సర్‌ను చూసుకుంటుంది. పార్టీ నిర్వహణ, కార్యకలాపాలకు నిధులు అవసరమే కదా’ అని గడ్కరీ ఉదహరించారు. ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే పార్టీలకు విరాళాలు పారదర్శకంగా వచ్చేలా చూశామన్నారు. -
మనిషి... మనుగడ
మనుగడ అనేది ప్రతి మనిషికీ ఉంటుంది. మనిషికి మాత్రమే మనుగడ ఉంటుందా? ప్రతి జీవికీ మనుగడ ఉంటుంది. ఏ జీవి మనుగడ దానిదే. కొన్ని జంతువుల మనుగడ మనిషికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి మనిషి మనుగడా తనకు, సమాజానికి ప్రయోజనకరంగానే ఉండాలి; ప్రయోజనకరంగా ఉండేందుకు మనిషి తన మనుగడను ఒక అవకాశంగా తీసుకుని, చేసుకుని ప్రయత్నించాలి. మనుగడ ప్రయోజనకరంగా పరిణమించడానికి ఏ మనిషికి ఐనా మెదడు, మనసు ఈ రెండూ కీలకం ఐనవి. మనసు తిన్ననైంది కాకపోవడం మాత్రమే మనిషికి లోటు కాదు; మెదడు సరిగ్గా పనిచెయ్యక పోవడం మాత్రమే మనిషికి లోటు కాదు. మెదడుకు మనసు లేకపోవడమే, మనసుకు మెదడు లేకపోవడమే మనిషికి లోతైన లోటు! మెదడుకు మనసు ఉండాలి; మనసుకు మెదడు ఉండాలి. మెదడు, మనసు కలిసి ఉద్యుక్తం ఐతే, ఉన్ముఖం ఐతే, ఉద్యమిస్తే ఉన్నతం ఐన ఫలితం వస్తుంది. మనుగడ ఉచ్చస్థితికి చేరుతుంది. సగటు మనిషి తన చేతిలోనే తాను ఓడిపోతూ ఉంటాడు; తన ప్రవర్తనవల్ల తాను సరిగ్గా ఉండడం జరగదు సగటు మనిషికి; చేసిన లేదా జరిగిన తప్పులు దిద్దుకోబడడం ఉండదు చాలమంది విషయంలో; చెడిపోవడం అన్నది చెరిగిపోవడం జరగడం లేదు పలువురిలో. వీటికి కారణం మెదడుకు మనసు లేకపోవడమే; మనసుకు మెదడు లేకపోవడమే. మనిషి మెదడు, మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఏవేవో, ఎన్నెన్నో వాటిలో ఉంటూ ఉంటాయి. అవసరం ఐనవి తక్కువగా, ఎక్కువగా అనవసరం ఐనవి మెదడు, మనసుల్లో ఉండి మనిషి మనుగడ మందమైపోవడానికి, మొద్దుబారిపోవడానికి కారణాలు ఔతూ ఉంటాయి. మెదడు, మనసుల పనితీరువల్లే మనిషికి మేలు, కీడులు కలుగుతూ ఉంటాయి; మనిషిని పనికి వచ్చేట్టుగానూ, పనికిరానట్టుగానూ చేసేవి మెదడు, మనసులే. మెదడుకు మనసును, మనసుకు మెదడును నేర్పుతో అనుసంధానం చేసుకోవడమూ, ఆ అనుసంధానంతో దైనందిన జీవనాన్ని ఎదుర్కోవడమూ తెలిసిన మనిషికి అభివృద్ధి అలవడుతుంది. మనిషి అభివృద్ధిని అలవాటు చేసుకోవాలి; మనిషికి అభివృద్ధిలో అభినివేశం ఉండి తీరాలి. అభివృద్ధిలేని మనిషి అక్కరకురాని మనిషి ఔతాడు ఆపై అక్కర్లేని మనిషి ఔతాడు. మనిషి మనుగడ అనవసరం ఐంది, పనికిరాంది కాకూడదు; మనిషి మనుగడ వెలవెలపోకూడదు. మనిషి మనుగడ విలువైంది కావాలి. మనిషి తన మనుగడకు తానే విలువను, వన్నెను సమకూర్చుకోవాలి. మెదడు, మనసుల్ని సంయుక్తంగా సంప్రయోగించి మనిషి తన మనుగడను విజయవంతంగా నడుపుకోవాలి. ‘తిండిని వెతుక్కుంటూ రోజూ తిని/ ఏవేవో అల్పమైన కథలు చెప్పుకుని/ మనసు ఒడిలి బాధల్ని అనుభవించి/ ఇతరుల్ని బాధించేవెన్నో చేసి/ తల నెఱుపు వచ్చి ముసలితనాన్ని పొంది/ ఘోరమైన మరణానికి బలై / మాసిపోయే పలు విదూషకుల్లా నేను కూలిపోతాననుకున్నావా?’ అని, అని తమిళ్ కవి సుబ్రమణియ బారతి పేలవంగా ఉండడాన్ని తిరస్కరించారు. కూలిపోయేందుకు కాకుండా, విదూషకత్వంతో కాకుండా, మాసిపోయేందుకు కాకుండా, ఇతరుల్ని బాధించేందుకు కాకుండా, బాధల్ని అనుభవిస్తూ ఉండేందుకు కాకుండా, అల్పుడుగా కాకుండా, ఏదో తింటూ కాలం గడిపేందుకు కాకుండా మిన్నగా మసలేందుకు, మిన్నులా ఎత్తుల్లో నిలిచేందుకు మెదడుతో మనసును, మనసుతో మెదడును సంయుక్తం చేసుకుని మనిషి కార్యాచరణకు పూనుకోవాలి. మనిషి మనుగడ ప్రయోజనకరంగా ఎందుకు ఫలించకూడదు? మనిషి తన మనుగడను పట్టుదలతో ప్రయోజనకరం చేసుకోవాలి. మెదడు, మనసుల సమన్వయంతో, సంయోగంతో మనిషి సంపూర్ణంగా సఫలం అవాలి. మనిషి తన మనుగడకు సత్ప్రయోజనాన్ని సాధించుకోవాలి; సమాజానికీ సాధ్యం ఐనంత ప్రయోజనకరంగా మనిషి మెదులుతూ ఉండాలి. మనిషికి మెదడు, మనసు ఉంటాయి. అవి సరిగ్గా, మెరుగ్గా ఉంటే మనిషి సరిగ్గా, మెరుగ్గా ఉంటాడు; అవి మేలుగా ఉంటే మనిషి మేలుగా ఉంటాడు. మెదడు, మనసు రెండూ కలిసి జతగా పనిచేస్తూ ఉంటేనే మనిషి గొప్ప స్థితిని, స్థాయిని, గతిని ఆపై ప్రగతిని పొందుతూ ఉంటాడు. – రోచిష్మాన్ -
2 కంపెనీల ఐపీవోలకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా నిధుల సమీకరణకు నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ ఎబిక్స్ ఇంక్ అనుబంధ సంస్థ ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్, స్పెషాలిటీ కెమికల్ తయారీ కంపెనీ సర్వైవల్ టెక్నాలజీస్లను అనుమతించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించమంటూ ఈ రెండు కంపెనీలు 2022 మార్చి, డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. రూ. 6,000 కోట్లపై కన్ను ఐపీవో ద్వారా ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్ రూ. 6,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అనుబంధ సంస్థలు ఎబిక్స్ ట్రావెల్స్, ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. అంతేకాకుండా ఎబిక్స్ మారిషస్ జారీ చేసిన తప్పనిసరిగా మార్పడికి లోనయ్యే డిబెంచర్ల చెల్లింపులతోపాటు.. వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. కంపెనీ పేమెంట్ సొల్యూషన్స్, ట్రావెల్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, బీపీవో సర్వీసులు, స్టార్టప్‌ల ఏర్పాటులో టెక్నాలజీ ఆధారిత డిజిటల్ ప్రొడక్టులు, సర్వీసులను అందిస్తోంది. రూ. 1,000 కోట్లకు సై ఐపీవోలో భాగంగా సర్వైవల్ టెక్నాలజీస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్(సీఆర్ఏఎంఎస్– క్రామ్స్) విభాగంలో ప్రధానంగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్ ప్రొడక్ట్ గ్రూప్‌ల నుంచి ఎంపిక చేసిన ఉత్పత్తులను కంపెనీ రూపొందిస్తోంది. -
ఐపీవో బాటలో సర్వైవల్ టెక్
న్యూఢిల్లీ: స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ సర్వైవల్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ప్రధానంగా విజయ్ కుమార్ రఘునందన్ ప్రసాద్ అగర్వాల్ రూ. 544 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్ రీసెర్చ్, తయారీ సర్వీసుల(క్రామ్స్) ఈ కంపెనీ ప్రధానంగా స్పెషాలిటీ కెమికల్స్ రూపొందిస్తోంది. దేశీయంగా హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్ ప్రొడక్ట్ గ్రూప్‌లకు చెందిన ప్రత్యేకతరహా ఉత్పత్తుల తయారీలోగల కొద్దిపాటి సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(2021–22) రూ. 312 కోట్ల ఆదాయం, రూ. 73 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
మనుగడ ఎలా?
-
Mount Everest: ఎవరెస్ట్ నేర్పే పాఠం ఎలాంటిదంటే..
ఎవరెస్ట్.. ఒక ప్రత్యేకం. అది ఎక్కడమంటే ఒక మినీ యుద్ధం చేసినట్లే!. అధిరోహించిన ప్రతిసారీ ఓ కొత్త అనుభవం పంచుతుంది. ఆ అనుభవం ఓ కొత్త పాఠం నేర్పిస్తుంటుంది. అదే సమయంలో కొత్త సవాళ్లనూ ముందుంచుతుంది. ఆకాశమే హద్దుగా.. పర్వత శిఖరాన్ని అధిరోహించే వాళ్లే కాదు, అక్కడి ప్రతికూల పరిస్థితులకు ఏమాత్రం తీసిపోని సవాళ్లను లైఫ్‌లో దాటుకుంటూ ముందుకెళ్లాలనుకునే వాళ్లు కూడా ‘ఎవరెస్ట్’ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు మరి!. మౌంట్ ఎవరెస్ట్.. ఆకాశానికి సమీప భూభాగం. వెండి కొండలా ధగ ధగా మెరిసే అద్భుత పర్వతం. ఆ శిఖరాగ్రాన్ని చేరి నిలబడి చూస్తే ఎలా ఉంటుంది?.. మొత్తం ప్రపంచమే మనిషి పాదాల కింద ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి మహోన్నత శిఖరాన్ని ఎక్కడమంటే ఆషామాషీ కాదు. కఠోర శిక్షణ తీసుకోవాలి. అంతకు మించి గుండెల నిండా ధైర్యం ఉండాలి. లక్ష్యాన్ని చేరుకోవాలన్న కసి.. గెలిచి తీరాలన్న పంతంతో ముందుకెళ్లాలి. మానవతీతులకు సాధ్యమేనా? అనుకున్న సమయంలో.. ఈ పర్వతాన్ని అధిరోహించి ‘మనిషి తల్చుకుంటే ఏదైనా సాధ్యమే’ అని ప్రపంచానికి చాటి చెప్పిన హీరోలిద్దరున్నారు. వాళ్లెవరో కాదు. న్యూజిలాండ్ కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ- భారత్ కు చెందిన టెన్జింగ్ నార్గే. ఇప్పటి సాంకేతికత, ఆధునిక పరికరాలు, పనిముట్లు, సౌకర్యాలు లేనిరోజుల్లో ఈ ఇద్దరూ ఎవరెస్ట్ మీద తమ జెండాలు పాతారు. అది.. 1953 మే 29 తేదీ సరిగ్గా ఉదయం 11:30 గంటల ప్రాంతంలో.. చరిత్రలో లిఖించదగ్గ క్షణాలను నమోదు చేశారు హిల్లరీ-నార్గేలు. ఈ ఇద్దరిలోనూ శిఖరం పై మొదట కాలు మోపింది మాత్రం హిల్లరీనే. పేరెలా వచ్చిందంటే.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం.. మౌంట్ ఎవరెస్ట్. సముద్ర మట్టానికి 29 వేల అడుగుల ఎత్తులో.. నేపాల్ -టిబెట్ సరిహద్దులో ఉంది. టిబెటన్లు దీన్ని కోమో లాంగ్మా అని పిలుస్తారు. దానర్థం మాతృ దేవత అని. చైనా వాళ్లు జుము లాంగ్మా అంటారు. హోలీ మదర్ అని చైనీయుల ఉద్దేశం. నేపాలీలేమో సాగర మాత అని పిలుస్తుంటారు. అప్పటివరకు కాంచన్ జంగా ప్రపంచంలోకెల్లా.. అత్యంత ఎత్తైన శిఖరమని అంతా పొరబడ్డారు. ఆ సమయంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన జార్జి ఎవరెస్ట్.. అంతకు మించి ఎత్తైన ఓ శిఖరం ఎత్తు తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1850లో నికొల్సన్ అనే ఉద్యోగికి ఆ బాధ్యతలు అప్పజెప్పాడు. ఆరేళ్లపాటు శ్రమించి.. నికొల్సన్ తన ఆపరేషన్ తన బాధ్యతలు పూర్తి చేశారు. అలా జార్జి ఎవరెస్ట్ పేరు మీద.. ప్రపంచానికి మౌంట్ ఎవరెస్ట్‌గా పరిచయమైంది. అయితే.. ఎవరు ఎలా పిలిస్తేనేం ఈ పర్వతమైతే పలుకుతుందా?. గంభీరంగా అలా ఉండిపోతుంది అంతే!. ఎవరెస్ట్‌ను అధిరోహిస్తే.. పేరు వస్తుందన్న మాట వాస్తవమే. కానీ, ఆ పని అంత సులువు కాదు. కాకలు తీరిన పర్వతారోహకులకు సైతం ఇదొక టఫ్ ఛాలెంజ్. ఎత్తుకు వెళ్లే కొద్దీ.. అన్నీ సమస్యలే స్వాగతం పలుకుతుంటాయి. పైగా ప్రతికూల వాతావరణం సవాళ్లు విసురుతుంటుంది. పచ్చిగా చెప్పాలంటే.. ప్రాణాలతో చెలగాటం. ఏమాత్రం తేడా జరిగినా అంతే!. ఎవరెస్ట్ అధిరోహించే క్రమంలో.. ఎనిమిది వేల అడుగుల ఎత్తు దాటితే దాన్ని డెత్ జోన్ అంటారు. అదో మృత్యు శిఖరం. అక్కడ గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఎంత తక్కువగా ఉంటుందంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే. ఆక్సిజన్ బాటిల్స్‌లో తేడాలు జరిగినా అంతే!. ఈ పరిస్థితుల్లో ఇంకా పైకి వెళ్లడం.. ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. అక్కడి నుంచి కిందకు తిరిగి వస్తే అదో గొప్ప. అంత ప్రమాదమని తెలిసినా.. క్లైంబర్స్కు ఎవరెస్ట్ మీద మోజు తగ్గదు. సాహసానికి లభించే అరుదైన విజయానందం మరొకటి ఉంటుందా? అంటారు. అయితే.. ఆ మోజే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. ఆకాశానికి నిచ్చెన.. ఎవరెస్ట్ ఎక్కడమంటే ఆకాశానికి నిచ్చెన వేయడమే. నిచ్చెన ఎక్కేటప్పుడు తప్పటడుగు ఒక్కటి పడినా ఖతం. వాతావరణం ఎదురు తిరిగినా డేంజరే. ఎవరెస్ట్ ఎక్కడంలో బోలెడు రికార్డులు ఉన్నాయి. అన్నే విషాదాలూ ఉన్నాయి. గుండెల నిండా సాహసాన్ని నింపుకుని వేల అడుగుల ఎత్తు ఎక్కిన క్లైంబర్స్ ఎవరెస్ట్ మీదనే చివరి ఊపిరి పీల్చిన విషాద ఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఓ దుర్ఘటన మాత్రం ఎవరెస్ట్ చరిత్రలోనే అత్యంత ట్రాజిక్ ఇన్సిడెంట్ గా మిగిలిపోయింది. ఎ‘వరెస్ట్’ 1996.. 1996, మే 11. మన పర్వతారోహణ చరిత్రలో ఓ బ్లాక్ డే. ఒకేరోజు ఎనిమిది మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పై ఊపిరి వదిలారు. మరణించిన వాళ్లలో మనవాళ్లు ముగ్గురు, అమెరికా-న్యూజిలాండ్-జపాన్ దేశాల వాళ్లు ఐదుగురు ఉన్నారు. ఈ ప్రమాదం మాత్రమే కాదు.. 1996 సీజన్లో ఎవరెస్ట్ అధిరోహణలో మొత్తం పదిహేను మంది కన్నుమూశారు. ఎవరెస్ట్ చరిత్రలో ఓ సీజన్లో ఇంతమంది చనిపోవడం అదే మొదటిసారి!. ఏం జరిగిందంటే..! అడ్వెంచర్ కన్సల్టెంట్స్- మౌంట్ మ్యాడ్నెస్ అనే రెండు ఏజెన్సీలతో పాటు జపాన్-టిబెట్‌లకు చెందిన పర్వతారోహకులు ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధపడ్డారు. మే 10వ తేదీన అంతా పర్వతం పైకి బయలుదేరారు. ఆ రాత్రికి క్యాంప్ ఫోర్ చేరారు. ఆ ఎత్తు 7,900 మీటర్లు. మధ్యాహ్నం తర్వాత ప్రమాదం అన్నివైపుల నుంచి ముంచుకొచ్చింది. ఎనిమిది మందిని బలిగొంది. ఈ ఘటనలో న్యూజిలాండ్‌కు చెందిన రాబ్ హాల్-ఆండ్రూ హారిస్, అమెరికాకు చెందిన హాన్సెన్ -స్కాట్ ఫిషర్ , జపాన్ యాసుకో నంబా, భారత్ కు చెందిన సుబేదార్ సెవాంగ్ -లాన్స్ నాయక్ -పల్జోర్ లు మృతి చెందారు. మరణాలు ఎడ్మండ్ హిల్లరీ-టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఏడాది 1953 నుంచి.. ఇప్పటిదాకా 250 మందికి పైనే చనిపోయారు. మరో విషయం ఏమిటంటే.. 70 శాతం మంది దేహాలు గల్లంతు అయ్యాయి. లెక్కల ప్రకారం.. 150 మంది పర్వతారోహకుల మృతదేహాలు ఏమయ్యాయో కూడా తెలియదు. ఆరంభంలో ఆహ్లాదం, కానీ.. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఎదురయ్యే సవాళ్లు చాలా కఠినంగా ఉంటుంది. అదీ దశలవారీగా. ఎవరెస్ట్ అధిరోహణలో.. ముందుగా పర్వత పాదాన్ని చేరాలి. దీన్నే బేస్ క్యాంప్ అంటారు. ఎవరెస్ట్ ఎక్కేముందు క్లైంబర్స్ ఇక్కడే రెండు వారాల పాటు ఉండాలి. ఈ టైంలో ఎవరెస్ట్ వాతావరణానికి అలవాటు పడతారు. ఈ రెండు వారాలు టెంటుల్లో కాలక్షేపం చేస్తారు. ఈలోగా అధిరోహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. నెక్ట్స్ లెవల్లో.. బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ వన్ చేరాలి. ఆ ఎత్తు 6,065 మీటర్లు. అక్కడి నుంచి క్యాంప్ టూ చేరాలి. దీన్నే ‘అడ్వాన్స్ డ్ బేస్ క్యాంప్’ అంటారు. మరో వెయ్యి మీటర్లు ఎత్తు పైకి వెళ్తే.. క్యాంప్ త్రీ వస్తుంది. ఆ తర్వాత మరో 500 మీటర్లకు క్యాంప్ ఫోర్. ఇది దాటితే కష్టాలు మొదలైనట్లే. క్యాంప్ ఫోర్ తర్వాత వచ్చేది బాల్కనీ. దీని ఎత్తు 8,400 మీటర్ల ఎత్తు. ఇక్కడి నుంచి శిఖరాన్ని చేరాలంటే మధ్యలో ప్రాణాలతో చెలగాటమే. నడుం లోతు మంచు లోంచి పై కెక్కాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కొన్ని వేల మీటర్ల కింద లోయలో పడిపోవడమే. సున్నంలోకి ఎముకలు కూడా మిగలవు!. ఎవరెస్ట్ ఎక్కడంలో అసలు సమస్యంతా ఎక్కడంటే.. వాతావరణంతోనే!. ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణంలో వచ్చే మార్పులు.. అధిరోహకులకు నరకం చూపిస్తాయి. ఒక్కసారిగా గాలులు విజృంభిస్తాయి. ఎడతెరపి లేకుండా మంచు కురుస్తూనే ఉంటుంది. పైకి వెళ్లడానికీ ఉండదు. కిందకు దిగడానికీ ఉండదు. ఈ గాలుల వల్ల ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. వీటితో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఉదాహరణకు.. సెరిబ్రల్ ఎడిమా అనే వ్యాధి సోకితే గనుక పర్వతారోహకులు వింతగా ప్రవర్తిస్తారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ల మెదడు చురుకుగా ఉండదు. అంత ఎత్తులో ఉన్నవాళ్లు.. తాము కిందకు జంప్ చేయగలమనే భావనలోకి కూరుకుపోతారు. అంతిమంగా అది వాళ్ల ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది. రిస్క్‌లేని లైఫ్ ఎందుకు? ఇన్ని అవరోధాలు, ఆటంకాలు అధిగమిస్తూ ఆకాశమే హద్దుగా ఉన్న ఎవరెస్ట్‌ను పర్వతారోహకులు అధిరోహించి అక్కడ జెండా పాతేస్తారు. ప్రపంచ విజేతగా తమను తాము ప్రకటించుకుని పొంగిపోతారు. అసలు ఆనందంకోసం ఒక్కోసారి ప్రాణాలు కూడా పణంగా పెట్టేస్తారు. ప్రాణాలను పణంగా పెట్టి.. ఇదంతా అవసరమా? అనే ప్రశ్నకు.. ఎవరెస్ట్ ప్రియుల నుంచి వినిపించే సమాధానం ఒక్కటే. రిస్క్ లేకపోతే లైఫ్ వ్యర్థం అని. ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రయాణాలు మానేసి ఇంట్లో కూర్చుని ఉంటామా? అలాగే ఇది కూడా అంటారు. పర్వతారోహణ అణువణువునా జీర్ణించుకుపోయిన ఒక ప్యాషన్.. వాళ్లతో అంతేసి సాహసం చేయిస్తోంది మరి!. ఎవరెస్ట్ అనే మహోతన్నత శిఖరం.. మనిషి ఓపికకు పరీక్ష పెడుతుంది. కష్టం విలువను తెలియజేస్తుంది. ఆహారాన్ని ఎలా దాచుకోవాలి అనే పొదుపు పాఠం నేర్పుతుంది. అన్నింటికి మించి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఎలా పోరాడాలి.. ముందుకు ఎలా సాగాలి అనే జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. -
ఆపదలో ఆలివ్.. తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లేల కళేబరాలు!
ప్రపంచలోనే అత్యంత అరుదైన సముద్రపు తాబేళ్లుగా పిలవబడే ఆలివ్‌రిడ్లేల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్ర జలాలను శుద్ధిచేసి, పర్యావరణాన్ని కాపాడడంలో తోడ్పడుతున్న వీటి సంరక్షణ కరువైంది. ఏటా గంజాం జిల్లా సాగర తీరంలో మైటింగ్(సంగమం)కి వచ్చే వీటిని కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇవి ఈసారి ఆశించినంత స్థాయిలో లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి జిల్లాలోని పలు తీర ప్రాంతాల్లో కనిపిస్తున్న ఆలివ్‌రిడ్లేల కళేబరాలే నిదర్శనం. బరంపురం (ఒడిశా): గంజాం జిల్లాలోని రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖద్వారం ఆలివ్‌రిడ్లేల సంతానాభివృద్ధికి మంచి ఆవాసం. దేశ వ్యాప్తంగా ఉన్న 3 అనువైన ప్రదేశాలకు మాత్రమే ఇవి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరీ సంగమిస్తుండడం విశేషం. ఏటా నవంబరులో వీటి మైటింగ్(సంగమం)తో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ గుడ్లు పెట్టడం, ఆ తర్వాత వాటిని పొదగడం వంటి ప్రక్రియలు జనవరి, ఫిబ్రవరి నెలల వరకు నిరవధికంగా సాగుతుంది. అయితే ఈ తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి ఏ మార్గాన వెళ్తాయో అవి పెద్దవైన తర్వాత గుడ్లు పెట్టేందుకు కూడా అదే స్థావరానికి రావడం వీటి ప్రత్యేకత. ఇప్పుడు గంజాం జిల్లాలోని గోపాలపూర్, పూర్ణబొందా సాగర తీరాల్లో ఎక్కడికక్కడ ఒడ్డుకు చేరుకున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఏటా చేరుకుంటున్న వీటికి రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇటువంటి దృశ్యాలు తారసపడడం పర్యావరణ హితులను కలవరపరుస్తోంది. ఇటీవల ఆలివ్‌రిడ్లేల రాక నేపథ్యంలో తీరం నుంచి లోపలికి 10 కిలోమీటర్ల మేర చేపల వేట నిషేధిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ఉత్వర్వులు జారీ చేసింది. ఫిషింగ్ బోట్లతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. చదవండి: (AP PGCET: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల) తీరంలోని కళేబరాలను పీక్కుతింటున్న శునకాలు సంప్రదాయ వలలతో వేటకు ఓకే.. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోకుండా సంప్రదాయ వలలతో వేట కొనసాగించుకోవచ్చని అవకాశం కల్పించింది. తీరంలో నిబంధనలను ఎవ్వరూ అతిక్రమించకుండా అధికారులను సైతం అధికార యంత్రాంగం నియమించింది. అయితే రెండు రోజులుగా అధికారుల జాడ కొరవడడంతో కొంతమంది సముద్రంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే సాహసం చేస్తున్నారు. ఈక్రమంలో ట్రాలీల వినియోగంతో మైటింగ్లో ఉన్న తాబేళ్లు చనిపోతున్నాయి. ముఖ్యంగా ఫిషింగ్ బోట్ల చక్రాలు తాబేళ్లను ఢీకొనడం, సముద్రంలోకి చేరే ఆక్వా రసాయనాలతో ఇవి చనిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖ ద్వారంలోని నిషేధిత ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విశాఖపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి కొంతమంది వేట జరపడంతో ఇక్కడి మైటింగ్లోని ఆలివ్‌రిడ్లేలు చనిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి, ఆపదలో ఉన్న తాబేళ్ల పరిరక్షణకు చర్యలను కట్టుదిట్టం చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొదిగే సమయం 45 రోజులు.. సంతానాభివృద్ధికి ఏటా నవంబరులో తీరానికి చేరే తాబేళ్లు మైటింగ్ అనంతరం గుడ్లు పెడతాయి. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో తీరంలోని ప్రత్యేక గుంతల్లో భద్రపరిచిన గుడ్లును పొదుగుతాయి. దీనికి 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. వీటి సంరక్షణకు ట్రీ ఫౌండేషన్, బయోవర్సిటీ కన్జర్వేషన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుండగా, ఆలివ్‌రిడ్లే ఒక్కొక్కటి 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, దాదాపు 45 కిలోల బరువు ఉంటుంది. చదవండి: (KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు) ఆక్సిజన్ పెంచడంలో కీలకం.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు సముద్ర జలాల్లోని వివిధ వ్యర్థాలను తిని, సముద్రం కలుషితం కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా సముద్ర జీవరాశులను అంతరించిపోకుండా ఇవి పరిరక్షిస్తున్నాయి. సముద్రంలో ఆక్సిజన్ పెంచడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరంలో ఓ రకమైన జెల్‌ని విడుదల చేస్తాయి. అది భూమిలో బంకలా అతుక్కుపోయి విపత్తుల సమయంలో తీరం కోతకు గురికాకుండా నివారిస్తుంది. ఇలా అనేక ఉపయోగాలున్న వీటి సంరక్షణ నేడు గాల్లో దీపంగా మారింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏం చెబుతోంది.. వణ్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం తాబేళ్లను షెడ్యూల్–1లో పొందుపరిచి, ప్రత్యేక రక్షణ కల్పించారు. పర్యావరణాన్ని కాపాడే సముద్రపు తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కొందరు సముద్రంలోకి వ్యర్థాలను వదిలిపెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లు నడపడం వల్ల తాబేళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. అలాగే తాబేళ్లను ఎవరైనా తిన్నా, చంపినా, వాటి ఆవాసాలను నాశనం చేసినా శిక్షార్హులు. నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. -
పక్షుల కిలకిల.. మెరుగైన జీవవైవిధ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిలో ఎన్నో ప్రాణులున్నా పక్షులది ప్రత్యేక గుర్తింపు.. ఎన్నో రకాలు.. ఎన్నో రంగులు.. మరెన్నో రాగాలు.. రాష్ట్రంలో వివిధ రకాల పక్షులు కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం మెరుగైన జీవవైవిధ్యం, చెట్లు, పూల మొక్కలు, పక్షులు, జంతుజాలంతో రాష్ట్రం విలసిల్లుతోంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 350కు పైగా పక్షుల రకాలు ఉన్నట్టుగా పర్యావరణ, పక్షుల ప్రేమికులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్.. దాని చుట్టుపక్కలే 270 దాకా వివిధ రకాల పక్షులుంటాయని చెబుతున్నారు. తాజాగా వికారాబాద్ అనంతగిరిలో దేశంలోనే అరుదైన ‘బ్లూ అండ్ వైట్ ఫ్లై క్యాచర్’ పక్షి కనిపించడం విశేషం. గత 30 ఏళ్ల కాలంలో ఇది తెలంగాణలోనే కనిపించలేదని, ఇప్పుడు కనిపించడాన్ని బట్టి మెరుగైన ఎకో సిస్టమ్‌తో పాటు జీవవైవిధ్యం బాగా ఉన్నట్టుగా, పక్షులు స్వేచ్ఛగా తమ జీవక్రియలను కొనసాగించేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్టుగా భావించవచ్చని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. జనవరి 5వ తేదీని ‘నేషనల్ బర్డ్ డే’గా అంతర్జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అమెరికాలో దీనిని ఒక ఉద్యమంగా ఒక కార్యాచరణ మాదిరిగా నిర్వహిస్తున్నారు. బర్డ్‌వాచింగ్, పక్షులపై అధ్యయనం, బర్డ్ యాక్టివిటీస్ పర్యవేక్షణ, పక్షులను దత్తత తీసుకోవడం అనేవి ‘నేషనల్ బర్డ్ డే’ యాక్టివిటీగా దాదాపు 5 లక్షల మంది వరకు నిర్వహిస్తుండటం విశేషం. యూఎస్‌లో ‘యాన్యువల్ క్రిస్మస్ బర్డ్ కౌంట్’లో భాగంగా దీనిని కూడా నిర్వహిస్తా రు. తమ దేశంలోని పక్షుల పురోభివృద్ధి, క్షేమ సమాచారం తెలుసుకునేందుకు సిటిజన్ సైన్స్ సర్వే మాదిరిగా చేపడుతున్నారు. పదేళ్ల కింద నుంచే నేషనల్ బర్డ్ డేను నిర్వహిస్తుండగా, భారత్‌లో ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్‌లోనూ జనవరి 5న నేషనల్ బర్డ్ డే సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్, వానలతో మేలు.. ‘తెలంగాణలో పక్షి జాతులు, రకాల సంతతి బాగానే వృద్ధి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అలాగే హైదరాబాద్, చుట్టుపక్కల వివిధ రకాల పక్షి జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సాధారణంగానే పక్షుల మనుగడ, పరిరక్షణ విషయంలో మన రాష్ట్రం మెరుగైన స్థితిలోనే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్డౌన్, ఆ తర్వాత వర్షం సీజన్ బాగా ఉండటం మనకు ఎంతో మేలు చేసింది. ముఖ్యంగా పర్యావరణానికి, అడవులు, జంతువులు, పశుపక్ష్యాదులకు మంచి జరిగింది. ప్రస్తుత సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు, పౌల్ట్రీ ఫామ్‌లలోని కోళ్లతో బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశాలున్నాయి. అయితే దీని పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – హరికృష్ణ ఆడెపు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సంస్థ అధ్యక్షుడు పాలినేటర్స్ పార్కులు పెట్టాలి.. ‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున అర్బన్ పార్కులను పెడుతున్న విధంగానే ‘పాలినేటర్స్ పార్కు’లను కూడా ఏర్పాటు చేయాలి. కనీసం జిల్లాకో పార్క్ పెట్టాలి. తెలంగాణకు ప్రత్యేకమైన, స్థానిక మొక్కలు, పండ్ల మొక్కలను వాటిలో పెంచితే పక్షులు వాటిని తిన్నాక ఇతర ప్రాంతాల్లో వాటి డ్రాపింగ్స్ ద్వారా ఈ మొక్కలు పెరుగుతాయి. అదే ఎగ్జోటిక్, ఇన్వెసివ్ ప్లాంట్లను పెట్టడం వల్ల మనుషులు, పక్షులకు ఎలర్జీలు ఏర్పడుతున్నాయి. నేటివ్ ప్లాంట్స్ ఎకోసిస్టమ్‌ను పెంచడానికి, జీవవైవిధ్యం మరింత మెరుగుపడేందుకు పాలినేటర్స్ పార్కులు దోహదపడతాయి. వీటి వల్ల పక్షుల సంఖ్య కూడా పెరుగుతుంది. బర్డ్ ఫ్లూ కేసులు, కొత్త వైరస్ బయటపడిన నేపథ్యంలో ఎక్కడైనా చనిపోయిన పక్షులు కనిపిస్తే వాటి గురించి అటవీ, వెటర్నరీ అధికారులకు తెలియజేస్తే వాటిని సేఫ్‌గా డిస్పోజ్ చేయవచ్చు. లేకపోతే చనిపోయిన పక్షుల వల్ల కూడా వైరస్ వ్యాపించే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి’ – గైని సాయిలు, బయో డైవర్సిటీ ఎక్స్పర్ట్, ఫారెస్ట్ 2.0 రీజినల్ డైరెక్టర్ జపాన్‌లో కనిపించే పక్షి వికారాబాద్ జిల్లాలోని అడవిలో ఇటీవల మేము పర్యటిస్తున్న సందర్భంగా దేశంలోనే అత్యంత అరుదైన ‘బ్లూ అండ్ వైట్ ఫ్లై క్యాచర్’పక్షి తారసపడటంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బ య్యాము. జపాన్, కొరియాలో ప్రధానంగా కనిపించే ఈ పక్షి, భారత్‌లోని దక్కన్ పీఠభూమిలో కనిపించడాన్ని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీరాంరెడ్డి తన కెమెరాలో బంధించాడు. అడవుల సంరక్షణతో పాటు జీవవైవిధ్యం మెరుగ్గా ఉంటే ప్రతీ ఏడాది ఈ పక్షి తెలంగాణలో కనిపించి కనువిందు చేస్తుంది. – గోపాలకృష్ణ, పక్షి ప్రేమికుడు -
వచ్చిరాని వైద్యం.. ఆపై నిలువు దోపిడీ
సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్) : గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాథమిక చికిత్స అందించే వారు ఆర్ఎంపీలు, పీఎంపీలు. వారికున్న అవగాహన, అనుభవం మేరకు చికిత్సనందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే వ్యక్తులు. కానీ ప్రస్తుతం కొందరు అక్రమార్జనే ధ్యేయంగా కనీస పరిజ్ఞానం లేకున్నా, అవగాహన లేకున్నా డాక్టర్ల అవతారమెత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొద్ది రోజుల పాటు ఏదో ఒక ఆస్పత్రిలో పనిచేసి వైద్యుల్లా చలామణి అవుతున్నారు. అవసరమున్నా లేకపోయినా రకరకాల మందులు, టెస్టులు రాసి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. దీంతో ప్రథమ చికిత్సకు ఆర్ఎంపీ వద్దకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు ఆస్పత్రికి వెళ్లేలోపు కావాల్సిన ప్రథమ చికిత్స అందిస్తుంటారు. కానీ వారిలోని కొందరు అక్రమార్జన బాట పట్టారు. అవగాహన లేకపోయినా, వైద్యం అందిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కాసుల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వైద్యం కోసం ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే స్థాయికి చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరిజ్ఞానం లేకపోయినా వైద్యం.. గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు ఆర్ఎంపీలు పరిజ్ఞానం లేకుండానే వైద్యులుగా చలామణి అవుతున్నారు. వాస్తవానికి ఆర్ఎంపీలు, పీఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స చేయడానికి మాత్రమే అర్హులు. జ్వరం, జలుబు లాంటి వాటికి చిన్న చిన్న మాత్రలు ఇస్తే సరిపోతుంది. కానీ చాలా మంది పరిధి దాటి వైద్యం చేస్తున్నారు. అవగాహన లేక కొంత, రోగం తొందరగా తగ్గితే చాలా మంచి డాక్టర్‌గా పేరు సంపాదించాలన్న ఆత్రుత కొంత వెరసీ అవసరమున్న దానికంటే ఎక్కువ మోతాదు మందులు ఇస్తున్నారు. ఫలితంగా రోగి బలహీన పడిపోవడమే కాకుండా ఎక్కువ రోజులు రోగాలతో సావాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చిన జబ్బేమో కానీ వైద్యం తర్వాత బిల్లు చూస్తే కొత్త రోగం రావడం ఖాయమని రోగులు అంటున్నారు. కొద్ది రోజులే కాంపౌండర్.. పెద్ద ఆస్పత్రుల్లో ఐదారు నెలల పాటు కాంపౌండర్‌గా పనిచేయడం, కొంత మేర వైద్య పరిజ్ఞానం సంపాదించి సొంత ఊరిలో ఆర్ఎంపీలుగా అవతారం ఎత్తడం పరిపాటిగా మారింది. ఇంజక్షన్ వేయడం వస్తే చాలు వైద్యం నిర్వహించేందుకు ముందడుగు వేస్తున్నారు. కాంపౌండర్‌గా పనిచేసిన సమయంలో తెలిసిన కాస్తో, కూస్తో పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతాల్లో క్లినిక్‌లు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులున్నప్పటికి వారు ప్రైవేటుకు ఎక్కువగా ప్రాధాన్యమివ్వడం, సమయపాలన పాటించకపోవడం, వచ్చిన రోగులను పట్టించుకోకపోవడంతో రోగులు స్థానికంగా ఉండే ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు గ్రామీణ వైద్యులు తెలిసీ తెలియని వైద్యాన్ని కొంతమేర నిర్వహించి, పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రాథమిక చికిత్స నుంచి మొదలుకొని ఆస్పత్రి నుంచి బయటికి వచ్చే వరకు అంతా తామై నడిపిస్తున్నారు. -
ఎముకలు కొరికే చలిలో.. రెండేళ్లు!
కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి చల్లని ప్రదేశాలకు వెళ్తే కొద్ది సేపటికే గజగజా వణికిపోతాం. అలాంటిది ఆర్కిటిక్ లాంటి ధ్రువ ప్రాంతంలోకి సాహసయాత్రకు వెళ్తే..? ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి ఒంటరిగా జీవించాల్సి వస్తే..? వెంట తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోవస్తే..? రెండేళ్ల పాటు ఎముకలు కొరికే చలిలో ధ్రువపు ఎలుగుబంట్ల కంటపడకుండా బతకాల్సి వస్తే..? తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ..? ‘అడా బ్లాక్‌జాక్’ మాత్రం స్వయంగా ఇవన్నీ అనుభవించింది. అంతేనా.. ప్రాణాలతో బయటపడి, విధితో పోరులో విజేతగా నిలిచింది. కానీ, ప్రపంచమే ఆమె పోరాటాన్ని గుర్తించలేదు..! 1921 నాటి సంగతి.. ప్రఖ్యాత కెనడియన్ శాస్త్రవేత్త, ఆర్కిటిక్ అన్వేషకుడు ‘విల్జామర్ స్టెపాన్సన్’ ఓ బ్రహ్మాండమైన సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. అలాస్కా నుంచి చుక్చీ సముద్రం మీదుగా రష్యాలోని రాంగెల్ దీవికి చేరుకోవాలనేదే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. ఆర్కిటిక్‌లోని మంచు సముద్రాల మీదుగా వందల మైళ్ల దూరం కాలినడకన చేయాల్సిన ఈ ప్రయాణాన్ని సాహస యాత్ర అనడం కంటే.. అన్వేషణ యాత్ర అనడమే సబబు. స్టెపాన్సన్ ఈ యాత్ర కోసం కెనడాకే చెందిన అల్లాన్ క్రాఫార్డ్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. మరో ముగ్గురు అమెరికన్లు లార్నే నైట్, మిల్టన్ గాల్లే, ఫ్రెడ్ మారెర్లను బృంద సభ్యులుగా ఎంపిక చేశారు. వీరందరికీ గతంలో ఇటువంటి సాహస యాత్రలు చేసిన అనుభవం ఉంది. వీరికి తోడుగా అలాస్కాకు చెందిన ఇన్యూట్ తెగ మహిళను వంటమనిషిగా ఎంపిక చేశారు. కుట్టుపని కూడా బాగా తెలిసిన ఆ మహిళే.. 23 ఏళ్ల అడా బ్లాక్‌జాక్. వీరంతా కలిసి జీతం ప్రాతిపదికన ఈ అన్వేషణ యాత్రకు సిద్ధమయ్యారు. రాంగెల్ దీవిని కెనడా భూభాగంగా చాటుకోవడమే ప్రధానంగా సాగిన ఈ ప్రయాణానికి స్టెపాన్సన్ ఆర్థిక అండదండలు అందించాడు. అయితే, ఆయన మాత్రం యాత్రకు దూరంగా ఉన్నారు. 1921, సెప్టెంబర్ 16న వీరి యాత్ర ప్రారంభమైంది. కొన్ని రోజులు ప్రయాణం బాగానే సాగింది. కానీ, మంచుతో గడ్డకట్టిన చుక్చీ సముద్రంపై నడుస్తున్న కొద్దీ వీరి శరీరాల్లో విపరీతమైన మార్పులు రాసాగాయి. అక్కడక్కడా ఆగుతూ, ఎలాగో ముందుకు సాగిపోయారు. అలా కనీవినీ ఎరుగని రీతితో దాదాపు ఏడాదిన్నర పాటు వీరి ప్రయాణం సాగుతూనే ఉంది. కొద్ది వారాలకు పరిస్థితులు ప్రతికూలంగా మారడం మొదలుపెట్టాయి. వెంట తెచ్చుకున్న సరకులు అయిపోయాయి. చేరాల్సిన గమ్యం అప్పటికి ఇంకా చాలా దూరాన ఉండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నారు బృంద సభ్యులు. కొద్ది వారాల పాటు సీల్ చేపలను వేటాడటం లాంటి పనులు చేసి ఎలాగో ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఇక, ప్రయాణం ఎక్కువ కాలం సాగదని తెలిసి సహాయం, ఆహారం కోసం సైబీరియా ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు మిల్టన్ గాల్లె, మారెర్, క్రాఫార్డ్లు. అప్పటికే జబ్బు బారిన పడిన లార్నే నైట్‌కు తోడుగా బ్లాక్‌జాక్‌ను అక్కడే విడిచిపెట్టి 1923 జనవరి 28న ప్రయాణం సాగించారు. అలా 700 మైళ్ల దూరం ప్రయాణించి సైబీరియా ప్రాంతానికి చేరుకున్నారు. మరోవైపు మంచు కొండల్లో అష్టకష్టాలు పడ్డారు నైట్, బ్లాక్‌జాక్‌లు. నైట్ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయనకు సపర్యలు చేస్తూ, సీల్‌లను వేటాడుతూ ఆహారం సంపాదించసాగింది బ్లాక్‌జాక్. రోజురోజుకీ క్షీణిస్తూ వస్తోన్న నైట్‌ను ఓవైపు కాపాడుతూనే, ప్రమాదకరమైన ధ్రువపు ఎలుగుబంట్ల కంట పడకుండా తనను తాను రక్షించుకునేది. అయితే, ఎంత శ్రమించినా చివరకు ఏప్రిల్ నెలలో నైట్‌ను కోల్పోక తప్పలేదు ఆమెకి. అతడు విగతజీవిగా పడి ఉండటం గమనించి, అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయాణం మొదలుపెట్టింది. ఒంటరిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ, అప్పటికే మంచు ప్రాంతంలో ఎలా జీవించాలో ఒంటబట్టించుకోవడంతో ప్రాణాలు నిలబెట్టుకోగలిగింది. చివరకు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య బ్లాక్‌జాక్‌ను ఆగస్టు 19న కనుగొన్నారు కొందరు నావికులు. అలా తిరిగి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అత్యంత వీరోచితంగా బతుకుపోరాటం చేసిన ఆమెకు ఈరోజుల్లో అయితే ఘన స్వాగతం లభించి ఉండేది. కానీ, అప్పట్లో అలా జరగలేదు. మీడియా బ్లాక్‌జాక్‌ను రాక్షసిలా చూసింది. తోటి అన్వేషకుడి మరణానికి ఆమే కారణం అని ఆరోపించింది. మరణించిన నైట్ కుటుంబ సభ్యులు కూడా ఆమె తీరును తప్పుపట్టారు. ఆమె నైట్‌ను విడిచిపెట్టేసి వచ్చిందని ప్రజల్లో బలమైన నమ్మకాలు పాతుకుపోయాయి. అయితే, అదంతా అసత్యమని తర్వాత ఆమెను కలిసిన ముగ్గురు సహ అన్వేషకులు ప్రకటించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె సమాజం దృష్టిలో విలన్‌గానే నిలిచిపోయింది. ఆమె జీవిత కథ ఆధారంగా తర్వాత ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. సినిమాలు సైతం రూపొందాయి. కానీ, ఏవీ ఆమెకు మేలు చేయలేకపోయాయి. జీవితాంతం ఆమె పేదరికంలోనే మగ్గిపోయింది. చివరకు ఆర్కిటిక్ ప్రాంతంలోని ఓ శరణాలయంలోనే 85 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచింది. -
కళలను బతికించాలి
పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రంలోని కళలను బతికించాలని, అది విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జెడీ వై.బాలయ్య అన్నారు. రాషీ్ట్రయ మాధ్యమిక శిక్షాభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండలోని డైట్ కళాశాలలో కళా ఉత్సవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహిం చారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతి థిగా పాల్గొన్న ఆర్జేడీ మాట్లాడుతూ మన కళలను సజీవంగా ఉండేలా కృషిచేయాలన్నా రు. కన్వీనర్ డీఈఓ పి.రాజీవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపా టు కళలలపై కూడా ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలన్నారు. కోకన్వీనర్ డిప్యూటీ ఈవో తోట రవీందర్, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సారంగపాణి అయ్యాంగార్, ఆర్గనైజర్ వల్సపైడి, ఎండీ. రహమాన్, పి.ఆనంద్, నివేదిత, కుమారస్వామి పాల్గొన్నారు. విజేతలువీరే... బృందగానంలో ప్రథమ జెడ్పీఎస్ఎస్ ఇటికాలపల్లి, ద్వితీయ జెడ్పీఎస్ఎస్ మహబూబాబాద్ బాలికలు, తృతీయ హన్మకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, బృంద నృత్య పోటీల్లో ప్రథమ టీఎస్ఎంఎస్ వంచనగిరి, ద్వితీయ హన్మకొండ ప్రభుత్వ మర్క జీ హైస్కూల్, తృతీయ జెడ్పీఎస్ఎస్ మొగి లిచర్ల వి ద్యార్థులు సాధించారు. నాటికల పోటీల్లో ప్రధ మ జెడ్పీఎస్ఎస్ ఇటికాలపల్లి, ద్వితీయ జెడ్పీఎస్ఎస్ శాయంపేట, తృతీ య ప్రభుత్వ ఆరెల్లి బుచ్చయ్య హైస్కూల్ వరంగల్ విజయం సాధించారు. పెయింటిం గ్, డ్రాయింగ్, స్కల్పచర్ పోటీల్లో ప్రథమ ఏకశిల పున్నేలు వర్ధన్నపేట, ద్వితీయ ఎస్వీ స్కూల్ ఫర్ డెప్అండ్ డమ్ టీటీడీ వరంగల్, తృతీయ ప్రభుత్వ హైస్కూల్ ఉర్సు గెలుపొందారు. ప్రథమ బహుమతి విద్యార్థులకు రూ.5000, ద్వితీయ రూ.3000, తృతీ య రూ. 2000ల చొప్పున నగదు బహుమతి అందజేసినట్లు డీఈఓ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులే బతికించాలి
ఉప ముఖ్యమంత్రి శ్రీహరి ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులే బతికించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. గురుదేవోభవ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం మమత ఆస్పత్రి ఆడిటోరియంలో ఉపాధ్యాయులకు మోటివేషన్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఫౌండేషన్ సాయంతో డిజిటల్ తరగతుల సెట్లను ఉపాధ్యాయులకు అందించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇప్పుడు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అనేకమంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో అంకితభావం కొరవడిందిని, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు రోజు రోజుకూ నమ్మకం పోతోందని, అందుకే అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకన్నా ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందనేది భ్రమ మాత్రమేనని అన్నారు. ప్రధానోపాధ్యాయులు సక్రమంగా పనిచేస్తే పాఠశాలల పరిస్థితులు చక్కబడుతాయన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి, ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతోపాటు ఉపాధ్యాయులు సక్రమంగా రాకపోవడం.. వచ్చినా కూడా సక్రమంగా చెప్పకపోవడం కారణాలన్న విషయం సుప్రీంకోర్టు సర్వేలో తేలిందని అన్నారు. ‘‘మౌలిక సవతుల కల్పనకు ఎంత డబ్బయినా ఖర్చు చేసే బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది’’ అని అన్నారు. ప్రజల కోరిక మేరకు రాష్ట్రంలోని ఐదువేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినట్టు, కేజీ టు పీజీలో భాగంగా 320 కొత్త గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నదన్నారు. ఏకీకత సర్వీస్ రూల్స్ త్వరలో ప్రకటిస్తామని; భాషాపండితులు, పీఈటీల సమస్యలు కూడా త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొందరు ఉపాధ్యాయులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ మురళి, ఆర్జేడీ బాలయ్య, డీఈఓ నాంపల్లి రాజేష్, ఎన్ఆర్ఐ పౌండేషన్ బాధ్యులు తాళ్లూరి జై, ఆళ్ల రాధాకష్ణ, పంచాక్షరయ్య, గుర్రం కిషన్‌రావు, కొంగర పురుషోత్తం, దండ్యాల లక్ష్మణ్‌రావు, నరేంద్ర స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
పొలాల్లో జీవచ్ఛవంలా..
♦ అందోలు పొలాల్లో ప్రాణాపాయ స్థితిలో వృద్ధురాలు ♦ ఆస్పత్రికి తరలించిన యువకులు.. ♦ పెద్దాపూర్ వాసిగా గుర్తింపు ♦ ‘వాట్సాప్’తో వివరాలు వెలుగులోకి.. జోగిపేట: కన్నవారే పిల్లలకు బరువవుతున్న ఈ రోజుల్లో.. పొలాల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వృద్ధురాలిని చెందిన కొందరు యువకులు చేరదీశారు. ఈ సంఘటన అందోలు గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామ శివారులోని పొలాల మధ్య దాదాపు నిర్జీవ స్థితిలో ఉన్న సుమారు 65 ఏళ్ల మహిళను స్థానిక వీహెచ్‌పీకి చెందిన యువకులు గుర్తించారు. తక్షణమే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పొలాల వద్దకు అంబులెన్స్ రావడం కష్టమవడంతో స్టెచర్‌పై తీసుకెళ్లారు. నేరుగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వృద్ధురాలికి దుస్తులు కూడా సరిగా లేకపోవడంతో చీర తెప్పించి, కట్టించారు. చికిత్స తర్వాత అల్పాహారం తీసుకున్న ఆమె.. యువకులకు చేతులెత్తి దండం పెట్టింది. దీంతో అక్కడివాళ్ల కళ్లు చమర్చాయి. శవంగా భావించిన గ్రామస్తులు అందోలు కొటాల బైపాస్ ఏరియాలో దూరంగా పడి ఉన్న వృద్ధురాలిని చూసి.. ఎవరో హత్య చేసి ఉంటారని స్థానిక మహిళలు మాట్లాడుకున్నారు. విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ యువకులు అక్కడికి చేరుకొని వృద్ధురాలిని రక్షించారు. వాట్సాప్ ద్వారా ఆచూకీ చికిత్స అనంతరం తేరుకున్న వృద్ధురాలు తన పేరు బాలమ్మ అని, తనది అల్లాదుర్గం మండలం పెద్దాపూర్ గ్రామంగా చెప్పింది. తనకు శ్రీశైలం, మొగులయ్య కుమారులు ఉన్నారని తెలిపింది. సమాచారం తెలుసుకున్న యువకులు.. వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు వృద్ధురాలి ఫొటోను పెద్దాపూర్‌కు చెందిన శంకర్ అనే జోగిపేట డిగ్రీ విద్యార్థికి వాట్సాప్ చేశారు. గ్రామంలోని కొందరికి ఆ ఫొటో చూపడంతో ఆమె చాకలి బాలమ్మగా గుర్తించారు. 2 రోజులుగా తమ తల్లి కనిపించకపోవడంతో వెతుకుతున్నామని కుమారులు తెలిపారు. జోగిపేటలో బాలమ్మ కుమార్తె ఉంటుందని తెలిసింది. వృద్ధురాలి విషయంలో అందోలుకు చెందిన యువత మానవత్వాన్ని చాటడంతో పలువురు అభినందించారు. -
ప్రాణాధార మందులు కొనలేం
ప్రభుత్వాసుపత్రులకు ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ లేఖ హైదరాబాద్: ప్రాణాపాయ స్థితిలో వాడాల్సిన మందులు కొనలేమని ప్రభుత్వం నిర్ణయించడంతో సర్కారీ ఆస్పత్రులు ఒక్కసారిగా విస్తుపోయాయి. ప్రభుత్వాసుపత్రులకు మందులు సరఫరా చేసే రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ రవిచంద్ర జూలై 3న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆస్పత్రులకు ఐదురకాల ప్రాణాధార మందులు కొనలేకపోతున్నామని లేఖ రాశారు. వీటిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్, ఇన్సులిన్ (రెండు రకాలు), హ్యూమన్ ఆల్బుమిన్, ఎరిత్రోపాయిటిన్ మందులున్నాయి. వీటికి సంబంధించి ఇంకా టెండరు ఖరారు కాలేదని, రవాణా సమస్యకూడా ఉందని అందుకే ఉన్న మందులతోనే సర్దుకోవాలని రాష్ట్రంలో ఉన్న అన్ని సెంట్రల్ డ్రగ్‌స్టోర్ (సీడీఎస్)లకు, అన్ని ఆస్పత్రుల ఫార్మసిస్ట్‌లకు ఈ లేఖ పంపారు. తొమ్మిది నెలలపాటు ఈ మందులు వచ్చే పరిస్థితి లేదని, ఉన్న స్టాకు కనీసం ఆరు నెలల పాటు వచ్చేలా చూడాలని ఆదేశాలివ్వడం కలకలం రేగింది. పైన పేర్కొన్న మందుల లైఫ్‌సేవింగ్ మందులని, వీటికోసం రోగులు వస్తే ఏం సమాధానం చెప్పాలని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అసలు స్టాకే లేకపోతే ఆరునెలలు వాడాలని ఎలా చెబుతున్నారని ఫార్మసిస్ట్‌లు ఆశ్చర్యపోతున్నారు.