కళలను బతికించాలి
Published Sat, Sep 10 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య
విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రంలోని కళలను బతికించాలని, అది విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జెడీ వై.బాలయ్య అన్నారు. రాషీ్ట్రయ మాధ్యమిక శిక్షాభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండలోని డైట్ కళాశాలలో కళా ఉత్సవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహిం చారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతి థిగా పాల్గొన్న ఆర్జేడీ మాట్లాడుతూ మన కళలను సజీవంగా ఉండేలా కృషిచేయాలన్నా రు. కన్వీనర్ డీఈఓ పి.రాజీవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపా టు కళలలపై కూడా ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలన్నారు. కోకన్వీనర్ డిప్యూటీ ఈవో తోట రవీందర్, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సారంగపాణి అయ్యాంగార్, ఆర్గనైజర్ వల్సపైడి, ఎండీ. రహమాన్, పి.ఆనంద్, నివేదిత, కుమారస్వామి పాల్గొన్నారు.
విజేతలువీరే...
బృందగానంలో ప్రథమ జెడ్పీఎస్‌ఎస్ ఇటికాలపల్లి, ద్వితీయ జెడ్పీఎస్‌ఎస్ మహబూబాబాద్ బాలికలు, తృతీయ హన్మకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, బృంద నృత్య పోటీల్లో ప్రథమ టీఎస్‌ఎంఎస్ వంచనగిరి, ద్వితీయ హన్మకొండ ప్రభుత్వ మర్క జీ హైస్కూల్, తృతీయ జెడ్పీఎస్‌ఎస్ మొగి లిచర్ల వి ద్యార్థులు సాధించారు. నాటికల పోటీల్లో ప్రధ మ జెడ్పీఎస్‌ఎస్ ఇటికాలపల్లి, ద్వితీయ జెడ్పీఎస్‌ఎస్ శాయంపేట, తృతీ య ప్రభుత్వ ఆరెల్లి బుచ్చయ్య హైస్కూల్ వరంగల్ విజయం సాధించారు.
పెయింటిం గ్, డ్రాయింగ్, స్కల్పచర్ పోటీల్లో ప్రథమ ఏకశిల పున్నేలు వర్ధన్నపేట, ద్వితీయ ఎస్‌వీ స్కూల్ ఫర్ డెప్‌అండ్ డమ్ టీటీడీ వరంగల్, తృతీయ ప్రభుత్వ హైస్కూల్ ఉర్సు గెలుపొందారు. ప్రథమ బహుమతి విద్యార్థులకు రూ.5000, ద్వితీయ రూ.3000, తృతీ య రూ. 2000ల చొప్పున నగదు బహుమతి అందజేసినట్లు డీఈఓ తెలిపారు.
Advertisement