Bihar: ‘టైగర్‌ జిందా హై’.. రబ్రీ ఇంటి ముందు హోర్డింగ్‌ కలకలం | Lalu Yadav Poster Hoarding Infront of Rabri Devi House in Patna | Sakshi
Sakshi News home page

Bihar: ‘టైగర్‌ జిందా హై’.. రబ్రీ ఇంటి ముందు హోర్డింగ్‌ కలకలం

Published Thu, Mar 20 2025 12:09 PM | Last Updated on Thu, Mar 20 2025 12:56 PM

Lalu Yadav Poster Hoarding Infront of Rabri Devi House in Patna

పట్నా: బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌(RJD chief Lalu Yadav) మరోమారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. ఈ సమయంలో వందలాందిమంది ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఈడీ కార్యాలయం ముందు లాలూ విచారణకు నిరసనగా ఆందోళన చేపట్టారు.
 

ఇదిలావుంటే ఇప్పుడు ఒక హోర్డింగ్‌(Hoarding) కలకలం సృష్టిస్తోంది. ఇది ఈడీ అధికారులను ప్రశ్నించేదిగా ఉందని పలువురు అంటున్నారు. ఈ హోర్డింగ్‌ను లాలూ యాదవ్‌ భార్య రబ్రీదేవి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఈ హోర్టింగ్‌పై ‘టైగర్‌ జిందా హై’(టైగర్‌ బతికేవుంది) అని రాసివుంది. అలాగే ‘నా ఝుకాహూ, నా ఝుకూంగా’ (తగ్గేదే లే) అని ఉంది. ఈ హోర్డింగ్‌లో ఒకవైపు లాలూ యాదవ్‌ ఫొటో ఉంది. మరోవైపు ఒక వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి కొందరు లాగుతున్నట్లు ఫొటోవుంది. ఆ ఫొటోలో వ్యక్తి లాలూ అని, అతనిని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో పాటు పీఎంఓ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తాళ్లతో లాగుతున్నాయని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. లాలూ యాదవ్‌కు సంబంధించిన ఈ పోస్టర్‌ను ఆర్జేడీ నేతలు నిషాంత్‌ మండల్‌, రాజూ కోహ్లీ రూపొందించారు. ఈ హోర్డింగ్‌లో బీజేపీ దిగ్గజ నేతలను పోలిన చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం లాలూ యాదవ్‌ ‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌’ కేసులో ఈ విచారణను ఎదుర్కొంటున్నారు. 

ఇది కూడా చదవండి: రూ. 200కి మనుమడిని అమ్మేసిన నాన్నమ్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement