rabridevi
-
మహారాష్ట్ర సీఎం భార్యపై అభ్యంతరకర పోస్టు..
పుణె: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రశ్మీ ఠాక్రేను బిహార్ మాజీ సీఎం రబ్రీదేవిగా పేర్కొంటూ ట్వీట్ చేసిన బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్చార్జి జితేన్ గజారియాపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. రశ్మీ ఠాక్రే ఫొటోపై మరాఠీ రబ్రీదేవిగా పేర్కొంటూ గజారియా పెట్టిన వివాదాస్పద పోస్టుపై శివసేన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో, ముంబై పోలీసులు గురువారం గజారియాను సుమారు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
‘వయసైపోయింది.. ఆయన మాటలు పట్టించుకోకండి’
పట్నా : నరేంద్రమోదీ మరోసారి దేశ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నానని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ములాయం వ్యాఖ్యలపై బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి స్పందించారు. ‘ఆయనకు వయసైపోయింది. ఎప్పుడు ఏం మాట్లాడాలన్నది గుర్తుకురాదు. ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రబ్రీదేవి ముక్తాయించారు. ములాయం వ్యాఖ్యల పట్ల సమాజ్‌వాదీ పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. ఇదిలా ఉండగా లోక్‌సభలో మోదీకి మద్దతుగా ములాయం మాట్లాడటంతో.. బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. Former Bihar CM Rabri Devi on Mulayam Singh Yadav's statement in Lok Sabha 'I want you (PM Modi) to become PM again': Unki umar ho gayi hai. Yaad nahi rehta hai kab kya bol denge. Unki boli ka koi mayene nahi rakhta hai pic.twitter.com/bNL5DePBkK — ANI (@ANI) February 14, 2019 -
పెళ్లి వేడుకలో మాజీ సీఎం స్టెప్పులు
పాట్నా: బీహర్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యరాయ్‌ల వివాహం శనివారం కన్నులపండువగా జరిగింది. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు... రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌లతో పాటు... ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ తదితరులు హాజరయ్యారు. వేదికపై ఆశీనులైన నీతీశ్ నవ దంపతులను ఆశీర్వదించారు. దాణా కుంభకోణంలో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ.. తన కుమారుడి వివాహం నిమిత్తం మూడు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత లాలూ ఇంటా పెళ్లి భాజాలు మోగడంతో అంతా ఆనందంతో ఆడి పాడారు. వివాహ వేడుకల్లో భాగంగా ఓ భోజ్ పురి పాటకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో పాటు కుమార్తె మీసా భారతి, కొడుకు తేజస్వీ యాదవ్ లు, నవ దంపతులు స్టెప్పులేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ లగావెలు జాబ్ లిప్‌స్టిక్’ అనే భోజ్‌పురి పాటతో పాటు పలు హిందీ పాటలకు రబ్రీదేవి నృత్యం చేశారు. ఈ వివాహం కోసం ప్రత్యేకంగా సాంగ్స్ కంపోజ్ చేయించగా, వాటికి కూడా అందరూ డ్యాన్స్ చేశారు. -
ఈడీ విచారణకు రబ్రీ దేవి
పట్నా: రైల్వే హోటళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. పట్నాలో ఈడీ ప్రత్యేక బృందం రబ్రీ దేవిని 6 గంటల పాటు ప్రశ్నించింది. వాంగ్మూలాన్ని నమోదుచేశారు. యూపీఏ–1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ 2004లో లంచం తీసుకుని రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణను వేరే కంపెనీలకు అప్పగించారని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
రబ్రీకి ఇంటిపోరు... లాలూకు ‘పుత్రిక వాత్సల్య’ తిప్పలు!
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు పుత్రిక వాత్సల్యంతో, ఆయనభార్య రబ్రీదేవికి ఇంటిపోరుతో కొత్త కష్టాలొచ్చాయి. సరాన్ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలోకి దిగనున్న రబ్రీదేవికి వ్యతిరేకంగా తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె సొంత సోదరుడు అనిరుధ్ ప్రసాద్ అలియాస్ సాధూయాదవ్ మంగళవారం ప్రకటించారు. 1990 నుంచి 2005 వరకు ఆర్జేడీ పాలనలో లాలూ బావమరిదిగా చక్రంతిప్పిన సాధూ వివాదాస్పద నేతగా నిలిచారు. తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో లాలూతోనే గొడవ పెట్టుకొని పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బెట్టియాలో లాలూపై పోటీ చేసి భంగపడ్డారు. నేరస్థుడికి కీలక పదవి: పుత్రికపై వాత్సల్యం లాలూను చివరకు ఓ నేరస్థుడిని కాళ్లావేళ్లా పడి బతిమిలాడుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. లాలూ పుత్రిక మీసా భారతి పాటలీపుత్ర నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. అక్కడ జేడీయూ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ రంజన్ ప్రసాద్ యాదవ్, రామ్‌క్రిపాల్ యాదవ్ (బీజేపీ) బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు యాదవులే.అదే వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ రిత్లాల్ యాదవ్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ నేత సత్యనారాయణ్ సిన్హా హత్య కేసులో ముద్దాయిగా ప్రస్తుతం పాట్నా జైలులో ఉన్న అతనికి సాధారణ ఎన్నికలలో పోటీ చేసేందుకు దిగువ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇలా పాటలీపుత్ర నియోజకవర్గంలో యాదవుల ఓట్లన్నీ చీలిపోతే తన కుమార్తెకు కష్టాలు తప్పవని గ్రహించిన లాలూ అప్రమత్తమయ్యారు. గత సోమవారం రాత్రి రిత్లాల్ స్వగ్రామానికి వెళ్లి అతని తండ్రి రామసిశా రాయ్‌తో మంతనాలు జరిపారు. రిత్లాల్ పోటీ నుంచి విరమించేలా, అలాగే మీసా భారతికి మద్దతు తెలిపేలా ఒప్పించారు. ఇందుకు ప్రతిఫలంగా రిత్లాల్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రకటన జారీ చేశారు. అంతేకాదు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రిత్లాల్ తండ్రికి ఆర్జేడీ తరఫున టికెటు ఇచ్చేందుకు లాలూ ఒప్పందం కుదుర్చుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.