పట్నా: రైల్వే హోటళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. పట్నాలో ఈడీ ప్రత్యేక బృందం రబ్రీ దేవిని 6 గంటల పాటు ప్రశ్నించింది. వాంగ్మూలాన్ని నమోదుచేశారు. యూపీఏ–1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ 2004లో లంచం తీసుకుని రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణను వేరే కంపెనీలకు అప్పగించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment