
బాలీవుడ్ భామ ప్రియాంక చాహర్ చౌదరి తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. ప్రియుడు అంకిత్ గుప్తాతో బ్రేకప్ అయినట్లు ఇటీవల కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బుల్లితెర బ్యూటీ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా సరే తమ జీవితంలో మార్పు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. జీవితంలో ముందుకు సాగాలే తప్ప వెనకడుగు వేయకూడదని అంటోంది. ఆమె మాటలను చూస్తుంటే వీరిద్దరి మధ్య బ్రేకప్ నిజమేనని తెలుస్తోంది.
ప్రియాంక చాహర్ మాట్లాడుతూ.. ' మార్పు అనేది ఎల్లప్పుడూ మంచిదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మనం జీవితంలో అభివృద్ధి చెందడానికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగాల్సిందే. అది రిలేషన్‌లో అయినా.. ఫ్యాషన్‌లో అయినా అదే మంచి నిర్ణయం" అని తెలిపింది. కాగా.. ఇటీవల ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ జంటపై బ్రేకప్ రూమర్స్ మొదలయ్యాయి.
(ఇది చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!)
అంతుకుముందు వీరిద్దరు కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'తేరే హో జాయేన్ హమ్' అనే టీవీ షో నుంచి సైతం అంకిత్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ప్రియాంక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా పరిణామాలతో ఈ జంట తమ రిలేషన్‌షిప్‌కు దాదాపు ఎండ్ కార్డ్ వేసినట్లేనని అర్థమవుతోంది.
కాగా.. వీరిద్దరు మొదటసారిగా 'ఉదారియన్' సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తరువాత బిగ్ బాస్- 16లో కనిపించారు. అంతేకాకుడా అంకిత్ గుప్తా, ప్రియాంకతో కలిసి బాలికా వధు, సద్దా హక్ సిరీయల్స్‌లో జంటగా నటించారు. మరోవైపు ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్ కూడా నటించనుంది.