మెంటల్ కాదు... డెంటల్ రికార్డు... | Dental records are not mental ... ... | Sakshi
Sakshi News home page

మెంటల్ కాదు... డెంటల్ రికార్డు...

Published Mon, Feb 8 2016 11:30 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

మెంటల్ కాదు... డెంటల్ రికార్డు... - Sakshi

మెంటల్ కాదు... డెంటల్ రికార్డు...

తిక్క  లెక్క
 
ఇతగాడి పేరు శివమణి కాదు... అందుకే ‘మెంటల్’ కాదు గానీ, కొంచెం ‘డెంటల్’. మరేమీ లేదు... ఇతగాడికి దంతసిరిసంపదలపై జాగ్రత్త ఎక్కువ. అంతేకాదు, దంతసిరిని ధగధగలాడించే టూత్‌పేస్టులపై కొంచెం టేస్టు కూడా ఎక్కువే! ఇదోరకం కలాపోసన లెండి. అయితే ఏంటి..? అనుకుంటున్నారా..? ఈ కలాపోసనతోనే ఇతగాడు ఏకంగా గిన్నెస్ బుక్కులోకి ఎక్కేశాడు.

ఏమంత ఘనకార్యం చేశాడంటారా..? ఫొటో చూస్తే అర్థం కావట్లేదూ! తన జీవితకాలంలో వాడేసిన టూత్‌పేస్ట్ ట్యూబులను పారవేయకుండా పదిలంగా దాచుకున్నాడు. ఇతరులు పారవేయబోతున్నవి కూడా వెరైటీగా కనిపిస్తే వెంటతెచ్చి మరీ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇలా ఏకంగా 2,037 టూత్‌పేస్ట్ ట్యూబులను సేకరించాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement