‘దంత్ కాంతి’తో మెరుగైన ఫలితాలు
హైదరాబాద్: మార్కెట్‌లోని పలు టూత్‌పేస్ట్‌లతో పోలిస్తే పతంజలి హెర్బల్ టూత్‌పేస్ట్ బ్రాండ్ ‘దంత్ కాంతి’ మెరుగైన ఫలితాలను అందిస్తోందని డెంటిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (డీఏఐ) పేర్కొంది. దంతాల మీది గార తొలగింపు, రక్తస్రావం తగ్గింపు, సూక్ష్మజీవులను ఎదుర్కోవడం వంటి అంశాల్లో ‘దంత్ కాంతి’ ఇతర టూత్‌పేస్ట్‌ల కన్నా ముందుందని 42 రోజుల ఒక ట్రయల్ పరీక్షలో తేలినట్లు డీఏఐ నేషనల్ ప్రెసిడెంట్ అనిల్ డాలా ఒక ప్రకటనలో తెలిపారు. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా మెస్వాక్, కోల్‌గేట్ టోటల్ ఉన్నాయి.