Paste
-
ప్రమాదకర రసాయనాలతో అల్లం, వెల్లుల్లి పేస్ట్ నుంచి కూల్ డ్రింక్స్ దాకా..
రాజేంద్రనగర్: ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమను నిర్వహించడమేగాక రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్, శీతల పానీయాలు(కూల్‌డ్రింక్స్) తయారు చేస్తున్న కర్మాగారంపై ఆదివారం రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 500 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో డ్రింక్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కిలోల మసాలా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాటేదాన్ శాంతినగర్‌లో ఫిరోజ్, అజిత్ గత రెండేళ్లగా ఎలాంటి అనుమతులు లేకుండా ఉమ్మాని ఫుడ్ కంపెనీ పేరుతో పరిశ్రమను నిర్వహిస్తున్నారు. సదరు పరిశ్రమలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌తో పాటు మ్యాంగో, ఆరెంజ్ జ్యూస్‌తో పాటు పుడ్ మసాలాలను తయారు చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లో కేవలం వెల్లుల్లి పొట్టును మాత్రమే వినియోగిస్తుండటం గమనార్హం. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో రెండు సంవత్సరాలుగా అల్లమే వాడకుండా తయారు చేస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన సమయంలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న పదార్థాలే కనిపించాయి. శీతల పానీయాలను తయారు చేసేందుకు మురుగునీటిని వాడుతున్నారని, ప్లేవర్ల కోసం రసాయనాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండేళ్లుగా నిందితులు ఎలాంటి అనుమానం రాకుండా పరిశ్రమను నిర్వహించడం గమనార్హం. భారీ యంత్రాలతో పెద్ద ఎత్తున ఉత్పత్తులు చేస్తున్న వీరు రాష్ట్ర వ్యాప్తంగా వాటిని సరఫరా చేసినట్లు వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకుని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. అధునాతన యంత్రాల వినియోగం... అల్లం, వెల్లుల్లి పేస్ట్‌తో పాటు గరంమసాలాలు, శీతల పానీయాల మిక్సింగ్, ప్యాక్ చేసేందుకు నిందితులు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో ఉన్న ఈ యంత్రాల ద్వారా ప్రతి రోజు రూ. లక్షల విలువైన మసాలాలు, అల్లం పేస్ట్, శీతల పానీయాలను తయారు చేస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశామని, స్వాధీనం చేసుకున్న పదార్థాలను ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
పేస్టులా మార్చి.. కాళ్లకు చుట్టుకుని..
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి జి–9–450 విమానంలో సోమవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అతడి వద్ద బంగారం బయటపడింది. పేస్టులా మార్చిన బంగారాన్ని రెండు కాళ్లకు టేపుతో అతికించి తీసుకొచ్చాడు. 970 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ రూ. 47.55 లక్షలుంటుందని అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య -
లస్సీ విత్ ఫ్లేక్స్
కూల్ కూల్‌గా... కావలసినవి: పెరుగు - అరలీటరు, అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కార్న్‌ఫ్లేక్స్ - పావు కప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా, క్రీమ్ - 3 టీ స్పూన్లు, ఉప్పు తయారి: మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి పెరుగు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి వరుసగా కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్‌లను పైన వేసి సర్వ్ చేయాలి. -
కాపీ చేశారు... పేస్ట్ చేయడంలో ఫెయిలయ్యారు!
ఆ సీన్ - ఈ సీన్ ఒక రకంగా చూస్తే కంప్యూటర్ను కనుక్కొన్నవాడి కన్నా కాపీ పేస్ట్‌ను కనుకున్నవాడు గొప్పవాడు. అయితే సరిగ్గా పేస్ట్ చేయడం తెలీనప్పుడు కాపీ చేస్తే మాత్రం చేసిన ప్రయత్నం వృథా అయిపోతుంది. ముఖ్యంగా క్లాసిక్స్ అనదగ్గ సినిమాలను కాపీ చేసేసి, వాటిని అతి సాదాసీదాగా పేస్ట్ చేస్తే... సినిమా అభిమానుల ఫీలింగ్స్ దారుణంగా హర్ట్ అవుతాయి. అలా హర్ట్ చేసిన ఓ సినిమా... ‘మా నాన్నకు చిరంజీవి’. సూపర్ హిట్ అయిన ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’కి అనుకరణగా రూపొందిన ఈ సినిమా ఘోరంగా విఫలమైంది. విల్ స్మిత్‌కు ఆస్కార్ అవార్డును, అంతకు మించిన అభిమానగణాన్ని సంపాదించి పెట్టిన సినిమా ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’. 2006లో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమా ఒక వాస్తవ కథ. అతుకుల్లేని, అలంకారాల్లేని, పారదర్శకమైన కథ. స్మిత్ నులివెచ్చని భావవ్యక్తీకరణ సినిమాను కొత్త హైట్స్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శ్రీమంతుల్లో ఒకరు క్రిస్ గార్డ్నర్. ఈ వ్యాపారవేత్త తన జీవితంలోని ఒక దశలో ఎదుర్కొన్న కష్టాలు, వాటిని ఆయన అధిగమించిన తీరును ఆటోబయోగ్రఫీగా రాశారు. దాన్నే ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’ సినిమాగా మలిచారు. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో కొన్ని ఎక్స్‌రే మిషన్లను కొని, వాటి వ్యాపారంలో తేడాలొచ్చి కట్టుబట్టలతో మిగులుతాడు క్రిస్ గార్డ్నర్ (విల్ స్మిత్). దీంతో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుంది. కొడుకును తన దగ్గర వదిలిపెట్టి భార్య వెళ్లిపోతుంది. ఆరేళ్ల వయసున్న కొడుకుతో కలిసి ఆ సేల్స్‌మెన్ రోడ్డున పడ తాడు. తన పరిస్థితి తనయుడికి ఏ మాత్రం అర్థం తెలియ నీకుండా జాగ్రత్తపడతాడు. బాబుకి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకోవ డానికి ఆ తండ్రి పడే తపన, మరోవైపు అడుగడుగునా దురదృష్టం ఎదురవుతున్నా ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని వదలక తన లక్ష్యం దిశగా ప్రయత్నాలను కొనసాగించే అతని ప్రయాణమే ఈ చిత్రం. ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతుందీ సినిమా. ఈ కథా నేపథ్యాన్ని ‘మా నాన్న చిరంజీవి’ సినిమాకు అన్వయించే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ వెర్షన్లో విల్ స్మిత్, ఆయన సొంత తనయుడు జేడెన్ స్మిత్‌లు నటించిన పాత్రల్లో తెలుగు వెర్షన్లో జగపతిబాబు, మాస్టర్ అతులిత్లు కనిపిస్తారు. భార్య మాట విని తనకు తెలియని వ్యాపారంలో డబ్బులన్నీ పెట్టి నష్టపోతాడు జగపతిబాబు. ఆయన ఆర్థికంగా నష్టపోవడానికి తనే కారణం అయినా... భార్య అతడిని వదలి వెళ్లిపోతుంది. దీంతో హీరో కొడుకును తీసుకుని హైదరాబాద్ వ స్తాడు. ఈ రకంగా నేపథ్యాన్ని మార్చినా... ఇక్కడి నుంచి ఇక హీరోకి ఎదురయ్యే అనుభవాలన్నీ హాలీవుడ్ సినిమాకు అనుకరణగా రాసుకున్నవే. కొడుకుతో కలిసి ఒక రాత్రి రైల్వేస్టేషన్ బాత్రూమ్లో తల దాచుకోవాల్సి వస్తుంది హీరోకి. ఈ సీన్లో విల్‌స్మిత్ నటన కన్నీటిని తెప్పిస్తుంది. ఈ సన్నివేశాన్ని తెలుగు సినిమాలో కూడా యథాతథంగా వాడుకున్నారు. హాలీవుడ్ వెర్షన్లో హీరో తన దగ్గరే మిగిలిపోయిన ఎక్స్‌రే మిషన్‌ను అమ్మడానికి హీరో ప్రయత్నం చేస్తుంటాడు. తెలుగులో హీరో చేతిలో డిక్షనరీలు పెట్టారు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు, అనుకరణలు ఎన్నో ఉన్నా... ఏ దశలోనూ తెలుగు సినిమా హాలీవుడ్ డ్రామాను రీచ్ కాలేదు. అమెరికా నేపథ్యంలో సాగే కథను లోకలైజ్ చేయబోయి... గొప్ప కాన్సెప్ట్‌ను సాధారణ స్థాయికి తీసుకొచ్చేశారు రూపకర్తలు. అందుకే ఈ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా చాలామందికి తెలియదు! వాస్తవానికి విల్‌స్మిత్ సినిమాలో ఉన్న గొప్పదనం... నాటకీయమైన కథలోనిది కాదు. ఆ చిత్రంలోని అందమంతా దాని నిజాయితీలో ఉంది. ప్రతి సన్నివేశం ఎంతో వాస్తవికంగా, మనసును తడిమేలా ఉంటడమే దాని సక్సెస్ సీక్రెట్. అలాంటి ఫీల్ తెలుగు సినిమాలో మిస్ అయ్యింది! అందుకే... పరాజయాల లిస్టులో చేరిపోయింది! - బి.జీవన్‌రెడ్డి -
పేస్ట్ ఒక్కటే... పనులు బోలెడు!
టూత్‌పేస్ట్ ఏం చేస్తుంది అనడిగితే... దంతాలను శుభ్రం చేస్తుంది అని ఠక్కున చెప్పేస్తాం. కానీ టూత్‌పేస్ట్ అదొక్కటే చేయదు. చాలా పనులు చేస్తుంది. అవేంటో తెలుసుకోవాలనుందా? ⇒ చేపలు శుభ్రం చేసినా, వెల్లుల్లి రేకులు ఒలిచినా, ఉల్లిపాయలు కోసినా వాటి వాసన చేతికి ⇒ అంటుకుపోతుంది. అలాంటప్పుడు టూత్‌పేస్ట్‌తో చేతులు రుద్దుకుంటే వాసన వదిలి పోతుంది! ⇒ అద్దాల మీద మరకల్ని, పింగాణీ వస్తువుల మీది మరకల్ని పేస్ట్ తేలికగా వదిలిస్తుంది! ⇒ బూట్ల మీద మరకలుంటే, టూత్‌పేస్ట్‌తో రుద్దితే చాలు... మళ్లీ తళతళ మెరుస్తాయి! ⇒ గోడలపై పిల్లలు పెన్ను, స్కెచ్ పెన్నుతో గీతలు గీశారా? అయితే పేస్టుకి పని చెప్పండి! ⇒ బంగారు, వెండి వస్తువులు మెరుపును కోల్పోతే, టూత్‌పేస్ట్‌తో రుద్ది చూడండి! ⇒ మొటిమలు వచ్చి ముఖమంతా సలుపుతుంటే... పడుకునే ముందు వాటి మీద పేస్ట్ రాయాలి. వాపు తీసి, సలుపు తగ్గి హాయిగా ఉంటుంది! ⇒ ఒక్కోసారి చేతి వేళ్లు, కాలి వేళ్లు రఫ్‌గా తయారవుతాయి. అలాంటప్పుడు టూత్‌పేస్టుతో రుద్దితే మళ్లీ మృదువుగా తయారవుతాయి! ⇒ దోమలు, పురుగులు కుట్టి దద్దుర్లు వచ్చినప్పుడు పేస్టు రాస్తే దద్దుర్లు అణగిపోతాయి. దురద కూడా తగ్గిపోతుంది! ⇒ కాలిన చోట పేస్ట్ రాస్తే బొబ్బలు, మంట రావు! ⇒ వాటర్ బాటిల్స్‌లో నీళ్లు పోసి, పేస్ట్ వేసి శుభ్రం చేస్తే... బాగా శుభ్రపడతాయి. పిల్లల పాల సీసాలను కూడా పేస్టుతో కడిగితే, పాల వాసన పోతుంది!