పేస్ట్ ఒక్కటే... పనులు బోలెడు!
టూత్‌పేస్ట్ ఏం చేస్తుంది అనడిగితే... దంతాలను శుభ్రం చేస్తుంది అని ఠక్కున చెప్పేస్తాం. కానీ టూత్‌పేస్ట్ అదొక్కటే చేయదు. చాలా పనులు చేస్తుంది. అవేంటో తెలుసుకోవాలనుందా?
⇒ చేపలు శుభ్రం చేసినా, వెల్లుల్లి రేకులు ఒలిచినా, ఉల్లిపాయలు కోసినా వాటి వాసన చేతికి
⇒ అంటుకుపోతుంది. అలాంటప్పుడు టూత్‌పేస్ట్‌తో చేతులు రుద్దుకుంటే వాసన వదిలి పోతుంది!
⇒ అద్దాల మీద మరకల్ని, పింగాణీ వస్తువుల మీది మరకల్ని పేస్ట్ తేలికగా వదిలిస్తుంది!
⇒ బూట్ల మీద మరకలుంటే, టూత్‌పేస్ట్‌తో రుద్దితే చాలు... మళ్లీ తళతళ మెరుస్తాయి!
⇒ గోడలపై పిల్లలు పెన్ను, స్కెచ్ పెన్నుతో గీతలు గీశారా? అయితే పేస్టుకి పని చెప్పండి!
⇒ బంగారు, వెండి వస్తువులు మెరుపును కోల్పోతే, టూత్‌పేస్ట్‌తో రుద్ది చూడండి!
⇒ మొటిమలు వచ్చి ముఖమంతా సలుపుతుంటే... పడుకునే ముందు వాటి మీద పేస్ట్ రాయాలి. వాపు తీసి, సలుపు తగ్గి హాయిగా ఉంటుంది!
⇒ ఒక్కోసారి చేతి వేళ్లు, కాలి వేళ్లు రఫ్‌గా తయారవుతాయి. అలాంటప్పుడు టూత్‌పేస్టుతో రుద్దితే మళ్లీ మృదువుగా తయారవుతాయి!
⇒ దోమలు, పురుగులు కుట్టి దద్దుర్లు వచ్చినప్పుడు పేస్టు రాస్తే దద్దుర్లు అణగిపోతాయి. దురద కూడా తగ్గిపోతుంది!
⇒ కాలిన చోట పేస్ట్ రాస్తే బొబ్బలు, మంట రావు!
⇒ వాటర్ బాటిల్స్‌లో నీళ్లు పోసి, పేస్ట్ వేసి శుభ్రం చేస్తే... బాగా శుభ్రపడతాయి. పిల్లల పాల సీసాలను కూడా పేస్టుతో కడిగితే, పాల వాసన పోతుంది!