ఒక వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. అదే హోటల్స్‌లో అయితే వంద రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ వాటర్ బాటిల్ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే దీని ధర అక్షరాలా రూ. 45 లక్షలు. అవును మీరు విన్నది నిజమే. ఆ వాటర్ బాటిల్ మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. మరి ఆ స్పెషల్ ఏంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచి నీళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా?లీటర్ కూడా ఉండని ఈ బాటిల్ ధర దాదాపు 45 లక్షల రూపాలుంటుందట!మనం రోజూ తాగే మంచి నీళ్ల బాటిల్ ధరలు కూడా.. ఊహించని స్థాయిలో ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు.అక్వా డి క్రిస్టలో ట్రిబ్యుటొ ఎ మోడిగ్లియాని అనే వాటర్ బాటిల్ గురించే ఈ చర్చంతా. దీనిలో కేవల 750 మిల్లీ లీటర్ల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంత చిన్న వాటర్ బాటిల్ ధర అక్షరాలా 45 లక్షల రూపాయలు. ఇప్పుడు ప్రపంచంలోని అతి ఖరీదైన మంచినీళ్లు ఇవేమరి.
లీటర్ కూడా లేని ఈ నీళ్లకు ఎందుకింత డిమాండ్? అంటే..ఈ నీళ్లను ఫ్రాన్స్, ఫిజీలలోని సహజ నీటిబుగ్గల నుంచి సేకరిస్తారట. భూగర్భ జలాలు ఉబికి భూమిపైన ప్రవహించే సహజ నీటి బుగ్గల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ఇది వింతేమీ కాదే!! ఈ రోజుకీ మార్కెట్‌లో అనేక మినరల్ వాటర్ బాటిల్లు ఈ విధమైన సహజ నీటి బుగ్గల నుంచి సేకరించిన నీళ్లను అమ్ముతున్నారు. మన దేశంలో కూడా ఈ విధమైన నీళ్ల బాటిల్లను రూ. 50 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. అయినప్పటికీ ఈ వాటర్ బాటిల్ ఎందుకంత ధర పలుకుతుంది? ఇదేనా మీ అనుమానం.. అనేకానేక కారణాల్లో ఈ వాటర్ బాటిల్ డిజైన్ కూడా ఒక కారణమే. ఎందుకంటే..
►ఈ బాటిల్ లోపలి భాగాన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారుచేయడం.
►ఈ బాటిల్ ఆకారాన్ని ప్రపంచంలోనే ప్రసిద్ధ బాటిల్ డిజైనర్ అయిన ఫెర్నాండో అల్టామిరానో డిజైన్ చేశాడు. ప్రపంచంలోనే అతి ఖరీదైన హెన్రీ 4 హెరిటేజ్ డ్యుడోగ్నన్ కోగ్‌న్యాక్ అనే వైన్ బాటిల్ కూడా ఇతనే డిజైన్ చేశాడు.
►ఈ బాటిల్‌లోని నీళ్లు కూడా ప్రత్యేక రుచి కలిగి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో లభించే సగటు తాగునీటి కంటే ఎక్కువ శక్తిని అందిస్తుందట.
అంతఖరీదు పెట్టి కొని తాగే వారు ఎవరుంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! సెలబ్రెటీలు, ప్రముఖ వ్యక్తులు మనలా సాధారణ నీళ్లను తాగరు. వాళ్లు తాగే నీళ్లు ఇవే మరి.. !
Comments
Please login to add a commentAdd a comment