ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. రైలు ప్రయాణంలో ఎక్కువ మంది ఇబ్బందులు పడేది ఆహారం, నీళ్లతోనే. డబ్బు పెట్టినా సురక్షితమైన నీళ్లు లభించవు. చాలా సార్లు రైళ్లలో అసురక్షితమైన ఏవో లోకల్ బ్రాండ్ వాటర్ బాటిళ్లు విక్రయిస్తుంటారు. అయితే రైళ్లలో ఏ బ్రాండ్ వాటర్ బాటిళ్లు అమ్మాలో నిబంధనలు ఉన్నాయి.
తాజాగా పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీ కారు నుంచి అనధికారిక, నాసిరకం తాగునీటి బాటిళ్లను మొరాదాబాద్ రైల్వే స్టేషన్‌లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం వాటర్ బాటిళ్ల విక్రయంపై ఓ సిబ్బందిలో ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు వేగంగా చర్యలు తీసుకున్నారు. సుమారు 80 కేసులు లోకల్ బ్రాండ్‌కు చెందిన బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యుడైన మేనేజర్‌ను, మరికొంత మందిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే..
సీనియర్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ (DCM) సుధీర్ కుమార్ సింగ్ ఈ సంఘటనపై మాట్లాడుతూ భారతీయ రైల్వేలలో ‘రైల్ నీర్’ బ్రాండ్ వాటర్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలని, ఒకవేళ అవి అందుబాటులో లేకుంటే నిర్దిష్ట బ్రాండ్ నీటిని విక్రయించడానికి కచ్చితమైన ప్రోటోకాల్ ఉందని పేర్కొన్నారు. 'రైల్ నీర్' బ్రాండ్ వాటర్ బాటిళ్ల సరఫరా పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వేరే బ్రాండ్‌లను విక్రయించాల్సిన పని లేదన్నారు. ‘రైల్ నీర్’ అనేది భారతీయ రైల్వేలో భాగమైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRTC)కి చెందిన బాటిల్ వాటర్ బ్రాండ్.
Comments
Please login to add a commentAdd a comment