మనలో చాలామంది టూత్‌బ్రష్‌ను ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. మరీ ఏళ్లు కాకపోయినా బ్రిజిల్స్ అంటే మనం పళ్లు తోముకునే భాగం బాగుంటే కనక కనీసం ఏడాదికి తగ్గకుండా వాడతారు. అయితే టూత్‌బ్రష్‌ను అంతకాలం పాటు వాడటం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు.
టూత్‌బ్రష్‌ను ఇంతకాలం లోపు మార్చాలనే విషయంలో నిర్దిష్టమైన మార్గదర్శకం అంటూ ఏమీ లేకపోయినప్పటికీ మూడు నాలుగు నెలలకోసారి మార్చడం మంచిదంటున్నారు వైద్యులు. అదేవిధంగా బ్రిజిల్స్ వంగి΄ోయినప్పుడు, లేదా కొన్ని బ్రిజిల్స్ ఊడిపోయినప్పుడు... ఊడుతున్నట్లుగా ఉన్నప్పుడు వెంటనే బ్రష్ మార్చడం మంచిది. బ్రష్‌ను, టంగ్‌క్లీనర్‌ను బాత్‌రూమ్‌లో కాకుండా బయట ఎక్కడైనా పెట్టుకోవాలి.
మరో ముఖ్యవిషయం... ఏదైనా జబ్బు పడి కోలుకున్న తర్వాత అప్పటివరకు వాడుతున్న బ్రష్ కొత్తదైనా సరే, దానిని పారేసి, కొత్త బ్రష్ కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే జబ్బుపడ్డప్పుడు ... అంటే వైరల్ ఫీవర్స్, డెండ్యూ, మలేరియా, టైఫాయిడ్... మరీ ముఖ్యంగా దంత వ్యాధులతో బాధపడుతున్ననప్పుడు తప్పనిసరిగా బ్రష్ మార్చడం అవసరం. ఇంటిల్లిపాదీ ఒకే బాక్స్‌లో బ్రష్‌లు పెట్టుకోవడం సాధారణం.. అటువంటప్పుడు రోజూ బ్రష్ చేసుకునేముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.
(చదవండి: స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment