Oral Health
-
Tooth Brush టూత్ బ్రష్.. దీని కథ తెలుసా?
రోజూ పొద్దున లేచి, పళ్లు తోమిన తర్వాతే ఏదైనా తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు పళ్లు తోమడానికి బద్దకిస్తారు. తోమకుండానే ఉండి΄ోతారు. దీనివల్ల పళ్లు చెడిపోయి, దుర్వాసన వస్తుంది. కాబట్టి పళ్లు తోమడం తప్పనిసరి. పళ్లు తోమేందుకు బ్రష్ వాడతాం కదా, ఆ బ్రష్ చరిత్రేమిటో తెలుసా?పళ్లు తోమేందుకు బ్రష్ కనిపెట్టకముందే ఆదిమానవులు పళ్లు శుభ్రం చేసుకునేందుకు రకరకాల వస్తువులు వాడేవారు. చెట్టు బెరడు, పక్షి రెక్కలు, జంతువుల ఎముకలతో పళ్లను శుభ్రం చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో పళ్లను తోమేందుకు చెట్ల కొమ్మల్ని వాడేవారు. అందులోనూ వేపపుల్లల్ని ఎక్కువగా వాడేవారు. వాటిని నమలుతూ పళ్లను శుభ్రంగా ఉంచుకునేవారు. ఒక వైపు తోమాక, మరో వైపుతో నాలుక శుభ్రం చేసుకునేవారు. ప్రపంచంలో అనేకచోట్ల చెట్ల కొమ్మల్నే పళ్లు శుభ్రం చేసుకునేందుకు వాడినట్లు ఆధారాలున్నాయి. అయితే పుల్లలు వాడకుంటూ బొగ్గు, ముగ్గు, బూడిద, ఇతర పదార్థాలను ఉపయోగించి చేత్తోనే పళ్లు తోమే అలవాటు కూడా చాలామందికి ఉండేది. ఇదీ చదవండి: టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!ఆ తర్వాత తొలిసారి చైనాలో బ్రష్ కనిపెట్టారు. ఒక చేత్తో బ్రష్ చివర పట్టుకుంటే మరో వైపు ఉన్న బ్రిజిల్స్ పళ్ల మీద మదువుగా రుద్దుతూ శుభ్రం చేసేవి. ఆ బ్రిజిల్స్ని రకరకాల వస్తువులతో తయారుచేసేవారు. అయితే ఇది కొందరికే అందుబాటులో ఉండేది.1780లో యూకేలో మొదటిసారి విలియం అడ్డీస్ అనే వ్యక్తి జైల్లో ఉండగా, పళ్లను శుభ్రం చేసుకునేందుకు సొంతంగా బ్రష్ తయారుచేసుకున్నాడు. ఆయన బయటకు వచ్చాక వాటిని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అలా బ్రష్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆయన మరణించాక ఆయన కొడుకు ఆ పనిని కొనసాగించాడు. ఆ తర్వాత అనేక కంపెనీలు బ్రష్‌ల తయారీ మొదలుపెట్టాయి. ఇప్పుడు రకరకాల రూపాల్లో బ్రష్‌లు వస్తున్నాయి. చూశారా! ఇవాళ మనం వాడే బ్రష్‌ల వెనుక ఇంత చరిత్ర ఉంది. -
టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!
ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడం అనేది మనం చిన్నప్పటినుంచీ నేర్చుకుంటున్న ప్రాథమిక పాఠం. దంతాల ఆరోగ్యాన్ని(Oral health)కాపాడుకోవాలన్నా, లేదా నోరు పరిశుభ్రంగా ఉండాలన్నా క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవడం అవసరం. లేదంటే నోరు దుర్వాసన రావడం మాత్రమే కాదు. అనేక రోగాలకు దారి చూపించిన వారమవుతాం. పళ్లు తోముకునేందుకు సాధారణంటా అందరూ టూత్ బ్రష్ (tooth brush)నే వాడతాం. వేప పుల్లలతో పళ్లు తోముకునే వారు కూడా ఉన్నప్పటికీ టూత్ బ్రష్ వాడే వారే ఎక్కువ. అయితే ఈ బ్రష్ ఎన్నిరోజులకు ఒకసారి మార్చాలి. ఏళ్ల తరబడి ఒకే టూత్ బ్రష్‌ను వాడవచ్చా? ఇలా వాడితే ఎలాంటి సమస్యలొస్తాయి? వీటి గురించి ఆలోచించారా ఎపుడైనా?ఎపుడు మార్చాలి?దంత సంరక్షణ విషయంలో రోజూ బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో, సమయానికి బ్రష్ మార్చడమూ అంతే ముఖ్యం. టూత్ బ్రష్ ను ఎన్ని రోజులు ఉపయోగించాలి అనే విషయంలో దంత వైద్యులు కచ్చితమమైన సిఫార్సులున్నాయి. ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు మార్చమని సిఫార్సు చేస్తారు. అరిగిపోయిన టూత్ బ్రష్ వాడుతూనే ఉంటానని చెబితే దంతక్షయం, చిగుళ్ల వ్యాధి వంటి అనేక సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలను నిర్లక్ష్యం చేసినా, అవగాహనా లేమితో ప్రయత్నించినా నష్టం తప్పదు అరిగిపోయిన లేదా, విరిగిపోయిన లేదా పాడైపోయిన బ్రష్ లను అస్సలు వాడకూడదు. అటువంటి అరిగిపోయిన టూత్ బ్రష్‌ను ఉపయోగించడం వల్ల దంతాల నుండి బ్యాక్టీరియా పోదు సరికదా మరికొన్ని వ్యాధులకుమూలవుతుంది. శానిటైజ్బ్రష్లను తరచుగా మార్చడంతో పాటు ఉపయోగించిన తర్వాత టూత్ బ్రష్‌ను నీటితో బాగా కడగాలి. కనీసం వారానికి ఒకసారి శానిటైజ్ చేయాలి. వీటికి ప్రత్యేకమైన శానిటైజర్ల పరికరాలున్నాయి. లేని పక్షంలో వేడి నీళ్లలో నానబెట్టి, బాగా కడగాలి. యాంటీమైక్రోబయల్ మౌత్‌వాష్‌లో లేదా నీరు, వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమంలో 30 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి.అలాగే బ్రష్ హోల్డర్లను బాత్రూంలలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా బ్రష్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ముంది.టూత్ బ్రష్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ప్రతి ఒక్కరికి వేర్వేరు నోటి బ్యాక్టీరియా ఉంటుంది .సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మాన్యువల్ టూత్ బ్రష్‌ను మార్చాలి. ముఖ్యంగా నోటి శస్త్రచికిత్స, రూట్ కెనాల్ థెరపీ, చిగుళ్ల వ్యాధికి చికిత్స వంటి పంటి చికిత్సల తర్వాత.. బ్రష్ కచ్చితంగా మార్చాలని నిపుణులు అంటున్నారు. వైద్యం చేసిన ప్రాంతంలో బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ముప్పు తగ్గించడానికి.. కొత్త బ్రష్ వాడటం మంచిది. చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంఅనారోగ్యం తరువాతజలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత, టూత్ బ్రష్‌ను కచ్చితంగా మార్చాలి. బాక్టీరియా, వైరస్లు మీ టూత్ బ్లష్ పళ్లపై ఉంటాయి. ఇది మళ్లి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.క్ష్మక్రిములు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నివారించాలంటే ఏదైనా అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పాత బ్రష్‌ను వదిలేసి, కొత్త బ్రష్‌ను ఎంచుకోవాలి. అలాగే పాతబ్రష్ను బ్రష్‌నుంచి కూడా తొలగించడం కూడా చాలా ఉత్తమం. ఈ విషయంలో పిల్లల బ్రష్ విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడుతున్నా కూడా చాలా త్వరగా బ్రష్‌ను మార్చాల్సి ఉంటుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి దాని తలను(Head) మార్చుకోవాలి. ఎందుకంటే సాధారణ బ్రష్‌లతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు ఇంకా వేగంగా అరిగిపోతాయి. -
ఒంటికి మంచిదే..మరి పంటికి?
ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడంతో ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ అందులో భాగంగా పండ్లూ, పళ్లరసాలు తీసుకోవడం పెరిగింది. అయితే ఇది ఆరోగ్యానికి మంచేదేమోగానీ పంటికి హానికరంగా పరిణమించవచ్చు. అలా ఒంటికి మంచిదైనా, పంటికి హాని చేసేవేమిటో, ఆ హానిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం. పండ్లు / పండ్ల రసాలతో... తాజా పండ్లు, పళ్ల రసాలూ ఆరోగ్యానికి మంచివే. కానీ అవే ఫ్రూట్జ్యూసుల వల్ల పంటికి హాని జరగవచ్చు. ఉదాహరణకు పళ్లరసాల్లోని ఎక్కువగా ఉండే చక్కెర మోతాదులు పళ్లను దెబ్బతీవయచ్చు. అలాగే ఒకింత పుల్లగా ఉండే పండ్లలోని యాసిడ్స్ వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి.ఈ సమస్య అధిగమించడానికి...పండ్లను జ్యూస్ రూపంలో తాగడం కంటే కొరికి తినడం మేలు. ఉదాహరణకు నారింజ/బత్తాయి పండ్లు కొరికి తిన్నప్పటికి కంటే చక్కెర కలిపి ఆరెంజ్‌జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు పళ్లు పాడయ్యే అవకాశం ఎక్కువ. పళ్లు బలహీనంగా ఉన్నవారు జ్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోవద్దు. జ్యూస్ తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి.దగ్గు మందులతో... దగ్గు మందు ఔషధమే అయినా అది కూడా ఫ్రూట్ జ్యూస్‌లాంటి ముప్పునే తెచ్చిపెడుతుంది. దగ్గు మందుల్లోని గాఢత చిక్కదనం), అందులో ఉండే చక్కెర మోతాదులు... అచ్చం జ్యూస్‌లాంటి ప్రభావాన్నే చూపుతాయి. దాంతో పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్య అధిగమించడానికి...దగ్గు మందు తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. వేలితో నోరు శుభ్రమయ్యేలా కడుక్కోవాలి. దగ్గుమందు తాగిన ప్రతిసారీ ఇలా నోరు కడుక్కోవాలి. గుండెకు మేలు చేసే డార్క్ చాక్లెట్లతో... పరిమితంగా తీసుకునే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. సాధారణంగా చాక్లెట్లు పళ్లకు చుట్టుకు΄ోయేలా కాస్త జిగురుగా / జారుడుగా ఉంటాయి. అలా చుట్టుకు΄ోవడం వల్ల అవి తమలోని చక్కెరను చాలాసేపు పంటిపైనే అంటిపెట్టుకునే ఉంటాయి. దాంతో పళ్ల ఎనామిల్ ΄పొర దెబ్బతినే అవకాశాల తోపాటు, పళ్లలో రంధ్రాలు (క్యావిటీలు) వచ్చే అవకాశాలెక్కువ. ఫలితంగా పిప్పిపళ్లు వస్తాయి. అలా దంతాలు దెబ్బతింటాయి.ఈ సమస్య అధిగమించడానికి...చాక్లెట్లు తిన్న తర్వాత ఆ జిగురంతా పోయేలా వేలితో లేదా టూత్ బ్రష్‌తో తేలిగ్గా బ్రష్ చేసుకోవాలి. నోరు పూర్తిగా శుభ్రమయ్యేలా పలుమార్లు నీళ్లతో పుక్కిలించాలి. (చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?) -
బ్రష్ మార్చి ఎంతకాలం అయ్యింది..?
మనలో చాలామంది టూత్‌బ్రష్‌ను ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. మరీ ఏళ్లు కాకపోయినా బ్రిజిల్స్ అంటే మనం పళ్లు తోముకునే భాగం బాగుంటే కనక కనీసం ఏడాదికి తగ్గకుండా వాడతారు. అయితే టూత్‌బ్రష్‌ను అంతకాలం పాటు వాడటం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు.టూత్‌బ్రష్‌ను ఇంతకాలం లోపు మార్చాలనే విషయంలో నిర్దిష్టమైన మార్గదర్శకం అంటూ ఏమీ లేకపోయినప్పటికీ మూడు నాలుగు నెలలకోసారి మార్చడం మంచిదంటున్నారు వైద్యులు. అదేవిధంగా బ్రిజిల్స్ వంగి΄ోయినప్పుడు, లేదా కొన్ని బ్రిజిల్స్ ఊడిపోయినప్పుడు... ఊడుతున్నట్లుగా ఉన్నప్పుడు వెంటనే బ్రష్ మార్చడం మంచిది. బ్రష్‌ను, టంగ్క్లీనర్ను బాత్రూమ్లో కాకుండా బయట ఎక్కడైనా పెట్టుకోవాలి. మరో ముఖ్యవిషయం... ఏదైనా జబ్బు పడి కోలుకున్న తర్వాత అప్పటివరకు వాడుతున్న బ్రష్ కొత్తదైనా సరే, దానిని పారేసి, కొత్త బ్రష్ కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే జబ్బుపడ్డప్పుడు ... అంటే వైరల్ ఫీవర్స్, డెండ్యూ, మలేరియా, టైఫాయిడ్... మరీ ముఖ్యంగా దంత వ్యాధులతో బాధపడుతున్ననప్పుడు తప్పనిసరిగా బ్రష్ మార్చడం అవసరం. ఇంటిల్లిపాదీ ఒకే బాక్స్‌లో బ్రష్‌లు పెట్టుకోవడం సాధారణం.. అటువంటప్పుడు రోజూ బ్రష్ చేసుకునేముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.(చదవండి: స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!) -
బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
సుష్టిగా భోంచేసినపుడో, కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడో మనకు వెంటనే గుర్తు వచ్చేది సోడా. సోడా తాగిన బ్రేవ్ మని త్రేన్పు వచ్చి రిలాక్స్ అనిపిస్తుంది చాలామందికి కదా. కానీ అప్పుడపుడు సోడా వాటర్ తాగితే పరవాలేదు. కానీ ఇది ఒక అలవాటుగా మారిపోతే మాత్రం ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు. సోడా తాగితే తప్ప తిన్నది అరగదు అన్న భావనతోపాటు, మార్కెట్లో రకరకాల ఫ్లావర్లలో ఆకర్షిస్తుంటాయి. కానీ సోడా రోజూ తీసుకుంటే ప్రమాదంలో పడినట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.సోడాతో ముప్పురోజూ సోడా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ మూత్రపిండ వ్యాధి, కాలేయ వ్యాధి, దంత క్షయం, కావిటీస్, గౌట్తోపాటు శరీరంలోని ఎముకలు కూడా బలహీనపడతాయి. ఇంకా శరీరానికి తీవ్రమైన హానికలుగుతుంది. లాలాజలం, దంత సమస్యలు: సోడాలోని చక్కెర, యాసిడ్ చిగుర్లను, దంతాలను దెబ్బతీస్తుంది.నోటి పరిశుభ్రతను పలు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సోడా తాగడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోతుంది. లాలాజలం నోటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నోటిలోని ఆమ్లాలను, ఆహార కణాలు , బ్యాక్టీరియాను కడిగివేయడానికి సహాయ పడుతుంది. సోడాతో లాలాజలం తగ్గి, చిగుళ్ల వ్యాధికి దారి తీస్తుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.సోడా చాలా కార్బోనేటేడ్గా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పొట్టలో పుండ్లు, పుండ్లు, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారికి ఇది ప్రమాదంకరం. అలాగే ఆస్తమా ఉంటే సోడాకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆస్తమాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెంజోయేట్ ఆస్తమాను ప్రేరేపిస్తుంది. దాని వల్ల సమస్యలు మరిన్ని పెరుగుతాయి.ఎముకలు బలహీనంసోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగిస్తుంది. దీంతో రోజూ సోడా తాగే వారి ఎముకలు బలహీనమవుతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం: కొంతమంది ఆరోగ్య స్పృహతో డైట్ సోడా తాగడానికి ఇష్టపడతారు. అది తమ ఆరోగ్యానికి మంచిదని వారు భావిస్తారు. కానీ.. డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వాడటం వల్ల స్థూలకాయానికి గురవుతారు. అంతే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడవచ్చు. మెటబాలిక్ సిండ్రోరమ్ దెబ్బతిని షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలను 67 శాతం పెంచుతుంది.చర్మంపై దురదలుసోడాలో బ్రామినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుపుతారు. ఈ కెమికల్ కారణంగా చర్మంపై దురదలు రావచ్చే. నరాల బలహీనత కూడా వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బుల ప్రమాదం: రోజూ సోడా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడవచ్చు.అలాగే గుండెలోని ధమనులను దెబ్బతీస్తాయి. సోడాలోని ఫాస్పేట్స్, ఫాస్పారిక్ యాసిడ్ వల్ల తొందరగా వృద్ధాప్యం వచ్చే ప్రమాదం ఉంది.షుగర్వ్యాధి: దీని వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.సోడా తాగడం, ట్రైగ్లిజరైడ్స్ 30 శాతం పెరుగుతాయి. మంచి (HDL) కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. మెదడుకు చేటు: డైట్ సోడాల్లో తక్కువ కేలరీలు ఉన్నప్పటికీ, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను కూడా దెబ్బతీస్తాయి. -
నోరు తెరిస్తే దుర్వాసన! తౌడు నానబెట్టిన నీటిలో వీటిని కలిపి తాగితే..
Oral Health Tips In Telugu- Bad Breath: ఉదయమే చక్కగా బ్రష్ చేసుకున్నారు. అయినా మధ్యాహ్నం నుంచి నోరు తెరిస్తే చాలు.. దుర్వాసన అని తెలిసిపోతోంది. ఎందుకిలా? బ్రష్ చేసిన తర్వాత కూడా వచ్చే నోటి దుర్వాసనకు కారణం ఏమిటి? దుర్వాసన అనేది చిగుళ్ళ వ్యాధి వంటి పెద్ద దంత సమస్య యొక్క లక్షణం కావొచ్చు. ఇది దంతాలపై ఫలకాన్ని (plaque) తయారు కావడం వల్ల సంభవిస్తుంది. చికిత్స చేయకపోతే, చిగుళ్ళ వ్యాధి దుర్వాసన మరియు దవడ ఎముక దెబ్బతినడం వంటి సమస్యలను సృష్టిస్తుంది. హేలిటోసిస్ అంటే నోటిలో నుంచి దుర్వాసన రావడం. దీనినే దుర్వాసన లేదా బ్యాడ్ బ్రీత్ అని కూడా అంటారు. దీనికి కారణాలు ప్రధానంగా.. 1. ఆహారం- మీ దంతాలలో మరియు చుట్టుపక్కల ఉన్న ఆహార కణాల విచ్ఛిన్నం బ్యాక్టీరియాను పెంచుతుంది మరియు దుర్వాసన కలిగిస్తుంది. 2. పొగాకు ఉత్పత్తులు. ధూమపానం అత్యంత అసహ్యకరమైన నోటి వాసనకు కారణమవుతుంది. 3. పేలవమైన దంత పరిశుభ్రత, అంటే సరిగా బ్రష్ చేసుకోకపోవడం నోటి దుర్వాసన ఇంకా ఏవైనా అనారోగ్యాలకు సంకేతమా? నోటి దుర్వాసన ఇతర వ్యాధులు లేదా అనారోగ్యాలు ఉన్నాయన్న దానికి హెచ్చరిక సంకేతం కూడా కావచ్చు. శ్వాసకోశ మరియు టాన్సిల్ ఇన్ఫెక్షన్లు, సైనస్ సమస్యలు, డయాబెటిస్, కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలు, అలాగే కొన్ని రక్త రుగ్మతలలో నోటి దుర్వాసన ఒక సాధారణ లక్షణంగా ఉంటుంది. మనం నోరు బాగా శుభ్రం చేసుకొన్నా దుర్వాసన వస్తోందంటే ఒక సారి డెంటిస్ట్‌ను కలవడం మంచిది. నోటిపూత సాధారణంగా నోటిపూత బి(B) విటమిన్ లోపం వలన వస్తుంది. నివారణకు ముందు రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తౌడుని వేసి తెల్లారి పరగడుపున ఆ నీటిని వడగట్టి అందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ఓ 15 రోజుల పాటు తీసుకోవాలి. తౌడులో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇక పొట్టలో అల్సర్ వంటివి ఉన్నా నోటిపూత వస్తుంది. ఆహారంలో మసాలాలు లేకుండా, తక్కువ ఆయిల్ తో వండుకొని తినాలి. పండ్లు, కూరగాయలు, జ్యూస్‌లు, తీసుకోవాలి. అలాగే నీరు బాగా త్రాగాలి. -డాక్టర్ నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు చదవండి: Skin Cancer: ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు ఉన్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. Essential Bath Rules: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు!