సుష్టిగా భోంచేసినపుడో, కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడో మనకు వెంటనే గుర్తు వచ్చేది సోడా. సోడా తాగిన బ్రేవ్ మని త్రేన్పు వచ్చి రిలాక్స్ అనిపిస్తుంది చాలామందికి కదా. కానీ అప్పుడపుడు సోడా వాటర్ తాగితే పరవాలేదు. కానీ ఇది ఒక అలవాటుగా మారిపోతే మాత్రం ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు.
సోడా తాగితే తప్ప తిన్నది అరగదు అన్న భావనతోపాటు, మార్కెట్లో రకరకాల ఫ్లావర్లలో ఆకర్షిస్తుంటాయి. కానీ సోడా రోజూ తీసుకుంటే ప్రమాదంలో పడినట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోడాతో ముప్పు
రోజూ సోడా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ మూత్రపిండ వ్యాధి, కాలేయ వ్యాధి, దంత క్షయం, కావిటీస్, గౌట్‌తోపాటు శరీరంలోని ఎముకలు కూడా బలహీనపడతాయి. ఇంకా శరీరానికి తీవ్రమైన హానికలుగుతుంది.
లాలాజలం, దంత సమస్యలు: సోడాలోని చక్కెర, యాసిడ్ చిగుర్లను, దంతాలను దెబ్బతీస్తుంది.నోటి పరిశుభ్రతను పలు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సోడా తాగడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోతుంది. లాలాజలం నోటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నోటిలోని ఆమ్లాలను, ఆహార కణాలు , బ్యాక్టీరియాను కడిగివేయడానికి సహాయ పడుతుంది. సోడాతో లాలాజలం తగ్గి, చిగుళ్ల వ్యాధికి దారి తీస్తుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
సోడా చాలా కార్బోనేటేడ్‌గా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పొట్టలో పుండ్లు, పుండ్లు, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారికి ఇది ప్రమాదంకరం. అలాగే ఆస్తమా ఉంటే సోడాకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆస్తమాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెంజోయేట్ ఆస్తమాను ప్రేరేపిస్తుంది. దాని వల్ల సమస్యలు మరిన్ని పెరుగుతాయి.
ఎముకలు బలహీనం
సోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగిస్తుంది. దీంతో రోజూ సోడా తాగే వారి ఎముకలు బలహీనమవుతాయి.
క్యాన్సర్ వచ్చే ప్రమాదం: కొంతమంది ఆరోగ్య స్పృహతో డైట్ సోడా తాగడానికి ఇష్టపడతారు. అది తమ ఆరోగ్యానికి మంచిదని వారు భావిస్తారు. కానీ.. డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వాడటం వల్ల స్థూలకాయానికి గురవుతారు. అంతే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడవచ్చు. మెటబాలిక్ సిండ్రోరమ్ దెబ్బతిని షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలను 67 శాతం పెంచుతుంది.
చర్మంపై దురదలు
సోడాలో బ్రామినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుపుతారు. ఈ కెమికల్ కారణంగా చర్మంపై దురదలు రావచ్చే. నరాల బలహీనత కూడా వచ్చే అవకాశం ఉంది.
గుండె జబ్బుల ప్రమాదం: రోజూ సోడా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడవచ్చు.అలాగే గుండెలోని ధమనులను దెబ్బతీస్తాయి. సోడాలోని ఫాస్పేట్స్, ఫాస్పారిక్ యాసిడ్ వల్ల తొందరగా వృద్ధాప్యం వచ్చే ప్రమాదం ఉంది.
షుగర్‌వ్యాధి: దీని వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.సోడా తాగడం, ట్రైగ్లిజరైడ్స్ 30 శాతం పెరుగుతాయి. మంచి (HDL) కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు.
మెదడుకు చేటు: డైట్ సోడాల్లో తక్కువ కేలరీలు ఉన్నప్పటికీ, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను కూడా దెబ్బతీస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment