heart desease
-
బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
సుష్టిగా భోంచేసినపుడో, కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడో మనకు వెంటనే గుర్తు వచ్చేది సోడా. సోడా తాగిన బ్రేవ్ మని త్రేన్పు వచ్చి రిలాక్స్ అనిపిస్తుంది చాలామందికి కదా. కానీ అప్పుడపుడు సోడా వాటర్ తాగితే పరవాలేదు. కానీ ఇది ఒక అలవాటుగా మారిపోతే మాత్రం ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు. సోడా తాగితే తప్ప తిన్నది అరగదు అన్న భావనతోపాటు, మార్కెట్లో రకరకాల ఫ్లావర్లలో ఆకర్షిస్తుంటాయి. కానీ సోడా రోజూ తీసుకుంటే ప్రమాదంలో పడినట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.సోడాతో ముప్పురోజూ సోడా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ మూత్రపిండ వ్యాధి, కాలేయ వ్యాధి, దంత క్షయం, కావిటీస్, గౌట్తోపాటు శరీరంలోని ఎముకలు కూడా బలహీనపడతాయి. ఇంకా శరీరానికి తీవ్రమైన హానికలుగుతుంది. లాలాజలం, దంత సమస్యలు: సోడాలోని చక్కెర, యాసిడ్ చిగుర్లను, దంతాలను దెబ్బతీస్తుంది.నోటి పరిశుభ్రతను పలు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సోడా తాగడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోతుంది. లాలాజలం నోటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నోటిలోని ఆమ్లాలను, ఆహార కణాలు , బ్యాక్టీరియాను కడిగివేయడానికి సహాయ పడుతుంది. సోడాతో లాలాజలం తగ్గి, చిగుళ్ల వ్యాధికి దారి తీస్తుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.సోడా చాలా కార్బోనేటేడ్గా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పొట్టలో పుండ్లు, పుండ్లు, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారికి ఇది ప్రమాదంకరం. అలాగే ఆస్తమా ఉంటే సోడాకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆస్తమాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెంజోయేట్ ఆస్తమాను ప్రేరేపిస్తుంది. దాని వల్ల సమస్యలు మరిన్ని పెరుగుతాయి.ఎముకలు బలహీనంసోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగిస్తుంది. దీంతో రోజూ సోడా తాగే వారి ఎముకలు బలహీనమవుతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం: కొంతమంది ఆరోగ్య స్పృహతో డైట్ సోడా తాగడానికి ఇష్టపడతారు. అది తమ ఆరోగ్యానికి మంచిదని వారు భావిస్తారు. కానీ.. డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వాడటం వల్ల స్థూలకాయానికి గురవుతారు. అంతే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడవచ్చు. మెటబాలిక్ సిండ్రోరమ్ దెబ్బతిని షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలను 67 శాతం పెంచుతుంది.చర్మంపై దురదలుసోడాలో బ్రామినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుపుతారు. ఈ కెమికల్ కారణంగా చర్మంపై దురదలు రావచ్చే. నరాల బలహీనత కూడా వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బుల ప్రమాదం: రోజూ సోడా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడవచ్చు.అలాగే గుండెలోని ధమనులను దెబ్బతీస్తాయి. సోడాలోని ఫాస్పేట్స్, ఫాస్పారిక్ యాసిడ్ వల్ల తొందరగా వృద్ధాప్యం వచ్చే ప్రమాదం ఉంది.షుగర్వ్యాధి: దీని వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.సోడా తాగడం, ట్రైగ్లిజరైడ్స్ 30 శాతం పెరుగుతాయి. మంచి (HDL) కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. మెదడుకు చేటు: డైట్ సోడాల్లో తక్కువ కేలరీలు ఉన్నప్పటికీ, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను కూడా దెబ్బతీస్తాయి. -
పెంచలయ్యా..ఎంత కష్టమయ్యా
తల్లి దివ్యాంగురాలు..తండ్రి కుటుంబాన్ని వదిలేయడం..పిన్నవయస్సులోనే తోబుట్టువు అకాల మరణం..ఆ సరస్వతీ పుత్రుడి హృదయాన్ని కలిచివేశాయి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ భారాన్ని మోసేందుకు ఇష్టమైన చదువును వదిలేయాల్సి వచ్చింది. వడ్రంగి పనులకు వెళ్తూ తల్లిని పోషించుకుంటున్న తరుణంలో విధి పగబట్టింది. హృద్రోగం రూపంలో కష్టాల పాల్జేసింది. వైద్యులు రూ.40లక్షలు ఖర్చు చేసి గుండెను మార్చాల్సిందేనని తేల్చ డంతో ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నాడు. వైద్యం కోసం సాయం అందించి ఆదుకోవాలని దాతలను వేడుకుంటున్నాడు మట్టెంపాడుకు చెందిన దాసరి పెంచలయ్య. నెల్లూరు రూరల్ : రూరల్ మండలం మట్టెంపాడుకు చెందిన దాసరి రామమోహన్, విజయమ్మ దంపతులు. విజయమ్మకు చిన్నవయస్సులో జరిగిన ప్రమాదంలో వైద్యులు ఒక కాలును పూర్తిగా తొలగించారు. 85శాతం దివ్యాంగురాలైన ఆమెది ఏ పని చేయలేని పరిస్థితి. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. తొలి సంతానం కుమార్తె కాగా. రెండో సంతానం దాసరి పెంచలయ్య. పెంచలయ్య పదిహేనో ఏటా తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తోబుట్టువును విధి ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోయింది. దీంతో కుటుంబం కష్టాల పాలైంది. తల్లిని పోషించుకునేందుకు చదువు నిలిపివేత చదువులో ముందుండే పెంచలయ్య నెల్లూరులో బీఎస్సీ కంప్యూటర్సు చదువుతుండగా కుటుంబం చిక్కుల్లో పడింది. ఏ పని చేయలేని తల్లి విజయమ్మకు కుమారుడే దిక్కు అయ్యాడు. తల్లిని, తనను పోషించుకోవాలంటే కూలీ పనికి వెళ్లక తప్పదని గ్రహించాడు. వెంటనే చదువును అర్ధాంతరంగా నిలిపేసి వడ్రంగి వద్ద కూలీగా చేరాడు. ఉడ్‌వర్క్ పాలిష్‌లో మంచి నైపుణ్యాన్ని సాధిం చాడు. ఉన్నంతలోనే తల్లిని ఏ లోటు లేకుండా పోషించుకుంటూ ఆనందంగా గడపసాగాడు. పెళ్లి చేద్దామనుకునేలోగా గుండెజబ్బు తల్లి, బంధువులు పెంచలయ్యకు పెళ్లి చేయాలనుకున్నారు. ఈ తరుణంలో సుమారు 8 నెలల క్రితం పనికెళ్లగా ఆయాసం రాసాగింది. శ్రమతో ఆయాసం వస్తుందని నెల రోజులు నెట్టుకొచ్చాడు. ఈ లోగా తలనొప్పి, జ్వరం రాసాగడంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా గుండె జబ్బు అని వైద్యులు తెలిపారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి వెళ్లగా గుండె జబ్బు తీవ్రంగా ఉందని, బతకడమే కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో దివ్యాంగురాలైన తల్లి విజయమ్మతో పాటు బిడ్డ పెంచలయ్య కుమిలి కుమిలి ఏడ్చారు. ప్రాణాలు మీద ఆశ వదులుకుంటున్న తరుణంలో కృపమ్మ అనే ఉద్యోగి ఇతర మిత్రుల సహకారంతో చెన్నైలోని విజయ ఆస్పత్రికి తీసుకెళ్లగా, గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలని చెప్పారు. గుండె జబ్బుతో పెంచలయ్య ఎక్కువగా తిండి తినేందుకు, నీరు తాగేందుకు వీలు లేకుండాపోయింది. రోజుకు 150 గ్రాముల భోజనం చేయాలి. 800 మిల్లీలీటర్ల నీటిని తాగాలి. ఒక చేతి ముద్ద ఎక్కువ తిన్నా ఆయాసం వస్తుండడంతో అల్లాడిపోతున్నాడు. ఆపరేషన్‌కు రూ.40లక్షల ఖర్చు మే 2న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో పెంచలయ్యకు అన్ని పరీక్షలు చేయించారు. గుండె మార్పిడి స్పెషలిస్టు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే పరీక్షించి కెడావర్ డోనార్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ ద్వారా గుండె మార్పిడి చేయాలని తెలిపారు. అపోలోలో ఆపరేషన్ చేయించుకుంటే రూ.40లక్షలు ఖర్చు అవుతుందని, గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చేయించుకుంటే రూ.27లక్షలు అవుతుందని చెప్పారు. ఆపరేషన్ తరువాత సంవత్సరం పాటు ఖరీదైన మందులు వాడాలని తెలిపారు. ఈ రెండు చోట్ల కెడావర్ డోనార్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం పెంచలయ్య తన పేరును రిజిష్టర్ చేయించుకున్నారు. దాతల సాయం కోసం వేడుకోలు రెక్కల కష్టంతో దివ్యాంగురాలైన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పెంచలయ్య తన గుండె ఆపరేషన్ కోసం దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. తనకు సాయం అందించి ప్రాణాలను కాపాడితే బ్రతికినంత కాలం రుణపడి ఉంటానని దాతలను వేడుకుంటున్నాడు. మనస్సును మా రాజులు 97038 80413 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..?
లండన్: మందుబాబులు..మీరు వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..? అయితే ఇక మీ జీవితంలో రెండు ఏళ్ల ఆయుషు తగ్గిపోయినట్లేనని అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్సీటీ పరిశోధకులు. ఇటీవలే వారు మద్యంపై వైద్య పరంగా ఓ విస్తృతమైన పరిశోధన చేశారు. వారి అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తి వారానికి పది లేదా అంత కంటే ఎక్కువ గ్లాసుల వైన్‌ను సేవిస్తే రెండేళ్ల ఆయుషు తగ్గుతుందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధన కోసం19 దేశాలకు చెందిన దాదాపు ఆరు లక్షల మందిని పరిశీలించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 40 ఏళ్ల ఓ వ్యక్తి వారానికి 5 పెగ్గుల మద్యాన్ని సేవిస్తే తన జీవిత కాలంలో ఆరు నెలలు నష్టపోతాడని, 10 గ్లాసుల వైన్ తాగితే రెండేళ్లు, 18 గ్లాసులు తాగితే ఐదేళ్ల ఆయుషును కోల్పోతారని యూనివర్సీటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సీటీ శాస్త్రవేత్త డాక్టర్ ఎంజెలా వుడ్ మాట్లాడుతూ..ఇప్పటికే మద్యం సేవించేవారు తాగడం తగ్గించాలని లేదంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మితిమీరిన మద్యం తాగడం వల్ల లివర్ క్యాన్సర్, రక్త పోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి మద్యం సేవించడం వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. -
ఆ యాంటీబయాటిక్‌తో గుండెకు ముప్పు
న్యూయార్క్ : యాంటీబయాటిక్స్ వాడకంపై భిన్న వాదనలు వినిపిస్తున్న క్రమంలో తాజాగా ఓ యాంటీబయాటిక్పై పదేళ్ల పాటు జరిపిన అథ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. బయాక్సిన్ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న క్లారిత్రోమైసిన్ హృద్రోగంతో బాధపడే రోగులకు పెనుముప్పుగా పరిణమించిందని తేలింది. ఇన్ఫెక్షన్ల చికిత్సకు వైద్యులు ఈ యాంటీబయాటిక్‌ను సహజంగా రిఫర్ చేస్తుంటారు. ఈ మందును వాడిన కొన్ని సంవత్సరాల తర్వాత సైతం హృద్రోగులకు ప్రాణాపాయం ముంచుకొస్తుందని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. హృద్రోగాలతో బాధపడతే వారు ఈ డ్రగ్‌ను రెండు వారాల కోర్సుగా తీసుకున్న క్రమంలో ఏడాది లేదా తర్వాతి కాలంలో గుండె పోటు లేదా హఠాన్మరణానికి గురైనట్టు పదేళ్ల పాటు నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. 2005లోనే క్లారిత్రోమైసిన్ దుష్పరిణామాలపై ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ఇక గుండె సమస్యలతో బాధపడే రోగులకు ఈ మందు చేసే మేలు కంటే కీడే అధికమని ఎఫ్‌డీఏ గుర్తించింది. ఈ డ్రగ్ కారణంగా గుండె వేగంగా కొట్టుకుంటుందని, గుండెపోటు, ఆకస్మిక మరణానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. -
వ్యాధులను ఇట్టే పట్టేస్తుంది
లండన్ : గుండె జబ్బులు, లంగ్ క్యాన్సర్‌ను ముందే పసిగట్టే నూతన కృత్రిమ మేథ (ఏఐ) వ్యవస్థను బ్రిటన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.గుండె జబ్బులకు సంబంధించి ప్రస్తుతం కార్డియాలజిస్టులు స్కానింగ్‌ల్లో హార్ట్‌బీట్ ఆధారంగా సమస్యలను గుర్తిస్తున్న క్రమంలో చేయితిరిగిన వైద్యులు సైతం కొన్ని సందర్భాల్లో పొరపడుతున్న ఉదంతాలున్నాయి. సంప్రదాయ పద్ధతులతో రోగులను ఇంటికి పంపిన తర్వాత హార్ట్ ఎటాక్‌కు లోనవడం లేదా అనవసర ఆపరేషన్లు చోటుచేసుకుంటున్నాయి.హార్ట్ స్కాన్లను మెరుగ్గా డయాగ్నైజ్ చేయగల నూతన ఏఐ వ్యవస్థను బ్రిటన్‌కు చెందిన జాన్ రాడ్క్లైఫ్ ఆస్పత్రి అభివృద్ధి చేసింది. హార్ట్ స్కాన్‌లో వైద్యులు చూడలేని వివరాలను సైతం ఈ వ్యవస్థ ఇట్టే పసిగడుతుంది. రోగి హార్ట్ ఎటాక్‌కు లోనయ్యే అవకాశం ఉంటే సిస్టమ్ పాజిటివ్ సిఫార్సును పంపుతుంది. ఈ సిస్టమ్‌ను ఆరు కార్డియాలజీ యూనిట్లలో క్లినికల్ ట్రయల్స్‌లో పరీక్షించారు. ఈ పద్ధతి ద్వారా డేటా విశ్లేషణ హార్ట్ స్పెషలిస్ట్‌ల కన్నా అత్యంత మెరుగ్గా ఉందని దీన్ని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ పాల్ లీసన్ చెప్పారు.అల్ట్రామిక్స్గా పిలిచే ఈ సిస్టమ్ సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు. ఇక బ్రిటన్‌లో ఓ స్టార్టప్ లంగ్ క్యాన్సర్‌ను పసిగట్టే మరో ఏఐ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఈ సిస్టమ్ ద్వారా లంగ్ క్యాన్సర్‌ను అత్యంత ప్రాధమిక దశలోనే గుర్తిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. -
రేపు గుండెజబ్బుల వైద్య శిబిరం
– ఇంగ్లాండ్‌కు చెందిన 11 మంది వైద్య బృందం రాక – స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యాన ఆత్కూరులో – మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి విజయవాడ(లబ్బీపేట) : స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యాన ఆంధ్రా హాస్పటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ సహకారంతో ఈ నెల 7న ఆదివారం ఆత్కూరులో మెగా గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఈ శిబిరంలో పుట్టుకతో గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పెద్దలకు వైద్యపరీక్షలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సూర్యారావుపేటలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ ఇంగ్లాండుకు చెందిన 11 మంది పిల్లల గుండెజబ్బుల వైద్య బృందంతోపాటు, ఆంధ్రా హాస్పటల్స్ వైద్యులు ఈ వైద్య శిబిరంలో సేవలు అందిస్తారని తెలిపారు. గుండె జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలు, ఎకో కార్డియోగ్రామ్, రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహించడంతోపాటు, శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఇంగ్లాండు వైద్య బృందం ఉచితంగా చేస్తుందన్నారు. ఈ శిబిరాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. 8 నుంచి 12 వరకు ఆంధ్రా హాస్పటల్లో ఉచిత గుండె శస్త్ర చికిత్సలు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో చిన్నపిల్లలకు ఇంగ్లాండు వైద్య బృందంతో ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా హాస్పటల్స్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ పీవీ రమణమూర్తి చెప్పారు. ఈ సమావేశంలో ఆస్పత్రి పీడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ యలమంచిలి రాజారావు, కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్ పాల్గొన్నారు.