లండన్ : గుండె జబ్బులు, లంగ్ క్యాన్సర్‌ను ముందే పసిగట్టే నూతన కృత్రిమ మేథ (ఏఐ) వ్యవస్థను బ్రిటన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.గుండె జబ్బులకు సంబంధించి ప్రస్తుతం కార్డియాలజిస్టులు స్కానింగ్‌ల్లో హార్ట్‌బీట్ ఆధారంగా సమస్యలను గుర్తిస్తున్న క్రమంలో చేయితిరిగిన వైద్యులు సైతం కొన్ని సందర్భాల్లో పొరపడుతున్న ఉదంతాలున్నాయి. సంప్రదాయ పద్ధతులతో రోగులను ఇంటికి పంపిన తర్వాత హార్ట్ ఎటాక్‌కు లోనవడం లేదా అనవసర ఆపరేషన్లు చోటుచేసుకుంటున్నాయి.హార్ట్ స్కాన్‌లను మెరుగ్గా డయాగ్నైజ్ చేయగల నూతన ఏఐ వ్యవస్థను బ్రిటన్‌కు చెందిన జాన్ రాడ్‌క్లైఫ్ ఆస్పత్రి అభివృద్ధి చేసింది.
హార్ట్ స్కాన్‌లో వైద్యులు చూడలేని వివరాలను సైతం ఈ వ్యవస్థ ఇట్టే పసిగడుతుంది. రోగి హార్ట్ ఎటాక్‌కు లోనయ్యే అవకాశం ఉంటే సిస్టమ్ పాజిటివ్ సిఫార్సును పంపుతుంది. ఈ సిస్టమ్‌ను ఆరు కార్డియాలజీ యూనిట్లలో క్లినికల్ ట్రయల్స్‌లో పరీక్షించారు. ఈ పద్ధతి ద్వారా డేటా విశ్లేషణ హార్ట్ స్పెషలిస్ట్‌ల కన్నా అత్యంత మెరుగ్గా ఉందని దీన్ని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ పాల్ లీసన్ చెప్పారు.అల్ట్రామిక్స్‌గా పిలిచే ఈ సిస్టమ్ సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు.
ఇక బ్రిటన్‌లో ఓ స్టార్టప్ లంగ్ క్యాన్సర్‌ను పసిగట్టే మరో ఏఐ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఈ సిస్టమ్ ద్వారా లంగ్ క్యాన్సర్‌ను అత్యంత ప్రాధమిక దశలోనే గుర్తిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment