క్యాన్సర్‌ని కనిపెట్టే డివైజ్‌.. అద్భుతం చేస్తోన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ | Ai-powered Derma sensorDevice Detection Skin Cancer | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ని కనిపెట్టే డివైజ్‌.. అద్భుతం చేస్తోన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

Published Sun, Feb 18 2024 9:22 AM | Last Updated on Sun, Feb 18 2024 9:24 AM

Ai-powered Derma sensorDevice Detection Skin Cancer - Sakshi

చూడటానికి మొబైల్‌ఫోన్‌లా కనిపించే ఈ పరికరం క్యాన్సర్‌ను కనిపెడుతుంది. అమెరికాలోని మ్యాకో కార్పొరేషన్‌ నిపుణులు ఈ పరికరాన్ని ‘డెర్మా సెన్సర్‌’ పేరుతో రూపొందించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ పరికరం మూడు రకాల స్కిన్‌ క్యాన్సర్లను కచ్చితంగా గుర్తించగలదు. 

మెలనోమా, బేసల్‌ సెల్‌ కార్సినోమా, స్క్వేమస్‌ సెల్‌ కార్సినోమా రకాల క్యాన్సర్లను గుర్తించడంలో ఈ పరికరం గ్రహించిన స్పెక్ట్రోస్కోపిక్‌ ఇమేజరీని ఇందులోని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆల్గరిథమ్‌ విశ్లేషించి, చర్మంపై తలెత్తిన మార్పులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.

జనరల్‌ ఫిజీషియన్లకు, డెర్మటాలజిస్టులకు ఉపయోగపడేలా ఈ పరికరాన్ని తీర్చిదిద్దారు. ఇది చర్మ క్యాన్సర్‌ చికిత్సను మరింత సులభతరం చేయగలదని నిపుణులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement