![Very interesting story about tooth brush; Check deets inside](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/TOOTHBRUSH-STORY.jpg.webp?itok=Xv-Em56N)
రోజూ పొద్దున లేచి, పళ్లు తోమిన తర్వాతే ఏదైనా తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు పళ్లు తోమడానికి బద్దకిస్తారు. తోమకుండానే ఉండి΄ోతారు. దీనివల్ల పళ్లు చెడిపోయి, దుర్వాసన వస్తుంది. కాబట్టి పళ్లు తోమడం తప్పనిసరి. పళ్లు తోమేందుకు బ్రష్ వాడతాం కదా, ఆ బ్రష్ చరిత్రేమిటో తెలుసా?
పళ్లు తోమేందుకు బ్రష్ కనిపెట్టకముందే ఆదిమానవులు పళ్లు శుభ్రం చేసుకునేందుకు రకరకాల వస్తువులు వాడేవారు. చెట్టు బెరడు, పక్షి రెక్కలు, జంతువుల ఎముకలతో పళ్లను శుభ్రం చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో పళ్లను తోమేందుకు చెట్ల కొమ్మల్ని వాడేవారు. అందులోనూ వేపపుల్లల్ని ఎక్కువగా వాడేవారు. వాటిని నమలుతూ పళ్లను శుభ్రంగా ఉంచుకునేవారు. ఒక వైపు తోమాక, మరో వైపుతో నాలుక శుభ్రం చేసుకునేవారు. ప్రపంచంలో అనేకచోట్ల చెట్ల కొమ్మల్నే పళ్లు శుభ్రం చేసుకునేందుకు వాడినట్లు ఆధారాలున్నాయి. అయితే పుల్లలు వాడకుంటూ బొగ్గు, ముగ్గు, బూడిద, ఇతర పదార్థాలను ఉపయోగించి చేత్తోనే పళ్లు తోమే అలవాటు కూడా చాలామందికి ఉండేది.
ఇదీ చదవండి: టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!
ఆ తర్వాత తొలిసారి చైనాలో బ్రష్ కనిపెట్టారు. ఒక చేత్తో బ్రష్ చివర పట్టుకుంటే మరో వైపు ఉన్న బ్రిజిల్స్ పళ్ల మీద మదువుగా రుద్దుతూ శుభ్రం చేసేవి. ఆ బ్రిజిల్స్‌ని రకరకాల వస్తువులతో తయారుచేసేవారు. అయితే ఇది కొందరికే అందుబాటులో ఉండేది.1780లో యూకేలో మొదటిసారి విలియం అడ్డీస్ అనే వ్యక్తి జైల్లో ఉండగా, పళ్లను శుభ్రం చేసుకునేందుకు సొంతంగా బ్రష్ తయారుచేసుకున్నాడు. ఆయన బయటకు వచ్చాక వాటిని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అలా బ్రష్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆయన మరణించాక ఆయన కొడుకు ఆ పనిని కొనసాగించాడు. ఆ తర్వాత అనేక కంపెనీలు బ్రష్‌ల తయారీ మొదలుపెట్టాయి. ఇప్పుడు రకరకాల రూపాల్లో బ్రష్‌లు వస్తున్నాయి. చూశారా! ఇవాళ మనం వాడే బ్రష్‌ల వెనుక ఇంత చరిత్ర ఉంది.
Comments
Please login to add a commentAdd a comment