toothbrush
-
మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...!
Do You Know World's First Toothbrush Was Made By Pig Hair? మొదట పెరుగు తయారు చేసినప్పుడు తోడు ఎలా వచ్చింది..? విత్తనం ముందా, చెట్టు ముందా..? లాంటి అనుమానాలు మీ కెప్పుడైనా వచ్చాయా! అలాగే మనం రోజూ ఉదయానే పళ్లు తోమే బ్రష్ ఎలావచ్చింది.. ఎప్పుడు వచ్చింది? మొదట ఎవరు తయారు చేశారు, అది ఎలా ఉండేది? ఆ విశేషాలు తెలుసుకుందామా.. మన పూర్వులు వేపపుల్లలతో పళ్లు తోమేవారని అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పళ్లు తోముకోడానికి పుల్లలను వినియోగిస్తున్నారు కూడా! క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలకు ముందే టూత్ బ్రష్ వినియోగం ఉందట! ప్రస్తుతం వినియోగంలో ఉన్న బ్రష్‌ను మొదట వినియోగించింది మాత్రం చైనా దేశం. 600 యేళ్లకు ముందే మన ప్రపంచానికి బ్రష్‌లను పరిచయం చేసింది ఈ దేశమే. చదవండి: Viral: 460 కోట్ల యేళ్లనాటి అరుదైన ఉల్క.. బంగారం కంటే ఎన్నో రెట్లు విలువైనది!! జూన్ 26, 1498న మొదటిసారిగా ఒక చైనీస్ రాజు టూత్ బ్రష్‌పై పేటెంట్ పొందాడు. ప్రపంచంలో మొట్టమొదటి టూత్ బ్రష్‌ను పంది వెంట్రుకలతో తయారు చేశారట. ఈ టూత్ బ్రష్‌పై ఉండే బ్రస్సెల్స్ చాలా గట్టిగా ఉండేవి. వీటిని పందుల మెడ వెనుక ఉండే మందపాటి జుట్టుతో తయారు చేయబడ్డాయి. ఈ వెంట్రుకలను వెదురు కర్రకు కట్టి టూత్ బ్రష్ లు తయారు చేశారు. 20వ శతాబ్ధం వరకు ఈ బ్రష్‌లను యూరప్, ఇంగ్లాండ్ దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకునేవి. 1780లో ఇంగ్లాండ్‌కు చెందిన విలియమ్ ఈడిస్ అనే ఖైదీ కనుగొనేంతవరకూ ఈ బ్రష్‌లనే వాడేవారు. ఆ కాలంలో విలియమ్ కూడా పంది వెంట్రుకలతోనే టూత్ బ్రష్‌ను తయారు చేసేవాడట. జైలు నుండి విడుదలయ్యాక 'విజ్డమ్ టూత్ బ్రష్' అనే కంపెనీని ప్రారంభించి, ఇంగ్లాండ్‌లో టూత్ బ్రష్‌ల ఉత్పత్తిని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఏటా 70 మిలియన్ టూత్ బ్రష్‌లు తయారు చేయబడుతున్నాయి. 1950లో డుపాంట్ డె నెమోర్స్ అనే వ్యక్తి నైలన్ బ్రిస్టల్ టూత్ బ్రష్‌లను ప్రపంచానికి పరిచయం చేశాడు. నవంబర్ 7, 1857లో హెచ్ఎన్ వడ్స్‌వర్త్ అనే వ్యక్తి టూత్ బ్రష్‌లపై పేటెంట్ పొందిన మొదటి అమెరికన్‌గా పేరుగాంచాడు. ఆ తర్వాత 1885లో అమెరికా దేశంలో పెద్ద ఎత్తున టూత్ బ్రష్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇలా వచ్చిందన్నమాట!! ప్రస్తుతం మనందరం వాడుతున్న టుత్ బ్రష్..! చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? -
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, ఇది ఎలా పనిచేస్తుందంటే
అందానికే అందం చిరునవ్వు. అది ఎల్లప్పుడూ అహ్లాదంగా ఉండాలంటే.. పెదవుల మధ్య తళతళలాడే పలువరుస ఉండాల్సిందే. గార, పిప్పి, పుచ్చు లాంటి పలు సమస్యలతో పాటు నోటి దుర్వాసన కూడా ఆ అందాన్ని కమ్మేస్తుందని బాధపడుతున్నారా? పరిష్కారం కోసం పేస్ట్‌లు, బ్రష్‌లు ఎన్ని మార్చినా.. ఫలితం కనిపించడం లేదని నిట్టూరుస్తున్నారా? అయితే చిత్రంలోని సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడాల్సిందే. ప్రత్యేకమైన ఇంటర్ డెంటల్ హెడ్ కలిగిన ఈ డివైజ్.. సుపీరియర్ సోనిక్ టెక్నాలజీతో పళ్లు, దంతాలను చాలా నీట్‌గా క్లీన్ చేస్తుంది. నిమిషానికి 40 వేల స్ట్రోక్‌లను ఉత్పత్తి చేస్తూ.. సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. ఈ మెషిన్‌తో పాటు ఐదు స్పెషల్ నైలాన్ డ్యుపోంట్ హెడ్స్ లభిస్తాయి. అవి దంతాల ఆకృతికి సరిపోయే విధంగా రూపొందించడంతో.. క్లీనింగ్ చాలా సులభమవుతుంది. వైటెనింగ్, క్లీనింగ్, సెన్సిటివ్, పాలిషింగ్, మసాజ్ అనే ఆప్షన్స్‌తో ఫైవ్ క్లీనింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. రోజుకు రెండు సార్లు దీన్ని ఉపయోగించడానికి కేవలం రెండు నిమిషాల సమయం చాలు. నాలుగు గంటల పాటు దీనికి చార్జింగ్ పెడితే.. సుమారు 25 రోజుల పాటు పని చేస్తుంది. ఆన్ చేసిన ప్రతి 30 సెకండ్లకు క్లీన్ చెయ్యాల్సిన ప్రదేశాన్ని మార్చమని అలర్ట్ చేస్తుంది. పైగా 2 నిమిషాల తర్వాత ఆపినా ఆపకపోయినా ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుంది. చివరిగా ఉపయోగించిన మోడ్‌ని గుర్తు చేస్తూ.. తిరిగి ఆన్ చేసినప్పుడు అదే మోడ్‌లో పని చేస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ టూల్ కావడంతో.. వినియోగించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. దీని ధర రూ. 15 వందలు. -
ఏకంగా టూత్ బ్రష్ మింగేసింది...అయితే
షిల్లాంగ్ : సాధారణంగా చిన్నపిల్లలు నాణేలు, చిన్న చిన్నమూతలు, ఒక్కోసారి పిన్నీసులు లాంటి మింగేయడం చూశాం. అయితే ఒక పెద్దావిడ (50) ఏకంగా టూత్ బ్రష్‌ను మింగేసింది. ఇదే వింతగా వుంటే.. వైద్యులు ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా చాకచక్యంగా బ్రష్‌ను బయటకు తీయడం విశేషంగా నిలిచింది. షిల్లాంగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లోయర్ మాప్రెమ్‌కు చెందిన మహిళ ఇటీవల పళ్లు తోముకుంటున్న సమయంలో ఒక్కసారిగా టూత్‌బ్రష్ మింగేసింది. అది నేరుగా ఆమె కడుపులోకి వెళ్లిపోయింది. అయినా ఆమెకు ఎలాంటి అరోగ్య సమస్యలు ఎదురు కాలేదు. కానీ అయితే వైద్యుడిని సంప్రదించాలని కూతురు బలవంతపెట్టడంతో..ఎట్టకేలకు మహిళ ఆసుపత్రికి వెళ్లక తప్పలేదు. అయితే ఆమెను పరిశీలించిన వైద్యులకు టూత్‌బ్రష్ ఒక్క పట్టాన కనబడలేదు. చివరికి ఎండోస్కోపీ ద్వారా బ్రష్‌ను కొనుగొన్న డాక్టర్లు తిరిగి నోటి ద్వారానే మింగేసిన బ్రష్‌కు బయటికు తీశారు. దీనిపై వైద్యుడు ఇసాక్ సయీమ్ మీడియాతో మాట్లాడుతూ...మొదట ఎక్స్‌రేలో ఆమె కడుపులో టూత్‌బ్రష్ కనపడలేదని, దీంతో తాము ఎండోస్కోపీ నిర్వహించి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నామని తెలిపారు. టూత్‌బ్రష్ ఉందని తెలుసుకుని మొదట తామంతా ఆశ్చర్యపోయామనీ షిల్లాంగ్‌లో ఇటువంటి చికిత్స అందించడం మొదటిసారని పేర్కొన్నారు. చికిత్స అనంతరం గంటన్నరకే ఆమెను డిశ్చార్జ్ చేశామన్నారు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారనీ, దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. అయితే బ్రష్‌ను తీసి ఉండకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు తలెత్తేవని చెప్పారు. -
టూత్‌బ్రష్ మింగేశాడు..
న్యూఢిల్లీ: గొంతును శుభ్రం చేసుకుంటున్న ఓ వ్యక్తి అనుకోకుండా టూత్‌బ్రష్‌ను మింగేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది జరిగిన రెండు రోజలు తరువాత ఆ వ్యక్తికి ఎండోస్కోపీ నిర్వహించిన ఏయిమ్స్ వైద్యులు 12 సెం.మీల పొడువున్న బ్రష్‌ను అతని పొత్తికడుపు పై భాగం నుంచి బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ సీమాపూరిలో నివాసం ఉంటున్న అవిద్ గతేడాది డిసెంబర్ 8వ తేదీన టూత్‌బ్రష్‌తో గొంతును బాగా శుభ్రం చేయాలని ప్రయత్నిస్తుండగా బ్రష్ గొంతు లోనికి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అవిద్ తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ ఓ ఆస్పత్రికి వెళ్లారు. అవిద్ అసలు విషయం చెప్పకపోవడంతో వైద్యులకు అతని కడుపు నొప్పికి గల కారణాలు తెలియలేదు. దీంతో వైద్యులు అతనికి సీటీ స్కాన్ నిర్వహించారు. అందులో అవిద్ కడుపులో ఏదో వస్తువు ఉన్నట్టు తెలింది. అప్పుడు అవిద్ వైద్యులకు అసలు విషయం చెప్పారు. బ్రష్‌ను బయటకు తీయడానికి ఆ ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి వైద్యులు అవిద్ సమస్యను ఏయిమ్స్‌కు రిఫర్ చేశారు. అవిద్కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఏయిమ్స్ వైద్యులు అతని ఉదరభాగంలో టూత్‌బ్రష్ చిక్కుకుని ఉందని.. అది గొంతు లోపలి ఇతర భాగాలకు ఎటువంటి హాని చేయలేదని తేల్చారు. డిసెంబర్ 10వ తేదీన అతని పొత్తికడుపు పైభాగంలో చిక్కుకున్న టూత్‌బ్రష్‌ను ఎండోస్కోపి చికిత్స ద్వారా బయటకు తీశారు. ఈ ఘటనపై ఎయిమ్స్ వైద్యులు ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. చాలా మంది గొంతును శుభ్రం చేసుకోవడానికి టూత్‌బ్రష్ వాడతారని.. కానీ అలా చేయడానికి టంగ్ క్లీనర్ వాడటం మంచిదని తెలిపారు. -
తోం తోం తోం
నిద్ర మత్తుతో లేచి బ్రష్ మీద కాస్త పేస్ట్ పూసి తోం తోం తోం అని తోమడం కాదు... పళ్లు చిగుర్ల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే రైట్ బ్రష్... కరెక్ట్ పేస్ట్... పర్ఫెక్ట్ టెక్నిక్ ఉండాలంతే! పళ్ల ప్రాబ్లమ్‌లు మిమ్మల్ని కొరుకుతూ ఉంటే ఈ చిట్కాలను ఒకసారి నెమరేయండి... పళ్లు నవ్వాలంటే చిగుర్లు బలంగా ఉండాలి!! పిల్లలకు డెంటల్ కేర్ అండ్ బ్రషింగ్ పసివయసు పిల్లలకు ప్రతిసారీ పాలుపట్టాక వాళ్ల నోటిని తడి గుడ్డతో గానీ, మామూలు నీళ్లలో ముంచిన దూదితో గానీ శుభ్రం చేయాలి. పాలపళ్లు వచ్చాక టూత్‌బ్రష్‌తో పళ్లు శుభ్రం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి. రెండేళ్ల వయసు కంటే ముందే ఫ్లోరైడ్ టూత్పేస్ట్వాడాలనుకుంటే మొదట డెంటిస్ట్‌ను కలిసి వారి సలహా తీసుకోవాలి. ∙పిల్లలు ఊయగలరు అనీ, టూత్‌పేస్ట్‌ను మింగరు అని నిర్ధారణ అయ్యాక వాళ్ల టూత్‌బ్రష్‌పై కాస్తంత టూత్‌పేస్ట్ వేసి వాళ్లు పళ్లు తోముకునేలా చేయాలి. ∙చిన్నారులకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులే బ్రష్ చేయడం మంచిది. పిల్లలు నిద్రపోవడానికి ముందే పాలుపట్టడం పూర్తిచేయండి. వాళ్లు నిద్రపోయాక బాటిల్‌ను అలాగే నోట్లో ఉంచవద్దు. ∙పిల్లల మొదటి పుట్టినరోజు నాటి నుంచే వాళ్లు కప్స్ సహాయంతో ఆహారాన్ని చప్పరించి తీసుకునేలా ప్రోత్సహించండి. ∙వారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అలవాటు చేయండి. ఆహారంలో ఆకుకూరలు, పళ్లు, కాయధాన్యాలు ఎక్కువగా తినేలా, ఆహారం తీసుకునేప్పుడు చక్కెర పదార్థాలు తక్కువగా తినేలా చూడండి. పిల్లలు ఉపయోగించే బ్రష్ మృదువైన బ్రిజిల్స్ ఉన్నదై ఉండాలి. ∙బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకునేలా చూడాలి. రఫ్‌గా బ్రష్ చేసుకోవడం పిల్లల చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవడం వారికి నేర్పాలి. ∙పిల్లలు అదేపనిగా బ్రష్‌ను నములుతూ ఉండకుండా చూసుకోవాలి. ఆ అలవాటును ప్రోత్సహించవద్దు. ∙బ్రష్ చేసుకునే ప్రక్రియ కనీసం రెండు నిమిషాల పాటు కొనసాగాలి. మరీ ఎక్కువ సేపు కూడా బ్రషింగ్ వద్దు. ∙నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకునేలా టంగ్‌క్లీనింగ్ పిల్లలకు నేర్పాలి. ∙చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ముందువైపు పళ్లకు పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకునేలా నేర్పాలి. వెనకవైపు పళ్లకు, బ్రష్‌ను గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్ చేసుకునేలా చూడాలి పిల్లలూ... పిప్పిపళ్లు పిల్లల్లో పాల పళ్ల దశలో బ్రషింగ్ సరిగా జరగకపోతే కీలకమైన పాలపళ్లు కాస్తా పిప్పిపళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో పాలపళ్లు చాలా ప్రధానమైనవి. ఆహారం నమలడానికి, మాట్లాడటానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ దంతాలు చాలా దోహదపడతాయి. పాలపళ్లు సరిగా ఉంటే భవిష్యత్తుల్లో శాశ్వత దంతాలు సక్రమంగా రావడానికి చాలా ఉపయోగకరం. సాధారణంగా ఆర్నెల్ల వయసులో వచ్చే పాలపళ్లు వచ్చినప్పటి నుంచీ అవి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. తీపిపదార్థాలు, చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువగా తాగడం, పిల్లలు ఏడ్వకుండా ఉండటానికి పాలపీకను నోట్లో ఉంచేయడం వంటి అలవాట్లతో పళ్లు పాడవుతాయి. పళ్లన్నీ పిప్పిపళ్లుగా మారితే– పాడైన వాటినన్నింటినీ తొలగించాల్సి రావచ్చు. అయితే త్వరగా డాక్టర్‌ను సంప్రదిస్తే వాటిని కాపాడుకోడానికీ అవకాశం ఉంది. అందుకే ఒక వయసు వచ్చాక పిల్లల బ్రషింగ్పై తల్లిదండ్రులు తప్పక శ్రద్ధ చూపాలి. అనేక రకాల టూత్పేస్ట్లు మనకు ఇవాళ రకరకాల టూత్పేస్ట్లు లభ్యమవుతున్నాయి. వాటిలో అనేక రకాల సౌలభ్యాలూ ఉన్నాయంటూ తయారీదారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. దాంతో మనకు ఎలాంటి టూత్‌పేస్ట్ కావాలనే దానిపై సందిగ్ధం నెలకొంటుంటుంది. అయితే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం ఒకటుంది. ప్రతివారికీ వేర్వేరు జీవనశైలి ఉంటుంది. కాబట్టి ఒకరికి అనువైన టూత్‌పేస్ట్ మరొకరికి అనువుగా ఉంటుందనే నియమం ఉండదు. కాబట్టి ప్రతివారూ తమ అవసరాల మేరకు తమ టూత్‌పేస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా మనకు అందుబాటులో ఉండి, ఎంచుకోదగ్గ టూత్పేస్ట్లు ఇవి... పిల్లల టూత్పేస్ట్లు : పిల్లల టూత్‌పేస్ట్‌లలో ఫ్లోరైడ్ పాళ్లు పెద్దవారి టూత్‌పేస్ట్ కంటే తక్కువగా ఉంటాయి. నిజానికి ఫ్లోరైడ్ పాళ్లు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటే అది చాలా హానికరం. అలాగే గారపోగొట్టేలా రుద్దగల శక్తి (అబ్రేసివ్గుణం) కూడా పిల్లల టూత్‌పేస్ట్‌లో చాలా తక్కువగా ఉండాలి. అలాగే వారి దంతాలు, చిగుర్లు సున్నితంగా ఉంటాయి కాబట్టి శక్తిమంతమైన రసాయనాలు లేని స్వాభావికమైన టూత్‌పేస్ట్‌లను డాక్టర్‌ను సంప్రదించి తీసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్లు : మనదేశంలో ఫ్లోరైడ్ పాళ్లు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉన్నందున ఫ్లోరైడ్‌తో కూడిన నీళ్ల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయిగానీ... నిజానికి తగిన పాళ్లలో ఉంటే ఫ్లోరైడ్ వల్ల దంతాల ఎనామెల్‌కు రక్షణ కలుగుతుంది. అలాగే దంతాన్ని దృఢంగానూ చేస్తుంది. కాబట్టి మనకు పుష్కలంగా ఫ్లోరైడ్ లభ్యత ఉన్నచోట్ల మినహాయించి తగినంత ఫ్లోరైడ్ లభ్యత లేని మిగతా ప్రాంతాల వారు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌లను వాడవచ్చు. దంతాలను తెల్లగా చేసేవి (టీత్ వైటెనింగ్ టూత్‌పేస్ట్స్) : దంతాలు కాస్త పసుపుపచ్చగా అనిపిస్తున్నవారు గారపొగొట్టేలా రుద్దగల శక్తి (అబ్రేసివ్ గుణం) ఉన్న టూత్‌పేస్ట్‌లను వాడటం మంచిది. అయితే అలాంటివి వాడేవారు కాస్తంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గారపోగొట్టే ‘యాంటీ స్టెయిన్స్’ టూత్‌పేస్ట్‌ను ఎక్కువ మోతాదులో ఉపయోగించడం వల్ల క్రమంగా పంటిపై ఉండే ఎనామెల్ కూడా దెబ్బతినవచ్చు. సున్నితమైన దంతాల కోసం వాడాల్సినవి (సెన్సిటివ్ టూత్‌పేస్ట్స్) : త్వరగా ప్రభావితం కాగల చాలా సున్నితమైన పళ్లు (సెన్సిటివ్ టీత్) ఉన్నవారు, చిన్న సమస్యకే చిగుర్ల నొప్పి వచ్చేవారు సెన్సిటివ్ టూత్ పేస్ట్‌లు వాడాలి. ఇలాంటివారు పొటాషియమ్ నైట్రేట్ ఉన్న టూత్‌పేస్ట్ వాడటం మంచిది. ఎందుకంటే ఆ రసాయనం నొప్పిని తెలిపే యంత్రాంగాన్ని కాసేపు నిద్రాణంగా ఉంచుతుంది. దాని వల్ల కాసేపు నొప్పి తెలియకుండా ఉంటుంది. హెర్బల్ టూత్పేస్ట్లు : నేచురల్ ఆరోగ్యప్రదాయిను లంటూ ఇటీవల స్వాభావికమైన మూలికలు, అటవీ ఉత్పాదనతో తయారు చేసే టూత్పేస్ట్లు ఎక్కువగా వస్తున్నాయి. సాధారణంగా కొందరికి రసాయనాలతో తయారైన టూత్పేస్ట్లు కొద్ది మొత్తంలో తీసుకున్నా వారికి సరిపడవు. అలాంటి వారు ఈ హెర్బల్ టూత్‌పేస్ట్‌లను వాడవచ్చు. అయితే ఈ టూత్‌పేస్ట్ లలో ఫ్లోరైడ్ ఉండదు కాబట్టి... ఫ్లోరైడ్ నీళ్లు దొరికే ప్రాంతాల వారు, ఫ్లోరైడ్ అవసరాలు లేనివారు వీటిని వాడవచ్చు. అయితే ఫ్లోరైడ్ ప్రాంతాల వారితో పాటు మిగతా ప్రాంతాలవారు కూడా ఒకసారి తమ దంతవైద్యుడిని సంప్రదించాకే ఈ హెర్బల్ టూత్పేస్ట్లు వాడటం మంచిది. గారను తొలగించే పేస్ట్‌లు (యాంటీ ప్లాక్ టూత్ పేస్ట్) : పళ్లపై పేరుకునే పాచికి ఒక లక్షణం ఉంటుంది. వెంటవెంటనే బ్రష్ చేసుకుంటే ఆ పాచి త్వరగా తొలగిపోతుంటుంది. కానీ బ్రష్ చేయడంలో అలసత్వం వహించినప్పుడు అది గార (ప్లాక్)గా ఏర్పడుతుంది. అలాంటి గారను దంతవైద్యుల సహాయంతో స్కేలింగ్ చేయించాలి. ఇప్పుడు ఈ గారను తొలగించేలా బలమైన, శక్తిమంతమైన యాంటీ ప్లాక్ టూత్పేస్ట్లు దొరుకుతున్నాయి. అయితే వాటిని అవసరమైన వారు కొద్దికాలం పాటు దాన్ని ఉపయోగించాక... గారతొలగిపోయాక మళ్లీ తమ సాధారణ టూత్‌పేస్ట్‌కు మళ్లడం మంచిది. పెద్దగా అవసరం లేకపోయినా అదే పనిగా ఈ యాంటీ ప్లాక్ టూత్పేస్ట్లు వాడటం వల్ల దంతాలు దెబ్బతినవచ్చు. చిగుర్లు గాయపడి మంట (ఇరిటేషన్) రావచ్చు. పైగా ఇవి చిగుర్లను గాయపరచడం వల్ల బ్యాక్టీరియా పేరుకునేందుకు తావిస్తాయి. దాంతో చిగుర్ల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే యాంటీ ప్లాక్ టూత్‌పేస్ట్‌లను దీర్ఘకాలం వాడటాన్ని నిపుణులు అంతగా సిఫార్సు చేయరు. సాధారణంగా మనకు లభ్యమయ్యే రకరకాల టూత్‌పేస్ట్‌ల తీరుతెన్నులు ఇవి. ఎవరికి వారు తమ విచక్షణ మేరకు అవసరమైన వారు వాటిని వాడవచ్చు. అయితే తమకు ఎలాంటి టూత్‌పేస్ట్ సరిపడుతుందో అనుభవం మీద తెలిశాక... ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి దాన్ని కొనసాగించం అన్ని విధాలా మంచిది. పెద్దలు బ్రషింగ్ ఎలా చేసుకోవాలంటే..! ►మీ దంతసంరక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ప్రతిరోజూ రెండుమార్లు పళ్లు తోముకోండి. ►మీ డెంటిస్ట్‌ను కలిసి క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోండి. ►మీరు బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడండి. ► దంత సంరక్షణను అందించే మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకోండి. ► పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి. ►బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకోండి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అలాంటప్పుడు అవి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ►మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి. ►లోపలివైపున బ్రష్ చేసుకోడానికి బ్రష్‌ను నిలువుగా పట్టుకొని పైకీ, కిందికీ మృదువుగా కదిలించండి. ► కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. ►నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి. ►బ్రష్షింగ్ తర్వాత టూత్‌బ్రష్‌ను మృదువుగా రుద్దండి. ►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ►ప్రతి మూడు నెలలకు ఓమారు బ్రష్‌ను మార్చేయండి. లేదా బ్రిజిల్స్ వంగినట్లు, దెబ్బతిన్నట్లు కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. దంత సమస్యల నివారణ ఎలా? పిల్లలకు గాని, పెద్దలకు గాని చిగుళ్ల జబ్బులు రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకు రెండు పూటలా బ్రష్ చేయించడం, పెద్దలూ రెండు పూటలా బ్రష్ చేసుకోవడం, పంటికి అతుక్కుపోయే పదార్థాలు తీసుకోకపోవడం, తినేవాటిలో జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త పడటం అవసరం. దాంతోపాటు స్వీట్స్ తగ్గించాలి. తీపి పదార్థాలు తిన్న ప్రతిసారీ నోటిని నీళ్లతో పుక్కిలించాలి. పంటి చిగుర్లకు ఇన్ఫెక్షన్లు వస్తే..! పంటి చిగురుకు ఇన్ఫెక్షన్ వస్తే మొదట తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతలోనే అకస్మాత్తుగా అది లేకుండా మాయమైనట్లు అనిపిస్తుంది. పంటి చుట్టూ చీము చేరుతుంది. ఈ ఇన్ఫెక్షన్ చిగురుకు పూర్తిగా పాకుతుంది. అది పంటిని వదులు చేస్తుంది. అక్కడో గడ్డ కూడా కావచ్చు. ఒక్కోసారి అది చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. నొప్పి లేదంటే అదేదో తగ్గిపోయిందనీ, డెంటిస్ట్ దగ్గరికి వెళ్లనక్కర్లేదని అర్థం కాదు. ఒకవేళ చీము అంతా ఎండిపోకపోతే అది క్రమంగా దవడకూ, తలకే కాదు... నొప్పి మెడవరకూ పాకొచ్చు. అది భయంకరంగా మారొచ్చు. నిజానికి మన నోట్లోనే బోల్డన్ని బ్యాక్టీరియా (సూక్ష్మజీవులు) ఉంటాయి. మనలో దంతక్షయంగానీ ఉంటే ఆ దెబ్బతిన్న పన్నులోని మృతకణాలున్న భాగం బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడి ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. దంతంలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే... అదే బ్యాక్టీరియా విస్తరించేందుకు సింహద్వారమవుతుంది. అలా ఇన్ఫెక్షన్ వస్తే మాటిమాటికీ నొప్పి వస్తూ ఉంటుంది. వేడి లేదా చల్లటి పదార్థాలు తిన్నప్పుడల్లా జిల్లుమంటుంది. అదేకాదు... నమలగానే నొప్పి ఠక్కున పొడుచుకొని వస్తుంది. అప్పటికీ డెంటిస్ట్‌కు చూపించకపోతే ఆ ఇన్ఫెక్షన్ శరీరంలోని మరే అవయవానికైనా విస్తరిస్తుంది. ఉదాహరణకు గొంతులోని గ్రంధులు వాచినట్లుగా కావచ్చు. నోరు దుర్వాసన వస్తున్నట్లు, మనమేదైనా నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే నోట్లో చిగురు వద్ద వచ్చిన గడ్డ పలిగినందుకు అది సూచన. ఇలాంటప్పుడు నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది గానీ వాస్తవానికి ఇన్ఫెక్షన్ మాత్రం మన శరీరంలోనే ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం కావచ్చు. అందుకే మన పంటికి ఎలాంటి నొప్పి వచ్చినా వెంటనే డెంటిస్ట్‌కు చూపించుకొని తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ ప్రత్యూష హెచ్ఓడీ, ఓరల్ మెడిసిన్ మాక్సీలో ఫేషియల్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వంటింటి చిట్కాలు
♦ ఉపయోగించిన టూత్ బ్రష్‌లతో వంటింట్లో సింకులు, కంప్యూటర్ కీ బోర్డులు, టీవీ రిమోట్లు శుభ్రం చేసుకోవచ్చు. ♦ ఛీజ్ నిల్వ చేసే డబ్బాలో చిన్న పటిక బెల్లం ముక్క వేసి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ♦ కోసిన ఉల్లిపాయ సగమే వాడినప్పుడు మిగతా సగం ముక్కకు వెన్న రాసి ఉంచాలి. తాజాగా ఉంటుంది. ♦ వేడి చేసిన గరిటెతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ♦ బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పుట్టదు. ♦ పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి కలపాలి. ♦ కూరల్లో, పులుసులో ఉప్పు కారం ఎక్కువైనప్పుడు రెండు చెంచాల శనగపిండిని వేయించి కలపాలి. ♦ మరీ నిల్వ ఉంచిన శనగపిండిని పారేయకుండా స్టీలు గిన్నెలు, వెండి సామాన్లను తోమితే శుభ్రపడతాయి. ♦ మజ్జిగ పల్చనైతే పది కరివేపాకు ఆకులు, కాస్త ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే చిక్కబడుతుంది. ♦ తెల్లని బట్టలు ఉతికాక పసుపు మరకలు అలాగే ఉంటే బోరిక్ పౌడర్ కలిపిన నీటిలో కొద్ది సేపు నానబెట్టి, ఉతికి ఎర్రటి ఎండలో ఆరేయాలి. ♦ రోజ్‌వాటర్‌లో ముంచిన దూది ఉండను హ్యాండ్‌బ్యాగులో ఉంచితే దుర్వాసన రాదు. ♦ హ్యాండ్ వాష్ లిక్విడ్‌ను దూదితో అద్దుకొని తుడిస్తే లెదర్ బ్యాగుల దుమ్ము సులువుగా వదిలిపోతుంది. -
పిల్లలందరికీ ఒకటే టూత్ బ్రష్!
అంగవైకల్యంతో అవస్థలు పడే పిల్లలకు ఆసరా అందించాల్సిన ప్రభుత్వ హాస్టళ్లు, జీవిత చరమాంకంలో పట్టించుకునేవారు లేక పడరాని పాట్లు పడే వృద్ధుల ఆశ్రమాల పరిస్థితి దయనీయంగా ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ హోమ్స్‌లో సుమారు 50 మంది పిల్లలు ఒకే టూత్ బ్రష్ వాడుతున్నవైనం తనను ఎంతో బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాధీనంలో కొనసాగుతున్న వికలాంగ బాలల హాస్టళ్ళు, వృద్ధాశ్రమాల్లో పరిస్థితిపై.. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ హెచ్ఎల్ దత్తు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమాలను, హాస్టళ్ళను ప్రతిరోజూ సందర్శిస్తున్న ఆయన... వారికి సరైన సహకారం అందించి వారిలో విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత డిసెంబర్ లో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం ఎన్ హెచ్ ఆర్సీ ఛైర్మన్ గా నియమితులైన తర్వాత.. ప్రతిరోజూ బెంగళూరు సమీపంలోని వృద్ధాశ్రమాలను సందర్శించి వారితో కొంత సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి కథ విన్నానని చెప్పారు. ఆయనకు ఇద్దరు బాగా సంపాదిస్తున్న, ఉన్నత స్థాయిలో ఉన్న కొడుకులు ఉన్నారని, అయితే వారితో కలసి తనకు ఉండే భాగ్యం మాత్రం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం తనను ఎంతో బాధించిందని, అటువంటి వారికి రోజూ కౌన్సెలింగ్ ఇప్పించి, వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉందని జస్టిస్ దత్తు అభిప్రాయపడ్డారు. జస్టిస్ దత్తు ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత... ఇరత సభ్యులు జస్టిస్ సిరియాక్ జోసెఫ్, డి. మురుగేశన్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్సి సిన్హాలతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి.. రాష్ట్రాల్లోని వికలాంగ పిల్లల హాస్టళ్లు, వృద్ధాశ్రమాలను సందర్శించి, ప్రాథమిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వాటి పరిస్థితులను మెరుగు పరిచేందుకు కావలసిన సలహాలు, సూచనలను ఇచ్చేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వ వృద్ధాశ్రమాల్లో, వికలాంగ హాస్టళ్ళలో ఉండేవారి జీవితాలు ఆనందమయంగా ఉండేట్టు మార్పులు జరిగితే తన జీవితంలో అదే అత్యంత సంతోషకర సన్నివేశం అవుతుందని జస్టిస్ దత్తు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
బాలుడి మూత్రాశయంలో టూత్ బ్రెష్
రాయ్‌పుర్: టూత్ బ్రెష్ మింగి, ఆ విషయం గోప్యంగా ఉంచి ఏడాది తర్వాత ప్రాణాపాయస్థితి నుంచి బయపడ్డాడు ఓ బాలుడు. ఎంతో అవస్థను అనుభవించి సంవత్సరం తర్వాత ఆ బ్రెష్ నుంచి చివరికి విముక్తి పొందాడు. వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతరీకి చెందిన కేశవ్ సాహూ(5) అనే బాలుడు టూత్ బ్రెష్ మింగాడు. తల్లిదండ్రులు టూత్ బ్రెష్ మింగిన విషయం తెలిస్తే కొడతారేమో అని బయపడ్డ కేశవ్, ఆ విషయాన్ని వారికి చెప్పలేదు. గత 6 నెలల నుంచి మూత్రవిసర్జన సమయంలో, ఆహారం తీసుకునేప్పుడు నొప్పి ఎక్కువగా రావడం ప్రారంభమైంది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలున్ని రాయ్ పూర్ మెడికల్ కాలేజీ డాక్టర్లకు చూపించారు. అక్కడ బాలుడి శరీరంలో ఓ వస్తువుతోపాటూ, 5 సెంటీమీటర్ల రాయిని మూత్రాశయంలో డాక్టర్లు కనుగొన్నారు. 'ఎక్స్ రేలో ఆ వస్తువు సరిగా కనిపించలేదు. అయితే ఆపరేషన్ చేసి 5 సెం.మీ రాయిని తొలగిస్తున్నపుడు 15 సెం.మీ.ల పొడవున్న స్టిక్‌ను కనుగొన్నాం. తర్వాత దాన్ని టూత్ బ్రెష్గా గుర్తించాము' అని డాక్టర్లు తెలిపారు. అయితే ఎప్పుడు తాను ఆ బ్రెష్‌ను మింగాడు అనే విషయాన్ని ఆ బాలుడు కచ్చితంగా చెప్పలేకపోతున్నాడు. కేశవ్ బ్రెష్ మింగి సంవత్సరం పైనే అయిఉండొచ్చని బాలిడి తండ్రి తెలిపారు. 'ఇది అసాధారణమైన కేసు. సాధరణంగా చిన్న పిల్లలు కాయిన్స్ మింగిన కేసులు ఎక్కువగా చూస్తుంటాము. ఆ టూత్ బ్రెష్ బాలుడి పేగులకు మూడు చోట్ల రంధ్రాలను చేసి చివరికి మూత్రాశయాన్ని చేరింది. ఇలాంటి సంఘటనల్లో సరైన సమయంలో చికిత్స అందించకపోతే పిల్లలు మరణించే అవకాశాలు ఎక్కువ. ఈ కేసులో బాలుడు కోలుకోవడం నిజంగానే ఓ అద్భుతం' అని ఆపరేషన్ చేసిన ఓ డాక్టర్ అన్నారు. బాలుడు మరో వారం రోజుల పాటూ తమ పర్యవేక్షణలోనే ఉంటాడని డాక్టర్లు తెలిపారు. -
టూత్‌బ్రష్‌తో అంటువ్యాధులు
న్యూయార్క్: మీరు ఉమ్మడి బాత్రూమ్ వాడుతున్నారా? అయితే మీ టూత్‌బ్రష్‌ను బాత్రూమ్లోని స్టాండ్స్‌లో ఉంచే విషయంలో కాస్త ఆలోచించండి. ఎందుకంటే దాని ద్వారా మీకు ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాపించే అవకాశముంది. సాధారణంగా ఎక్కువ మంది వాడే బాత్రూముల్లో హానికరమైన కోలిఫామ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. బాత్రూమ్లో ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల కంటే ఇది కలిగిన బాత్రూమ్ల్లో టూత్‌బ్రష్‌లను నిల్వ చేయడం వల్ల అది మనకు వ్యాపించవచ్చు. దీని వల్ల అంతకుముందు మనలో లేని బ్యాక్టీరియా ప్రభావానికి గురవుతామని అమెరికాలోని క్విన్నిపియాక్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అందువల్ల హాస్టళ్లలో ఉండే విద్యార్థులు టూత్‌బ్రష్‌ను వినియోగించడంలో, నిల్వ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు కలుగుతుంది. -
త్రీమంకీస్ -77
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 77 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఇక నుంచి నేను రోజుకో టూత్ బ్రష్‌ని వాడదలచుకున్నాను. డ్రాయర్, బనీన్లని కూడా. మిగిలిన డబ్బుతో మినరల్ వాటర్ బాటిల్స్‌ని కొని ఇక ఆ నీళ్ళతోనే స్నానం, తాగడం అన్నీనూ. ఇంట్లోని లైట్లని మాటిమాటికీ వేసి ఆర్పను. వాటన్నిటినీ ఎప్పుడూ వేేన ఉంచుతాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఇది వింటే స్వచ్ఛ వీడిని ప్రేమించేది. నువ్వు?’’ కపీష్ ప్రశ్నించాడు. ‘‘ఇక నేను దేనికీ బేరం ఆడను. ఏపిల్స్ కొన్నా, ఇల్లు కొన్నా సరే. సగం జీవిత కాలం బేరాలకే సరిపోయింది. చెప్పిన ధరకి కొనేస్తాను. నీ సంగతేమిటి?’’ మర్కట్ అడిగాడు. ‘‘నేను మీలా కాదు. గోల్డ్ కంచంలో తిని, గోల్డ్ గ్లాసుతో తాగి, అన్నంలో గోల్డ్ రేకులని వేసుకుని తిని, ఆఖరికి టాయిలెట్ పేపర్ని కూడా గోల్డ్‌తో తయారు చేయించి దాన్నే వాడతాను’’ కపీష్ చెప్పాడు. వానర్ తనతో తెచ్చుకున్న దినపత్రికలోని ఓ వార్తని చదివి తర్వాత మిత్రులు ఇద్దరికీ ఆశ్చర్యంగా చెప్పాడు. ‘‘బేంక్‌కి సొరంగం తవ్వింది దుర్యోధన్. ఆ సంగతి తెలీక వాడి అన్న రావణ్ అదే బేంక్‌లోకి సమయానికి ఆయుధాలతో, తన అనుచరులతో ప్రవేశించాడట.’’ ‘‘అంటే మనం బేంక్‌లోకి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నది రావణ్ అన్న మాట!’’ ‘‘అవును. సిసి కెమేరా ఫుటేజ్‌ని చూసి అతని నడకని బట్టి, ఒడ్డూ పొడుగుని బట్టి పోలీసులు అతన్ని గుర్తించి అరెస్ట్ చేశారట’’ వానర్ చెప్పాడు. ‘‘అంటే దుర్యోధన్‌ని పోలీసులు పట్టుకోకపోతే వాడు ఆ సొరంగంలోంచి మన బదులు తన అనుచరులతో వెళ్ళి ఉండేవాడు. వాడు వెళ్తే మనం వెళ్ళలేంగా. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ బేంక్ సొత్తుని పంచుకునే వారు. అవునా?’’ కపీష్ అడిగాడు. ‘‘కాదు. వాళ్ళ మధ్య రక్తపాతం జరిగేదిట. వాళ్ళు ఆజన్మ శత్రువులట’’ వానర్ చెప్పాడు. ‘‘దేనికి?’’ ‘‘వాళ్ళ తండ్రి ఒకరే కాని తల్లులు వేరట. దాయాదులన్నమాట. అందుకని.’’ ‘‘అంటే పోలీసులు దుర్యోధనుడ్ని పట్టుకుని అన్నదమ్ముల ఇద్దరి ప్రాణాలని కాపాడారన్నమాట!’’ మర్కట్ చెప్పాడు. ‘‘అనే ఇందులో రాశారు. అంతేకాదు. బేంక్ సొమ్ము మోసం చేసి దోచుకుపోయిన మనం ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. సాక్షులతో మన ఊహాచిత్రాలని గీయించి తెలుసుకుంటారుట’’ వానర్ గొంతు తగ్గించి చెప్పాడు. ‘‘తెలుసుకోమను. ఆ సరికి మనం ఇక్కడ ఉండం.’’ మర్కట్ ఆ పేపర్ అందుకుని ఆ వార్తని చదివి చెప్పాడు. ‘‘పోలీసులు ఆ అన్నదమ్ములు ఇద్దర్నీ చెరో జైల్లో పెట్టారుట.’’ పైలట్ గ్రైప్ షీట్‌ని అందుకుని చదివాడు. అంతకు మునుపు ఆ విమానాన్ని నడిపిన పెలైట్ తను అందులో గమనించిన లోపాలని రాసే షీటే గ్రైప్ షీట్. గ్రౌండ్ స్టాఫ్ దాన్ని చదివి ఆ లోపాలని సవరించాలి. తర్వాత తను హాజరైన లోపాల సర్దుబాటు మీద కామెంట్స్ రాయాలి. పైలట్ అలా రాసిన వాటిని చదివాడు. పైలట్: ఆటో లేండింగ్ గేర్ సరిగ్గా పడటం లేదు. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: ఈ విమానంలో ఆటో లేండింగ్ గేర్ లేదు. పైలట్: కాక్‌పిట్‌లో ఎలుక ఉంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: కాక్‌పిట్‌లో పిల్లిని ఇన్స్టాల్ చేశాం. పైలట్: విండ్ స్క్రీన్‌లో పగులు ఉన్నట్లు అనుమానంగా ఉంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: మీ అనుమానం నిజమే. పైలట్: కాక్‌పిట్‌లో ఏదో లూజ్‌గా ఉంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: కాక్‌పిట్‌లో ఏదో బిగించాం. పైలట్: విండ్‌షీల్డ్ మీద చచ్చిన పురుగులు ఉన్నాయి. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: విండ్‌షీల్డ్ మీదకి బతికున్న పురుగులని ఆర్డర్ చేశాం. పైలట్: రేడియో స్విచ్‌లు అంటుకుంటున్నాయి. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: కాక్‌పిట్‌లో ఇక మీదట జామ్ సర్వ్ చేయబడదు. పైలట్: కాక్‌పిట్‌లో వింత వాసన. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: మీ పెర్ఫ్యూమ్ని మార్చండి. పైలట్: ఏర్ కండిషన్డ్ మెషీన్ నా భార్యలా అరుస్తోంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: విడాకులు రికమెండ్ చేస్తున్నాం. పైలట్: ఫ్రిక్షన్ బ్రేక్స్‌ని త్రాటిల్ లివర్ పట్టుకుంటోంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: త్రాటిల్ లివర్ చేసే పని అదే. పైలట్: రైట్ మెయిన్ లేండింగ్ గేర్‌లో ఏదో కారే సాక్ష్యం ఉంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: రైట్ మెయిన్ లేండింగ్ గేర్‌లో ఏదో కారే సాక్ష్యం తొలగించబడింది. పైలట్ దాని మీద తన ఇనీషియల్ వేసి సంతకం చేసి విమానం ఇంజన్లని స్టార్ట్ చేయసాగాడు. అకస్మాత్తుగా అతనికి కంట్రోల్ టవర్ నించి వైర్లెస్లో ఓ ముఖ్యమైన సమాచారం అందింది. (దాని పర్యవసానంగా ఏం జరిగింది?) -
టూత్‌బ్రష్‌లపై టాయిలెట్ బ్యాక్టీరియా!
మీరు టూత్‌బ్రష్‌ను బాత్రూంలోనే ఉంచుతున్నారా? అయితే వెంటనే అక్కడ ఉంచేయడం మానుకోండి. ఎందుకంటే టాయిలెట్లో ఉండే బ్యాక్టీరియాలు టూత్‌బ్రష్‌పై చేరి తద్వారా బ్రష్ చేసినప్పుడు నోట్లోకీ చేరుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్లో ఉండే స్టెఫైలోకోకై, యీస్ట్స్, తదితర బ్యాక్టీరియాలు టూత్‌బ్రష్‌లను చేరే అవకాశముందని బర్మింగ్‌హాంలోని యూనివర్సిటీ ఆఫ్ అల బామా పరిశోధకులు అంటున్నారు. టూత్‌బ్రష్‌ను ఉపయోగించిన తర్వాత నీటితో శుభ్రంగా కడగడంతోపాటు బాత్రూంకు దూరంగా గాలి బాగా ఆడేచోట నిలువుగా ఉంచడం, యాంటీ బ్యాక్టీరియల్ మౌత్క్లీనర్లో ముంచడం చేస్తే బ్యాక్టీరియా ముప్పు తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. ఒకే దగ్గర ఎక్కువ టూత్‌బ్రష్‌లు ఉంచితే వాటిని ఒకదానికొకటి తగలకుండా దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. -
ఆవిష్కరణం: పంది ఈకలతో పళ్లు తోమారా!
ఆవిష్కరించింది చైనీయులు, ప్రచారంలోకి తెచ్చింది ఫ్రెంచివాళ్లు, ఉత్పత్తి చేసింది బ్రిటిష్ వాళ్లు, పేటెంట్ తీసుకుంది అమెరికా వాళ్లు. పొద్దున్నే లేచి మన పళ్లను శుభ్రం చేసే టూత్ బ్రష్‌ను వెలుగులోకి తేవడంలో ఇంతమంది చేయి ఉంది. కానీ అసలు కనుగొన్నది ఎవరు? ఒకరకం పందికి ఉండే వెంట్రుకలతో చైనీయులు తొలిసారిగా బ్రష్‌ను రూపొందించారట. క్రీస్తుశకం ఐదో శతాబ్దంలో చైనా రాజులు టూత్‌బ్రష్‌ను ఉపయోగించే వారని... తర్వాత 15, 16 శతాబ్దాల్లో ఫ్రెంచివాళ్లు దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారని తెలుస్తోంది. విలియం ఆడీస్ అనే బ్రిటిషర్ పెద్ద ఎత్తున టూత్‌బ్రష్‌లను ఉత్పత్తి చేసి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారట. 1885లో అమెరికాకు చెందిన వడ్త్వర్స్ అనే వ్యక్తి బ్రష్‌లపై పేటెంట్ రైట్స్ రిజిస్టర్ చేసుకుని ఒక కంపెనీ పేరుతో టూత్‌బ్రష్‌ల ప్రొడక్షన్ ప్రారంభించారట. అక్కడ నుంచి టూత్‌బ్రష్‌లు విస్తృత స్థాయిలో వినియోగంలోకి వచ్చాయని తెలుస్తోంది. అయితే బ్రష్ వెనుక ఉన్న చరిత్ర గురించి ఇంకా అనేక థియరీలు ఉన్నాయి. చైనీయుల కన్నా ముందు క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలోనే ఈజిప్షియన్లు టూత్‌బ్రష్‌ను వినియోగించారనేది మరో పరిశోధన చెప్పే వివరం. భారతీయుల్లో క్రీస్తు పూర్వం ఐదువందల సంవత్సరాల కిందటే టూత్‌పేస్ట్ వినియోగం, వేపపుల్లలతో బ్రష్ చేసుకునే అలవాటు ఉందని తెలుస్తోంది. ఏదేమైనా కుడి చేతి చూపుడు వేలు మనిషి వాడిన తొలి టూత్‌బ్రష్ అని, పరిణామక్రమంలో జంతువుల వెంట్రుకలు, పక్షుల ఈకలతో రూపొందించిన టూత్‌బ్రష్‌లు వినియోగంలోకి వచ్చాయనేది మాత్రం అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకునే విషయం!