టూత్‌బ్రష్‌లపై టాయిలెట్ బ్యాక్టీరియా!
మీరు టూత్‌బ్రష్‌ను బాత్‌రూంలోనే ఉంచుతున్నారా? అయితే వెంటనే అక్కడ ఉంచేయడం మానుకోండి. ఎందుకంటే టాయిలెట్‌లో ఉండే బ్యాక్టీరియాలు టూత్‌బ్రష్‌పై చేరి తద్వారా బ్రష్ చేసినప్పుడు నోట్లోకీ చేరుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్‌లో ఉండే స్టెఫైలోకోకై, యీస్ట్స్, తదితర బ్యాక్టీరియాలు టూత్‌బ్రష్‌లను చేరే అవకాశముందని బర్మింగ్‌హాంలోని యూనివర్సిటీ ఆఫ్ అల బామా పరిశోధకులు అంటున్నారు. టూత్‌బ్రష్‌ను ఉపయోగించిన తర్వాత నీటితో శుభ్రంగా కడగడంతోపాటు బాత్‌రూంకు దూరంగా గాలి బాగా ఆడేచోట నిలువుగా ఉంచడం, యాంటీ బ్యాక్టీరియల్ మౌత్‌క్లీనర్‌లో ముంచడం చేస్తే బ్యాక్టీరియా ముప్పు తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. ఒకే దగ్గర ఎక్కువ టూత్‌బ్రష్‌లు ఉంచితే వాటిని ఒకదానికొకటి తగలకుండా దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.