బాలుడి మూత్రాశయంలో టూత్ బ్రెష్ | Five-year-old boy swallowed toothbrush, remain silent for a year | Sakshi
Sakshi News home page

బాలుడి మూత్రాశయంలో టూత్ బ్రెష్

Published Sun, May 1 2016 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

బాలుడి మూత్రాశయంలో టూత్ బ్రెష్

బాలుడి మూత్రాశయంలో టూత్ బ్రెష్

రాయ్పుర్: టూత్ బ్రెష్ మింగి, ఆ విషయం గోప్యంగా ఉంచి ఏడాది తర్వాత ప్రాణాపాయస్థితి నుంచి బయపడ్డాడు ఓ బాలుడు. ఎంతో అవస్థను అనుభవించి సంవత్సరం తర్వాత ఆ బ్రెష్ నుంచి చివరికి విముక్తి పొందాడు. వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతరీకి చెందిన కేశవ్ సాహూ(5) అనే బాలుడు టూత్ బ్రెష్ మింగాడు. తల్లిదండ్రులు టూత్ బ్రెష్ మింగిన విషయం తెలిస్తే  కొడతారేమో అని బయపడ్డ కేశవ్, ఆ విషయాన్ని వారికి చెప్పలేదు. గత 6 నెలల నుంచి మూత్రవిసర్జన సమయంలో, ఆహారం తీసుకునేప్పుడు నొప్పి ఎక్కువగా రావడం ప్రారంభమైంది.  దీంతో తల్లిదండ్రులు ఆ బాలున్ని రాయ్ పూర్ మెడికల్ కాలేజీ డాక్టర్లకు చూపించారు.
 
అక్కడ బాలుడి శరీరంలో ఓ వస్తువుతోపాటూ, 5 సెంటీమీటర్ల రాయిని మూత్రాశయంలో డాక్టర్లు కనుగొన్నారు. 'ఎక్స్ రేలో ఆ వస్తువు సరిగా కనిపించలేదు. అయితే ఆపరేషన్ చేసి 5 సెం.మీ రాయిని తొలగిస్తున్నపుడు 15 సెం.మీ.ల పొడవున్న స్టిక్ను కనుగొన్నాం. తర్వాత దాన్ని టూత్ బ్రెష్గా గుర్తించాము' అని డాక్టర్లు తెలిపారు. అయితే ఎప్పుడు తాను ఆ బ్రెష్ను మింగాడు అనే విషయాన్ని ఆ బాలుడు కచ్చితంగా చెప్పలేకపోతున్నాడు. కేశవ్ బ్రెష్ మింగి సంవత్సరం పైనే అయిఉండొచ్చని బాలిడి తండ్రి తెలిపారు.

'ఇది అసాధారణమైన కేసు. సాధరణంగా చిన్న పిల్లలు కాయిన్స్ మింగిన కేసులు ఎక్కువగా చూస్తుంటాము. ఆ టూత్ బ్రెష్ బాలుడి పేగులకు మూడు చోట్ల రంధ్రాలను చేసి చివరికి మూత్రాశయాన్ని చేరింది. ఇలాంటి సంఘటనల్లో సరైన సమయంలో చికిత్స అందించకపోతే పిల్లలు మరణించే అవకాశాలు ఎక్కువ. ఈ కేసులో బాలుడు కోలుకోవడం నిజంగానే ఓ అద్భుతం' అని ఆపరేషన్ చేసిన ఓ డాక్టర్ అన్నారు. బాలుడు మరో వారం రోజుల పాటూ తమ పర్యవేక్షణలోనే ఉంటాడని డాక్టర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement