ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడంతో ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ అందులో భాగంగా పండ్లూ, పళ్లరసాలు తీసుకోవడం పెరిగింది. అయితే ఇది ఆరోగ్యానికి మంచేదేమోగానీ పంటికి హానికరంగా పరిణమించవచ్చు. అలా ఒంటికి మంచిదైనా, పంటికి హాని చేసేవేమిటో, ఆ హానిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం.
పండ్లు / పండ్ల రసాలతో...
తాజా పండ్లు, పళ్ల రసాలూ ఆరోగ్యానికి మంచివే. కానీ అవే ఫ్రూట్‌జ్యూసుల వల్ల పంటికి హాని జరగవచ్చు. ఉదాహరణకు పళ్లరసాల్లోని ఎక్కువగా ఉండే చక్కెర మోతాదులు పళ్లను దెబ్బతీవయచ్చు. అలాగే ఒకింత పుల్లగా ఉండే పండ్లలోని యాసిడ్స్ వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి.
ఈ సమస్య అధిగమించడానికి...
పండ్లను జ్యూస్ రూపంలో తాగడం కంటే కొరికి తినడం మేలు. ఉదాహరణకు నారింజ/బత్తాయి పండ్లు కొరికి తిన్నప్పటికి కంటే చక్కెర కలిపి ఆరెంజ్‌జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు పళ్లు పాడయ్యే అవకాశం ఎక్కువ. పళ్లు బలహీనంగా ఉన్నవారు జ్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోవద్దు. జ్యూస్ తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి.
దగ్గు మందులతో...
దగ్గు మందు ఔషధమే అయినా అది కూడా ఫ్రూట్ జ్యూస్‌లాంటి ముప్పునే తెచ్చిపెడుతుంది. దగ్గు మందుల్లోని గాఢత చిక్కదనం), అందులో ఉండే చక్కెర మోతాదులు... అచ్చం జ్యూస్‌లాంటి ప్రభావాన్నే చూపుతాయి. దాంతో పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.
ఈ సమస్య అధిగమించడానికి...
దగ్గు మందు తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. వేలితో నోరు శుభ్రమయ్యేలా కడుక్కోవాలి. దగ్గుమందు తాగిన ప్రతిసారీ ఇలా నోరు కడుక్కోవాలి.
గుండెకు మేలు చేసే డార్క్ చాక్లెట్లతో...
పరిమితంగా తీసుకునే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. సాధారణంగా చాక్లెట్లు పళ్లకు చుట్టుకు΄ోయేలా కాస్త జిగురుగా / జారుడుగా ఉంటాయి. అలా చుట్టుకు΄ోవడం వల్ల అవి తమలోని చక్కెరను చాలాసేపు పంటిపైనే అంటిపెట్టుకునే ఉంటాయి. దాంతో పళ్ల ఎనామిల్ ΄పొర దెబ్బతినే అవకాశాల తోపాటు, పళ్లలో రంధ్రాలు (క్యావిటీలు) వచ్చే అవకాశాలెక్కువ. ఫలితంగా పిప్పిపళ్లు వస్తాయి. అలా దంతాలు దెబ్బతింటాయి.
ఈ సమస్య అధిగమించడానికి...
చాక్లెట్లు తిన్న తర్వాత ఆ జిగురంతా పోయేలా వేలితో లేదా టూత్ బ్రష్‌తో తేలిగ్గా బ్రష్ చేసుకోవాలి. నోరు పూర్తిగా శుభ్రమయ్యేలా పలుమార్లు నీళ్లతో పుక్కిలించాలి.
(చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?)
Comments
Please login to add a commentAdd a comment