brush
-
బ్రష్ మార్చి ఎంతకాలం అయ్యింది..?
మనలో చాలామంది టూత్‌బ్రష్‌ను ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. మరీ ఏళ్లు కాకపోయినా బ్రిజిల్స్ అంటే మనం పళ్లు తోముకునే భాగం బాగుంటే కనక కనీసం ఏడాదికి తగ్గకుండా వాడతారు. అయితే టూత్‌బ్రష్‌ను అంతకాలం పాటు వాడటం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు.టూత్‌బ్రష్‌ను ఇంతకాలం లోపు మార్చాలనే విషయంలో నిర్దిష్టమైన మార్గదర్శకం అంటూ ఏమీ లేకపోయినప్పటికీ మూడు నాలుగు నెలలకోసారి మార్చడం మంచిదంటున్నారు వైద్యులు. అదేవిధంగా బ్రిజిల్స్ వంగి΄ోయినప్పుడు, లేదా కొన్ని బ్రిజిల్స్ ఊడిపోయినప్పుడు... ఊడుతున్నట్లుగా ఉన్నప్పుడు వెంటనే బ్రష్ మార్చడం మంచిది. బ్రష్‌ను, టంగ్క్లీనర్ను బాత్రూమ్లో కాకుండా బయట ఎక్కడైనా పెట్టుకోవాలి. మరో ముఖ్యవిషయం... ఏదైనా జబ్బు పడి కోలుకున్న తర్వాత అప్పటివరకు వాడుతున్న బ్రష్ కొత్తదైనా సరే, దానిని పారేసి, కొత్త బ్రష్ కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే జబ్బుపడ్డప్పుడు ... అంటే వైరల్ ఫీవర్స్, డెండ్యూ, మలేరియా, టైఫాయిడ్... మరీ ముఖ్యంగా దంత వ్యాధులతో బాధపడుతున్ననప్పుడు తప్పనిసరిగా బ్రష్ మార్చడం అవసరం. ఇంటిల్లిపాదీ ఒకే బాక్స్‌లో బ్రష్‌లు పెట్టుకోవడం సాధారణం.. అటువంటప్పుడు రోజూ బ్రష్ చేసుకునేముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.(చదవండి: స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!) -
ఆ మూడు సమయాల్లో అస్సలు బ్రష్ చేయకూడదట..!
రోజుకి రెండు, మూడు సార్లు బ్రష్ చేసుకోండి అని దంత వైద్యులు చెప్పడం చూశాం. పైగా పడుకునే ముందు తప్పనసరిగా బ్రెష్ చేయండి అని చెబుతారు. అయితే ఇక్కడొక దంత వైద్యురాలు అందుకు విరుద్ధంగా బ్రెష్ చేసుకోవద్దని, ముఖ్యంగా ఆ మూడు సమయాల్లో బ్రష్ వెంటనే చేయొద్దని సలహాలిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ తెగ అవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే..? సహజంగా డాక్టర్లు బ్రష్ చేయమని చెబుతుంటారు. అలాంటిది ఈవిడ మాత్రం ఆ మూడు సమయాల్లో బష్ చేయొద్దనడం ఒక్కసారిగా అందరిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఇలా చెబుతోంది లండన్‌కి చెందిన డాక్లర్ షాదీ మనో చెహ్రీ. ఆమె తప్పనిసరిగా ఆ మూడు సమయాల్లో బ్రష్ చేయకుడదని చెప్పారు. ముఖ్యంగా అల్పాహారం, స్వీట్లు, వాంతులు అయినప్పుడు అస్సలు బ్రష్ చేయకూడదట. ఆ టైంలో పీహెచ్ స్థాయిలు లేదా నోటిలో ఆమ్లత్వం ఎక్కువగా అవుతాయట. ఏదైనా తిన్నప్పుడూ దంతాల మీద బ్యాక్టీరియాయా ఆ పదార్థాలను జీవక్రియ చేసి యాసిడ్‌గా మారుస్తుంది. ఆ టైంలో లాలాజలం బఫర్లు తిరిగి పనిచేయడానికి కనీసం 30 నుంచి 60 నిమిషాలు పడుతుంది. అలాగే వాంతులుచేసుకున్నప్పుడూ కూడా నోరంతా చేదుగా ఉండి ఆమ్లత్వంగా ఉంటుంది. అంటే పుల్లని విధంగా.. చెత్ల టేస్ట్‌గా ఉండే ఫీల్ ఉంటుంది. అందుకని మనం వెంటనే బ్రష్ చేసేస్తాం. కానీ ఆ టైంలో కూడా అస్సలు చేయకూడదట. ఆ విధమైన ఫీల్ తగ్గేంతవరకు ఓపిక పట్టి నిధానంగా బ్రష్ చేసుకోవాలని చెబతున్నారు. అంతసేపు ఓపిక పట్టలేం అనుకుంటే చక్కెర లేని మౌత్ఫ్రెష్నర్లు లాంటి చూయింగ్ గమ్‌లు లేదా ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మౌత్ వాష్‌లు వినియోగించచ్చొని సూచించారు చెహ్రీ. (చదవండి: నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!) -
దశకుంచెల చిత్రకారుడు! ఏకాకాలంలో ఎడాపెడా..
ఎంతటి చేయితిరిగిన చిత్రకారుడైనా ఒకసారి ఒకే కుంచెను చేత్తో పట్టుకుని బొమ్మలు చిత్రించగలడు. అతి అరుదుగా కొందరు రెండు చేతులతోనూ చెరో కుంచె పట్టుకుని బొమ్మలు గీయడానికి ప్రయత్నించవచ్చు. అయితే, ఈ బెలారష్యన్ కళాకారుడు మాత్రం రెండు చేతులతోనూ పదికుంచెలు పట్టుకుని, వాటితో ఏకకాలంలో ఎడాపెడా కళ్లుచెదిరే బొమ్మలు చిత్రిస్తూ, చూసేవాళ్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు. ఈ కళాకారుడి పేరు సర్జీ ఫీలింగర్. మొదట్లో అందరిలాగానే పద్ధతిగా ఒకసారి ఒక కుంచె పట్టుకునే బొమ్మలు వేసేవాడు. ఇలా బొమ్మలు వేసేటప్పుడు ఒక్కోసారి ఒక్కో కుంచెను మార్చాల్సి వచ్చేది. బొమ్మ గీసే ప్రక్రియ ఆలస్యమయ్యేది. ఇదంతా చిరాకనిపించడంతో కాస్త వెరైటీగా ప్రయత్నిద్దామనుకున్నాడు. రెండు చేతుల వేళ్లకూ పది కుంచెలను తగిలించుకుని, వాటిని రంగుల్లో ముంచి ఏకకాలంలో పది కుంచెలతోనూ బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నట్లుగా సర్జీ బొమ్మలు అద్భుతంగా రావడం మొదలైంది. అతడు బొమ్మలు గీసే ప్రక్రియ మాత్రమే కాదు, అతడి బొమ్మలు కూడా సందర్శకులను ఆకట్టుకోవడంతో అనతి కాలంలోనే సెలబ్రిటీ పెయింటర్‌గా మారాడు. గడచిన రెండేళ్లలో సర్జీ తన బొమ్మలతో జర్మనీ, పోలండ్, ఇటలీల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ ప్రదర్శనల్లో అతడి పెయింటింగ్స్ కళ్లుచెదిరే ధరలకు అమ్ముడయ్యాయి. (చదవండి: ముక్కుతో 'ఈల' పాట విన్నారా? ఈ విలక్షణమే ఆమెను..) -
'మైండ్ బ్లోయింగ్ ఆర్ట్'! ఏకంగా సూది రంధ్రంలోని బబుల్‌పై కళాఖండం!
ఎన్నో ఆర్ట్‌లు చూసి ఉంటాం. ఇలాంటి నెవ్వర్ బీఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఆర్ట్‌ని చూసి ఉండటం అసాధ్యం. ఎందుకంటే..? ఇంతలా సూక్షంగా వేయడం ఒక ఎత్తైతే..పైగా బబుల్ పగిలిపోకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా వేయడం అనితర సాధ్యం. సుసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించాడు ఓ అసాధారణ వ్యక్తి. ఇతనేం అందరిలాంటి వ్యక్తి కాదు కూడా. ఎందుకంటే? ఇతను చిన్నతనంలో ఆటిజంతో బాధపడిన వ్యక్తి. తస ఆర్ట్‌తో అందర్నీ విస్మయపరచడమే కాదు శభాష్ అని ప్రసంశలు అందుకున్నాడు. ఆ వ్యక్తి ఆర్ట్ జర్నీ ఎలా సాగింది? అనితర సాధ్యమైన ఆర్ట్ ఎందుకు వేశాడో అతని మాటాల్లో తెలుసుకుందామా! విల్లార్డ్ విగాన్ ఇంగ్లాండ్‌లోని వెడ్నెస్ఫీల్డ్లోని అష్మోర్ పార్క్ ఎస్టేట్‌కు చెందిన బ్రిటిష్ శిల్పి. అతడు సూక్ష్మ శిల్పాలను రూపొందిస్తాడు. చాలామంది ఇలాంటి సూక్ష్మాతి సూక్ష్మ శిల్పలు రూపొందిస్తారు కానీ అతడు కేవడం సూదీ తల భాగంలో లేదా రంధ్రంలో వేస్తాడు. ఈసారి సూదీ రంధ్రంలో ఓ బబుల్‌పై ముగ్గురు వ్యక్తులు ఒంటెలపై ప్రయాణిస్తున్నట్లు వేశాడు. బబుల్ పగలకుంటా అత్యంత జాగ్రత్తగా వేయాలి. అందుకోసం అతడు రోజూకు 16 గంటలకు పైగా శ్రమను ఓర్చీ మరీ ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. దీన్ని వేసేందుకు కంటి రెప్ప వెంట్రుకలతో తయారు చేసిన పెయింట్ బ్రెష్‌ని వినియోగించడం విశేషం. నిజం చెప్పాలంటే ప్రతి నిమిషం ఉత్కంఠంగా ఊపిరి బిగబెట్టి గుండె లయలను వింటూ వేయాల్సింది. ఎందుకంట? ఆ ఆర్ట్ వేస్తున్నప్పుడూ ఏ క్షణమైన బబుల్ పగిలిందే మొత్తం నాశనమైపోతుంది. పడిన శ్రమ వృధా అయిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఆర్ట్ అనితరసాధ్యమైన ఫీట్ అనే చెప్పాలి. ఆ ఆర్ట్‌లో ఒంటెలను నైలాన్‌తో రూపొందించగా, వాటిపై రాజుల్లా ఉన్న వ్యక్తుల కిరిటీలను 24 క్యారెట్ల బంగారంతో మెరిసేట్లు రూపొందించాడు. సూదీ రంధ్రంలో బుడగ పగిలిపోకుండా ఆధ్యంతం అత్యంత ఓపికతో శ్రమతో వేశాడు. చూసిన వాళ్లు సైతం ఇది సాధ్యమాఝ అని నోరెళ్లబెట్టేలా వేశాడు విల్లార్డ్ విగాన్. ఈ అసాధారణ కళా నైపుణ్యానికి గాను విల్లార్డ్ని 2007లో ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ సభ్యుడిగా నియమించింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. విల్లార్డ్ సుమారు 5 ఏళ్ల ప్రాయంలోనే చీమలకు ఇళ్లను కట్టే మైక్రో శిల్పాన్ని వేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఆర్ట్ వైపుకి ఎలా వచ్చాడంటే.. విల్లార్డ్ ఆటిజం కారణంగా చిన్నతనంలో అన్నింటిలోనూ వెనుకబడి ఉండేవాడు. దీంతో స్నేహితులు, టీచర్లు పదేపదే ఎగతాళి చేసేవారు. ఈ అవమానాల కారణంగా అతడి చదువు సరిగా కొనసాగలేదు. ఈ వ్యాధితో బాధపడే చిన్నారులు చదవడం, రాయడంలో చాలా వెనబడి ఉంటారు. ఈ రకమైన పిల్లలకు బోధించడం టీచర్లకు కూడా ఓ పరీక్ష లేదా సవాలుగానే ఉంటుంది. ఇక్కడ విల్లార్డ్ ఈ అవమానాలకు చెక్‌పెట్టేలా ఏదో ఒక టాలెంట్‌తో తానెంటో చూపించాలి. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని బలంగా అనుకునేవాడు. ఆ జిజ్ఞాశే విల్లార్డ్ని మైక్రో ఆర్ట్ వైపుకి నడిపించింది. చిన్న వయసు నుంచే ఈ మైక్రో ఆర్ట్‌లు వేసి టీచర్లను తోటి విద్యార్థులను ఆశ్చర్యపరిచేవాడు. దీంతో క్రమంగా వారు కూడా అతడిని అవమానించటం, ఎగతాళి చేయటం మానేశారు. ఈ కళ అతడికి మంచి పేరునేగాక అందరీ ముందు విలక్షణమైన వ్యక్తిగా నిలిచేలా చేసింది. మనకు కొన్ని విషయాల్లో రోల్ మోడల్స్ ఉండాలి గానీ నాలాంటి వాళ్లకు రోల్‌మోడల్స్ ఉండరు. అందుకుని వారికీ తాను స్ఫూర్తినిచ్చే వ్యక్తిలా ఉండాలనుకున్నాను. అని చెబుతున్నాడు విల్లార్డ్. మనం నిత్యం ఎన్నో సమస్యలు, బాధలతో సతమతమవుతాం. దాన్ని మనలో దాగున్న ఏదో నైపుణ్యంతో వాటిని పారద్రోలాలి. ఆ స్కిల్ తెయకుండానే.. మీకు ఎదురైన చేదు అనుభవాలను సమస్యలకు చెక్ పెడుతుంది. అందుకు తానే ప్రేరణ అని విల్లార్డ్ చెబుతుంటాడు. అంతేగాదు ప్రపంచానికి సరికొత్త వెలుగునిచ్చేందుకు తాను ఈ కష్టతరమైన మైక్రో ఆర్ట్ వైపుకి వచ్చానంటున్నాడు. ఈ ఆర్ట్ ప్రతి ఒక్కరిలో ఆశ అనే ఒక మ్యాజికల్ కాంతిని, శాంతిని అందజేస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు విల్లార్డ్. దీని అర్థం చిన్న చిన్న సమస్య లేదా పర్వతం లాంటి సమస్య అయినా నువ్వు తల్చుకుంటే సాధ్యమే! అని విల్లార్డ్ తన ఆర్ట్‌తో చెప్పకనే చెబుతున్నాడు కదా!. (చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?) -
నిద్ర మత్తులో బ్రష్ మింగేశాడు
చిన్నపిల్లలు ఆడుకుంటూ చిన్న చిన్న కాయిన్స్ వంటివి మింగేయడం తెలుసు.. కొందరు పెన్ను క్యాప్‌లు, పిన్నీసులు వంటివి మింగడమూ తెలుసు.. కానీ చైనాలోని టైంఝు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవున్న టూత్‌బ్రష్‌ను మింగేశాడు. రాత్రంతా టీవీ చూస్తూ గడిపాడో, బయటెక్కడో తిరిగి లేటుగా వచ్చాడోగానీ.. పొద్దున నిద్రమత్తులో లేచాడు. కళ్లు నలుముకుంటూనే బాత్రూమ్కు వెళ్లాడు. బ్రష్ తీసుకుని పళ్లు తోముకోవడం మొదలుపెట్టాడు. పళ్ల వెనకాల, నాలుక చివరన తోముతుంటే బ్రష్ చేజారి.. గొంతులోకి వెళ్లిపోయింది. తీయడానికి ప్రయత్నిస్తే రాలేదు. అప్పటికే ఊపిరాడక ఇబ్బంది మొదలవడంతో.. బ్రష్‌ను అలాగే లోపలికి తోసేశాడు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి పరుగెత్తాడు. డాక్టర్లు వెంటనే గ్యాస్ట్రోస్కోపిక్ ఆపరేషన్ చేసి బ్రష్‌ను బయటికి తీశారు. నిద్రమత్తులో పేస్ట్ అనుకుని షేవింగ్ క్రీమ్నో, లిక్విడ్ సోప్నో వేసుకున్నవారిని చూశామని.. కానీ ఇలా బ్రష్ మింగేయడం చాలా చిత్రంగా ఉందని డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. -
చిన్నారి గొంతులో విరిగిన బ్రష్
విజయనగరం,పార్వతీపురం: జియ్యమ్మవలస మండలం బిత్రపాడు గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి బూరి విద్యాప్రసూన గొంతులో ప్రమాదవశాత్తు బ్రష్ విరిగిపోయింది. శుక్రవారం ఉదయం ఇంటి వద్ద బ్రష్ చేసుకుంటున్న సమయంలో కాలుజారి కింద పడిన సమయంలో ప్రమాదవశాత్తు బ్రష్ రెండు ముక్కలుగా విరిగింది. ముందు భాగం అంగుళం మేర ప్రసూన గొంతులో కొండనాలుక ప్రాంతంలో నాలిక పైభాగంలో లోపలకి చొరబడింది. చిన్నారి ప్రసూన నొప్పిన తట్టుకోలేక విలవిలలాడింది. వెంటనే తల్లిదండ్రులు పార్వతీపురంలోని చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డా.శంకాప్రతాప్కుమార్ ఆసుపత్రికి తీసుకురాగా ఆయన వైద్య పరీక్షలు చేసి అనంతరం చాకచక్యంగా విరిగిన బ్రష్ ముందు భాగాన్ని బయటకు తీసివేశారు. దీంతో ప్రసూన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆయన కుంచె..పర్యావరణ పరిరక్షణకు కంచె
-
ఈ బ్రష్ ధర రూ.12 వేలు
పళ్లు తోముకోవడానికి మీరు ఎంతసేపు సమయం కేటాయిస్తారు? ఓ పదో పదిహేను నిమిషాలో అద్దం ముందు బ్రష్‌తో గడుపుతారు. ఇక నుంచి దానికి అంత సమయం కేటాయించవలసిన అవసరం లేదు. కేవలం 10 సెకన్లలో బ్రషింగ్ని పూర్తి చేసే సరికొత్త ఎలక్ట్రానిక్ బ్రష్ ని అమెరికాకు చెందిన కంపెనీ తయారు చేసింది. 10 సెకండ్లలో బ్రష్ చేసుకోవడమా? అని ఆశ్చర్య పడకండి. ఈ బ్రష్ గురించి వింటే ఔరా! అనక మానరు. ఈ బ్రష్‌లో అతి చిన్న కెమెరాలు అమర్చారు. బ్రష్ నోటిలోకి వెళ్లగానే మన పంటి లోపల భాగాలను ఈ కెమెరా ఫొటోలు తీస్తుంది. దానికి సంబంధించిన చిత్రాలను మన దగ్గరుండే స్మార్ట్‌ఫోన్‌కు పంపిస్తుంది. దీనికి మన దగ్గరున్న స్మార్ట్‌ఫోన్‌ను కెమెరాకు అనుసంధానిస్తే సరిపోతుంది. ఈ బ్రష్‌ను ప్రస్తుతం ట్రయల్ రన్లో ఉంచారు. ఇంతకీ ఈ బ్రష్ పేరు చెప్పలేదు కదూ.. దీని పేరు ‘గ్లేర్ స్మైల్ ’. దీని ధర రూ.12వేలు కాగా భారత్‌లో దీన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. -
అప్లై చెయ్యండి ఆరాక కడగండి
బ్యూటిప్స్ ఒక టీ స్పూను చక్కెరలో అంతే మోతాదులో నిమ్మరసం, కొద్దిగా నీటిని వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లు వేసుకునే బ్రష్‌తో ముఖానికి (అవాంఛిత రోమాలు ఉన్న చోట) అప్లయ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది.ఒక టేబుల్ స్పూను నిమ్మ రసంలో నాలుగు టీ స్పూన్ల తేనె కలిపి బ్రష్‌తో ముఖానికి అప్లయ్ చేసి ఆరిన తర్వాత కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. పాలలో పసుపు వేసుకుని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిగా ఆరనివ్వాలి. ఇప్పుడు ముఖానికి వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ మర్దన చేయాలి. ఇది అవాంఛిత రోమాలను తొలగించడంతోపాటు స్క్రబ్‌గా పని చేసి మృతకణాలను కూడా పోగొడుతుంది. మర్దన చేయడం పూర్తయిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఒక టేబుల్ స్పూను శనగపిండిలో ఒక టీ స్పూను పసుపు వేసి తగినంత నీటితో పేస్టులా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత సున్నితంగా రుద్దుతూ కడగాలి. -
క్షణాల్లో బ్రష్ నోరంతా ఫ్రెష్
పళ్లుతోముకోవడం క్షణాల్లో చేసుకునే పనేనా.. అని ఆశ్చర్యపోతున్నారా..? ఒకప్పటి కాలంలోనైతే తాపీగా ఏ వేపపుల్లనో తుంచుకుని, నోట్లో నములుతూ కుచ్చులా చేసుకుని ముచ్చట్లాడుతూ పళ్లుతోముకునే ప్రక్రియ పూర్తి చేసుకునే సరికి కనీసం పావుగంటైనా పట్టేది. టూత్‌బ్రష్‌లు, టూత్పేస్ట్లు అందుబాటులోకి వచ్చాక ఈ ప్రక్రియ ముగించడానికి మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతోంది. క్షణాల్లో బ్రష్ చేసుకోవడం ముగించేటట్లయితే, అసలు పళ్లు తోముకున్నట్లేనా.. అని సందేహిస్తున్నారా..? మీ సందేహాలన్నింటికీ సమాధానమే ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘బ్రిజిల్డెంట్’ టూత్‌బ్రష్. చూడటానికి చిత్రవిచిత్రంగా ఉంది కదూ! ఇదిలాగే ఉంటుంది. ఎందుకంటే, పలువరుస మూస ఆధారంగా దీన్ని తయారు చేస్తారు. ఈ రకమైన టూత్‌బ్రష్‌లు రెడీమేడ్‌గా దొరకవు. ఇవి టైలర్డ్ టూత్‌బ్రష్‌లు. ఎవరికి కావలసిన బ్రష్‌ను వారు ఆర్డర్‌పై తయారు చేయించుకోవాల్సిందే. స్కానింగ్ ద్వారా లేదా పలువరుస ఇంప్రింట్ తీసుకోవడం ద్వారా కచ్చితమైన కొలతలతో దీన్ని తయారు చేస్తారు. పలువరుస ముందు, వెనుకలకు. దంతాల సందులకు చేరేలా దీనికి బ్రిజిల్స్ ఉంటాయి. దీనిని 45 డిగ్రీల కోణంలో పల్వరుసకు తగిలించుకుని, నములుతున్నట్లుగా దవడలను గబగబా పది పదిహేనుసార్లు ఆడిస్తే చాలు. దంతాలన్నీ పూర్తిగా శుభ్రపడిపోతాయి. కచ్చితంగా చెప్పాలంటే, ఈ టూత్‌బ్రష్‌తో ఆరు సెకండ్లలోనే దంతధావన ప్రక్రియ ముగిసిపోతుంది. -
పళ్లు శుభ్రంగా ఉంటే అల్జైమర్స్ దూరం!!
మీకు రోజూ చక్కగా బ్రష్ చేసుకుంటుంటారా? మీకు దీర్ఘకాలం పాటు జ్ఞాపకశక్తి పదిలంగా ఉంటుంది. అంతేకాదు... అల్జైమర్స్ వ్యాధికి గురయ్యే అవకాశాలూ తక్కువే. ఇది పరిశోధనలు చెప్పిన సత్యం. మతిమరపుతో బాధపడుతున్న కొందరి మెదడు ఫిల్ములనూ, అలాగే డిమెన్షియా (మతిమరపు), అల్జైమర్స్ లాంటి వ్యాధులు లేని ఆరోగ్యవంతుల మెదడు ఫిల్మలను పరిశీలించారు. దీనితో పాటు ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వారి మెదడు నమూనాలనూ సేకరించి పరీక్షించారు. ఇందులో డిమెన్షియా (మతిమరపు)తో బాధపడుతున్న వారి మెదళ్లలో పార్ఫైరోమోనాస్ జింజివాలిస్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా పంటి చిగుర్లలో నివాసం ఉంటుంది. ఆహారం నములుతున్నప్పుడుగానీ, చిగురుకు దెబ్బతగిలి స్వల్ప రక్తస్రావం జరిగినప్పుడుగానీ ఆ బ్యాక్టీరియమ్... రక్తప్రవాహంతో కలిసి మెదడును చేరుతుంది. ఒక్కోసారి పంటిచికిత్స చేయించుకున్నవారిలో సైతం చికిత్స తర్వాత ఏర్పడే గాట్ల ద్వారా ఆ బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలిసి శరీరంలోని వేర్వేరు భాగాలకు చేరే అవకాశం ఉంది. అదే క్రమంలో మెదడునూ చేరి అక్కడి వ్యాధినిరోధక రసాయనాలను ప్రభావితం చేయవచ్చు. దాంతో నరాల చివరలు దెబ్బతినవచ్చు. ఫలితంగా అయోమయం, జ్ఞాపకశక్తి క్షీణించడం వంటి లక్షణాలు బయటపడతాయి. అంతేకాదు... పళ్లను శుభ్రంగా ఉంచుకోకపోతే అక్కడి బ్యాక్టీరియా గుండెను చేరి గుండె సంబంధ వ్యాధులనూ, డయాబెటిస్‌ను కలిగించవచ్చని ఇప్పటికే నిరూపితమైంది. బ్రిటిష్ పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో తేలిన ఈ విషయాలన్నీ ‘జర్నల్ ఆఫ్ అల్జైమర్స్ డిసీజ్’లో ప్రచురితమయ్యాయి. అందుకే రోజూ పళ్లు శుభ్రంగా తోముకుంటే కేవలం నోరు శుభ్రంగా ఉండటం మాత్రమే కాదు... గుండెజబ్బులూ, డయాబెటిస్తో పాటు మతిమరపు, అల్జైమర్స్ కూడా నివారితమవుతాయన్నమాట. - డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్, హైదరాబాద్ -
రోజంతా తాజాగా ఉంచే పానీయం..!
మగమహారాజులకేం... బ్రష్ చేసుకుని రాగానే వేడివేడి కాఫీనో, టీనో భార్య తెచ్చి ఇస్తే ఊదుకుంటూ తాగుతారు. మరి ఆడవాళ్లేం చేయాలి? ‘అదేం ప్రశ్న? భర్తకి ఇచ్చేటప్పుడే తాను కూడా ఒక కప్పు కాఫీనో, టీనో కలుపుకుని తాగుతుంది కదా...’ అనుకోవద్దు. ఎందుకంటే కాఫీ, టీ లు ఎలాగూ తాగుతారు. అంతకన్నా ముందు ఓ గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇదేమీ కొత్త విషయం కాదు కానీ, ఎవరూ దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. పొద్దున్నే తాగవలసిన ఈ పానీయం వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో తెలుసుకుంటే దీనిని కూడా తమ అలవాట్లలో భాగం చేసుకుంటారని... 1. అజీర్తిని, మలబద్ధకాన్ని నివారించి, సాఫీగా మలవిసర్జన జరిగేటట్లు చూస్తుంది. 2. తాగిన వెంటనే రక్తంలో కలిసిపోవడం వల్ల కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. 3. ఆయుర్వేదం ప్రకారం కడుపులో చేరిన మలినాలను, ఆమాన్ని తొలగించి, శుభ్రంగా కడిగేస్తుంది. 4. రక్తపోటును అదుపు చేసి, మెదడును చైతన్యపరుస్తుంది. 5. నెగటివ్ మూడ్స్‌ను దరిచేరనివ్వకుండా చూస్తుంది. 6. రక్తాన్ని పరిశుభ్రం చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది. 7. మూత్రపిండాల పనితీరును మెరుగుపర చి, మలినాలను వడపోయడంలో సహకరిస్తుంది. 8. అదనపు కొవ్వును కరిగించి, శరీరం బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ పానీయాన్ని పరగడుపున తాగాలి. అంటే సాధారణంగా బ్రష్ చేసుకున్నాకే ఏదైనా తాగడం మనకు అలవాటు. అయితే, ఈ పానీయాన్ని మాత్రం బ్రష్ చేసుకోకమునుపే తాగడం మంచిదని నిపుణులంటున్నారు. పెద్ద గ్లాసునిండా గోరువెచ్చటి నీళ్లు తీసుకుని, అందులో సగం నిమ్మచెక్కను పిండాలి, దానికి టేబుల్‌స్పూన్ తేనె జతచేసి, బాగా కలిపి, వెంటనే తాగాలి. అయితే కాఫీ లేదా టీ తాగే అలవాటు మానుకోనక్కరలేదు. ఓ గంట ఆగి తీసుకోవడం మంచిది. -
ఈ టోపీ పళ్లు తోముతుంది!
లండన్: ఓ పక్క టూత్‌పేస్టు, మరో పక్క బ్రష్ అమర్చి ఉన్న ఈ టోపీ నిజంగానే పళ్లు తోముతుందట! పొద్దున లేవగానే దీన్ని తలపై పెట్టుకుని పళ్లు తోముకుంటూనే ఎంచక్కా ఇంకో పని చేసుకోవచ్చట. బ్రిటన్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీలో సంగీతం నేర్చుకుంటున్న శ్యాం హంటర్ బాక్స్టర్ అనే విద్యార్థి దీనిని రూపొందించాడు. రోజూ పళ్లు తోముకోవడానికి సమయం వ్యర్థం అయిపోతోందని భావించిన ఈ 19 ఏళ్ల గడుగ్గాయి.. జీవితకాలంలో దంతధావనానికి ఎన్ని రోజుల సమయం వ్యర్థం అవుతుందోనని ఓ రోజు లెక్కలేసుకున్నాడు. మొత్తమ్మీద 75 రోజులని తేలింది. ఇంకేం.. చేతులతో పనిలేకుండానే దంతధావనం చేసుకునేందుకు ఉపయోగపడేలా ఈ టోపీని తయారు చేశాడు. అన్నట్టు.. ‘విచిత్ర ఆవిష్కరణల పోటీ’లో ఈ టోపీకి రూ.10 లక్షల బహుమతి కూడా దక్కింది! ఇంటితాళాలు దాచుకునే హీల్స్, బ్రెడ్ ఆకారంలోని రేజర్, మినీట్రెడ్మిల్స్లా పనిచేసే రోలర్స్ బూట్లు, పాదాల వరకూ విస్తరించే గొడుగు వంటి మొత్తం 300 విచిత్ర ఆవిష్కరణలను పోటీలో వెనక్కు నెట్టి మరీ ఈ టోపీ ప్రైజ్‌ను కొట్టేసింది. దీనిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారట. -
నోరు మంచిదైతే... మెదడుకూ మంచిదే! రోజూ వాడే బ్రష్‌తో పక్షవాతాన్నీ తరిమేయండి!
ఇటీవల తమ వద్దకు వచ్చే కేసులతో ఒక కొత్త పరిణామాన్ని గమనించారు దంతవైద్యులు డాక్టర్ ప్రత్యూష, న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మ వీరపనేని. పక్షవాతంతో తన వద్దకు వచ్చిన కేసులను పరిశీలిస్తే... వారికి గతంలో దంత సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చిన కేస్ హిస్టరీని గమనించినట్లు పేర్కొంటున్నారు పద్మ వీరపనేని. అలాగే దంత సంబంధమైన వ్యాధులు జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వచ్చి ఉన్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువే అంటున్నారు డాక్టర్ ప్రత్యూష. ఈ సంయుక్త పరిశీలన ఫలితాలను బేరీజు వేసి చూస్తే... దంతసంబంధమైన వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదనేది ఆ ఇద్దరు డాక్టర్ల మాట. నోటి శుభ్రతతో పక్షవాతానికి వాత పెట్టవచ్చని వారి సలహా. దంతాలకు వచ్చే జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వ్యాధులు దీర్ఘకాలంలో పక్షవాతానికి దారితీసే వైనాన్ని వివరిస్తున్నారు వీరు. చాలామందిలో చిగుర్ల భాగం కాస్తంత ఉబ్బి, ఎర్రగా మారుతుంది. నిజానికి చిగుర్లకు వచ్చే వ్యాధులు నొప్పి లేనివిగా ఉంటాయి. దాంతో చిగుర్లకు వచ్చే వ్యాధుల్ని గుర్తించడం కష్టం. చిగుర్లను ‘జింజివా’ అంటారు. వీటికి వచ్చే ఇన్ఫెక్షనే ‘జింజివైటిస్’. చిగుర్లలోపలి భాగంలో పంటికి గట్టిగా అతుక్కుపోయే గార, బ్యాక్టీరియా వల్ల చిగుర్లవాపు లక్షణంతో కనిపించే జింజివైటిస్ వస్తుంది. ప్రతిరోజూ సరిగా బ్రష్ చేయకపోవడం అనే చిన్న కారణం మొదలుకొని, చాలామందిలో ఉండే పొగాకు నమిలే దురలవాటు వరకు ఈ గార, బ్యాక్టీరియాల పెరుగుదలకు కారణం. మనం రోజూ సరిగా బ్రష్ చేయకపోతే కనీసం 400 రకాల హానికర బ్యాక్టీరియా పళ్ల మధ్య పెరగడానికి ఆస్కారం ఉంది. అలా హానికరమైన బ్యాక్టీరియా కారణంగా పంటిపై గార పెరుగుతుంది. తొలిదశలో గారను సులభంగా తొలగించవచ్చు. కానీ అదే దీర్ఘకాలికంగా ఉంటే తొలగించలేనంత గట్టిగా మారి కాలక్రమంలో పెరియోడాంటైటిస్‌కు దారితీస్తుంది. ఇది ప్రధానంగా పొగతాగేవారిలో, పొగాకును గుట్కా, ఖైనీ, పాన్పరాగ్ల రూపంలో నమిలేవారిలో మరింతగా ఉంటుంది. నోటి ఆరోగ్యానికీ... పక్షవాతానికీ సంబంధమేమిటి? నోటిజబ్బులకూ, చిగుర్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కొన్ని రకాల విషపదార్థాల (టాక్సిన్స్)ను వెలువరిస్తుంటాయి. ఆ టాక్సిన్స్ రక్తంలో ప్రవేశించి, రక్తప్రవాహానికి అడ్డుపడటానికి కారణమయ్యే కొన్ని రక్తపుగడ్డలు (క్లాట్స్)నూ, కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ క్లాట్స్, ప్లాక్స్ ఒకవేళ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలకు అడ్డుపడితే గుండెపోటు రావచ్చు. ఇది ఒక థియరీ. ఇక పక్షవాతానికి దారితీసే మరో థియరీ కూడా ఉంది. దీని ప్రకారం... నోటిలో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందినప్పుడు మన కాలేయంలో కొన్ని రకాల ప్రోటీన్లు తయారవుతాయి. అవి రక్తప్రవాహంలోకి తద్వారా మెదడులోని రక్తనాళాల్లోకి ప్రవేశించి రక్తప్రవాహానికి అడ్డుపడటం వల్ల ‘ఇస్కిమిక్ స్ట్రోక్’ (ఒక రకం పక్షవాతం)కు దారితీయవచ్చు. మెదడులో ఏ అవయవాన్ని నియంత్రించే సెంటర్‌కు రక్తసరఫరా నిలిచిపోతే ఆ భాగం చచ్చుబడి... అలా అది పక్షవాతం రూపంలో వ్యక్తమవుతుంది. ఇదీ నోటిఆరోగ్యానికీ, చిగుళ్ల ఆరోగ్యానికీ... మెదడుకూ ఉన్న సంబంధం. అలాగే కోరపన్నుకు వచ్చే ఇన్ఫెక్షన్ నేరుగా మెదడుకి వెళ్లి కేవర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అనే కండిషన్ వస్తుంది. అది నేరుగా పక్షవాతానికి దారితీస్తుంది. ఇక కొందరిలో అసలు పళ్లే ఉండవు. దాంతో చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశమే ఉండదు. ఇలా చిగుర్ల ఇన్ఫెక్షన్ లేనివాళ్లలో పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్న దృష్టాంతం కూడా పళ్లకూ, పక్షవాతానికి ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తోంది. చిగుర్లు ఆరోగ్యంగానే ఉన్నాయని గుర్తించడం ఎలా? చిగుర్లు గులాబి రంగులో ఆరోగ్యంగా కనిపిస్తుంటాయి. ఈ గులాబి రంగు చిగుర్లు కాస్తా ఎర్రగా వాచి కనిపించడం, బ్రష్ చేసుకుంటుంటే చిగుర్ల నుంచి రక్తం రావడం జరిగితే అది చిగుర్ల వ్యాధి (జింజివైటిస్)కి లక్షణంగా భావించాలి. జింజివైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది దీర్ఘకాలంలో పెరియోడాంటైటిస్‌కు దారి తీస్తుంది. పెరియోడాంటైటిస్ను గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి... చిగుర్లలో పుండ్లు పడటం, దంతాల మధ్య గ్యాప్ పెరగడం, దంతాలు వదులు కావడం వంటి లక్షణాలతో తెలుసుకోవచ్చు. పక్షవాతానికి బ్రష్‌తోనూ నివారణ... మనం రోజూ పళ్లు తోముకునే ఒక చిన్న బ్రష్ గుండెజబ్బులతో పాటు పక్షవాతాన్నీ నివారిస్తుందని తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు బ్రషింగ్ కోసం చేతిని కదిలించడానికి బద్దకిస్తే... అసలు భవిష్యత్తులో చెయ్యే కదలకుండా చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని గుర్తించండి. పంటి పక్కవైపున ఉండే ప్లాక్‌ను ఫ్లాసింగ్‌తో (దారం సహాయంతో) తొలగించుకోండి. ఒకవేళ ఇప్పటికే ప్లాక్ చేరి ఉన్నట్లు గుర్తిస్తే డెంటిస్ట్‌ను కలిసి దాన్ని స్కేలింగ్ వంటి ప్రక్రియలతో తొలగించుకోవాలి. ఒకసారి ఆ పని చేసి ఇక ఆ తర్వాత ఎప్పటికప్పుడు నోటి శుభ్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇది పళ్లను శుభ్రపరచడమే గాక... రక్తనాళాలనూ శుభ్రం చేసి అటు గుండెపోటూ, ఇటు బ్రెయిన్స్ట్రోక్లను నివారిస్తుంది. -నిర్వహణ: యాసీన్ పక్షవాతం రిస్క్ తగ్గించే షార్ట్‌కట్స్ ఇవి... ఊ రోజూ బ్రషింగ్, ఫ్లాసింగ్ ద్వారా దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలను తొలగించాలి దంతాలకు బలం చేకూర్చే సమతుల పోషకాహారం తీసుకోవాలి. దంతాలకు తగినంత క్యాల్షియం లభించేలా పాలు, పాల ఉత్పాదనలు తీసుకోండి సిగరెట్, పొగాకుకు సంబంధించిన ఇతర ఉత్పాదనలైన గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటి అలవాట్లను తక్షణం మానేయండి. అవి తీసుకునే సమయంలో భవిష్యత్తులో అదే పక్షవాతానికి కారణం కావచ్చనే మాటను గుర్తుచేసుకోండి. డాక్టర్ ప్రత్యూష దంత వైద్య నిపుణులు, ప్రొఫెసర్, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. డాక్టర్ పద్మ ఎస్. వీరపనేని సీనియర్ న్యూరాలజిస్ట్, అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ , సికింద్రాబాద్.