
ప్రసూన గొంతులో విరిగిన బ్రష్, (ఇన్‌సెట్లో) శస్త్ర చికిత్స అనంతరం తొలగించిన బ్రష్ ముక్క
విజయనగరం,పార్వతీపురం: జియ్యమ్మవలస మండలం బిత్రపాడు గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి బూరి విద్యాప్రసూన గొంతులో ప్రమాదవశాత్తు బ్రష్ విరిగిపోయింది. శుక్రవారం ఉదయం ఇంటి వద్ద బ్రష్ చేసుకుంటున్న సమయంలో కాలుజారి కింద పడిన సమయంలో ప్రమాదవశాత్తు బ్రష్ రెండు ముక్కలుగా విరిగింది.
ముందు భాగం అంగుళం మేర ప్రసూన గొంతులో కొండనాలుక ప్రాంతంలో నాలిక పైభాగంలో లోపలకి చొరబడింది. చిన్నారి ప్రసూన నొప్పిన తట్టుకోలేక విలవిలలాడింది. వెంటనే తల్లిదండ్రులు పార్వతీపురంలోని చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డా.శంకాప్రతాప్‌కుమార్ ఆసుపత్రికి తీసుకురాగా ఆయన వైద్య పరీక్షలు చేసి అనంతరం చాకచక్యంగా విరిగిన బ్రష్ ముందు భాగాన్ని బయటకు తీసివేశారు. దీంతో ప్రసూన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment