రోజుకి రెండు, మూడు సార్లు బ్రష్ చేసుకోండి అని దంత వైద్యులు చెప్పడం చూశాం. పైగా పడుకునే ముందు తప్పనసరిగా బ్రెష్ చేయండి అని చెబుతారు. అయితే ఇక్కడొక దంత వైద్యురాలు అందుకు విరుద్ధంగా బ్రెష్ చేసుకోవద్దని, ముఖ్యంగా ఆ మూడు సమయాల్లో బ్రష్ వెంటనే చేయొద్దని సలహాలిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ తెగ అవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది.
ఎందుకంటే..? సహజంగా డాక్టర్లు బ్రష్ చేయమని చెబుతుంటారు. అలాంటిది ఈవిడ మాత్రం ఆ మూడు సమయాల్లో బష్ చేయొద్దనడం ఒక్కసారిగా అందరిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఇలా చెబుతోంది లండన్‌కి చెందిన డాక్లర్ షాదీ మనో చెహ్రీ. ఆమె తప్పనిసరిగా ఆ మూడు సమయాల్లో బ్రష్ చేయకుడదని చెప్పారు. ముఖ్యంగా అల్పాహారం, స్వీట్లు, వాంతులు అయినప్పుడు అస్సలు బ్రష్ చేయకూడదట. ఆ టైంలో పీహెచ్ స్థాయిలు లేదా నోటిలో ఆమ్లత్వం ఎక్కువగా అవుతాయట.
ఏదైనా తిన్నప్పుడూ దంతాల మీద బ్యాక్టీరియాయా ఆ పదార్థాలను జీవక్రియ చేసి యాసిడ్‌గా మారుస్తుంది. ఆ టైంలో లాలాజలం బఫర్లు తిరిగి పనిచేయడానికి కనీసం 30 నుంచి 60 నిమిషాలు పడుతుంది. అలాగే వాంతులుచేసుకున్నప్పుడూ కూడా నోరంతా చేదుగా ఉండి ఆమ్లత్వంగా ఉంటుంది. అంటే పుల్లని విధంగా.. చెత్ల టేస్ట్‌గా ఉండే ఫీల్ ఉంటుంది. అందుకని మనం వెంటనే బ్రష్ చేసేస్తాం. కానీ ఆ టైంలో కూడా అస్సలు చేయకూడదట. ఆ విధమైన ఫీల్ తగ్గేంతవరకు ఓపిక పట్టి నిధానంగా బ్రష్ చేసుకోవాలని చెబతున్నారు. అంతసేపు ఓపిక పట్టలేం అనుకుంటే చక్కెర లేని మౌత్‌ఫ్రెష్‌నర్‌లు లాంటి చూయింగ్ గమ్‌లు లేదా ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మౌత్ వాష్‌లు వినియోగించచ్చొని సూచించారు చెహ్రీ.
(చదవండి: నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!)
Comments
Please login to add a commentAdd a comment