
పంజాబ్ కుర్రాడు.. ప్రపంచ రికార్డు!
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల సందీప్‌సింగ్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నోట్లో ఓ టూత్‌బ్రష్ పెట్టుకొని దానిపై వేగంగా తిరుగుతున్న బాస్కెట్ బాల్‌ను 53 సెకన్లపాటు నిలిపాడు. దీంతో ‘టూత్‌బ్రష్‌పై ఎక్కువ సమయంపాటు బాస్కెట్‌బాల్‌ను తిప్పిన’ రికార్డు సందీప్‌సింగ్ పేరుమీద నమోదైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సందీప్‌సింగ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ముందుగా ఓ బాస్కెట్‌బాల్‌ను తీసుకొని దానిని ఓ టూత్‌బ్రష్‌పై పెట్టి వేగంగా తిప్పాడు.
ఆ తర్వాత టూత్‌బ్రష్‌ను తిరుగుతున్న బాల్‌తో పాటు నోట్లో పెట్టుకున్నాడు. అలా దానిని 53 సెకన్ల 62 నానో సెకన్లపాటు నిలిపాడు. ఇప్పటివరకు ఎవరూ ఇంతసేపు టూత్‌బ్రష్‌పై బాస్కెట్‌బాల్‌ను నోట్లో పెట్టుకొని నిలపలేదని చెప్పాడు. అయితే దీనిని గిన్నిస్ రికార్డు నిర్వాహకులు ధ్రువీకరించారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే సందీప్ ప్రయత్నంపై అతడి సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.