Sandeep Singh
-
ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?
మహారాజ్ ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా (Chhaava Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకుంటున్నారు. ఇది కదా మనం తెలుసుకోవాల్సిన చరిత్ర.. భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన ఘనత అంటూ ఉప్పొంగిపోతున్నారు. నేడు (ఫిబ్రవరి 19) శివాజీ మహారాజ్ 395వ జయంతి.శివాజీ బయోపిక్ఈ సందర్భంగా శివాజీ జీవిత కథపై తీస్తున్న బయోపిక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'కాంతార'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీనికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో భవానీ దేవి ముందు శివాజీ కత్తితో నిలబడి ఉన్నాడు. పోస్టర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. 2027లో రిలీజ్సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 21న విడుదల కానుంది. రవి వర్మ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా రేసుల్ సంగీతం అందించనున్నాడు. ఛావా సినిమాతో విక్కీ కౌశల్ పేరు మార్మోగిపోతోంది. తన కెరీర్లోనే ఇదొక మాస్టర్‌పీస్‌గా మిగిలిపోనుంది. రిషబ్‌కు కూడా శివాజీ అతడి జీవితంలోనే బెస్ట్ సినిమాగా నిలవనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by SANDEEP SINGH (@officialsandipssingh) చదవండి: సినిమా కోసం కాదు.. రూమ్‌కు రమ్మని పిలుస్తారు: సనం శెట్టి -
Olympics: షూటింగ్ జోడీలు విఫలం.. పతక రేసు నుంచి అవుట్
Paris Olympics 2024 Day 1: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత షూటర్ల బృందానికి శుభారంభం లభించలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ మెడల్ ఈవెంట్లో మన షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. అర్జున్ బబూటా–రమితా జిందాల్, సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జంట ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయాయి. ఫలితంగా ఈ ఈవెంట్లో భారత్ పతక రేసు నుంచి నిష్క్రమించింది.ఇక ఈ పోటీలో రమితా- అర్జున్ జోడీ ఓవరాల్‌గా 628.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా.. ఇలవేనిల్- సందీప్ ద్వయం 626.3 పాయింట్లతో 12వ స్థానానికి పడిపోయింది.నిబంధనల ప్రకారం.. క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–4లో నిలిచిన నాలుగు జోడీలు మాత్రమే పసిడి, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడే అర్హత సాధిస్తాయి. అయితే, భారత షూటింగ్ జోడీలు ఈ అడ్డంకిని దాటలేకపోయాయి. చైనా, కొరియా, కజకిస్తాన్, జర్మనీ టాప్-4లో నిలిచాయి.గోల్డ్ మెడల్ రౌండ్లో చైనా- కొరియాఈ నేపథ్యంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ మెడల్ ఈవెంట్.. గోల్డ్ మెడల్ రౌండ్లో చైనా- కొరియా అమీతుమీ తేల్చుకోనుండగా.. కాంస్య పతక పోరులో కజకిస్తాన్ జర్మనీతో తలపడనుంది. ఇదిలా ఉంటే.. తదుపరి పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది.భారత్ నుంచి అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో.. మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ (సాయంత్రం గం. 4 నుంచి) మహిళ విభాగంలో పోటీపడనున్నారు.రోయింగ్‌లో మరో అవకాశంఇండియన్ రోవర్ బాల్‌రాజ్ పన్వార్‌కు కూడా తొలిరోజు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మెన్స్ వ్యక్తిగత స్కల్స్ హీట్ 1లో నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే, ప్రతి హీట్ నుంచి టాప్-3 మాత్రమే ఆటోమేటిక్‌గా ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో తొలి ప్రయత్నంలో బాల్‌రాజ్‌కు నిరాశే మిగిలినా.. రేపెచెజ్ రౌండ్ రూపంలో సెమీ ఫైనల్ దారులు ఇంకా తెరిచే ఉన్నాయి. చదవండి: ఆర్చరీలో అదరగొట్టి.. క్వార్టర్ ఫైనల్లో -
‘కేసు వాపస్ తీసుకుంటే నెలకి రూ.1 కోటి ’.. మహిళా కోచ్ సంచలన ఆరోపణ
చండీగఢ్: హరియాణా క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన జూనియర్ మహిళా అథ్లెటిక్ కోచ్ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. కేసు వాపసు తీసుకోవాలని లేదంటే చంపేస్తామని తనను బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, తాను చావుకు భయపడనని, సందీప్ సింగ్‌కు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తనను దేశం విడిచి వెళ్లిపోవాలని, అందుకు నెలకి రూ.1 కోటి చొప్పున ఇస్తామని బేరమాడినట్లు వెల్లడించారు. ‘నా నోరు మూయించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను చావుకు భయపడను. బెదిరింపులు వస్తున్నా వెనక్కి తగ్గను. నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నాకు నచ్చిన దేశానికి వెళ్లిపోతే నెలకి రూ.1 కోటి అందుతాయని ఆఫర్ చేశారు. నా ఫిర్యాదును వెనక్కి తీసుకుని, వేరే దేశానికి వెళ్లమని నన్ను అడిగారు. నాకు తెలుసు ఆయన(సందీప్ సింగ్) మంత్రివర్గం నుంచి తొలగించబడతాడు, జైలుకు వెళతాడు, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.’అని మహిళా కోచ్ తెలిపినట్లు ఏఎన్ఐ నివేదించింది. అలాగే.. ఈ కేసును హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మంగళవారం మాట్లాడారు సీఎం ఖట్టర్. క్రీడాశాఖ మంత్రిపై వచ్చిన లైంగిక ఆరోపణలు అంసబ్ధమైనవని, ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన దోషిగా మారడని స్పష్టం చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా! -
అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా!
హర్యానా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. జూనియర్ మహిళా అథ్లెటిక్స్ కోచ్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో సందీప్‌సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది తన ఇమేజ్ను చెడగొట్టేందుకే కొందరు చేస్తోన్న ప్రయత్నమని రాజీనామా చేసిన అనంతరం సందీప్‌సింగ్ అన్నారు. సందీప్‌సింగ్ మాట్లాడుతూ.. "నా ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతుందని నాకు సృష్టంగా తెలుసు. నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. విచారణ నివేదిక వచ్చే వరకు ముఖ్యమంత్రికి క్రీడా శాఖ బాధ్యతలు అప్పగిస్తాను" అని అతను పేర్కొన్నాడు. ఏం జరిగిందంటే? గురువారం(డిసెంబర్ 29) ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రీడామంత్రి సందీప్ సింగ్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా కోచ్ ఆరోపణలు చేసింది. తనను తొలుత జిమ్ లో మంత్రి చూశాడని... ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తనకు మెసేజ్ లు పెట్టేవాడని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడని ఆమె పేర్కొంది. ఈ క్రమంలోనే శుక్రవారం (డిసెంబర్ 30) చండీగఢ్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ)ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం సెక్షన్లు 354, 354A, 354B, 342, 506 కింద క్రీడా మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని మంత్రి ఖండించారు. అయినప్పటికీ ప్రతిపక్షాల తీవ్ర ఒత్తడి చేయడంతో మంత్రి తన పదవికి విడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. కాగా సందీప్‌సింగ్ గతంలో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. చదవండి: పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్‌కు సత్కారం.. ఎప్పుడంటే? -
మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు
-
మహిళా అథ్లెట్ కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడామంత్రిపై కేసు
హర్యానా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ జూనియర్ మహిళా అథ్లెటిక్స్ కోచ్ ఆరోపణలు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా మంత్రి సందీప్ సింగ్ తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం వెంటనే క్రీడాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఎన్ఎల్డి డిమాండ్ చేసింది. విషయంలోకి వెళితే.. తనను క్రీడామంత్రి సందీప్ సింగ్ లైంగికంగా వేధించాడంటూ బాధితురాలు ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనను తొలుత జిమ్ లో మంత్రి చూశాడని... ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తనకు మెసేజ్ లు పెట్టేవాడని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించారు. తాను స్పందించకపోవడంతో తనకు రావాల్సిన నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ ను పెండింగ్ లో ఉంచాడని... దీంతో ఆయనను తాను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశానని చెప్పారు. ఆ సందర్భంగా తనతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. మరోవైపు దీనిపై మంత్రి సందీప్ సింగ్ స్పందిస్తూ... ఆమె చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని ఖండించారు. చదవండి: ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం -
20 శాతం వృద్ధి: టాటా హిటాచీ
కోల్‌కత: నిర్మాణ రంగానికి అవసరమైన యంత్రాల తయారీలో ఉన్న టాటా హిటాచీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2021–22లో కంపెనీ రూ.4,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అధిక విలువ కలిగిన మైనింగ్ యంత్రాలకు డిమాండ్ నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం 10–12 శాతం అధికం కానుందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ తెలిపారు. ‘మౌలిక రంగం నుంచి డిమాండ్ వృద్ధి 12–15 శాతం ఉంది. మైనింగ్ విభాగం నుంచి ఇది 20–25 శాతానికి ఎగసింది. మొత్తం విక్రయాల్లో మైనింగ్ విభాగం యూనిట్ల పరంగా 8 శాతం సమకూరుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ సెగ్మెంట్ వాటా 15 శాతానికి చేరనుంది. పొరుగు దేశాలు ఆర్థిక కారణాల వల్ల దిగుమతులను తగ్గించిన తర్వాత మధ్యప్రాచ్య, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఎగుమతులు పెరగడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఎగుమతులు ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఏడు శాతం వాటాను కలిగి ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఎగుమతుల వాటా 10 శాతానికి చేరాల్సి ఉంది’ అని వివరించారు. జేవీలో హిటాచీకి 60 శాతం, టాటా కంపెనీకి 40 శాతం వాటా ఉంది. కర్నాటకలోని ధార్వాడ్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. -
దీపికా, రణ్వీర్తో దావుద్ డిన్నర్!
ముంబై : అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంతో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె, ఆమె భర్త, హీరో రణ్వీర్ సింగ్‌లు కలిసి ఫొటో దిగారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రంలో దీపికా, రణ్వీర్, సందీప్, సంజయ్ లీలా భన్సాలీతోపాటు మరికొంత మంది ఉన్నారు. అయితే ఈ ఫోటో 2013లో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ జంటగా నటించిన ‘గోలియోంకి రాస్లీలా రామ్‌లీలా’ సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలోనిది. అయితే ఇందులో దావుద్ కూడా ఉన్నాడని, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె వెనక వరసలో సందీప్ పక్కన కూర్చున్న వ్యక్తిని దావుద్ ఇబ్రహీంగా గుర్తిస్తూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. (‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’) ఈ ఫోటోను జస్టిస్ ఫర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనే పేరుతో క్రియేట్ అయిన ఓ గ్రూప్ పోస్ట్ చేసింది. దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్, సందీప్ తమ స్నేహితులతో కలిసి దిగిన ఈ ఫొటోలో దావుద్ ఇబ్రహీం కూడా ఉన్నాడంటూ ఈ ఫొటోకు క్యాప్షన్‌ను జోడించారు. అయితే ఇదే ఫొటోను సందీప్ సింగ్ ఈ ఏడాది మేలో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఫోటోలో ఉన్న ప్రతి ఒక్కరి పేర్లను కింద పేర్కొన్నారు. దీంతో ఇది వాస్తవం కాదని, ఆ ఫొటోలో దీపికా, రణ్వీర్, సంజయ్ లీలా భన్సాలీతో ఉన్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం కాదని తేలింది. సంజయ్ లీలా భన్సాలీ, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, ఆర్ వర్మన్తోపాటు దావుద్ గా చెబుతున్న వ్యక్తి వాసిక్ ఖాన్‌గా స్పష్టమైంది. వాసిక్ ఖాన్.. బాలీవుడ్లో ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. రామ్‌లీలా సినిమాకు కూడా ఆయనే ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. వాస్తవం: దీపికా, రణ్వీర్, సందీప్‌లతో ఉన్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం కాదు. ఆర్ట్ డైరెక్టర్ వాసిక్ ఖాన్. View this post on Instagram #Iftar is the time of huge blessings, try to gather as many as you can... Breaking bread together since 2013. . #SanjayLeelaBhansali @ranveersingh @deepikapadukone @r_varman_ @siddharthgarima #WasiqKhan A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on May 17, 2020 at 5:25am PDT -
‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం మాజీ ప్రేయసి అంకితా లోఖండే తన జీవితాన్ని అంకితం చేసిందని సుశాంత్ స్నేహితుడు సందీప్ సింగ్ అన్నారు. అంకితా మాత్రమే సుశాంత్‌ను నిజంగా అర్థం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. అసలు రియా చక్రవర్తిని పెళ్లి చేసుకోవాలన్న సుశాంత్ ఆలోచన గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. కాగా ఈ నెల 14 సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని అర్థాంతరంగా తనువు చాలించిన విషయం తెలిసిందే. అయితే కెరీర్ పరంగా సమస్యలు తలెత్తడంతో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అందరూ భావిస్తున్నారు. (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ : కీలక ప్రకటన) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తనకు చెప్పలేదని వెల్లడించారు. సుశాంత్ ఇంట్లో ఎప్పుడూ కొంతమంది వ్యక్తులు ఉండేవారన్నారు. తానెప్పుడూ సుశాంత్‌తో ఫోన్ కాల్స్ ద్వారా టచ్‌లో ఉండే వాడని పేర్కొన్నారు. రియా చక్రవర్తితో సుశాంత్ రిలేషన్ గురించి అడగ్గా.. ‘వాళ్లు పెళ్లి చేసుకుంటారని నాకు తెలీదు. ఆ పెళ్లి గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. నాకు నిజంగా తెలీదు. ఒకానొక సమయంలో సుశాంత్, అంకితా పెళ్లి చేసుకోవాల్సి ఉండేది. నాకు తెలిసినంతవరకు అదే సుశాంత్ చివరి రిలేషన్ అనుకుంటా’. అని తెలిపారు.(తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు: సుశాంత్ తండ్రి) సుశాంత్‌ను అంకితా స్నేహితురాలుగా కాకుండా తన తల్లిగా చూసుకునేదని సందీప్ అన్నారు. అంకితా గురించి మాట్లాడుతూ.. ‘ఆమె సుశాంత్ జీవితంలో తన తల్లి స్థానాన్ని పొందింది. నా 20 ఏళ్ల సినీ పరిశ్రమలో అంకితా లాంటి అమ్మాయిని చూడలేదు. అంత మంచి అమ్మాయి. సుశాంత్‌కు ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకునేది. తన కోసం ఏమైనా చేస్తుంది. సుశాంత్‌కు అనుగుణంగా మెలిగేది. అనికి నచ్చిన ఫుడ్‌ను వండి పెట్టేది. అంకితా తన ఇంటిని సుశాంత్‌కు నచ్చే విధంగా డిజైన్ చేసుకుంది.సుశాంత్ కోసం తన కెరీర్‌ను వదులుకుంది. ఇలా ప్రతిదీ సుశాంత్ ఇష్టం మేరకే చేసేది. అంకితా లాంటి అమ్మాయిని పొందాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇటీవల తనతో మాట్లాడాను అంకితా ఎంత బాధపడుతుందో నాకు తెలుసు’. అంటూ ముగించారు. (‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’) -
బుల్లెట్ దిగినా... స్టిక్ వదల్లేదు
హాకీలో అనూహ్యంగా దూసుకొచ్చిన సందీప్ సింగ్ ఆటపై ధ్యాసతోనే పయనిస్తున్నాడు. హాకీలో మెరుపులు మెరిపిస్తున్న పిన్న వయస్కుడిగా ఘనత కూడా వహించాడు. అతనికి హాకీ స్టిక్ ప్రాణమైంది. ఆటే లోకమైంది. కానీ అంతలోనే ప్రాణం మీదికి తెచ్చింది. తుపాకీ మిస్‌ఫైర్‌తో బుల్లెట్ సందీప్ వెన్నులోకి దిగింది. ఆట కాదు కదా నడకే కష్టమన్నారు. మంచమే దిక్కన్నారు. అదేంటో మంచం దిగాడు. మైదానంలోకీ అడుగు పెట్టాడు. నడక కాదు మైదానంలో గోల్స్ కోసం పరుగు పెట్టాడు. అంతం కావాల్సిన కెరీర్‌ను సందీప్ సంచలనంగా మలచుకున్నాడు. భారత హాకీలో డ్రాగ్ ఫ్లికర్ మెరికగా, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్‌గా ఎదిగిన సందీప్ నిజానికి తనంతట తానుగా హాకీకి ఆకర్షితుడు కాలేదు. సోదరుడు బిక్రమ్‌జీత్ సింగ్ వద్ద ఉండే హాకీ కిట్, బూట్లు చూసి అసూయతోనే ఇటువైపు మళ్లాడు. దాంతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా సందీప్ సింగ్ హాకీ స్టిక్ పట్టేలా చేసింది. ఈ విషయాన్ని అతని తల్లి దల్జీత్ కౌర్ ఓ సందర్భంలో చెప్పింది! అమ్మా... నాకు కిట్లు, బూట్లు కావాలని సందీప్ అడిగితే... ఆడితేనే నీకూ కొనిస్తామని ఆమె బదులిచ్చింది. అలా మొదట కిట్ చేతికి అందుకున్నాడు. మెల్లిగా మైదానం బాట పట్టాడు. వెంటనే యూత్ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆ వెంటే జూనియర్... తర్వాత భారత సీనియర్ జట్టుకు అమాంతం ఎదిగిపోయాడు. అచిరకాలంలోనే తన చురుకుదనం, అంకితభావంతో ఆటలో ఒదిగిపోయాడు. ఇదంతా కూడా రెండు, మూడేళ్లలోనే జరిగిపోవడం విశేషం. 2003లో టీమ్ జెర్సీ... హాకీలో ఓనమాలు నేర్చుకున్నంత సులభంగా గోల్స్ చేయడం కూడా నేర్చుకోవడంతో టీనేజ్లోనే సందీప్ సెలక్టర్ల కంటబడ్డాడు. అలా 2003లో 17 ఏళ్ల సందీప్ సింగ్ భారత జూనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. కరాచీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో అతని దూకుడు హాకీ వర్గాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఏకంగా డజను (12) గోల్స్ చేసిన ఈ పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ భారత్‌కు తొలి జూనియర్ ప్రపంచకప్ విజయాన్ని రుచి చూపించాడు. వెంటనే సీనియర్ సెలక్షన్ కమిటీ ఆలస్యం చేయకుండా ఈ హరియాణా కుర్రాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అలా 18 ఏళ్ల వయసులో 2004లో సుల్తాన్ అజ్లాన్ షా కప్, అదే ఏడాది ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆడటం ద్వారా సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పిన్న వయస్కుడిగా ఘనతకెక్కాడు. బుల్లెట్ మంచాన పడేసినా... నిండా 20 ఏళ్లకు ముందే భారత హాకీ జట్టులో కీలక ఆటగాడయ్యాడు సందీప్. ఇక ఈ ఆరడుగుల బుల్లెట్ కెరీర్ నల్లేరుమీద నడకలా సాగిపోతుందనుకుంటే అనుకోని ఉపద్రవం మిస్‌ఫైర్ రూపంలో ప్రాణంమీదికి తెచ్చింది. 2006 ప్రపంచకప్ (జర్మనీ)కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఓ ‘బుల్లెట్’ అతని వెన్నులోకి దూసుకెళ్లింది. జట్టుతో కలిసేందుకు సహచరుడు రాజ్‌పాల్‌తో కలిసి రైలులో వెళుతుండగా... రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీస్ అధికారి పొరపాటు వల్ల అతని రైఫిల్ మిస్‌ఫైర్ అయ్యింది. అదికాస్తా సందీప్ దిగువ వెన్నెముకను చిదిమేసింది. దీంతో అతని తొలి ప్రపంచకప్ కలతో పాటు కెరీర్, జీవితం అన్ని మూలనపడ్డాయి. ఊపిరే కష్టమంటే... చివరకు కొన్ని రోజులు కోమాలో, ఇంకొన్ని రోజులు పక్షవాతానికి గురైన అతన్ని డాక్టర్లు నడవలేడని తేల్చేశారు. పట్టుదలతో... ప్రాణాపాయమైతే తప్పింది కానీ...ఊపిరి ఉన్నంతవరకు మంచమే దిక్కని డాక్టర్లు చెప్పారు. దీంతో జర్మనీలో మైదానంలో ప్రత్యర్థులతో తలపడాల్సిన సందీప్... ఇంట్లో మంచంపై ఒంటరితనంతో పోరాడాల్సి వచ్చింది. ప్రతికూల ఆలోచనలతో తల్లడిల్లిపోయేవాడు. కానీ అతనిలోని నేర్పరితనం... ఆటలో అలవడిన సుగుణం... వేగంగా ఎదిగేలా చేసిన వైనం... ఇవన్నీ అతని గాయన్ని మాన్పించాయి. మళ్లీ ఆడాలన్న పట్టుదల తిరిగి హాకీ స్టిక్‌ను పట్టించింది. రెండంటే రెండేళ్లలోనే మైదానంలోకి దిగేలా చేసింది. ఒలింపిక్స్‌కు నడిపించాడు... ఇక సందీప్ నడవలేడన్న డాక్టర్లే ఆశ్చర్యపోయేలా అతను భారత జట్టునే ఒలింపిక్స్‌కు నడిపించాడు. ఇలా అతని ఆట, ఒలింపిక్స్ బాట సంచలనంగా మారిపోయింది. 2008లో అజ్లాన్ షా కప్‌లో ఆడాడు. ఆడటమే కాదు తొమ్మిది గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో 12 ఏళ్ల తర్వాత భారత్‌ను విజేతగా నిలిపిన ఘనత కచ్చితంగా సందీప్‌దే. భారత కెప్టెన్‌గా పలు టోర్నీల్లో విజయవంతమైన ఈ డ్రాగ్‌ఫ్లికర్... భారత్‌ను 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేలా కీలకమైన గోల్స్ చేశాడు. ఈ మెగా టోర్నీ కోసం ఫ్రాన్స్‌తో జరిగిన ఆఖరి క్వాలిఫయర్ పోరులో భారత్ 9–1తో ఏకపక్ష విజయం సాధించింది. ఇందులో సందీప్ సింగ్ ఏకంగా ఐదు గోల్స్ చేయడం గమనార్హం. కెరీర్ మొత్తంలో వందకంటే ఎక్కువ గోల్స్ చేసిన సందీప్ 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత హాకీ ఇండియా లీగ్‌లో ముంబై మెజీషియన్స్, పంజాబ్ వారియర్స్, రాంచీ రేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సందీప్ సింగ్ కెరీర్‌పై 2018లో బాలీవుడ్లో ‘సూర్మా’ పేరుతో సినిమా కూడా నిర్మించారు. హరియాణా పోలీసు విభాగంలో ఐదేళ్లపాటు డీఎస్పీగా పనిచేసిన 34 ఏళ్ల సందీప్ గతేడాది రాజకీయాల్లోకి వచ్చాడు. బీజేపీ తరఫున హరియాణాలోని పెహోవా నియోజకవర్గం నుంచి పోటీచేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం రాష్ట్ర మంత్రి వర్గంలో క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. -
బీజేపీలో చేరిన యోగేశ్వర్, సందీప్
న్యూఢిల్లీ : ఒలంపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ గురువారం బీజేపీలో చేరారు. హర్యానా బీజేపీ చీఫ్ సుభాశ్ బరాలా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ దత్ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ తననెంతో ప్రభావితం చేశారని.. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించానని పేర్కొన్నారు. ‘ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో బీజేపీలో చేరాను. ప్రధాని మోదీ పాలన నన్నెంతగానో ప్రభావితం చేసింది. క్రీడాకారులు కూడా ప్రజా సేవలో భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పింది. ఈ కుటుంబం(బీజేపీ)లో సభ్యుడిని కావడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. కాగా హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న వేళ యోగేశ్వర్ దత్, సందీప్ సింగ్ బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున వీరిద్దరు బరిలోకి దిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2012 ఒలంపిక్ క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం అందించిన యోగేశ్వర్ దత్‌ను సోనెపట్ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యోగేశ్వర్ ఇప్పటికే తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక సందీప్ సింగ్‌తో పాటు శిరోమణి అకాలీ దళ్ ఎమ్మెల్యే బాల్కౌర్ సింగ్ కూడా గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సందీప్ సింగ్ మాట్లాడుతూ...ప్రధాని మోదీ, హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌లను ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. జాతికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో కాషాయ కండువా కప్పుకొన్నానని తెలిపారు. -
తప్పులో కాలేసిన విద్యాశాఖ మంత్రి
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సందీప్ సింగ్ తప్పులో కాలేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి బదులుగా 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనండంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలీఘర్‌లో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సందీప్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనమంతా కలిసి 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. చాలా మంది నాయకులు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను కొల్పోయారని, వారి వలనే మనంమంతా సమాన హక్కులను పొందుతున్నామని చెప్పారు. సందీప్ సింగ్ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #WATCH Aligarh: Uttar Pradesh Minister(MoS Education) says "'we are celebrating India's 59th #Republicday" pic.twitter.com/m1VKuIcOhd — ANI UP (@ANINewsUP) January 26, 2018 -
బై బై.. సెర్బియా
సొంత గడ్డపై మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి. ఇక విదేశీ గడ్డపై సత్తా చాటేందుకు వెళ్లారు హీరోయిన్ తాప్సీ. ఇంతకీ...తాప్సీ ప్రజెంట్ ఏ గేమ్ ప్లేయర్ అంటే..‘హాకీ’ అని ఇట్టే ఊహించే ఉంటారు. బీ టౌన్ డైరెక్టర్ షాద్ అలీ దర్శకత్వంలో హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సూర్మ’. సందీప్ రోల్‌ను హిందీ యాక్టర్ దిల్జీత్‌సింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తాప్సీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్‌ను చత్తీస్‌ఘడ్‌లో చిత్రీకరించారు. నిన్నటి వరకు సెర్బియాలో ఒక షెడ్యూల్‌ను చిత్రీకరించారు. అక్కడ కీలకమైన సీన్స్‌లో పాల్గొన్నారు తాప్సీ. ఈ సినిమాను జూన్ 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదండోయ్.. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... తాప్సీ త్వరలోనే ముంబైలో ఓ ఇల్లు కొనాలనుకుంటు న్నారని, సమ్మర్లో గృహప్రవేశం చేయాల నుకుంటున్నారని బాలీవుడ్ టాక్. మరి.. తాప్సీ కొత్త ఇంటి అడ్రెస్ ఎక్కడ? అంటే.. ఆశ..దోశ.. అప్పడం.. వడ.. చెప్పేస్తారేంటి? -
గోల్ కొట్టేస్తా.. హిట్ పట్టేస్తా..!
తాప్సీ గోల్ ఇప్పుడు ఒకటే. హాకీ స్టిక్‌తో బాల్ని గోల్‌పోస్ట్‌లోకి కొట్టడమే. అందుకే హాకీ ఆట గురించి ఆమె ఫుల్‌గా తెలుసుకున్నారు. ఇక చెప్పేదేముంది? హాకీ గేమ్ కిట్‌తో గ్రౌండ్లో దిగిపోయారు. వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. తాప్సీ ఎంతో ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్లా ప్రాక్టీస్ చేస్తున్నారట. ఆమె కాన్సన్ట్రేషన్ చూస్తుంటే షాట్ గురి తప్పదేమో అన్నట్లు ఉందట. ఇదంతా ఓ సినిమా కోసమేనండోయ్. ఇండియన్ హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ బయోపిక్‌ను షాద్ అలీ తెరకెక్కిస్తున్నారు. ‘జూమ్ బరాబర్ జూమ్, కిల్ దిల్, ఓకే జాను’ వంటి హిందీ చిత్రాలను తెరకెక్కించా రాయన. ఈ సినిమాలో దిల్జిత్ దేశాంగ్, తాప్సీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. సందీప్ పంజాబీ కాబట్టి, కీలక సన్నివేశాలను అక్కడ తీయడానికి ప్లాన్ చేశారు. ‘‘నా లైఫ్‌లో స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ పార్ట్. ఇండియాలో నా ఫేవరెట్ ప్లేస్ పంజాబ్. అక్కడ జరగబోయే ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదరు చూస్తున్నాను. ఆల్రెడీ కొన్ని హాకీ సెషన్స్‌ను కంప్లీట్ చేశాను. ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు తాప్సీ. -
పంజాబ్ కుర్రాడు.. ప్రపంచ రికార్డు!
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల సందీప్‌సింగ్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నోట్లో ఓ టూత్‌బ్రష్ పెట్టుకొని దానిపై వేగంగా తిరుగుతున్న బాస్కెట్ బాల్‌ను 53 సెకన్లపాటు నిలిపాడు. దీంతో ‘టూత్‌బ్రష్‌పై ఎక్కువ సమయంపాటు బాస్కెట్‌బాల్‌ను తిప్పిన’ రికార్డు సందీప్‌సింగ్ పేరుమీద నమోదైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సందీప్‌సింగ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ముందుగా ఓ బాస్కెట్‌బాల్‌ను తీసుకొని దానిని ఓ టూత్‌బ్రష్‌పై పెట్టి వేగంగా తిప్పాడు. ఆ తర్వాత టూత్‌బ్రష్‌ను తిరుగుతున్న బాల్‌తో పాటు నోట్లో పెట్టుకున్నాడు. అలా దానిని 53 సెకన్ల 62 నానో సెకన్లపాటు నిలిపాడు. ఇప్పటివరకు ఎవరూ ఇంతసేపు టూత్‌బ్రష్‌పై బాస్కెట్‌బాల్‌ను నోట్లో పెట్టుకొని నిలపలేదని చెప్పాడు. అయితే దీనిని గిన్నిస్ రికార్డు నిర్వాహకులు ధ్రువీకరించారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే సందీప్ ప్రయత్నంపై అతడి సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
రాజేంద్రనగర్: గండిపేట్ చెరువులో దూకి సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సందీప్ సింగ్(27) బెంగళూర్‌లో ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 12న బెంగళూర్ నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొలేకపోతున్నానని బాధపడుతుండటంతో తల్లిదండ్రులు అతడిని ఓదార్చారు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన సందీప్ సింగ్ గండిపేట్ ప్రాంతానికి వచ్చి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వాహనంతో పాటు గట్టు వద్ద సెల్‌ఫోన్ వివరాలతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాకీ జట్టు గోల్‌కీపర్ శ్రీజేష్‌కు పురస్కారం
భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్, వైస్ కెప్టెన్ పీఆర్ శ్రీజేష్‌కు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘లెఫ్టినెంట్ కల్నల్ జీవీ రాజా అవార్డు’ దక్కింది. త్రివేండ్రంలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చేతుల మీదుగా శ్రీజేష్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ అవార్డు కింద శ్రీజేష్‌కు రూ. 3 లక్షల నగదు అందజేశారు. -
ఆకాశ్‌దీప్‌కు రూ.55 లక్షలు
సర్దార్ సింగ్‌కు నిరాశ హాకీ ఇండియా లీగ్ ఆటగాళ్ల వేలం న్యూఢిల్లీ : హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఆటగాళ్ల వేలంలో యువ స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్‌కు భారీ ధర పలికింది. అయితే భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్‌పై ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తి కనబరచకపోవడం ఆశ్చర్యపరిచింది. వచ్చే సీజన్ కోసం శుక్రవారం జరిగిన ఈ వేలంలో ఆకాశ్‌దీప్‌ను ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్ 84 వేల డాలర్ల (రూ.55,56,247)కు కొనుగోలు చేసింది. భారత ఆటగాళ్లలో అత్యధిక మొత్తం ఆకాశ్‌కే దక్కింది. ఆ తర్వాత స్థానంలో 81 వేల డాలర్ల(రూ.53,57,578) ధరతో సీనియర్ డ్రాగ్‌ఫ్లికర్ సందీప్ సింగ్ (రాంచీ రేస్), గుర్మైల్ సింగ్ (దబాంగ్ ముంబై) నిలిచారు. మరోవైపు ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఈ ఏడాది వదులుకున్న సర్దార్ సింగ్‌ను 58 వేల డాలర్ల (రూ. 38,36,290) తక్కువ మొత్తంతో పంజాబ్ వారి యర్స్ తీసుకుంది. ఓవరాల్‌గా జర్మనీ స్టార్ ఆటగాడు మోరిట్జ్ ఫ్యుయర్‌స్టే టాప్‌లో నిలిచాడు. కళింగ లాన్సర్స్ ఈ ఆటగాడిని లక్షా 5 వేల డాలర్ల (రూ.69,46,289)కు తీసుకుంది. -
టయోటా ‘ప్రాడో’.. కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: టయోటా కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ మోడల్.. ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోలో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరను రూ.84.87 లక్షలుగా(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) నిర్ణయించామని కంపెనీ డిప్యూటీ ఎండీ, సీవోవో సందీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ కారు బుకింగ్స్ గురువారం నుంచే ప్రారంభించామని కంపెనీ తెలిపింది. 3.0 లీటర్ 170 బీహెచ్పీ డీ4డీ డీజిల్ ఇంజిన్‌తో కూడిన ఈ కారు ఐదు రంగుల్లో లభ్యమవుతుంది. ఈ కారులో చుట్టుపక్కల పరిస్థితులను సావకాశంగా పరిశీలించడానికి మానిటర్, టైర్లలో ఎంత ప్రెజర్ ఉందో పర్యవేక్షించే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రాల్ కంట్రోల్(రోడ్డు పరిస్థితి జారుడుగా ఉన్నప్పుడు, సరిగ్గా లేనప్పుడు యాక్సిలేటర్, బ్రేక్‌ల అవసరం లేకుండా స్టీరింగ్‌పై పూర్తిగా డ్రైవర్‌కు నియంత్రణ ఉండే సిస్టమ్), మల్టీ టెర్రైన్ సెలెక్ట్(బురద, ఇసుక, రాళ్లతో ఉన్న రోడ్ మోడ్స్‌ను ఎంపిక చేసుకునే ఫీచర్) వంటి ప్రత్యేకతలున్నాయి. 2004లో మార్కెట్లోకి తెచ్చిన ఈ కారుకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని సందీప్ పేర్కొన్నారు.