ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సందీప్ సింగ్ తప్పులో కాలేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి బదులుగా 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనండంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలీఘర్‌లో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సందీప్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనమంతా కలిసి 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. చాలా మంది నాయకులు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను కొల్పోయారని, వారి వలనే మనంమంతా సమాన హక్కులను పొందుతున్నామని చెప్పారు. సందీప్ సింగ్ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH Aligarh: Uttar Pradesh Minister(MoS Education) says "'we are celebrating India's 59th #Republicday" pic.twitter.com/m1VKuIcOhd
— ANI UP (@ANINewsUP) January 26, 2018
Comments
Please login to add a commentAdd a comment