కాస్‌గంజ్‌లోని ఓ వీధిలో కత్తులు, తుపాకులు, కర్రలతో హల్‌చల్ చేస్తున్న యువకులు
సాక్షి, కాస్‌గంజ్ : ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ ప్రాంతంలో చోటు చేసుకున్న మతసంఘర్షణలకు సంబంధించి సాక్ష్యంగా నిలవబోతున్న ఆ వీడియో వైరల్‌గా మారింది. సరిగ్గా ఆ రోజు చందన్ గుప్తా అనే యువకుడిని కొంతమంది దుండగులు తుపాకితో కాల్పులు జరిపిన ఘడియల్లో రికార్డయినదే ఆ వీడియో. కాసన్‌గంజ్ ప్రాంతంలో రిపబ్లిక్ డే నాడు మతపరమైన ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రిపబ్లిక్ డేను పురస్కరించుకొని త్రిరంగ యాత్ర నిర్వహించారు.
అది సరిగ్గా ముస్లిం డామినేషన్ ఉండే ప్రాంతంలో నుంచి వెళుతుండగా చందన్ గుప్తా అనే యువకుడు మరో మిత్రుడితో కలిసి బైక్‌పై త్రివర్ణపతాకంతో వెళుతుండగా అనూహ్యంగా అతడిపై కాల్పులు జరిగాయి. దాంతో అతడు చనిపోగా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో కొందరు యువకులు తుపాకులు, కత్తులు, కర్రలు, రాళ్లతో వీధుల వెంట హల్‌చల్ చేస్తూ వెళ్లారు. గాల్లోకి తుపాకులు కాలుస్తూ ఎవరైనా ఎదురొస్తే కాల్చిపారేస్తామని బెదరిస్తూ ముందుకెళ్లారు. ఈ దృశ్యాలను ఎవరో వ్యక్తి ఓ అంతస్తుపై నుంచి తీయగా అది ఇప్పుడు బయటకు వచ్చి పెద్ద వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment