
పశ్చిమ బెంగాల్ సీఎం దేశభక్తి పాటను ఆలపించి..
గురువారం 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించకుని అన్ని చోట్ల చాలా ఘనంగా వేడుకలు జరిగాయి. అలానే పశ్చిమ బెంగాల్‌లో కూడా చాలా వైభవంగా జరిగింది. ఐతే ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించకుని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశభక్తి గీతాన్ని ఆలపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తెల్లటి కాటన్ చీరలో బెంగాల్ కవి ద్విజేంద్రలాల్ సరే రాసిన 'ధోనో ధన్నే పుష్పే భోరా' అనే పాటను ఇతర గాయకులతో కలిసి ఆలపించారు.
ఈ పాట బెంగాల్‌లో ఉన్న వనరులను, అక్కడి వారసత్వాన్ని తెలియజేస్తుంది. మమత ఈ పాటను ఆలపించి తన దేశభక్తిని చాటుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన పశ్చిమబెంగాల్‌లో కోల్‌కతాలోని ప్రసిద్ధ దుర్గాపూజా ఢిల్లీలోని నిర్వహించిన కవాతులో ప్రదర్శించారు. ట్రాక్టర్ ముందు భాగంలో నారికేళంతో ఉన్న పూర్ణ కలశం దాని ముందు మాతృదేవతా ఆరాధన నమునా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
(చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ)