పెళ్ళికూతురు డాన్స్‌..అంతలోనే విషాదం.. | Shocking Video: Bride Dance On Road In Baraat Escaped From Car Accident | Sakshi
Sakshi News home page

పెళ్ళికూతురు డాన్స్‌..అంతలోనే విషాదం..

Published Thu, Feb 18 2021 10:06 AM | Last Updated on Thu, Feb 18 2021 3:33 PM

Shocking Video: Bride Dance On Road In Baraat Escaped From Car Accident - Sakshi

ముజఫర్‌ నగర్‌: జోష్‌గా  మొదలైన వధువు పెళ్ళి ఊరేగింపు కాస్త విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో వధువు పెళ్ళి బృందం కళ్యాణ మండపానికి కారులో బయలుదేరారు. బంధువులు, మిత్రులందరు సంతోషంగా డాన్సులు చేస్తున్నారు. వధువు ప్రత్యేక కాస్టూమ్స్‌, సన్‌గ్లాసెస్‌ ధరించి కారులోని రూఫ్‌పైన నిలబడి ఉత్సాహంతో  స్టేప్పులు వేస్తుంది. కానీ..అకాస్మాత్తుగా ఒక కారు వేగంగా పెద్ద శబ్ధం చేసుకుంటు వధువు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. రెప్పపాటులో అక్కడి వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు ఫుల్‌ జోష్‌తో డాన్స్‌లు చేస్తున్న వారు కాస్త, దూరంగా ఎగిరిపడ్డారు.

కాగా, ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 12 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి  విషమంగా ఉంది. అదృష్టవశాత్తు పెళ్ళికూతురు మాత్రం దీని నుంచి క్షేమంగా బయటపడింది. దీనికి  సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతొంది. 

చదవండి: విహారంలో విషాదం.. ఉలిక్కిపడ్డ షేక్‌పేట
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement