కాబోయే భార్యను తలచుకుంటూ ముసి ముసి నవ్వులతో పెళ్లి కొడుకు దేవ్ కుమార్ గుర్రమెక్కి పెళ్లి మంటపానికి బందు మిత్ర సపరివారంగా తరలి వెళ్లాడు. బాజా భజంత్రీల సమక్షంలో అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. కొత్తభార్యతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. మెడలో మెరిసిపోతున్న కరెన్సీ మాలను చూసుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చాడో తెలియదు ఆగంతకుడు. పెళ్లి కొడుకు మెడలోని కరెన్సీ దండలోని 100 రూపాయలనోటను అమాంతం ఎగరేసుకుపోయాడు ఘొక మినీ ట్రక్ డ్రైవర్ కాజేశాడు. ఒక్క క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకుని అత్యత సాహసంగా అతణ్ణి వెంబడించి పట్టుకున్నాడు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
పియూష్ రాయ్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీని ప్రకారం. తన మెడలోని నోట్ల దండను ట్రక్ డ్రైవర్ కొట్టేయడంతో వెంటనే అప్రమత్తమైన వరుడు పెళ్లీ, గిళ్లీ తరువాత చూద్దాం అనుకున్నాడో ఏమో గానీ, నగదు దండను చోరీ చేసిన డ్రైవర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. హైవేపై ట్రక్‌ను వెంబడించాడు. అత్యంత సాహసంతో స్టంట్‌మ్యాన్‌లాగా ట్రక్‌పైకి దూకాడు. చాకచక్యంగా క్యాబిన్‌లోకి ప్రవేశించి అతగాడిని దొరకబుచ్చుకున్నాడు. నాలుగు తగిలించాడు. ఇంతులో అతని వెనకాలే ఫాలో అయిన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు కూడా తోడయ్యాడు. దీంతో పొరపాటు జరిగిందని వదిలేయాలంటూ లబోదిబో మన్నాడు. దీంతో దేవ్ కుమార్ హీరోగా అయిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పన్నీ కామెంట్లను షేర్ చేశారు. దెబ్బకి పెళ్లి కూతురు ఫిదా అని ఒకరు, కొత్త పెళ్లి కూతురు స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ నా మనసు దోచేశావ్ అని పాడుకుంటుందేమో అని మరికొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు పెళ్లి రాత్రిని తప్పించుకోవడానికి వరుడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడని కొందరు, ఇంత చేసినా అమ్మాయి ఇంప్రెస్ అవుతుందా అని ఇంకొందరు ఫన్నీగా కమెంట్ చేశారు. <
Video of the year!
In UP's Meerut, groom Dev Kumar was happily getting home after the wedding when a pick up driver pinched a note from his currency tucked garland. What followed was a near Bollywood, daring chase for justice! Groom Dev Kumar asked for lift from a motorist,… pic.twitter.com/libIH8PRTT— Piyush Rai (@Benarasiyaa) November 25, 2024
రవాణా సంస్థ ప్రకటన
ట్రక్ స్థానిక రవాణా సంస్థకు చెందినది, దీని యజమాని మనీష్ సెహగల్ ఈ సంఘటనపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రక్ డ్రైవర్ దొంగ కాదని, దొంగతనంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని వాదించారు. అతని వాహనానికి వ్యతికేంగా వేగంగా దూసుకురావడం వల్లే పెళ్లి ఇలా చేశాడని ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేనప్పటికీ వరుడు , అతని స్నేహితులు డ్రైవర్‌పై దాడి చేశారని సెహగల్ ఆరోపించారు. దీంతో ఏం జరిగిందో స్పష్టత లేక బుర్ర గోక్కుంటున్నారట స్థానిక పోలీసులు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment