ఏడు ఆపరేషన్లు, ఏడు లక్షలు ఖర్చు, చివరికి ఏడడుగులు: ముద్దుగుమ్మల లవ్‌స్టోరీ | Unique wedding in Uttar Pradesh's Kannauj after gender change operation | Sakshi
Sakshi News home page

ఏడు ఆపరేషన్లు, ఏడు లక్షలు ఖర్చు, చివరికి ఏడడుగులు: ముద్దుగుమ్మల లవ్‌స్టోరీ

Published Fri, Dec 20 2024 5:57 PM | Last Updated on Sat, Dec 21 2024 2:07 PM

Unique wedding in Uttar Pradesh's Kannauj after gender change operation

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిల స్నేహం వీర ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇందులో పెద్ద వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ జంటలోఒక  అమ్మాయి తన లింగాన్ని మార్చుకుని పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన  వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఒక అమ్మాయి  ఏకంగా ఏడుసార్లు లింగ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్లు  చేయించుకుంది ఇందుకోసం ఏడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది. అంతేకాదు ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగాజరిగిన పెళ్లి వేడుకలో ఏడడుగులు  వేసింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట తెగవైరల్‌ అవుతున్నాయి.

 

కన్నౌజ్‌లోని సరయామీరాలో ఉన్న డెవిన్ తోలా ప్రాంతానికి  వీరిద్దరూ ఇటీవల కొన్ని రిలేషన్‌షిప్‌లో ఉన్నారట.  వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో తన లింగాన్ని మార్చుకొని మరీ స్నేహితురాల్ని పెళ్లాడింది.   గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బదౌన్‌కు చెందిన ఓ యువతి టీచర్ గా పని చేసేందుకు బరేలీకి వచ్చింది. అక్కడ ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది.    అయితే పెళ్లి, లేదంటే చావు అన్న స్థితికి వచ్చారు. దీంతో కుటుంబ సభ్యుల చొరవతో లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకుని  అన్ని అవరోధాలు అధిగమించిన తరువాత వివాహం చేసుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement