‘మురారి’, ‘వరుడు’ సినిమాల లెవల్లో పెళ్లి చేసుకోవాలని ఒకపుడు పెళ్లి కాని పిల్లలు కలలు కనేవారు. కాలానికి తగ్గట్టు ఇపుడు ట్రెండ్ మారింది. బ్లాక్ బస్టర్ మూవీ ప్రేరణతో పెళ్లి చేసుకోవడం విశేషంగా నిలిచింది. 'వార్ మెషిన్ గన్'తో వధూవరుల ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల వేలాది ఫన్నీ కామెంట్లతో సందడితో ఏకంగా 15 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
రణబీర్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక నటించిన యానిమల్ స్ఫూర్తితో కదిలే స్టీల్ మెషిన్ గన్‌పై జంట వివాహ వేడుకును జరుపుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆశిష్ సుయ్వాల్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ మూవీలో రణబీర్ కేరెక్టర్ 500 కిలోల మూవబుల్ స్టీల్ మెషిన్ గన్‌ని ఉపయోగించి తన శత్రువులతో పోరాడిన దృశ్యాలు అభిమానులను ఉర్రూతలూగించి. ఈ నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్‌లా ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంగాపై వివాహ వేదికకు చేరుకోవడాన్ని ఈ వీడియోలు చూడవచ్చు. వధువు సిగ్గుతో గన్ క్యారేజ్‌పై కూర్చొని ఉండగా, వరుడు గర్వంగా ఈ స్పెషల్ రైడ్‌ను ఆస్వాదిస్తున్నాడు.
“హవ్వా పగ, ప్రతీకారంతో అధికారంకోసం మనుషులను చంపే పాత్రగా ఎందుకు మారతారు" అని ఒకరు, "ఆమె తన జీవితంలో తదుపరి యుద్ధానికి సిద్ధమవుతోంది’’ అని ఒకరు వ్యాఖ్యానించారు క్రియేటివిటీకోసం ఎంతకైనా తెగిస్తున్నారు అంటే ఇంకొక నెటిజన్ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇది ఎక్కడ జరిగింది అనే వివరాలు మాత్రం అందుబాటులో లేవు.
Comments
Please login to add a commentAdd a comment