Machine guns
-
డ్రోన్లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు
చైనీస్ మిలటరీ ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. ఇంతవరకు మిషన్గన్తో కూడిన రోబో శునకాలను చూశాం. ఐతే వాటినే రణరంగంలోకి దింపి శత్రువుపై ఆకస్మకి దాడులు చేయించే టెక్నాలజీకి నాంది పలకింది చైనా రక్షణ శాఖ. ఈ మేరకు డ్రోన్ సాయంతో మిషన్గన్తో కూడిన రోబో శునకాలను శత్రువు ఉండే ప్రాంతంలో వదిలేస్తారు. అది వెంటనే తన టార్గెట్‌ని ఏర్పాటు చేసుకుంటూ దాడులు చేయడం ప్రారంభించింది. ఇది శత్రువులకు సైతం అర్థంకాని విధంగా వ్యూహాత్మక ఆకస్మిక దాడులు చేస్తోంది. దీంతో శత్రువుని సులభంగా మట్టి కరిపించగలమని చైనీస్ మిలటరీ చెబుతోంది. అంతేకాదు ఆ రోబో కుక్క నాలుగు కాళ్లపై నుంచుని గన్ని ఓపెన్ చేసి తన టార్గెట్‌ని చూసుకుంటూ దాడులు నిర్వహిస్తోంది. అందుకు సంబంధించిన వీడీయోని చైనా మిలటరీ అనుబంధంగా ఉండే కెస్ట్రెల్ డిఫెన్స్ బ్లడ్-వింగ్‌కి సంబంధించిన విబో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Has anyone watched the War of the Worlds cable series! Chinese military contractor created a video showing off its terrifying new military technology, revealing a robot attack dog that can be dropped off by a drone. https://t.co/wW9kYR70N0 pic.twitter.com/grrWutK8ge — Shell (@EwingerMichelle) October 27, 2022 (చదవండి: మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ) -
రోబోటిక్ డాగ్ ... సైనికుడిలా కాల్పులు జరుపుతోంది: వీడియో వైరల్
టెక్నాలజీతో మానవుడు అసాధ్యం అనుకున్న వాటన్నంటిని సాధ్యం చేసి చూపించాడు. ఆకాశానికే నిచ్చేన వేసేంతగా టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. అందులో భాగంగానే ఇపుడే ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్ పేరుతో అత్యాధునిక రోబోలను తయారు చేస్తున్నాడు. మావనవుడు చేయగలిగే వాటన్నింటిని రోబోలే చేసేలా రూపొందించాడు. అందులో భాగంగానే రూపొందచిందే ఈ రోబో డాగ్. ఈ రోబో డాగ్ అచ్చం కుక్క మాదిరిగానే ఉంటూ...పైనా ఆటోమేటిక్ మెషిన్ గన్ అమర్చి ఉంటుంది. ఇది మన పెంపుడు కుక్కల మాదిరిగానే ఇంటిని కాపలా కాస్తూ... దొంగలు చొరబడకుండా ఉండేలా వారిని భయపెట్టేలా కాల్పులు జరుపుతుంటుంది. ఇదే ఈ రోబో డాగ్లోని ప్రత్యేకత. ఐతే ఈ రోబో డాగ్‌ని రష్యకు చెందిన ఆటామానోవ్ రూపొందించాడు. అతను 'హోవర్‌సర్ఫ్' అనే ఏరోపరిశ్రమ వ్యవస్థాపకుడు. అతని కంపెనీ కాలిఫోర్నియాలోని శాస్జోస్లో ఉంది. అంతేకాదు అతను ఈ రోబో ఎలా తన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని కాల్పులు జరుపుతుందో కూడా వివరించారు. ఈ రోబో డాగ్ పై అమర్చిన తుపాకీ రష్యన్ - PP-19 విత్యాజ్, AK-74 డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇలాంటి రోబోలు అవసరమా అని ప్రశ్నిస్తూ..ట్వీట్ చేశారు. ఇలాంటి రోబోలు మనుషులపై దాడులు చేస్తే యజమానులు నేరం నుంచి సులభంగా తప్పించుకునే అవకాశం ఉందంటూ పలు అనుమానాలు లేవనెత్తారు కూడా. All the people who laughed off the “worrywarts” years ago for freaking out about the Funny Dancing Robot Dogs (tm) should be forced to watch this video once a day for the remainder of the year. pic.twitter.com/WBIrlGah3w — Sean Chiplock (@sonicmega) July 20, 2022 (చదవండి: రైలు వంతెనపై మంటలు...నదిలోకి దూకేసిన ప్రయాణికులు) -
ఆయుధాల అడ్డా..
మనం కిరాణా షాపుకెళ్లి.. పప్పులు ఉప్పులు కొంటాం.. అదే ఇక్కడికెళ్తే.. ఏకే 47లు, మెషీన్ గన్లు, పిస్టళ్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ కిరాణా షాపులున్నట్లే.. అక్కడ ఆయుధాలు అమ్మే దుకాణాలు ఉంటాయి..! ఇంతకీ ఎక్కడ? పాకిస్థాన్‌లోని దర్రా ఆదం ఖేల్ చిన్న పట్టణమే.. అయితే.. అక్రమాయుధాలకు పెద్ద అడ్డా. ఇక్కడ ప్రధాన వీధికి రెండు వైపులా దుకాణాలు. అన్నీ గన్లు అమ్మేవే! ఇక్కడి ప్రజల్లో 75 శాతం మంది ఇదే బిజినెస్‌లో ఉన్నారు. ఏ మోడల్ గన్ను అయినా.. ఇక్కడ లోకల్‌గా దొరికే సామాన్లతో వీరు డూప్లికేట్‌ను తయారుచేసేసి అమ్మేస్తారు. పెన్నుల్లో ఇమిడిపోయే గన్ల దగ్గర్నుంచి.. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాల వరకూ అన్నీ.. గత 150 ఏళ్లుగా ఇక్కడి బిజినెస్ మూడు గన్నులు ఆరు గ్రనేడ్లుగా వర్థిల్లుతోంది. ముఖ్యంగా తాలిబన్లు వంటి టైస్టులు వీరి వద్ద నుంచి ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తారని చెబుతారు. కొన్నాళ్లు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోని పాక్ ప్రభుత్వం.. చివరికి ఈ ఆయుధాలను టైస్టులు తమపైకి గురిపెట్టేసరికి.. కొన్నిసార్లు దాడులు జరిపింది. భారీ ఆయుధాల తయారీని నిషేధించింది. అయినప్పటికీ.. షరామామూలే..