theaf
-
Australia: దొంగను చంపి..శవంతో 15 ఏళ్లు సహవాసం
ఆస్ట్రేలియా(సిడ్నీ): ఇంట్లో దొంగచొరబడితే ఏం చేస్తాం?..నాలుగు తగిలించి పోలీసులకు అప్పగిస్తాం. అయితే ఓ వ్యక్తి మాత్రం దొంగను చంపి 15 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. 2002 ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన షేన్ స్నెల్‌మన్ దొంగతనానికి వెళ్లగా.. బ్రూస్ రాబర్ట్స్ అనే వ్యక్తి అతడ్ని కాల్చి చంపాడు. దొంగ శవాన్ని 15 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. మృతదేహం నుంచి వాసన రాకుండా 70కి పైగా ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించాడు. అయితే ఈ విషయం పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఏబీసీ ద్యారా తెలిసినట్లు "కరోనర్ కోర్టు" తెలిపింది. ఈ కోర్టు మిస్టరీ మరణాలపై విచారణకు ఆదేశాలను జారీ చేస్తుంది. అయితే 2017లో రాబర్ట్స్ హీటర్‌పై పడి మరణించగా..ఇరుగు పొరుగువారు అతడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన జరిగిన సంవత్సరం తరువాత ఓ వ్యక్తి ఆ ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లగా...స్నెల్మాన్ అవశేషాలు లభించాయి. కాగా, రాబర్ట్స్ తన ఇంటిని ఎప్పుడూ విడిచి వెళ్లేవాడు కాదని, ఆ ఇంట్లో డజనుకు పైగా తుపాకీలు లభించాయని అక్కడి వారు పోలీసులకు తెలిపారు. (చదవండి: USA: భార్యతో గొడవ.. భర్తకు షాకిచ్చిన అమెరికా కోర్టు) -
అత్తాకోడళ్లు చోరీ చేసి.. డైపర్‌లో దాచి..
కంకిపాడు: పట్టపగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన అత్తాకోడళ్లను కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.కాశీవిశ్వనాథ్ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కంకిపాడు బస్టాండ్ సెంటరులోని ఓ ఇంట్లో పచ్చిపాల రత్న రామకోటేశ్వరరావు కుటుంబం ఉంటోంది. ఈనెల 23న ఉదయం రత్న రామకోటేశ్వరరావు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంటి వెలుపల ఓ బాలింత రోజుల వయస్సు బిడ్డకు పాలిస్తూ కనిపించింది. తాళం తెరిచి ఇంట్లోకి వెళ్లిన రామకోటేశ్వరరావు ఇంట్లో ఫ్యాన్లు, టీవీ ఆన్‌లో ఉండడం, బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడం, ఓ మహిళ ఇంట్లో వెతుకులాడుతుండడం చూసి నిర్ఘాంతపోయాడు. దీంతో ఇరుగుపొరుగువారిని పిలిచాడు. స్థానికులు ఇంట్లోని మహిళతోపాటు, బయట ఉన్న బాలింతనూ పట్టుకుని పోలీసులు అప్పగించారు. ఫిర్యాదుపై చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చోరీ చేసి.. డైపర్‌లో దాచి.. ఈ ఇద్దరు మహిళలూ విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, బోయపాటి సాధ్వితని, వీరిద్దరూ వరుసకు అత్తాకోడళ్లని, పాతనేరస్తులని పోలీసులు గుర్తించారు. గతేడాది నవంబరులో సీసీఎస్ పోలీసులు పలు చోరీ కేసుల్లో ఈ ఇద్దరినీ అరెస్టు చేశారని, ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలయ్యారని తేల్చారు. అప్పట్లో అరెస్టయ్యేనాటికి గర్భిణిగా ఉన్న సాధ్విత ఈ నెల 8న ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రోజుల వయస్సు ఉన్న బిడ్డతో సాధ్విత, ధనలక్ష్మి ఇద్దరూ మాచవరం నుంచి ఆటోలో కంకిపాడుకు వచ్చి తాళం వేసి ఉన్న ఇల్లును ఎంచుకుని మధ్యాహ్నం సమయంలో చొరబడ్డారు. బీరువాలో ఉన్న చెవి బుట్టలు, ఉంగరం, మేటీలు, వెండి వస్తువులు, రూ.6 వేలు నగదు అపహరించారు. చోరీ సొత్తును బిడ్డకు వేసిన డైపర్‌లో దాచారు. సాధ్విత ఇంటి బయటకు వచ్చేసి బిడ్డకు పాలిస్తుండగా, ధనలక్ష్మి లోపల ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని వెతుకుతున్న సమయంలో ఇంటి యజమాని రావడంతో నిందితులిద్దరూ పట్టుబడ్డారు. వీరి వద్ద చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. వీరిద్దరిపైనా విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో 6 కేసులు ఉన్నాయి. 200 తాళం చెవులు స్వాధీనం అత్తా కోడళ్లు పగటిపూటే చోరీలకు పాల్పడుతుంటారని, వీరి వద్ద చోరీకి వినియోగించే సుమారు 200 వరకూ ఇళ్ల తాళం చెవులను స్వాధీనం చేసుకున్నామని సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని వివరించారు. సమావేశంలో ఎస్ఐ వై.దుర్గారావు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: పని చేయాలని చెప్పడమే పాపమైంది.. -
మెకానిక్‌లమని చెప్పి అంబులెన్స్ అపహరణ
సాక్షి, ఇల్లెందు/గుండాల: తాము మెకానిక్‌లమని చెప్పి 102 అంబులెన్స్ డ్రైవర్ నుంచి తాళాలు తీసుకుని ట్రయిల్ వేస్తామంటూ ఉడాయించారు. వెంటనే సమాచారం అందించగా, పోలీ సులు వెంబడించారు. దీంతో ఇల్లెందు వద్ద వదిలి పారిపోయారు. ఈ సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రి పరిధిలో తిరిగే 102 అంబులెన్స్‌ను రిపేరు చేయాలని ముగ్గురు గుర్తు తెలియ ని వ్యక్తులు కారులో వచ్చి ట్రయల్ వేస్తామని తాళాలు తీసుకున్నారు. ఓ వ్యక్తి అంబులెన్స్‌ను తీసుకుని వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత మిగిలిన ఇద్దరు కూడా వెళ్లిపోయారు. ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే కాచనపల్లి, ఇల్లెందు పోలీసులకు సమాచారం అందించారు. కాచనపల్లి నుంచి అంబులెన్స్‌ను వెంబడించగా ఇల్లెందు దగ్గర వదిలి పారిపోయాడు. వెంటనే పోలీసులు 102 వాహనాన్ని ఆస్పత్రి సిబ్బందికి అప్పగించారు. -
వయసు 16..కేసులు 23
అతని వయసు 16 ఏళ్లు.. నేర చరిత్రేమో ఘరానా దొంగకు ఏ మాత్రం తీసిపోదు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ ల్లో అతనిపై 23 కేసులు నమోదై ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇతనితో పాటు ఓ మేజర్ బి.గణేష్, మరో ఇద్దరు బాల నేరస్తులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. ముషీరాబాద్: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన పి.వెంకటేశ్వర్లు భార్య పిల్లలతో బతుకుదెరువు కోసం నగరంలోని అశోక్‌నగర్‌కు వచ్చాడు. హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. అతని కుమారుడు పి.వీరబాబు అలియాస్ వినోద్ అలియాస్ వీరా నాల్గవ తరగతి చదువుతున్న సమయంలో పక్క విద్యార్థి చెయ్యి విరిచాడు. దీనితో పాఠశాల యాజమాన్యం వీరబాబుకు టీసీ ఇచ్చి పంపించింది. ఆ తర్వాత ఇతన్ని కూకట్‌పల్లిలోని పెద్దమ్మ దగ్గరకు పంపించగా, చోరీలకు పాల్పడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో బాచుపల్లి పీఎస్‌లో 2 కేసులు, మియాపూర్‌లో 11 కేసులు, కూకట్‌పల్లిలో 1 కేసు, సనత్‌నగర్‌లో 1 కేసు, సైదాబాద్‌లో 1 కేసు.. మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. ఇతనితో వేగలేక తల్లిదండ్రులు స్వగ్రామానికి వెళ్లిపోయారు. వీరబాబు నాలుగుసార్లు అరెస్టై జైలు (జువైనల్ హోం)కు వెళ్లాడు. రెండుసార్లు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తాజాగా హోంలో తోటి బాల నేరస్తున్ని విపరీతంగా కొట్టి తప్పించుకున్నాడు. జువైనల్ హోంలో పరిచయమైన బాకారానికి చెందిన బుషిపాక గణేష్ దగ్గరకు వెళ్లాడు. వీరిద్దరు రాంనగర్ లక్ష్మమ్మ పార్కు వద్ద ఉండే బాల నేరస్తుడు మద్దెల సిద్దార్థ అలియాస్ సిద్దూ, హరినగర్‌కు చెందిన విద్యార్థి నాంపల్లి సాల్మ¯Œ రాజులతో కలసి చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. ఈ క్రమంలో ముషీరాబాద్, నల్లకుంట, చిక్కడపల్లి, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 7 కేసులు నమోదయ్యాయి. మంగళవారం గోల్కొండ క్రాస్ రోడ్స్‌లో వీరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని పోలీసులు పట్టుకుని విచారించారు. ద్విచక్ర వాహనాలను, సెల్ఫోన్లను, బంగారు గొలుసులను చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.1.70 వేల రెండు యాక్టివాలు, 2 సెల్ఫోన్లు, ఒక్క ముత్యాల దండ, 25 తులాల వెండి పట్టగొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, చిక్కడపల్లి ఏసీపీ నర్సింహారెడ్డి, ముషీరాబాద్ డీఎస్పీ గంగాధర్, డీఐ వెంకన్న, డీఎస్ఐ బాలరాజు తెలిపారు. -
అంతర్ జిల్లా ఆటో దొంగల ముఠా అరెస్ట్
నాలుగు ఆటోలు స్వాధీనం పాల్వం^è : ఖమ్మం, వరంగల్ జిల్లాలో వరుస ఆటోల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పీఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎంఎ షుకూర్ వివరాలను వెల్లడించారు. శుక్రవారం ఎస్ఐలు పి.సత్యనారాయణరెడ్డి, టి. కృష్ణయ్యలు విశ్వసనీయ సమాచారం మేరకు అల్లూరి సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొత్తగూడెంకి చెందిన ఎండీ అన్వర్‌ఖా¯ŒS, కల్లూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన మేకల నరేష్, పాల్వంచ ఇందిరా కాలనీకి చెందిన పిట్టా క్రాంతికుమార్, సంజయ్‌నగర్‌కు చెందిన పూల హేమంత్, కరకవాగుకు చెందిన వజ్జా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు బయటపడ్డాయి. పాల్వంచ, కల్లూరు, ఖమ్మం, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో వరుసగా నాలుగు ఆటోలను చోరీ చేసింది ఈ ముఠానే అని తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి ఆటోలను రికవరీ చేశామని, వాటి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐలు సత్యనారాయణ, కృష్ణయ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
అసలు దొంగ అత్తే
♦ చోరీ కేసు ఛేదించిన పోలీసులు ♦ వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాంరెడ్డి ఎర్రుపాలెం : ఇంటి దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బంగారు ఆవరణాలను రికవరీ చేయడంతోపాటు దొంగను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైరా డీఎస్పీ రాంరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. రాజులదేవరపాడుకు చెందిన వేమిరెడ్డి పెద్ద శివారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 4న తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాడు. ఇంటికి కాపలాగా తక్కెళ్లపాడుకు చెందిన తన అత్త శీలం ఇందిరను ఉంచి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన ఇందిర, తనకు పరిచయం ఉన్న తక్కెళ్లపాడుకు చెందిన ఇనపనూరి రామారావుతో కలిసి ఇంట్లో బీరువాలోని రూ.2.73లక్షల విలువైన 91 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి తిరిగొచ్చిన శివారెడ్డి భార్య ఈనెల 6న చోరీ విషయాన్ని గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈనెల 7నడీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని.. దర్యాప్తును వేగవంతం చేశారు. విచారణ మొదట్లో ఇంటికి ఎవరో ఓ వ్యక్తి వచ్చి వెళ్లాడని, తాను ఆ సమయంలో ఇంటి వెనుక గేదెలకు గడ్డి వేసేందుకు వెళ్లానని, అప్పుడే చోరీ జరిగి ఉంటుందని నిందితురాలు ఇందిర కథ అల్లింది. ఈ మేరకు డీఎస్పీ రాంరెడ్డి సూచనలతో సీఐ నూనె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో విచారణ చేపట్టారు. దీంతో శివారెడ్డి అత్త ఇందిర తన స్నేహితుడు రామారావుతో కలిసి దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. శుక్రవారం నిందితులు ఇందిర, రామారావు బంగారు ఆభరణాలు విక్రయించేందుకు విజయవాడ వెళ్లే నిమిత్తం ఎర్రుపాలెం రింగ్ సెంటర్లో బస్సు కోసం నిరీక్షిస్తుండగా.. విశ్వసనీయ సమచారం మేరకు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ఎన్.గౌతమ్, ట్రెయినీ ఎస్సై ఆంజనేయులు, ఐడీ కానిస్టేబుల్ నారాయణ వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మధిర కోర్టుకు రిమాండ్ చేశారు. కాగా, కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు అధికారులకు డీఎస్పీ నగదు బహుమతి అందించారు. -
దొంగ దొరికాడు
పశ్చిమగోదావరి: నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగ తనాలకు పాల్పడిన నిందితుడిని ఎట్టకేలకు మామిడి కుదురులో పోలీసులు పట్టుకున్నారు. రాజోలు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన గుడిసే విజయబాబు(35) బాగా చేయితీరిగిన దొంగ. దీంతో పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం విజయబాబును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5.28 లక్షల విలువైన బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు, డెల్ ట్యాబ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.