zPod Driverless Car In Bengaluru, Internet Stunned - Sakshi
Sakshi News home page

రద్దీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న డ్రైవర్‌లెస్ కారు.. నెటిజన్లు ఫిదా..! వీడియో వైరల్..

Published Thu, Jul 27 2023 6:27 PM | Last Updated on Thu, Jul 27 2023 6:44 PM

Driverless Car In Bengaluru Internet Stunned - Sakshi

బెంగళూరు: బెంగళూరు రోడ్లపై డ్రైవర్ లేకుండా నడుస్తున్న ఓ వింత ఆకారంలో ఉన్న వాహనం స్థానికుల్నిఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేదో బాలీవుడ్ మూవీలో కారు ఆకారంలో ఉన్న వాహనంలా ఉందని ఓ యూజర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆన్‌ ద స్ట్రీట్స్‌ ఆఫ్ బెంగళూరు అనే క్యాప్షన్‌ను జతచేసి పోస్టు చేశాడు. ఈ కారును చూసిన నెటిజన్లు ఇదేంటీ ఇలా ఉందని? ప్రశ్నించారు. డ్రైవర్ లేకుండా ఎలా ఇంత ట్రాఫిక్‌లో నడుస్తోందని ఆశ్చర్యానికి గురయ్యారు. 

ఈ కారుని జీప్యాడ్‌ అని అంటారని ఓ యూజర్ క్లారిటీ ఇచ్చాడు. సెల్ఫ్ డ్రైవింగ్ కారుని మైనస్ జీరో అనే అంకుర సంస్థ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని మైనస్ జీరో సంస్థ తన ఇన్‌స్టా పేజీలో వివరంగా పేర్కొంది. ఇప్పటికే రెండు సార్లు ఈ వాహనం రోడ్లపై కనిపించిందని బెంగుళూరు వాసులు తెలిపారు. టెస్టింగ్‌లో భాగంగానే ఇలా రోడ్లపై కారు ప్రత్యక్షమైనట్లు సమాచారం. ఇది భారతదేశంలోనే మొట్ట మొదటి అటానమస్‌ వాహనం.

అయితే.. సంప్రదాయ కార్లకు భిన్నంగా ఉండే ఈ జీప్యాడ్‌కు స్టీరింగ్ ఉండదు. హై రిజల్యూషన్ కెమెరాలతో ట్రాఫిక్‌లోనూ నడుస్తోంది. ఈ కారులో మొత్తం 6 కెమెరాలు అమర్చారు. వీటి సాయంతో చుట్టూరా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తుంది. ప్రమాదం అనిపిస్తే వెంటనే వాహనం నిలిచిపోతుంది. ట్రాఫిక్‌ సమస్యను, రోడ్డు ప్రమాదాలను తగ్గించటంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చినట్లు మైనస్‌ జీరో తెలిపింది.

ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement