driverless
-
డ్రైవర్ లేకుండానే... 70 కి.మీ. వెళ్లిన గూడ్స్
జమ్మూ/చండీగఢ్: గూడ్స్ రైలొకటి డ్రైవర్ లేకుండానే 70 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. అధికారులు చివరికి అప్రమత్తమై ఇసుక బస్తాలను పట్టాలపై అడ్డుగా ఉంచి రైలును నిలపగలిగారు. ఘటన జమ్మూ–జలంధర్ సెక్షన్లో ఆదివారం ఉదయం 7.25 నుంచి 9 గంటల మధ్యలో చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్ నుంచి కంకర లోడున్న 53 బోగీల డీజిల్ లోకోమోటివ్ గూడ్స్ రైలు పంజాబ్ వైపు బయలుదేరింది. డ్రైవర్ మార్పిడి కోసం కథువా స్టేషన్ వద్ద రైలును ఆపారు. తర్వాత ఏం జరిగిందో ఏమో..రైలు నెమ్మదిగా జమ్మూ–జలంధర్ సెక్షన్ దిశగా ముందుకు సాగింది. కొంత సేపటికి విషయం తెలిసిన అధికారులు ఆ మార్గంలోని స్టేషన్లతోపాటు, రైల్–రోడ్ క్రాసింగ్‌ల వద్ద అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపు 70 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఊంచి బస్సీ వద్ద పట్టాలపై ఇసుక బస్తాలను అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు. ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. -
రద్దీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న డ్రైవర్‌లెస్ కారు.. నెటిజన్లు ఫిదా..!
బెంగళూరు: బెంగళూరు రోడ్లపై డ్రైవర్ లేకుండా నడుస్తున్న ఓ వింత ఆకారంలో ఉన్న వాహనం స్థానికుల్నిఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేదో బాలీవుడ్ మూవీలో కారు ఆకారంలో ఉన్న వాహనంలా ఉందని ఓ యూజర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బెంగళూరు అనే క్యాప్షన్‌ను జతచేసి పోస్టు చేశాడు. ఈ కారును చూసిన నెటిజన్లు ఇదేంటీ ఇలా ఉందని? ప్రశ్నించారు. డ్రైవర్ లేకుండా ఎలా ఇంత ట్రాఫిక్‌లో నడుస్తోందని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కారుని జీప్యాడ్ అని అంటారని ఓ యూజర్ క్లారిటీ ఇచ్చాడు. సెల్ఫ్ డ్రైవింగ్ కారుని మైనస్ జీరో అనే అంకుర సంస్థ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని మైనస్ జీరో సంస్థ తన ఇన్‌స్టా పేజీలో వివరంగా పేర్కొంది. ఇప్పటికే రెండు సార్లు ఈ వాహనం రోడ్లపై కనిపించిందని బెంగుళూరు వాసులు తెలిపారు. టెస్టింగ్‌లో భాగంగానే ఇలా రోడ్లపై కారు ప్రత్యక్షమైనట్లు సమాచారం. ఇది భారతదేశంలోనే మొట్ట మొదటి అటానమస్ వాహనం. On the streets of Bengaluru. @peakbengaluru pic.twitter.com/VtahXpa6Mh — anirudh ravishankar (@anrdh89) July 22, 2023 అయితే.. సంప్రదాయ కార్లకు భిన్నంగా ఉండే ఈ జీప్యాడ్కు స్టీరింగ్ ఉండదు. హై రిజల్యూషన్ కెమెరాలతో ట్రాఫిక్‌లోనూ నడుస్తోంది. ఈ కారులో మొత్తం 6 కెమెరాలు అమర్చారు. వీటి సాయంతో చుట్టూరా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తుంది. ప్రమాదం అనిపిస్తే వెంటనే వాహనం నిలిచిపోతుంది. ట్రాఫిక్ సమస్యను, రోడ్డు ప్రమాదాలను తగ్గించటంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చినట్లు మైనస్ జీరో తెలిపింది. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
డ్రైవర్ లేకుండా మెట్రో రైలు
వాహనం నడపాలంటే డ్రైవర్లు తప్పనిసరి. కానీ ఆధునిక సాంకేతికత డ్రైవర్ల అవసరం లేకుండా ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తోంది. పాశ్యాత్య దేశాలలో డ్రైవర్‌లెస్ కార్లు ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. అలాగే ఐటీ సిటీలో డ్రైవర్లతో నిమిత్తం లేకుండా మెట్రో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. కంట్రోల్ రూం నుంచి రైలు గమనాన్ని పర్యవేక్షిస్తారు. డ్రైవర్లకు అనారోగ్యం, సమ్మె వంటి సమస్యలతో ఇబ్బంది ఉండదు. బనశంకరి: బెంగళూరులో డ్రైవర్లు లేకుండానే మెట్రో రైళ్లు దూసుకుపోనున్నాయి. ఈ ఏడాది చివరిలో ప్రారంభిస్తున్నట్లు బీఎంఆర్సీఎల్ అధికారులు తెలిపారు. దీనికి కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2020 డిసెంబరులో దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. తరువాత దేశ ఆర్థిక రాజధాని ముంబై లో డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు వచ్చాయి. ఆగస్టులో తమిళనాడు రాజధాని చైన్నెలో అమలులోకి రానుంది. ఇప్పుడు ఐటీ సిటీలో శ్రీకారం చుట్టబోతున్నారు. ఆర్వీ రోడ్డు– బొమ్మసంద్ర మార్గంలో 19 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ గా ఉన్న గులాబీ లైన్లో (ఆర్వీ రోడ్డు– బొమ్మసంద్ర) ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది, నిజానికి గత ఏడాది పూర్తి కావలసి ఉంది. కానీ కోవిడ్ కారణంగా పనులు ఆలస్యం కావడంతో ఈ ఏడాది చివరిలో ప్రారంభించే కారిడార్‌లో డ్రైవర్ రహిత మెట్రో నడపడానికి బీఎంఆర్సీఎల్ సన్నాహాలు చేస్తోంది. సీబీటీసీ సిగ్నలింగ్ ఆధారంగా డ్రైవర్లు లేకుండా ఈ రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు తెలిపాయి. ఇంటర్‌చేంజ్‌గా సిల్క్‌బోర్డు స్టేషన్ నమ్మ మెట్రో గులాబీ మార్గం నిర్మాణదశలో ఉండగా దీని పొడవు 18.82 కిలోమీటర్లు. ఈ మార్గాన్ని ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర కు అనుసంధానిస్తారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్ కాగా 16 స్టేషన్లు కలిగి ఉంది. ఆర్వీ రోడ్డు స్టేషన్ టెర్మినల్ స్టేషన్ కాగా గ్రీన్ లైన్‌తో ఇంటర్చేంజ్ కల్పిస్తారు. సిల్క్‌బోర్డు స్టేషన్ గులాబీలైన్, నీలి లైన్ మధ్య మరో ఇంటర్ చేంజ్ స్టేషన్ కానుంది. గులాబీ లైన్‌ను మొదట్లో బొమ్మసంద్ర వరకు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పుడు బొమ్మసంద్ర నుంచి తమిళనాడులోని హోసూరు పట్టణం వరకు విస్తరించడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎలా పనిచేస్తాయంటే ► డ్రైవర్ రహిత రైళ్లను నడపడానికి మెట్రో రైల్వేలో సాంకేతికంగా మార్పులు చేశారు. ఆధునిక సీబీటీసీ సిగ్నలింగ్ వ్యవస్థలను అమర్చారు. ఇది రైళ్లు స్వయంచాలితంగా సంచరించడానికి సహాయపడుతుంది. ►గులాబీ (పర్పుల్) లైన్‌కు సీబీటీసీ సాంకేతికతను అమర్చారు. ఎలక్ట్రానిక్ సిటీ, గొట్టిగెరె, నాగవార, సిల్క్‌బోర్డు, కెంపేగౌడ విమానాశ్రయం లాంటి కొత్త మార్గాల్లో సీబీటీసీ వ్యవస్థను అమర్చుతారు. ►డ్రైవర్ రహిత మెట్రోరైలులో డ్రైవర్ ఉండరు, ఒక అటెండర్ మాత్రం ఉంటారు, అత్యవసరం అనుకుంటే అటెండర్ డ్రైవింగ్‌ను తీసుకుంటారు. డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడేళ్లు సంచరిస్తే ఆ అటెండర్ అవసరం కూడా ఉండదని మెట్రో అధికారులు తెలిపారు. ►ప్రతి రైలును కంట్రోల్ రూమ్ కేంద్రాల ద్వారా పర్యవేక్షిస్తారు. -
డ్రైవర్ లేకుండా దూసుకెళ్లిన బైక్
-
డ్రైవర్ లేకుండా దూసుకెళ్లిన బైక్.. ‘దెయ్యం పట్టిందా ఏంటి’
ముంబై: మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణగావ్ ప్రాంతం.. రోడ్డుపై అడపాదడపా వాహనాలు వెళుతున్నాయి. పెద్దగా రద్దీ లేదు. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డు మీదకు దూసుకొచ్చింది. ఎవరబ్బా.. ఇంత స్పీడ్‌గా రోడ్డుగా మీదకు వచ్చింది అని చూస్తే.. షాక్. బైక్ మీద ఎవ్వరు లేరు. వార్ని డ్రైవర్ లేకుండా ఇంత స్పీడ్‌గా రోడ్డు మీదకు దూసుకువచ్చింది.. బైక్‌కు ఏమైనా దెయ్యం పట్టిందా ఏంటి అనుకున్నారు దాన్ని చూసినవారు. ఇంతలో ఓ వ్యక్తి తేరుకుని రోడ్డు మీదకు వచ్చి ఇతరులను అప్రమత్తం చేశాడు. బైక్ అలా స్పీడ్‌గా వెళ్తుండగా.. అనుకోకుండా దానికి ఎదురుగా ఓ జీపు వేగంగా ముందుకు వచ్చింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి..బ్రేక్ వేశాడు. బైక్ దానికి కొద్దిగా ఢీకొని…ఏకంగా టర్న్ తీసుకుంది..కొద్దిదూరం వెళ్లి కింద పడిపోయింది. డ్రైవర్ లేని ఈ బైక్ రోడ్డుపై సుమారు 300 మీటర్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏముంది కొన్ని క్షణాల పాటు జనాలను హడలెత్తించింది బైక్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. దీన్ని చూసిన వారు ‘‘డ్రైవర్ లేకుండా బైక్ నడవడం ఏంటి.. కొంపదీసి దీన్ని ఏమైనా దెయ్యం ఆవహించిందా.. ఏంటి’’ అని కామెంట్ చేయసాగారు నెటిజనులు. అయితే కొందరు ఈ డ్రైవర్‌లెస్ బైక్ జర్నీ గురించి వివరించారు కొందరు. ఈ బైక్ ప్రమాదవశాత్తు రోడ్డుమీద వెళుతున్న మరో వ్యక్తిని ఢీకొనడంతో దాన్ని నడిపే అతడను కిందపడిపోయాడని తెలిపారు. అయితే..బైకర్ కిందపడిపోయినా..బైక్ మాత్రం ముందుకు దూసుకెళ్లిందని వెల్లడించారు.. ఈ ఘటనలో బైక్ ఢీకొన్న వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. -
2025 నాటికి 25 నగరాల్లో మెట్రో
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో తొలి డ్రైవర్‌లెస్ ట్రైన్‌ను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలను 25 నగరాలకు విస్తరిస్తామని ప్రకటించారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో అన్ని ప్రజా రవాణా సేవలను పొందేందుకు వీలు కల్పించే ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’నూ ప్రారంభించారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉండగా, ప్రస్తుతం ఆ సేవలు 18 నగరాలకు విస్తరించాయన్నారు. ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉంటే పట్టణాలో ‘మెట్రోలైట్’ విధానంలో తక్కువ ఖర్చుతో మెట్రో సేవలందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జల మార్గాలకు అవకాశమున్న నగరాల్లో ‘వాటర్ మెట్రో’ విధానం ఒక వినూత్న ఆలోచన అవుతుందన్నారు. ప్రస్తుతం మెజెంటా లైన్(జానక్‌పురి వెస్ట్ – బొటానికల్ గార్డెన్)లో ఈ ట్రైన్లు నడుస్తాయని, మరో ఆరు నెలల్లో పింక్ లైన్(మజ్లిస్ పార్క్ – శివ్ విహార్)లో ప్రారంభిస్తామని వెల్లడించింది. 21వ శతాబ్దపు భారత దేశ వైభవాన్ని ఢిల్లీ ప్రతిబింబించాలని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని పాత పర్యాటక నిర్మాణాలను ఆధునీకరించడంతో పాటు, నగరానికి 21వ శతాబ్దపు హంగులను అద్దనున్నామన్నారు. సాగు ఉత్పత్తుల కోసం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతుల ఆదాయం పెంచేందుకు విప్లవాత్మక సంస్కరణలను ప్రారంభించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో సోమవారం 100వ కిసాన్ రైలు సర్వీసును మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్లోని షాలిమార్ వరకు ఈ కిసాన్ రైలు నడవనుంది. చిన్న, మధ్య తరహా రైతులు తమ ఉత్పత్తులను సూదూరంలో ఉన్న మార్కెట్లలో అమ్ముకునేందుకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉన్న ఈ కిసాన్ రైళ్లు ఉపయోగపడ్తాయని ప్రధాని వివరించారు. ఈ రైళ్లకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా రైల్వే స్టేషన్లకు దగ్గరలో రైల్ కార్గో సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు. -
నేడు పట్టాలపైకి డ్రైవర్ రహిత తొలి ట్రైన్
సాక్షి, న్యూఢిల్లీ: మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా మన దేశంలో పట్టాలెక్కనుంది. ఈ రైలు సర్వీసును ప్రధాని మోదీ 28న ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్ –బొటానికల్ గార్డెన్) లో డ్రైవర్ రహిత సర్వీసుకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. దీనితోపాటు ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్లో పూర్తిస్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సేవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభిస్తారు. ఈ ఆవిష్కరణలు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంతో పాటు, రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని అధికారులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 7 శాతం డ్రైవర్‌లెస్ మెట్రో రైల్ నెట్వర్క్ జాబితాలో ఢిల్లీ కూడా చేరుతుందన్నారు. సోమవారం మెజెంటా లైన్లో డ్రైవర్‌లెస్ సర్వీసులు ప్రారంభమైన తరువాత, 2021 మధ్య నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్లో డ్రైవర్‌లెస్ ట్రైన్ సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. -
డ్రైవర్‌లెస్ ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోల తొలి డ్రైవర్ రహిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ‘దేశంలోని తొలి డ్రైవర్ రహిత, ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు సర్వీసు 37 కిమీలు మెజెంటా లైన్ మార్గంలో (జానక్‌పురి వెస్ట్ బొటానికల్ గార్డెన్ వరకు) డిసెంబర్ 28న ప్రారంభం కానుంది. ఈ సర్వీసును మోదీ ప్రారంభిస్తారు’ అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. -
ఆ ట్రాలీ ఆటోని దెయ్యం నడిపిందా?
-
ఆ ట్రాలీ ఆటోని దెయ్యం నడిపిందా?
అహ్మదాబాద్ : గుజరాత్లో ఓ ట్రాలీ ఆటో రోడ్డుపై హల్ చల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. డ్రైవర్ లేకుండానే దానికదే ప్రయాణింటంతో అంతా అవాక్కవుతున్నారు. భరూచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సరుకులతో ఉన్న ఆ ట్రాలీ రహదారిపైకి ఎక్కేసి ముందుకు సాగింది. ఈ క్రమంలో మోటర్ బైక్ మీద వెళ్తున్న వెంటనే వీడియో తీయటం ప్రారంభించారు. డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత కూడా అది ముందుకు సాగింది. కొద్ది దూరం వెళ్లాక ఓ లారీని తగిలినప్పటికీ.. అది ఆగలేదు. అక్కడ బైక్ పై ఉన్న ఓ వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక ఓ ట్రక్కును ఢీకొట్టి అప్పుడు అది ఆగిపోయింది. ఈ ఘటనలో దాని అద్దం పగిలిపోయింది. ఇక ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా దెయ్యం ఆ ఆటో నడిపి ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తే... ఇండియాలోనే ఇలాంటి ఘటనలు జరుగుతాయని మరికొందరు... ఇంకొందరైతే గూగుల్, యాపిల్, జీఎం లాంటి వాళ్లు చేస్తున్న డ్రైవర్ లెస్ వాహనాల ప్రయోగాల కంటే మనమే ముందున్నామంటూ సెటైర్లు వేస్తున్నారు. -
తాగదు... తూలదు!
ఈ బస్సు పెట్రోల్ తాగదు. ఎందుకంటే విద్యుత్‌తో నడుస్తుంది. ఈ బస్సు నిద్రకు తూలదు. ఎందుకంటే ఇందులో డ్రైవర్ ఉండడు. బస్సు నడిపేటప్పుడు డ్రైవర్ వేరే ధ్యాసలో ఉన్నా... కాస్త నిద్రమత్తుతో జోగుతున్నట్టు కనిపించినా మనకు గుండెలు దడదడా కొట్టుకుంటాయి. అలాంటిది బస్సును కంట్రోల్ చేయడానికి అసలు డ్రైవరే లేకపోతేనో? అమ్మో అనిపిస్తోంది కదూ! కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే భవిష్యత్తులో బస్సుల్ని డ్రైవర్లు నడపరు... వాటికవే నడుస్తాయి! బస్సు అంటే కండక్టర్ రైట్ రైట్ అంటుండాలి. స్టీరింగ్ పట్టుకుని డ్రైవర్ బస్సుని నడుపుతుండాలి. ఇదీ మనం చూసేది, ఊహించేది కూడా. కానీ ఇది 21వ శతాబ్దం. పాత వాసనలను వదిలించుకుని టెక్నాలజీ ఆసరాతో కొత్తకొత్త వింతల్ని సృష్టిస్తున్న కాలం. అలాంటి ఓ వింతే... ఈ ఈజెడ్-10 బస్సు. దీనిలో డ్రైవర్ ఉండడు. స్టీరింగ్ వీలే కనపడదు. అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అడ్డంకులను అధిగమిస్తూంటే... జీపీఎస్ వంటి అప్లికేషన్ల సాయంతో సాగిపోతుంది. గమ్యం చేరిపోతుంది. ఇంతకీ ఎక్కడుందీ బస్సు?! పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఈ బస్సును ఫిన్లాండ్లో చాలాకాలంగా వాడుతున్నారు. ఒకేసారి 12 మంది వరకూ ప్రయాణం చేయవచ్చు. ముందుగా నిర్దేశించిన మార్గంలో షటిల్ సర్వీస్ చేసేందుకు వాడుతున్నారు దీన్ని. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈజెడ్-10 మెట్రో స్టేషన్లను, బస్టాండ్లను అనుసంధానించేందుకు, పెద్ద పెద్ద మాల్స్ లేదా ఎయిర్‌పోర్టుల్లో ఒకవైపు నుంచి ఇంకోవైపునకు వెళ్లేందుకు బాగా ఉపయోగపడుతుందని అంచనా. బస్సు, ట్రామ్‌ల మాదిరిగా దీనికి ఏ విధమైన మౌలిక సదుపాయాలూ అవసరం లేదు. నిర్దేశిత రూట్లలో మొబైల్ యాప్ ద్వారా కూడా బస్సు సర్వీసు పొందవచ్చు. బస్సు రాగానే దానిపైన ఉండే బటన్ నొక్కితే తలుపులు తెరుచుకుంటాయి. వికలాంగులు లేదా చిన్నపిల్లల ట్రాలీతో ఉండేవారి కోసం ప్రత్యేకమైన ర్యాంప్ కూడా ఉంది. -
డ్రైవర్ లెస్ టెక్నాలజీ రేసులో చైనా!
బీజింగ్ః భారీ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థ గూగుల్ కు పోటీగా ప్రముఖ చైనా సంస్థ స్వయం చోదిత కార్లను సిద్ధం చేస్తోంది. చైనా ఆటోమొబైల్ తయారీ సంస్థతో కలసి ఇంటర్నెట్ దిగ్గజం బైడు ఈ డ్రైవర్ లెస్ కార్ల తయారీ చేపట్టనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం, యంత్ర మేథస్సుల కలయికతో ఈ స్వయం చోదిత కార్లను తయారు చేయనున్నట్లు చైనా క్లౌడ్ కంప్యూటింగ్ సేవల సమావేశంలో బైడు సీనియర్ ఉపాధ్యక్షులు వాంగ్ జిన్ తెలిపారు. చైనా తయారీదారులు, ఇంటర్నెట్ దిగ్గజాలు డ్రైవర్ లెస్ టెక్నాలజీవైపు దృష్టి సారిస్తున్నారు. అమెరికా సంస్థలకు దీటుగా డ్రైవర్ లెస్ కార్ల తయారీకోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే మార్కెట్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పటికే గూగుల్ స్వయం చోదిత కారును అమెరికాలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. గత ఆరేళ్ళుగా బిఎమ్ డబ్ల్యూ, వోల్వో, టయోటాల సహకారంతో గూగుల్ అటానమస్ వాహనాల తయారీ చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చైనా ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం'బైడు' తయారీదారులు 'చంగన్' తో కలసి అదే రేసులో ఎంటరయ్యే ప్రయత్నం చేస్తోంది. దేశ మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి వాహనాల టెస్ట్ లో రాజధానికి నైరుతిలోని పర్వతశ్రేణుల్లో 2,000 కిలోమీటర్ల అత్యధిక దూరం ప్రయాణించిన రెండు స్వీయ డ్రైవింగ్ ఛంగన్ కార్లు ఇప్పటికే బీజింగ్ ఆటో షో లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. దీనికితోడు మరో చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం 'లీ ఎకో' కూడ అటానమస్ టెక్నాలజీలోకి ప్రవేశించి ఓ ఎలక్ట్రానిక్ కారును బీజింగ్ లో ఆవిష్కరించింది. చైనాలో 'బైడు' సంస్థ మొదటిసారి స్థానికంగా రూపొందించిన డ్రైవర్ లెస్ వాహనం గతేడాది చివరల్లో బీజింగ్ లోని వీధుల్లో 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ స్థానికులను ఆకట్టుకుంది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో చైనా ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ స్థానిక వినియోగదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి, కీలక మార్కెట్ గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఇక స్టీరింగ్ లేని బస్సులు!
వాగానింజన్: రోడ్లపైకి డ్రైవర్ లేని బస్సులు రాబోతున్నాయి. స్టీరింగ్ లేని బస్సులు వాటంతట అవే ప్రయాణికులను తీసుకొని వెళ్లి వారి గమ్య స్థానాలకు చేర్చనున్నాయి. నెదర్లాండ్స్‌లోని వాగానింజన్ పట్టణంలో శుక్రవారం ప్రయోగాత్మకంగా ఈ బస్సులను నడుపుతున్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ తరహా ప్రయాణికులను చేరవేసే డ్రైవర్ లెస్ బస్సులను ప్రవేశపెడుతున్న దేశంగా నెదర్లాండ్స్ రికార్డు సృష్టిస్తోంది. ప్రయాణికులు వచ్చి కూర్చోగానే వాటంతట అవే వెళ్లే విపాడ్ పబ్లిక్ షెటిల్ సర్వీస్‌లను ఆరుగురు ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా రూపొందించారు. ఇవి గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. రోడ్లపై సమీపంలో ఉన్న ఇతర వాహనాలు, పరిసరాలను గుర్తించడానికి ఈ ఎలక్ట్రిక్ బస్సులు అత్యాధునిక కెమేరాలు, రాడార్, లేజర్ సెన్సార్లను ఉపయోగించుకుంటాయి. బస్సులోని ఆన్ బోర్డ్ కంప్యూటర్ క్యాబిన్ బ్రేకులను నియంత్రిస్తుంది. విపాడ్లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు అవసరమైతే అందులో నుండే కంట్రోల్ రూం ను కాంటాక్ట్ చేసే సౌకర్యం కల్పించారు. విపాడ్ సర్వీస్ పై అక్కడి అధికారి ఐరిస్ ఇవాన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా డ్రైవర్ లెస్ వాహనాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మొట్టమొదటిసారిగా వీటిని మేం ప్రవేశపెడుతున్నాం అని తెలిపారు. రాబోయే నెలల్లో ఈ బస్సులను విస్తరించనున్నట్లు ఇవాన్ వెల్లడించారు. -
డ్రైవర్ లెస్ కారులో ఇక సేఫ్ గా వెళ్లొచ్చు..
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించిన డ్రైవర్ లెస్ కారుతో ఇక ప్రమాద రహిత ప్రయాణం చేయొచ్చునట. లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన కార్లతో అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నిర్వాహకులు మరిన్ని అధ్యయనాల అనంతరం ఇప్పుడు సురక్షితమైన కార్లను రూపొందించారు. పాదచారులు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తి.. కారుకు దగ్గరకు వస్తే పసిగట్టి సెన్సర్లు పనిచేయడంతో కారు... దానంతట అదే తప్పించుకొని వెళ్ళే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. సుమారు లక్ష మైళ్ళ దూరం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా టెస్టింగ్ దశ పూర్తయిన అనంతరం ఆ సంస్...థ కార్ల తయారీలో మరింత సురక్షితంగా ఉండే డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కారుకు ఏర్పాటు చేసిన స్పీకర్ సిస్టం, స్క్రీన్లు డ్రైవర్ అవసరం లేకుండానే రోడ్డు మీద సురక్షితంగా వెళ్ళే అవకాశం ఉందని పేటెంట్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ నూతన ఆవిష్కారంలోని కారు డోర్లు, స్క్రీన్లు పాదచారులకు సెన్సర్ల ఆధారంగా 'స్టాప్', 'సేఫ్ క్రాస్' వంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ను తెలుపుతూ హెచ్చరికలు జారీ చేస్తాయి. వాహనంలోని కంప్యూటర్లు పాదచారులు వెళ్ళాల్సిన మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఇద్దరికి మాత్రమే సీటు ఉండే ఈ కారు... కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా గ్యారేజ్ కు మెసేజ్ పంపిస్తే చాలు నడవడం ప్రారంభమౌతుంది. అయితే ఈ కొత్త కారు సిస్టమ్ కు సంబంధించి ఎటువంటి స్కెచ్ ను గూగుల్ ప్రస్తుతానికి విడుదల చేయలేదు. కానీ గత నెల్లో నిస్సాన్ విడుదల చేసిన సిస్టమ్ కు ఇంచుమించు దగ్గరగా ఇది ఉండే అవకాశం ఉంది. నిస్సాన్ విడుదల చేసిన డ్రైవర్ లెస్ కారు టీట్రో ఫర్ డేజ్ ను... వెహికిల్ ఫర్ ది డిజిటల్ నేటివ్ గా సామాజిక మీడియా అభివర్ణించింది. ఈ తెల్లని కారు ఇప్పుడు సవరణల అనంతరం క్లీన్ కాన్వాస్ గా రూపొందించబడింది. -
త్వరలో రోడ్డెక్కనున్న డ్రైవర్‌లెస్ కార్