ముంబై: మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణగావ్ ప్రాంతం.. రోడ్డుపై అడపాదడపా వాహనాలు వెళుతున్నాయి. పెద్దగా రద్దీ లేదు. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డు మీదకు దూసుకొచ్చింది. ఎవరబ్బా.. ఇంత స్పీడ్‌గా రోడ్డుగా మీదకు వచ్చింది అని చూస్తే.. షాక్. బైక్ మీద ఎవ్వరు లేరు. వార్ని డ్రైవర్ లేకుండా ఇంత స్పీడ్‌గా రోడ్డు మీదకు దూసుకువచ్చింది.. బైక్‌కు ఏమైనా దెయ్యం పట్టిందా ఏంటి అనుకున్నారు దాన్ని చూసినవారు. ఇంతలో ఓ వ్యక్తి తేరుకుని రోడ్డు మీదకు వచ్చి ఇతరులను అప్రమత్తం చేశాడు.
బైక్ అలా స్పీడ్‌గా వెళ్తుండగా.. అనుకోకుండా దానికి ఎదురుగా ఓ జీపు వేగంగా ముందుకు వచ్చింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి..బ్రేక్ వేశాడు. బైక్ దానికి కొద్దిగా ఢీకొని…ఏకంగా టర్న్ తీసుకుంది..కొద్దిదూరం వెళ్లి కింద పడిపోయింది. డ్రైవర్ లేని ఈ బైక్ రోడ్డుపై సుమారు 300 మీటర్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏముంది కొన్ని క్షణాల పాటు జనాలను హడలెత్తించింది బైక్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. దీన్ని చూసిన వారు ‘‘డ్రైవర్ లేకుండా బైక్ నడవడం ఏంటి.. కొంపదీసి దీన్ని ఏమైనా దెయ్యం ఆవహించిందా.. ఏంటి’’ అని కామెంట్ చేయసాగారు నెటిజనులు.
అయితే కొందరు ఈ డ్రైవర్‌లెస్ బైక్ జర్నీ గురించి వివరించారు కొందరు. ఈ బైక్ ప్రమాదవశాత్తు రోడ్డుమీద వెళుతున్న మరో వ్యక్తిని ఢీకొనడంతో దాన్ని నడిపే అతడను కిందపడిపోయాడని తెలిపారు. అయితే..బైకర్ కిందపడిపోయినా..బైక్ మాత్రం ముందుకు దూసుకెళ్లిందని వెల్లడించారు.. ఈ ఘటనలో బైక్ ఢీకొన్న వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment