
ప్రపంచం ఆటోమేషన్ వైపు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రధానంగా ఆటోమోటివ్ విభాగంలో ఈ ఆటోమేషన్ పాత్ర కీలకంగా మారింది. ప్రస్తుతం స్వయంచాలిత డ్రైవింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. దాంతో చాలా కంపెనీలు ఈ మేరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూ వాటిని పరీక్షిస్తున్నాయి. అందులో భాగంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగంలో జపాన్ ఆటోమోటివ్ దిగ్గజం నిస్సాన్ సంస్థ దూసుకుపోతోంది. ఇటీవల జపాన్‌లోని యోకోహమాలోని రద్దీగా ఉన్న వీధుల్లో అత్యాధునిక అటానమస్ వ్యవస్థ కలిగిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను పరీక్షించింది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సెరెనా మినీవ్యాన్‌ను యోకోహమా వీధుల్లో పరుగు పెట్టించింది. ఈ వాహనంలో 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 లైడార్ సెన్సార్లను వాడారు. ఇవి అధిక రద్దీ ఉంటే రోడ్లపై సులువుగా ప్రయాణించేందుకు దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. మెరుగైన అటానమస్ వ్యవస్థ ఉండడంతో స్వయంగా వేగ పరిమితులను నిర్ధారించుకుంటుందని చెప్పారు. ట్రాఫిక్‌ను, అడ్డంకులను తప్పించుకుంటు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒకేరోజు 27 శాతం కుప్పకూలిన బ్యాంకు స్టాక్..
జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్లు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రానున్న రోజుల్లో డ్రైవర్ల కొరత అధికమవుతుందని, అలాంటి వారికి కంపెనీ చేస్తున్న ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. సెరెనా ప్రస్తుతం లెవల్ 2 స్వయంప్రతిపత్తితో(అటానమీ వ్యవస్థ-పాక్షికంగా ఆపరేట్ చేయడానికి మానవుల అవసరం ఉండడం) పనిచేస్తుండగా.. 2029 నాటికి లెవల్ 4 స్వయంప్రతిపత్తి(మానవ ప్రయేయంలేని)ని సాధించాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment