driverless car
-
డ్రైవర్ లెస్ కారులో మంటలు.. వీడియో వైరల్
జైపూర్: రాజస్థాన్‌లో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. జైపూర్‌లో డ్రైవర్ లెస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై పార్క్ చసిన బైక్‌లను ఢీకొడుతూ మంటలతోనే కారు ముందుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కారు ఓనర్ అల్వార్‌కు చెందిన ముఖేష్ గోస్వామిగా పోలీసులు గుర్తించారు. కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారును ముఖేష్ గోస్వామి అతని స్నేహితుడు జితేంద్ర జంగిద్ నడిపారు. అయితే కారు బానెట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావటాన్ని ఆయన గమనించారు. మంటలు చెలరేగడంతో కారు హ్యాండ్‌బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో డ్రైవర్ జితేంద్ర.. అందులో నుంచి బయటకు దూకేశారు. ఎలివేటెడ్ రోడ్డులో కారు మంటలతో అక్కడ పార్క్ చేసిన పలు బైక్‌లను ఢీకొడుతూ కిందికి కదిలింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారి దినేష్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. Watch Burning Car on #Jaipur Road Causes Panic Among Commuters | #Burningcar pic.twitter.com/mzEKAGCyU6— KINGSNEWS (@KINGSNEWS7) October 13, 2024చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్ -
‘అమ్మా..ఈకారులో డ్రైవరే లేడమ్మా’!
సాఫీగా ఉన్న రోడ్డు మీద గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న మీ కారుకు సడెన్‌గా బ్రేకులు పడితే.. ఆ ఉహ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఊహల్ని నిజం చేసేలా గత కొన్ని ఏళ్లుగా దిగ్గజ టెక్ కంపెనీలు మానవ రహిత కార్ల తయారీపై దృష్టి సారించాయి. వాటిని తయారు చేసి పరిమితంగా వాహనదారులకు క్యాబ్ సర్వీసులు అందిస్తున్నాయి. తాజాగా, అమెరికాలో గూగుల్‌కు చెందిన వేమో సంస్థ అందుబాటులోకి తెచ్చిన డ్రైవర్ లెస్ క్యాబ్‌లో భారత్‌కు చెందిన ఓ మహిళా, ఆమె కుమారుడు ఇద్దరు ప్రయాణించారు. ఈ సందర్భంగా సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రయాణం గురించి ఆశ్చర్య పోయారు. డ్రైవర్ లేకుండా వారు చేరాలనుకున్న గమ్యస్థానానికి సురక్షితంగా వెళ్లామని చెబుతూ ఓ వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్ని రోజులు స్తబ్ధుగా ఉన్న ఆయా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో డ్రైవర్ లెస్ కార్ల తయారీపై మరింత దృష్టిసారిస్తున్నాయి. ప్రయాణాల్లో జరిగే ఆకస్మిక ప్రమాదాల నుంచి ప్రాణనష్టాన్ని నివారించేందుకు గత కొన్ని ఏళ్లుగా టెస్లా, గూగుల్ వేమో వంటి సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారు చేస్తున్నాయి. 2015 నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై గూగుల్‌కు చెందిన వేమో ఇప్పటికే వేల కొద్ది మానవ రహిత కార్లను వినియోగంలోకి తెచ్చింది. పరిమిత సంఖ్యలో సేవలందిస్తున్నాయి. తాజాగా, అమెరికాలోని ఓ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన తల్లి కొడుకులైన ఇద్దరు భారతీయులు వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై ప్రయాణించారు. ఈ సందర్భంగా డ్రైవర్ లేని కారులో ప్రయాణించి ఆశ్చర్యపోయారు. అమ్మ కారులో కూర్చొని ఆ కారును ఎలా నడుపుతుందో తెలుపుతుంటే.. ఆమె కుమారుడు అమ్మా.. ఇందులో డ్రైవర్ లేడమ్మా అంటూ వీడియో తీస్తూ సంతోషం చెబుతున్న వీడియో నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియో ఎలా ఉందో మీరూ చేసేయండి. -
బంతిలాంటి కారు.. దీనికి డ్రైవర్ అవసరం లేదు!
ఒక పెద్దగోళానికి నాలుగు చక్రాలు తగిలించి ఉన్నట్లు కనిపిస్తున్న ఈ విచిత్రవాహనం ఆటబొమ్మ కాదు, అచ్చంగా ప్రయాణాలకు పనికొచ్చే కారు. కంప్యూటర్లు, మొబైల్ఫోన్లు తయారుచేసే యాపిల్ కంపెనీ తాజాగా రూపొందించిన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు ఇది. యాపిల్ కంపెనీ కోసం భారత సంతతికి చెందిన మెకానికల్ డిజైనర్ దేవాంగ బోరా ‘యాపిల్ ఆటోనమస్’ పేరిట ఈ గోళాకార శకటానికి రూపకల్పన చేశారు. ఇందులోని మరో విశేషం ఏమిటంటే, దీనికి డ్రైవర్ అవసరం లేదు. ఇది పూర్తిగా డ్రైవర్‌లెస్ వాహనం. ఇద్దరు మనుషులు ఇందులో సౌకర్యవంతంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ప్రయాణించేవారిని కోరుకున్న చోట దించేశాక ఈ కారు నిర్దేశిత పార్కింగ్ స్థలానికి తనంటత తానే వెళ్లిపోతుంది. ఈ వాహనాన్ని మరో రెండేళ్లలో మార్కెట్లోకి తేవడానికి యాపిల్ సంస్థ సన్నాహాలు చేసుకుంటోంది. (క్లిక్: గూగుల్ కు దిమ్మ తిరిగే షాక్, రూ.65కోట్ల జాక్ పాట్ కొట్టేశాడు!) -
డ్రైవర్‌లెస్ కారు.. తోక ముడిచిన ఎలన్ మస్క్
ఎలన్‌మస్క్ నేతృత్వంలో నడుస్తున్న టెస్లా రూపొందించిన ఎస్ ప్లెయిడ్ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఏడాదిలోనే డ్రైవర్ లెస్ కారు కూడా తీసుకొస్తానంటూ సీఈవో ఎలన్‌మస్క్ ప్రకటించారు. మరీ ఆటో పైలెట్ కారు ప్రయోగాలు ఎక్కడి వరకు వచ్చాయి. ఎలన్ మస్క్ కల ఎప్పుడు సాకారం కావొచ్చు ? కాలిఫోర్నియా : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కి కొత్త అర్థం చెప్పిన వారిలో ఎలన్ మస్క్ ముందు వరుసలో ఉంటారు. పేపాల్ సీఈవోగా, స్పేస్ ఎక్స్ అధినేతగా, టెస్లా సీఈవోగా.. ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా ఎలన్ మస్క్ ఎదిగాడు. ఆటోపైలట్ మోడ్ లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కారుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై చాన్నాళ్లుగా ఆయన వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాదే ఎస్ ప్లెయిడ్ ప్రారంభానికి ముందు 2021 జనవరిలో ఎలన్‌మస్క్ మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే డ్రైవరు లేకుండా నడిచే కారు అందుబాటులోకి వస్తుందంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో జూన్‌లో విడుదలైన ఎస్ ప్లెయిడ్‌లో డ్రైవర్ లెస్ ఆప్షన్ కూడా ఉంటుందని అంతా భావించారు. కానీ ఆ ఫీచర్‌ని ఎస్ ప్లెయిడ్‌లో టెస్లా అందివ్వలేదు. Haha, FSD 9 beta is shipping soon, I swear! Generalized self-driving is a hard problem, as it requires solving a large part of real-world AI. Didn’t expect it to be so hard, but the difficulty is obvious in retrospect. Nothing has more degrees of freedom than reality. — Elon Musk (@elonmusk) July 3, 2021 చాలా కష్టం ఆటో పైలెట్ కారును ఇప్పుడప్పుడే మార్కెట్లోకి తీసుకురావడం కష్టమని ఎలన్ మస్క్ తాజాగా అంగీకరించారు. ‘ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఎంతో జటిలమైనది, దీన్ని నిజం చేయాలంటే, వాస్తవిక ప్రపంచానికి తగ్గటుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని రూపొందించాలి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, ఈ విషయం నేను ఇంతకు ముందు ఊహించలేదు. వాస్తవితకకు ఉన్నంత స్వేచ్ఛ మరి దేనికి లేదు’ అంటూ ఇటీవల ఎలన్ మస్క్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లెవల్ 2 సెల్ఫ్ డ్రైవింగ్‌కి సంబంధించి గతంలో తాము చేసిన ప్రకటనలు అన్నీ వాస్తవికంగా అమల్లోకి తేవడానికి అనుకూలంగా లేవంటూ టెస్లా తెలిపింది. మరోవైపు ఆటో పైలెట్ ఇంకా లెవల్ 2లో ఉన్నట్టుగా కూడా చెప్పింది. లెవల్ 2 అంటే ఆటో పైలెట్ ఆప్సన్ ఉన్నప్పటికీ కారులో డ్రైవర్ ఉండాల్సిందే. కేవలం డ్రైవర్ యొక్క భారాన్ని తగ్గిస్తుందే తప్ప పూర్తిగా డ్రైవింగ్ చేయలేదని అర్థం. -
Huwaie Driverless Car: హువాయ్ విప్లవాత్మక ప్రకటన
షెంజెన్: ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ హువాయ్ విప్లవాత్మక ప్రకటన చేసింది. వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఆపకుండా.. డ్రైవర్ లెస్ కార్ల టెక్నాలజీకి శరవేగంగా పావులు కదుపుతోంది. 2025 నాటికల్లా డ్రైవర్‌లెస్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు కంపెనీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, చైనీస్ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం హువాయ్ టెక్నాలజీస్ ఆటోమోటివ్ స్పేస్‌లో అడుగుపెట్టబోతున్నట్లు కొంతకాలంగా మీడియాకు హింట్ అందుతూనే వస్తోంది. అయితే ఏకంగా డ్రైవర్‌లెస్ కార్లను తయారు చేస్తామనే ప్రకటనతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చోంగ్క్వింగ్ ఛాంగన్ ఆటోమొబైల్ కో లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ఎలక్ట్రానిక్ వెహికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రెండు కంపెనీలతో హువాయ్ కంపెనీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీగా పేరున్న హువాయ్.. స్మార్ట్ఫోన్ల అమ్మకం ద్వారా హవా చాటేది. అయితే ట్రంప్ హయాంలో ఆంక్షలు, ప్రత్యేకించి హువాయ్‌తో అమెరికా వర్తకానికి పెనుముప్పు ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో హువాయ్ దూకుడు మొదలుపెట్టింది. ఇక హువాయ్‌తో పాటు జియోమి, ఒప్పో కూడా వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు యాపిల్ కూడా ఈ రంగం తీరుతెన్నులపై ఒక అంచనాకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: స్మార్ట్ వాచ్.. 54 శాతం భారీ తగ్గింపు -
ఊహించని ప్రమాదం.. వీడియో విడుదల
శాన్ ఫ్రాన్సిస్కో : ఉబెర్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్టింగ్ ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా అభివృద్ధి చేయకుండా ఈ తరహా వాహనాలను బిజీ రోడ్ల పైకి ఎలా అనుమతించారని పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఘటనకు సంబంధించిన వీడియోను టెంపె పోలీస్ శాఖ బుధవారం విడుదల చేసింది. ప్రమాద సమయంలో వోల్వో వాహనంలోని కెమెరాల ద్వారా లోపల, బయట జరిగిన పరిణామాలు రికార్డు అయ్యాయి. చీకట్లో ఎలైనే హెర్జ్‌బర్గ్(49) తన సైకిల్‌తో రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో లోపల కూర్చున్న వాహనదారు కూడా ఊహించని ఆ పరిణామంతో షాక్ తినటం చివర్లో చూడొచ్చు. ఆదివారం రాత్రి అరిజోనా రాష్ట్రంలోని టెంపె ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌కు చెందిన డ్రైవర్ లెస్కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ హెర్జ్‌బర్గ్ ఆస్పత్రిలో మృతి చెందింది. కారులోని వ్యవస్థ పాదాచారిని గుర్తించకపోవటంతోనే ప్రమాదం జరిగినట్లు నిపుణులు వెల్లడించారు. ఘటన నేపథ్యంలో ఈ తరహా వాహనాల పరీక్షను నిలిపివేస్తున్నట్టు ఉబెర్ ప్రకటించింది. మరోవైపు వీటి పని తనంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో వీటిని అందుబాటులోకి తేకపోవటమే ఉత్తమమన్న డిమాండ్‌నూ పలువురు తెరపైకి తెస్తున్నారు. Tempe Police Vehicular Crimes Unit is actively investigating the details of this incident that occurred on March 18th. We will provide updated information regarding the investigation once it is available. pic.twitter.com/2dVP72TziQ — Tempe Police (@TempePolice) March 21, 2018 -
బరువు బాధ్యతల బండి
నో డౌట్.. రవాణా రంగంలో భవిష్యత్తు డ్రైవర్ల అవసరం లేని వాహనాలదే. విద్యుత్తుతో నడిచేవే. ఎందుకంటారా? ఫొటో చూసేయండి మరి. స్వీడన్‌కు చెందిన కంపెనీ ఎన్రైడ్ తయారు చేసిన వాహనమిది. డ్రైవర్ అవసరం లేదు.. పెట్రోలు, డీజిళ్లు అంతకంటే వద్దు. రవాణా చేయాల్సిన సరుకులను ఎక్కించడం.. ఎక్కడికెళ్లాలో ఫీడ్ చేయడం, మరచిపోవడం అంతే! ఇంకా వివరాలు కావాలా? పేరు.. టీ–పాడ్. దాదాపు 23 అడుగుల పొడవుంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 124 మైళ్లు అంటే 200 కిలోమీటర్ల దూరం ఆగకుండా వెళ్లిపోతుంది. విద్యుత్తు మోటార్‌ను ఉపయోగించడం వల్ల ఇంజిన్ బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది. డ్రైవర్లు ఉండరు కాబట్టి దీంట్లో కిటికీలు, సీట్లు గట్రా కూడా ఏమీ ఉండవు. లగేజీ వేసుకునేందుకు ఓ పెద్ద డబ్బా ఉంటుంది అంతే. ఒకొక్క టీ–పాడ్ దాదాపు 20 టన్నుల బరువు మోసుకెళ్లగలదు. మన లారీలకు రెట్టింపు అన్నమాట. ఇంకో మూడేళ్లలో స్వీడన్‌లోని గోథెన్బర్గ్ నుంచి హెల్సిన్బర్గ్ వరకూ సరుకులు రవాణా చేసేందుకు ఎన్రైడ్ ఇప్పటికే వంద వరకూ టీ–పాడ్లను సిద్ధం చేసింది. దీంతోపాటే బ్యాటరీలను రీఛార్జ్ చేసుకునేందుకు అక్కడక్కడ కొన్ని స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీ తక్కువైందనుకున్న వెంటనే టీ–పాడ్ తన దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్లిపోయి తనంతట తానే ఛార్జ్ చేసుకుంటుంది. అవసరమనుకుంటే.. కొన్ని టీ–పాడ్లను ఆఫీసు నుంచే నియంత్రించేందుకూ దీంట్లో ఏర్పాట్లు ఉన్నాయి. టీ–పాడ్లు పనిచేయడం మొదలుపెట్టిన తరువాత స్వీడన్లో దాదాపు నాలుగు లక్షల కార్లకు సరిపడా కార్బన్డయాక్సైడ్ వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చునని అంచనా. ప్రస్తుతానికి 200 టీ–పాడ్స్‌తో రవాణాను మొదలుపెట్టినా.. భవిష్యత్తులో డిమాండ్‌ను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఎన్రైడ్ సిద్ధమవుతోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డ్రైవర్ అక్కర్లేని గూగుల్ కారు